దేవరకొండ

13:10 - September 14, 2018

బాలీవుడ్..టాలీవుడ్..కోలీవుడ్..ఇలా ఏ వుడ్ అయినా బయోపిక్ ల హావా కొనసాగుతోంది. ఎన్నో చిత్రాలు నిర్మితమై ప్రజాదరణ పొందాయి. కూడా రికార్డులు కూడా సృష్టించాయి. తాజాగా తెలుగులో నాయకుల బయోపిక్ చిత్రాలు నిర్మితమౌతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ జీవితం ఆధారంగా ‘ఎన్టీఆర్’..వైఎస్ జీవితం ఆధారంగా ‘యాత్ర’ చిత్రాలు రూపొందుతున్నాయి. ఎన్టీఆర్ బయోపిక్ లో బాలకృష్ణ నటిస్తుండగా వైఎస్ బయోపిక్ లో మమ్ముట్టి నటిస్తున్నాడు. తాజాగా వైఎస్ బయోపిక్ లో మరో హీరో నటిస్తున్నట్లు తెలుస్తోంది. 

జగన్ పాత్రలో ‘విజయ్ దేవరకొండ’ నటించనున్నారని ప్రచారం జరుగుతోంది. మొదట సూర్య...కార్తీ పేర్లు వినిపించాయి. జగన్ పాత్రలో విజయ్ కరెక్టుగా సరిపోతారని..అతను అయితే పాత్రకు న్యాయం జరుగుతుందని చిత్ర యూనిట్ భావిస్తోందంట. దీనికి సంబంధించి విజయ్ తో చిత్ర యూనిట్ సంప్రదింపులు జరిపిందని టాక్. ఇదిలా ఉంటే ప్రస్తుతం విజయ్ రాజకీయ నేపథ్యంలో రూపొందుతున్న సినిమాలో నటిస్తున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో ‘నోటా’ మూవీ చేస్తున్నాడు. మరి జగన్ పాత్రలో దేవరకొండ నటిస్తున్నాడా ? లేదా ? అనేది రానున్న రోజుల్లో తేలనుంది. 

12:35 - May 30, 2017

నల్గొండ : జిల్లాలో టీఆర్ఎస్ లో అంతర్గత విబేధాలు భగ్గుమన్నాయి. దేవరకొండ నియోజకవర్గంలోని చందంపేట మండలం కంబాలపల్లిలో గులాబీ నేతలు ఒకరినొకరు ఘర్షణకు తలపడ్డార. దీనితో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కర్రలు..పదునైన ఆయుధాలతో దాడులు చేసుకున్నారు. దీనితో ఇరువర్గాల్లో ఉన్న వారికి గాయాలయ్యాయి. ఇద్దరు వ్యక్తులకు తీవ్రగాయాలు కావడంతో దేవరకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కంబాలపల్లిలో ఇంతకుముందు కూడా పలు ఘర్షణలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన అనంతరం గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు.

16:57 - December 3, 2016

నల్గొండ : దేవరకొండలో శిశు విక్రయాలు, బాల్యవివాహాలు ఎక్కువైపోతున్నాయని.. వీటిని అరికట్టేలా గిరిజనులకు అవగాహనా కార్యక్రమాలు చేపట్టడంలో అధికారులు విఫలమయ్యారని నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. దేవరకొండ నియోజకవర్గంలో అమ్మా నన్ను అమ్మకే అనే పేరుతో జిల్లా ఎస్పీ ప్రకాష్ రెడ్డి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. శిశు విక్రయాలు, బాల్య వివాహాలు చట్ట విరుద్ధమనీ..పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు ప్రతి విషయంలోనూ ఆడపిల్లలపై వివక్ష చూపడం మానుకోవాలని ఎస్పీ హితవు పలికారు. 

19:54 - May 9, 2016

నల్గొండ : జిల్లాలోని దేవరకొండలో విషాదం నెలకొంది. టెట్ లో అర్హత సాధించడం లేదని మనస్థాపంతో ప్రమీల అనే విద్యార్థిని ఈనెల 5వ తేదీన ఆత్మహత్యకు పాల్పడింది. హైదరాబాద్ లో ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు మృతి చెందింది. టెట్ లో బయాలజీ విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని, టెట్ లో మ్యాథ్స్కు 30 మార్కులు కేటాయించడంతో ఎమ్మెస్సీ బయోసైన్స్ చదివిన నాలాంటి వారు స్కోర్ చేయలేకపోతున్నారని సీఎం కేసీఆర్ చివరి లేఖ రాసింది. మ్యాథ్స్ కు బదులు మెంట్ ఎబిలిటీ ప్రశ్నలు పొందుపరచాలని.. నా విజ్ఞప్తిని అమలు చేస్తే తెలంగాణ బిడ్డగా సంతోషిస్తానని సీఎం రాసిన లేఖలో పేర్కొంది.

16:31 - November 30, 2015

నల్గొండ : అప్పుడే పుట్టిన ఆడ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు ముళ్ల పొదల్లో పడేశారు. ఆడ శిశువును పందులు పీక్కుతుంటుండగా గమనించిన స్థానికులు వెంటనే 108 కు సమాచారం అందించారు. 108 సిబ్బంది ఆసుపత్రికి తరలిస్తుండగా శిశువు మృతి చెందింది. ఈ ఘటన నల్గొండ జిల్లా దేవర కొండ బస్టాండ్ పరిసర ప్రాంతంలో చోటు చేసుకుంది.

19:14 - November 24, 2015

నల్లగొండ : భారతదేశాన్ని భారతమాతగా పిలుస్తున్నాము. ఆడ దేవుళ్లను అత్యంత భక్తి శ్రద్ధలతో కొలుస్తాము. అమ్మను అమితంగా గౌరవిస్తాము. ఆడవారిని అపురూపంగా చూసుకునే సంస్తృతి భారతదేశానికి ఉంది. కానీ ఇప్పుడు ఆడపిల్లలను సాద లేక అమ్ముకునే దుస్థితి నెలకొంది. దేశంలో పలుచోట్ల ఆడపిల్లలను అమ్మేస్తున్నారు. నల్లగొండ జిల్లాలో శిశు విక్రయాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా దేవరకొండ మండలం దుబ్బతండలో తల్లిదండ్రులు.. శిశువును 50వేలకు అమ్మేశారు. నేనవత్‌ లాలి, లచ్యలకు గతంలో నలుగురు ఆడపిల్లలున్నారు. తాజాగా మరోసారి అమ్మాయి పుట్టింది. పేద కుటుంబం కావడంతో శిశువు పెంచలేమని తల్లిదండ్రులు భావించారు. హైదరాబాద్‌లోని ఓ వాచ్‌మెన్‌కు పాపను ఇచ్చేశారు. కొద్ది రోజులుగా శిశువు కనిపించకపోవడంతో అంగన్‌వాడీ కార్యకర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు పాపను అంగన్‌వాడీ కార్యకర్తకు అప్పగించారు. అయితే శిశువును తీసుకున్నవారు మాత్రం తమకు పిల్లలు లేరని.. పాపను పెంచుకునేందుకు తీసుకున్నామని చెబుతున్నారు.

 

10:31 - November 15, 2015

నల్గొండ : తనను ప్రేమించి మోసం చేసిన డాక్టర్‌తో వివాహం జరిపించాలంటూ అతని ఇంటిముందు ప్రియురాలు ఆందోళన కొనసాగిస్తోంది. నల్లగొండ జిల్లా దేవరకొండకు చెందిన డాక్టర్ రణధీర్‌, బాధితురాలు ప్రేమించుకున్నారు. ఆ తర్వాత రణధీర్‌ ప్లేట్‌ ఫిరాయించడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహిళా సంఘాల మద్దతుతో రెండు రోజులుగా నిరసన తెలుపుతోంది. తలంబ్రాలు, తాళిబొట్టుతో ఇవాళ దేవరకొండలోని రణధీర్‌ ఇంటి ముందు బాధితురాలు మౌన పోరాటం చేస్తోంది. రణధీర్‌ తనను ప్రేమించి మోసం చేశాడంటున్న యువతి వాపోయింది. రణధీర్‌తో తనకు పెళ్లి జరిపించాలని డిమాండ్ చేసింది.

 

18:09 - November 13, 2015

హైదరాబాద్ : ప్రేమపేరుతో యువకుడు ఓ యువతిని మోసం చేశాడు. తనకు న్యాయం చేయాలంటూ యువతి పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన నల్గొండ జిల్లా దేవరకొండలో చోటుచేసుకుంది. నల్గొండ జిల్లా దేవరకొండకు చెందిన రణధీర్ రెడ్డి ఎంబీబీఎస్ పూర్తి చేసి ఓ ఆస్పత్రిలో డాక్టర్‌గా పనిచేస్తున్నాడు. హైదరాబాద్ యూసుఫ్ గూడకు చెందిన కీర్తి అనే యువతిని ప్రేమ పేరుతో లోబరుచుకున్నాడు. అనంతరం పెళ్లి చేసుకుంటానని చెప్పి యువతిని స్వగ్రామం దేవరకొండకు తీసుకువెళ్లాడు. అక్కడ రణధీర్‌రెడ్డి తల్లి రత్నమ్మ, సోదరుడు సుధీర్‌రెడ్డిలతో కలిసి ఆమెపై దాడి చేసి గాయపరిచారు. పెళ్లి జరగాలంటే రూ. 8 కోట్లు కట్నంగా ఇవ్వాలని హెచ్చరించారు. తనను మోసం చేసిన డాక్టర్ రణధీర్‌రెడ్డి, అతడి కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. అయితే.. ఇంతవరకు రణధీర్ రెడ్డిపై చర్య ఎందుకు తీసుకోలేదంటూ బాధిత యువతి కుటుంబ సభ్యులు, మహిళా సంఘాల దేవరకొండలోని రణధీర్ ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది. రణధీర్ కుటుంబ సభ్యులు పరారీలో ఉన్నారు. తనకు న్యాయం చేయాలంటూ.. బాధిత యువతి దేవరకొండ పోలీసులను ఆశ్రయిచింది. బాధితురాలికి.. కుటుంబ సభ్యులతోపాటు.. మహిళా సంఘాలు మద్దతు పలికాయి.

 

18:53 - October 19, 2015

నల్గొండ : బతుకమ్మ పేరుతో కూతురు కవితకు కోట్లు ఖర్చు చేస్తున్న సీఎం కేసీఆర్‌.. తమను మాత్రం పస్తులుంచుతున్నారని ఆశావర్కర్లు మండిపడుతున్నారు. ఇవాళ నల్లగొండ జిల్లా దేవరకొండలో బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఎంపీ కవిత రానున్న నేపథ్యంలో.. ఆమె రాకను నిరసిస్తూ ఆశావర్కర్లు జిల్లా కేంద్రంలో 'కవిత గో బ్యాక్‌' అంటూ ప్రదర్శన చేపట్టారు. కవితలాగానే తాము కూడా ఓ తండ్రికి బిడ్డలేమనని.. తమ వినతులను పట్టించుకోకపోవడం దారుణమని ఆశాలు ఆవేదన వ్యక్తం చేశారు. బతుకమ్మకు కోట్లు ఖర్చు చేస్తున్న కేసీఆర్‌.. తమను పస్తులుంచడం దారుణమన్నారు.

 

12:48 - September 18, 2015

నల్లగొండ : జిల్లాలోని దేవరకొండలో యాలాల ఎస్సై రమేష్‌ అంతిమయాత్ర కొనసాగుతుంది. రెండురోజుల క్రితం రంగారెడ్డి జిల్లా పెద్దేముల్‌లో రమేష్‌ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. రమేష్‌ భౌతికకాయం ఆయన స్వగ్రామం చెరుపల్లికి చేరుకుంది. అంతిమయాత్ర కొనసాగుతోంది. అంతిమయాత్రలో ఎమ్మెల్యే రవీంద్రకుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.
రమేష్ మృతిపై అనుమానాలు : రవీంద్రనాయక్
రమేష్ మృతి దురదృష్టకర సంఘటన. రామావత్ రమేష్ నాయక్ ఆత్మహత్య చేసుకునే పరికివాడు కాదు. మూడు రోజుల క్రితం.. భార్యను ఆస్పత్రికి తీసుకెళ్లే సమయంలో రమేష్ ను ఆఫీస్ కు పిలిచారు. వెళ్లాడు. తిరిగి శవమై వచ్చాడు. ఎస్సై రమేష్ మృతిపై అనుమానాలున్నాయి. రమేష్ బొటన వేలు కట్ అయింది. మోకాళ్లకు గాయాలయ్యాయి. మృతిపై అనేక అనుమానాలున్నాయి. రమేష్ మృతి ఘటనపై హోమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డిని కలిశాము. సిబిసిఐడి ద్వారా.. విచారణ చేయించాలని నాయిని కోరాము. వెంటనే సిబిసిఐడి విచారణకు ఆదేశించారు. మృతికి బాధ్యులై వారిపై చర్యలు తీసువాలని డిమాండ్ చేశాము. భార్యకు ఉద్యోగం కల్పించాలి. కుటుంబానికి ఆర్థిక సహాయం చేయాలని కోరారు.

 

Pages

Don't Miss

Subscribe to RSS - దేవరకొండ