దేవి

21:00 - March 30, 2018

హైదరాబాద్ నడిబొడ్డున మైనర్ బాలిక ప్రేమోన్మాదానికి బలైంది... ఈ ఒక్క సంఘటనేకాదు ఈమధ్య కాలంలో భాగ్యనగరంలో ఇలాంటి సంఘటనలు అనేకం జరుగుతున్నాయి. చుట్టూ పోలీసుల పహారా, రక్షణకు షీటీమ్స్ ఉన్నా... రాజధానిలో మహిళలపై దాడులు జరుగుతున్నాయంటే ప్రేమోన్మాదం ఎంత సృతిమించుతుందో అర్థం చేసుకోవచ్చు... ప్రస్తుతం ఈ ఘటన స్త్రీకి ఉన్న రక్షణ ఎంత అని పాలకులను ప్రశ్నిస్తుంది. ఇదే అంశంపై టెన్ టివి ప్రత్యేక చర్చను చేపట్టింది. ప్రేమోన్మాదుల దాడులపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో సామాజిక కార్యకర్త దేవి పాల్గొని, మాట్లాడారు. సమగ్రమైన యూత్ పాలసీ కావాలని సామాజిక కార్యకర్త దేవి అన్నారు. చట్టాన్ని సక్రమంగా అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు. బాధితులకు సత్వరమే న్యాయం చేయాలని చెప్పారు.
ఆ వివరాలను ఆమె మాటల్లోనే...
బాలికలకు భ్రదత కల్పించడమంటే ఇంటికో కానిస్టేబుల్ ను ఏర్పాటు చేయడం కాదు. చట్టం చేయడం కాదు.. వాటిని అమలు చేసి చూపించాలి. బాల్య వివాహాల చట్టాన్ని అమలు చేయడంలో ప్రభుత్వం విఫలం అవుతుంది. స్త్రీలకు సబంధించిన ఏ ఒక్క చట్టాన్ని అమలు చేయడం లేదు. సత్వరంగా జరగని న్యాయం... న్యాయం కాకుండా పోతుంది. ప్రతిస్థాయిలో రాజకీయ జోక్యం ఉంటుంది. పోలీసు స్టేషన్ లో రాజకీయ దళారులు కూర్చుంటారు. చట్టం దాదాపు పనిచేయకుండా ఉంటుంది. చట్టం గురించి జనం పట్టించుకోవడం లేదు. నేరస్తుడు, బాదితుడు చట్టాలను నమ్మడం లేదు. నీతిబోధల వల్ల సమాజం మారదు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

 

15:53 - February 8, 2018

హైదరాబాద్ : ఎప్పుడూ వివాదాల్లో ఉండే 'రాం గోపాల్ వర్మ'కు తెలంగాణ సీసీఎస్ పోలీసులు షాక్ ఇచ్చారు. ‘జీఎస్టీ' సినిమాపై నమోదైన కేసులో ఆయనకు నోటీసులు జారీ చేశారు. కానీ ఆయన సీసీఎస్ ఎదుట హాజరు కాలేదు. సమాచారం తెలుసుకున్న 'వర్మ' పోలీసులకు తన న్యాయవాది ద్వారా సమాచారం అందించారు.

ఇటీవలే 'జీఎస్టీ' షార్ట్ ఫిలింను ఆయన తన యూ ట్యూబ్ లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిపై మహిళా సంఘాలు..మహిళలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. సామాజిక కార్యకర్త దేవి ఏకంగా సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనితో 'జీఎస్టీ' షార్ట్ ఫిలింపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. వెబ్ సైట్ నిర్వాహకులతో మాట్లాడి...తెలంగాణలో షార్ట్ ఫిలింను ప్రసారం కాకుండా అడ్డుకున్నారు. దీనిపై సామాజిక కార్యకర్త దేవి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు స్పందించారు.

తమ ఎదుట హాజరు కావాలని..వివరణ ఇవ్వాలని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. కానీ విచారణకు హాజరు కాలేనని న్యాయవాది ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. ముంబైలో జరుగుతున్న సినిమా షూటింగ్ లో బిజీగా ఉండడమే కారణమని, మళ్లీ నోటీసులు పంపితే వచ్చే వారం హాజరువతానని వర్మ తెలిపారు. దీనిపై టెన్ టివి సామాజిక కార్యకర్త దేవి, ఏపీ మహిళా నేత మణితో మాట్లాడింది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

12:25 - January 25, 2018

హైదరాబాద్ : తన పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వర్మపై ప్రముఖ సామాజిక కార్యకర్త దేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ (జీఎస్టీ) సినిమా పై మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

 

06:39 - November 26, 2017

హైదరాబాద్ : కామెడీ పేరుతో టీవీ ఛానెళ్లలో ప్రసారమవుతున్న అసభ్యకరమైన కార్యక్రమాలపై మహిళా, ప్రజా సంఘాలు గళమెత్తాయి. రేటింగ్స్ కోసం పోటీ పడి ఛానెళ్లు విలువలకు తిలోదకాలిచ్చి.. మహిళలను, పిల్లలను కించపర్చేలా చూపించడం దారుణమని ధ్వజమెత్తాయి. అనాథపిల్లలపై జబర్దస్త్‌ ప్రోగ్రామ్‌లో హైపర్‌ ఆది చేసిన వ్యాఖ్యలపై మహిళా లోకం మండిపడింది.తోంది. సదరు నటులు, చానెళ్లపై చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు HRC ని ఆశ్రయించాయి. తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానెళ్లలో కామెడీ షోస్‌ వివాదాస్పదమవుతున్నాయి. వినోదం పేరుతో అశ్లీలత, అసభ్యతను పెంచిపోషిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హాస్యం అంటే ఆస్వాదించేలా ఉండాలి కానీ.. జుగుప్సాకరంగా ఉండకూడదని మహిళా, ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి.

హైదరాబాద్‌ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏది బూతు, ఏది కామెడీ పేరుతో నిర్వహించిన చర్చాకార్యక్రమం వాడివేడీగా సాగింది. హాస్యం పేరుతో ప్రముఖ చానెల్స్‌లో పలు కార్యక్రమాలు అసభ్యత, అశ్లీలత ఎక్కువయ్యిందని పలువురు అభిప్రాయపడ్డారు. రేటింగ్‌ మత్తులో పడిన కార్పొరేట్‌ మీడియాకి అశ్లీలత కనిపించడం లేదని..వారు చేస్తున్న తప్పులేంటో తెలియజేయాలన్నారు సామాజిక కార్యకర్త దేవి. ఛానల్‌, ప్రొడక్షన్‌, నటులతో పాటు వ్యాఖ్యాతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

హైపర్‌ ఆదిపై సినీ విమర్శకులు కత్తిమహేష్‌ విరుచుకుపడ్డారు. తను నటిస్తున్న ప్రోగ్రామ్‌ సమాజానికి కీడు చేస్తుందని తెలిసి కూడా ఓ కళాకారుడుగా ఆది స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు. పవన్‌పై తాను చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా తనను టార్గెట్‌ చేశారన్నారు. ఇలాంటి షోలను బ్యాన్‌ చేయాలని డిమాండ్ చేశారు. జబర్దస్త్‌ కార్యక్రమంలో హైపర్ ఆది తమను కించపరిచేలా మాట్లాడారని ఆరోపిస్తూ.. అనాథ విద్యార్థులతో కలిసి మహిళా సంఘాలు సైపాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదితో పాటు ఆ ప్రోగామ్‌ ప్రసారం చేసిన చానెల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

18:15 - November 25, 2017

హైదరాబాద్ : సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 'ఏది బూతు-ఏది కామెడీ' అనే అంశంపై చర్చా గోష్టి జరిగింది. ఈ కార్యక్రమానికి సినీ విమర్శకులు కత్తి మహేష్‌, సామాజిక కార్యకర్త దేవితో పాటు పలు మహిళా, ప్రజాసంఘాల నేతలు పాల్గొన్నారు. హాస్యం పేరుతో ప్రముఖ చానెల్స్‌లో పలు కార్యక్రమాలు అసభ్యత, అశ్లీలత ఎక్కువయ్యిందని పలువురు అభిప్రాయపడ్డారు. పిల్లలు, మహిళలు ప్రోగ్రామ్స్‌ చూసే విధంగా లేవన్నారు. అలాంటి కార్యక్రమాలపై చర్యలు తీసుకోవడమే కాకుండా బ్యాన్‌ చేయాల్సిన అవసరముందన్నారు. జబర్దస్త్‌ ప్రోగ్రామ్‌లో తమను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని అనాథ విద్యార్థులు ఆరోపించారు. సైఫాబాద్‌ పీఎస్‌లో హైపర్‌ ఆది, జబర్దస్త్‌ కార్యక్రమంపై ఫిర్యాదు చేశారు. 

19:53 - June 16, 2017

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన శిరీష అనుమానాస్పద మృతి కేసు మిస్టరీ వీడింది. శిరీష మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తేల్చారు. ఆమెది హత్యకాదని... ఆత్మహత్యేనని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ మహేందర్‌రెడ్డి తెలిపారు. ఈ కేసులో ఏ-1గా శ్రావణ్‌, ఏ-2గా రాజీవ్‌ను నిందితులుగా చేర్చామన్నారు. శిరీష, శ్రావణ్‌, రాజీవ్‌ కలిసి సిద్దిపేట జిల్లాలోని కుకునూర్‌పల్లి వెళ్లారని చెప్పారు. ఆ రాత్రి శిరీషతోపాటు రాజీవ్‌, శ్రావణ్‌, ఎస్సై ప్రభాకర్‌రెడ్డి మద్యం సేవించారన్నారు. అనంతరం ఒంటరిగా ఉన్న శిరీషపట్ల ఎస్సై అసభ్యకరంగా ప్రవర్తించారని.. శ్రావణ్‌, రాజీవ్‌లు తమ విచారణలో తెలిపారన్నారు. ఎస్సై చేష్టలతో అవాక్కైన శిరీష మనస్తాపం చెందిందని.. ఒక్కసారిగా ఆమె పెద్దగా అరవడంతో బయట ఉన్న రాజీవ్‌, శ్రావణ్‌ లోనికి వచ్చారన్నారు. హైదరాబాద్ వచ్చిన తర్వాత శిరీష మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నట్టు తేల్చారు. ఇదే అంశంపై 'హెడ్ లైన్ షో'లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో సామాజిక కార్యకర్త దేవి, డాక్టర్ సైక్రియాటిస్టు జవహర్ లాల్ నెహ్రూ, మాజీ ఏసీబీ రెడ్డన్న పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

 

16:45 - May 5, 2016

హైదరాబాద్ : జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 70లో అనుమానాస్పద రీతిలో మృతి చెందిన విద్యార్థిని దేవి కేసులో అనుమానాలు మరింత బలపడుతున్నాయి. సాధారణ రోడ్డు ప్రమాదంగా భావించిన ఈ కేసులో ఒక్కొక్క అంశాన్ని విశ్లేషిస్తున్న పోలీసులకు ఊహించని ట్విస్టులు ఎదురవుతున్నట్టు తెలుస్తోంది. కుటుంబీకులు లేవనెత్తిన అనుమానాలు పోలీసులు ప్రాథమిక విచారణలో పలు అంశాలపై దృష్టిసారించారు. ఇదిలా ఉంటే నిందితుడిగా పేర్కొంటున్న భరత్‌ రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలంటూ మృతురాలు దేవి కుటుంబ సభ్యులు డిమాండ్‌ చేస్తున్నారు. బాధితురాలు దేవి ఇంటి నుంచి ఆమె బంధువులు, మహిళా సంఘాల కార్యకర్తలు పోలీస్‌ స్టేషన్‌కు ర్యాలీగా బయలు దేరారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. 

 

 

 

 

 

16:40 - August 11, 2015

మహిళలను చూసే దృక్కోణం మారాలని వక్తలు అన్నారు. సమాజం.. మహిళలు.. చిన్నచూపు అనే అంశంపై మానవి నిర్వహించిన చర్చ వేదిక కార్యక్రమంలో సామాజిక కార్యకర్తల దేవీ, పిఓడబ్ల్యు నేత ఝాన్సీ పాల్గొని, మాట్లాడారు. మహిళలను వ్యక్తిత్వం ఉన్న మనుషులుగా గుర్తించాలని కోరారు. మహిళలను వస్తువుగా చూసే భావజాలంలో మార్పు రావాలన్నారు. మహిళల వస్త్రధారణను వ్యాఖ్యానించటం అంటే వారి వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించటమే అవుతుందని పేర్కొన్నారు. స్త్రీల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించే వ్యాఖ్యానాలు చేయరాదని హితవు పలికారు. మహిళను అగౌరవ పరిచే వ్యాఖ్యలను ప్రతి ఒక్కరు ఖండించాలన్నారు. మహిళల అందచందాల గురించి వ్యాఖ్యానించే తీరు మారాలని పేర్కొన్నారు.
ఆలోచన రేకెత్తించే సినిమాలు రావాలి..
ప్రజలలో ఆలోచన రేకెత్తించే సినిమాలు రావాలని ఆకాంక్షించారు. సినిమాలలో అశ్లీలతను పూర్తిగా నిరోధించాలన్నారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే సంస్థలపై చర్యలు తీసుకోవాలని సూచించారు. సమస్యలు ఎదుర్కొవటానికి మహిళలంతా ఐక్యంగా స్పందించాలని పిలుపునిచ్చారు.
జెండర్ సెన్సిటివిటీని పెంచాలి...
జెండర్ సెన్సిటివిటీని పెంచాలన్నారు. జెండర్ సెన్సిటివిటీని పాఠ్యాంశంగా చేర్చాలని సూచించారు. జెండర్ సెన్సిటివిటీపై అన్ని రంగాల్లో, అన్ని స్థాయిలలో అవగాహన పెంచాలని వక్తలు పేర్కొన్నారు. వారు తెలిపిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

Don't Miss

Subscribe to RSS - దేవి