ధర్నా

18:24 - August 18, 2018

ఆదిలాబాద్ : జిల్లాలోని రిమ్స్ ఆస్పత్రి వద్ద మెడికోలు ధర్నాకు దిగారు. రిమ్స్ కళాశాలలో రెగ్యులర్ సిబ్బంది నియమించాలని డిమాండ్ చేశారు. సిబ్బంది లేక చాలా ఇబ్బందులకు గురువుతన్నామని..ప్రభుత్వం వెంటనే ఆదిలాబాద్ రిమ్స్ పై దృష్టి పెట్టాలని మెడికోలు కోరుతున్నారు. 

 

13:20 - August 14, 2018
17:30 - August 7, 2018
16:12 - August 7, 2018

ఢిల్లీ : రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్‌తో దేశ రాజధానిలో ఏపీ ఎన్ ఎస్ యూఐ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఢిల్లీలోని పార్లమెంటు స్ట్రీట్‌లో జరిగిన ఆందోళనకు కాంగ్రెస్‌ ఎంపీ కేవీపీ రామచంద్రరావు, ఏఐసీసీ కార్యదర్శి జేడీ శీలం మద్దతు తెలిపారు. ప్రత్యేక హోదా, విభజన హామీల అమల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏపీ ప్రజలను మోసం చేసిందని ఎన్ ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడు భగత్‌ ఆరోపించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపీ అందిస్తారు. 

16:35 - August 5, 2018

విశాఖపట్నం : పోర్టు పరిధిలోని సీ పోర్టులో 15 మంది కార్మికులను తొలగిండాన్ని నిరసిస్తూ సీఐటీయూ ధర్నా నిర్వహించింది. తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కార్మిక నాయకులు డిమాండ్‌ చేశారు. యూనియన్‌ ఏర్పాటు చేసుకున్న కారణంలో కార్మికులను తొలగించడాన్ని తప్పుపట్టారు.  లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సీ పోర్టు యాజమాన్యం  కార్మిక చట్టాలను కాలరాస్తోందని ఆరోపించారు. 
 

15:36 - August 3, 2018

ఢిల్లీ : హస్తినలో టీడీపీ ఎంపీలు ఆందోళన కొనసాగుతోంది. పార్లమెంట్ లోని గాంధీ విగ్రహం దగ్గర ఎంపీలు ధర్నా చేపట్టారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన చట్టం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అయినప్పటి నుంచి పార్లమెంట్ లోపల, వెలుపల టీడీపీ ఎంపీలు ఆందోళన చేస్తున్నారు. 

12:40 - July 31, 2018

విజయవాడ : కిడ్నీ బాధితుల సమస్యలపై సీపీఎం ఆధ్వర్యంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులు ధర్నా చేపట్టారు. మమ్మల్ని బ్రతికించండి మహాప్రభో అంటు ప్రభుత్వానికి తమ గోడును విన్నవించుకుంటున్నారు. ఈ ధర్నాలో ఏపీలోని 19 మండలాలకు చెందిన కిడ్నీ వ్యాధిగ్రస్తులు పాల్గొన్నారు. కిడ్నీ సమస్యల నుండి రక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ సమస్య వున్న 19 మండల కేంద్రాల్లో డాయలసిస్ సెంటర్లు ఏర్పాటు చేయాలని..ఉచితంగా మందులు అందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ 19 మండలాల్లోను రోజురోజుకి కిడ్నీ సమస్యల బాధితులు పెరుగుతున్నారు. ఇప్పటికే ఈ సమస్యతో 100మంది మృతి చెందారు. ఈ సమస్యపై స్పందించిన సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించి యంత్రాంగం ఏమాత్రం చర్యలు తీసుకోలేదు. దీంతో కిడ్నీ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఎ.కొండూరులో కిడ్నీ వ్యాధిగ్రస్తుల్ని ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు ప్రభుత్వం ఓ అంబులెన్స్ ను ఏర్పాటు చేసిందనీ..కానీ ఆసుపత్రిలో మాత్రం వైద్యులు అందుబాటలో వుండటంలేదని..కొంతకాలానికి ఆ అంబులెన్స్ సౌకర్యం కూడా నిలిచిపోయిందని సీపీఎం నేతలు తెలిపారు. ప్రతీ పేషెంట్ రూ.4 వేల నుండి 9వేల వరకు ఖర్చు పెడుతున్నారనీ..దీంతో వారు అప్పుల పాలై చివరకు మందులు కూడా కొనుగోలు చేసుకోలేని దుస్థితికి చేరుకున్నారన్నారు. ఐదారు సంవత్సరాల పిల్లకు కూడా ఈ కిడ్నీ వ్యాధి బారిన పడుతున్నారని తెలిపారు. స్థానికంగా తాగునీరు వల్ల ఈ వ్యాధి తీవ్రత పెరుగుతోందని..దీనికి సంబంధించిన అన్ని చర్యలను ప్రభుత్వం తీసుకోవాలని సీపీఎం నేతలు డిమాండ్ చేశారు. రూ.680 కోట్లు కేటాయించామని జూన్ నెలాఖరుకల్లా ఇంటింటికి మంచినీరు సరఫరా చేస్తామని మంత్రి లోకేశ్ హామీ ఇచ్చారనీ కానీ ఇంత వరకూ అమలు కాలేదని వెంటనే కిడ్నీ వ్యాధిగ్రస్తులకు సంబంధించి అన్ని చర్యలు తీసుకోవాలని సీపీఎం నేతలు డిమాండ్ చేశారు.

08:48 - July 24, 2018

తూ.గో : ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ ఏపీ వ్యాప్తంగా వైసీపీ ఆధ్వర్యంలో బంద్‌ కొనసాగుతోంది. కాకినాడలోని బస్‌ డిపో ఎదుట వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు. బస్సులు బయటకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. ప్రత్యేకహోదాపై చంద్రబాబుకు చిత్తశుద్ది లేదంటున్న వైసీపీ నేత ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డితో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం... 

15:50 - July 9, 2018

తూర్పుగోదావరి : తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో డైట్ విద్యార్ధులు ధర్నా చేపట్టారు. నాలుగు సంవత్సరాల డైట్ కోర్సును రెండు సంవత్సరాలు కుదించడంతో నిర్ణీత కాలంలో కోర్సు పూర్తి కాకపోవడంతో తమ విలువైన కాలాన్ని కోల్పోతున్నామని విద్యార్ధులు అవేదన వ్యక్తం చేశారు. దీనికి ప్రధాన కారణం లెక్చరర్ల కొరతే అని..వెంటనే ప్రభుత్వం కలుగజేసుకొని డైట్ విద్యార్ధుల డిమాండ్లను నెరవేర్చాలని విద్యార్ధిసంఘం నాయకులు కోరుతున్నారు.

11:01 - July 2, 2018

కృష్ణా : నందిగామలో మున్సిపల్‌ కార్మికుల ఆందోళనతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గత కొన్ని రోజులుగా తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలన్న డిమాండ్‌తో మున్సిపల్‌ కార్మికులు సమ్మె చేస్తున్నారు. దీంతో అధికారులు ఇవాళ పారిశుద్ధ్య పనులకోసం కిరాయి కూలీలను రప్పించారు. పని చేస్తున్న కిరాయి కూలీలను మున్సిపల్‌ కార్మికులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అండగా నిలవాల్సిన ఎమ్మెల్యే కూడా తమని అణగదొక్కేందుకు చూస్తున్నారని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Pages

Don't Miss

Subscribe to RSS - ధర్నా