నందమూరి

08:11 - August 30, 2018

హైదరాబాద్ : నందమూరి హరికృష్ణ మృతి చెందడం పట్ల మంత్రి పోచారం తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. గురువారం ఉదయం హరికృష్ణ పార్థీవ దేహానికి నివాళులర్పించారు. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సమయంలో ఆత్మయంగా పలకరించేవాడని, ఆయన మరణం అందరికీ దుఖాన్ని కలుగ చేస్తోందన్నారు. ఎంతో చక్కటి, నైపుణ్యంతో డ్రైవింగ్ చేసేవాడని తెలిపారు.

ఇదిలా ఉంటే నందమూరి హరికృష్ణను కడసారి చూసేందుకు భారీగా అభిమానులు, నేతలు తరలివస్తున్నారు. మెహిదీపట్నంలో ఆయన నివాసంలో పార్థీవ దేహాన్ని ఉంచిన సంగతి తెలిసిందే. నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణ దుర్మరణం పాలయిన సంగతి తెలిసిందే. సినీ, రాజకీయ, ఇతర ప్రముఖులు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. జూబ్లీహిల్స్ లోని మహా ప్రస్థానంలో అంత్యక్రియలు జరుగనున్నాయి. సాయంత్రం 4గంటలకు ఈ కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో జరుగనున్నాయి. 

06:32 - August 30, 2018

హైదరాబాద్ : రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన టీడీపీ సీనియర్‌ నేత, సినీ నటుడు నందమూరి హరికృష్ణకు సినీ ప్రపంచం నివాళులర్పించింది. ఆయన కుటుంబ సభ్యులకు సినీ ప్రముఖులు సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా హరికృష్ణతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన సినీ నటుడు, టీడీపీ నేత నందమూరి హరికృష్ణకు సినీ జగత్తు నివాళులర్పించింది. సినీ ప్రముఖులు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిజేశారు. ఈ సందర్భంగా హరికృష్ణతో ఉన్న అనుబంధాన్ని సినీ ప్రముఖులు గుర్తుచేసుకున్నారు.

నందమూరి హరికృష్ణ అకాల మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని హీరో చిరంజీవి అన్నారు. హరికృష్ణ నివాసానికి వచ్చిన చిరంజీవి.. ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. ఆత్మీయ మిత్రుడు, సోదర సమానుడైన హరికృష్ణ మృతి తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. హరికృష్ణ ఎప్పుడు కలిసినా ఎంతో ఆప్యాయంగా పలకరించేవారన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, హరికృష్ణ కుటుంబ సభ్యులకు మానసిక స్థైర్యం కలిగించాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని చిరంజీవి అన్నారు. అటు పవన్‌కల్యాణ్‌ సైతం హరికృష్ణ పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

తన అన్నయ్య అందరితోను కలుపుకోలుగా ఉండేవారని అన్నాకు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. హరికృష్ణ మనతో లేకున్నా ఆయన జ్ఞాపకాలు మనతోనే ఉంటాయన్నారు. హరికృష్ణ మృతికి సానుభూతి తెలిపిన ప్రతి ఒక్కరికీ బాలకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. హరికృష్ణ తన జీవితంలో ఒక గొప్ప వ్యక్తిగా జీవించాడని బాలకృష్ణ అన్నారు.

హరికృష్ణ మహా మనిషి అని.. ఎవరికి ఏ సాయం కావాలన్నా.. చేసేవారని సినీ నటుడు కృష్ణం రాజు అన్నారు. ఒక మంచి మిత్రున్ని కోల్పోయనని కన్నీటి పర్యంతం అయ్యారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలన్నారు కృష్ణం రాజు. హరికృష్ణ మంచి నటుడిగా.. మంచి వ్యక్తిగా గుర్తింపు సంపాదించారని సినీ నటుడు సీనియర్‌ నరేష్‌ అన్నారు. ఎన్టీఆర్‌ చైతన్య రథ సారథిగా హరికృష్ణకు గొప్ప పేరుందని తెలిపారు. హరికృష్ణ మృతి సినీ లోకానికి తీరని లోటని అన్నారు. హరికృష్ణ ఇంత త్వరగా తమని వదిలి వెళ్తారని తాను ఊహించలేదని.. ఆయన ఆత్మకు శాంతి చేకూరలని కోరుకుంటున్నానని నరేష్‌ అన్నారు.

నందమూరి హరికృష్ణ అకాల మరణం తెలుగు సినీ జగత్తుకు తీరని లోటు అన్నారు ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్‌. ఆకస్మాత్తుగా హరికృష్ణ మరణ వార్త వినటం కలిచివేసిందని చెప్పారు. నందమూరి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని.. హరికృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలని కోరకుంటున్నానని కళ్యాణ్ అన్నారు. హరికృష్ణ మంచి మనిషి అని.. గొప్ప వ్యక్తి అని అభివర్ణించారు సినీ నటుడు అశోక్‌. ఏ వ్యక్తి ఆపదలో ఉన్న వారికి ఎలాంటి సాయమైనా చేసే వారని తెలిపారు. నందమూరి హరికృష్ణ మరణించటం తెలుగు సినీ పరిశ్రమకు, టీడీపీకి, దేశ రాజకీయాలకు తీరని లోటు అని అన్నారు సినీ నటుడు ఆర్‌. నారాయణమూర్తి. మానవీయ విలువలు, కుటుంబ విలువలు, సామాజిక విలువలపై నిబద్దత, పట్టు ఉన్న మనిషి హరికృష్ణ అని తెలిపారు. అలాంటి వ్యక్తి చనిపోవటం దురదృష్టకరమని.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని ఆర్‌. నారాయణ మూర్తి చెప్పారు. ఇక హరికృష్ణను కడసారి చూసేందుకు సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున్న ఆయన నివాసానికి చేరుకుంటున్నారు. 

06:29 - August 30, 2018

హైదరాబాద్ : రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన నందమూరి హరికృష్ణ అంత్యక్రియలు గురువారం జరగనున్నాయి. జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. హరికృష్ణ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి హరికృష్ణ అంతిమయాత్ర కొనసాగనుంది. సాయంత్రం 4 గంటలకు జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానంలో అధికారిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు జరగనున్నాయి. మెహిదీపట్నంలోని నివాసం నుంచి జూబ్లీహిల్స్‌ వరకు అంతిమయాత్ర కొనసాగనుంది. చైతన్య రథంపైన హరికృష్ణ అంతిమయాత్ర సాగనున్నట్లు తెలుస్తోంది. హరికృష్ణ మృతదేహాన్ని సందర్శించి సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. హరికృష్ణను కడసారి చూసేందుకు పలువురు అభిమానులు తరలివస్తున్నారు

13:35 - August 29, 2018

హైదరాబాద్ : నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడం ఎందరినో కలిచి వేసింది. నందమూరి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఇదిలా ఉంటే ఆయన రాజ్యసభలో చేసిన స్పీచ్ ను పలువురు గుర్తు చేసుకుంటున్నారు. విభజనను వ్యతిరేకిస్తూ రాజ్యసభలో తెలుగులో ప్రసంగించారు. విభజనను తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ హిందీలో మాట్లాడాలని డిప్యూటి ఛైర్మన్ పేర్కొన్నా...హిందీలో మాట్లాడే అవకాశం ఉన్నా..ఆయన మాత్రం తెలుగులోనే మాట్లాడుతానని పట్టుబట్టారు. విభజనను వ్యతిరేకించిన హరికృష్ణ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తెలుగువారంతా కలిసి ఉండాలని, తెలుగు జాతి ఒక్కటేనని డిమాండ్ చేస్తూ రాజ్యసభ సభ్యత్వం నుంచి ఆయన తప్పుకున్నారు. తెలుగు భాషా దినోత్సవం రోజునే హరికృష్ణ మృతి ఘటన దురదృష్టకరమని టీడీపీపీ పేర్కొంది.

12:24 - August 29, 2018
09:23 - August 29, 2018

హైదరాబాద్ : సినీ నటుడు, ప్రొడ్యూసర్, టిడిపి రాజకీయ నేత నందమూరి హరికృష్ణ దుర్మరణం చెందడం పలువురు జీర్ణించుకోలేకపోతున్నారు. విషయం తెలుసుకున్న నందమూరి కుటుంబసభ్యులు, అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. నల్గొండ జిల్లా అన్నేపర్తి వద్ద ఆయన కారు ప్రమాదానికి గురైంది. తీవ్రగాయాల పాలైన హరికృష్ణ నార్కెట్ పల్లి కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు ఆసుపత్రికి బయలుదేరారు.

ఇదిలా ఉంటే ఆయన జీవిత గమనాన్ని నేతలు నెమరు వేసుకుంటున్నారు. ఎన్టీరామారావుతో ఎంతో సానిహిత్యంగా ఉండేవాడని, ఆయన ప్రారంభించిన చైతన్య రథానికి డ్రైవర్ గా హరికృష్ణ చేశారని గుర్తు చేసుకుంటున్నారు. ఆయన నిర్వహించిన పాత్ర ఇప్పటికీ నెమరు వేసుకుంటున్నారు. హరికృష్ణ ఒక మొండి మనిషి..భోళాశంకరుడని టిడిపి నేతలు అభివర్ణిస్తుంటారు. సీతయ్య ఎవరి మాట వినడనే రీతిలో వ్యవహరించేవాడని...ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో రాజీనామా చేసి తెలుగులో ప్రసంగించిన సంగతి తెలిసిందే.

2004లో ఎన్నికల ప్రచారానికి వెళుతున్న జూ.ఎన్టీఆర్ ప్రమాదానికి గురై తృటిలో మృత్యువాత నుండి బయటపడ్డారు. కానీ జానకీ రామ్ మాత్రం రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా ఇప్పుడు నందమూరి హరికృష్ణ మృతి చెందడం కుటుంబసభ్యులను కలిచివేస్తోంది. 

06:50 - May 25, 2018

హైదరాబాద్ : నందమూరి బాలకృష్ణ తాను ఎంతగానో ఇష్టపడే నటుడని తెలంగాణ ఐటీ, మున్సిపల్‌ మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఎన్టీఆర్‌పై అభిమానంతోనే తన తండ్రి కేసీఆర్‌ తనకు తారక రామారావు అని పేరు పెట్టారని తెలిపారు. జూబ్లీహిల్స్‌లోని బసవతారకం కేన్సర్‌ ఆస్పత్రిలో క్యాన్సర్‌ యూనిట్‌ను నటుడు బాలకృష్ణతో కలిసి కేటీఆర్‌ ప్రారంభించారు. క్యాన్సర్‌ను అవగాహనతోనే నిర్మూలించవచ్చని.. ప్రజల్లో అవగాహన కల్పించాలని మంత్రి కేటీఆర్ అన్నారు. తారకరామారావు పేరును నిలబెట్టేలా పని చేస్తానని కేటీఆర్ తెలిపారు. కేసీఆర్ తన కొడుకుకి ఎన్టీఆర్ పేరు పెట్టడం సంతోషకరమని బాలకృష్ణ అన్నారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో క్యాన్సర్‌కు చికిత్స అందిస్తున్నామని బాలకృష్ణ తెలిపారు. ఎన్టీఆర్‌ బయోపిక్‌లో బసవతారకం హాస్పిటల్‌ గురించి ఉంటుందని బాలకృష్ణ చెప్పారు.

18:26 - January 13, 2018

చిత్తూరు : ఏపీ సీఎం చంద్రబాబు స్వగ్రామంలో సంక్రాంతి శోభ ఉట్టిపడింది. నారావారిపల్లికి చేరుకున్న నారా, నందమూరి కుంటుంబ సభ్యులకి గ్రామస్థులు ఘనస్వాగతం పలికారు. మహిళలకు ముగ్గుల పోటీలు, పిల్లలకు ఆటల పోటీలను సీఎం సతీమణి నారా భువనేశ్వరి ప్రారంభించారు. సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు.

19:18 - January 12, 2018

నటమూరి నందమూరి 'బాలకృష్ణ' సంక్రాంతి పండుగ సందర్భంగా తన తాజా చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఆయనకిది 102వ చిత్రం. కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో ‘జైసింహా’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా శుక్రవారం విడుదలైంది. ఈ చిత్రంలో బాలయ్య సరసన మరోసారి 'నయనతార నటించగా మరో హీరోయిన్ గా నటాషాదోషి, హరి ప్రియ కథానాయికలుగా నటించారు. 'బాలకృష్ణ' 'నయనతార' కాంబినేషన్ లో వచ్చిన చిత్రాలు విజయవంతమైన సంగతి తెలిసిందే. 'జై సింహా' తో మరిసారి ఈ కాంబినేషన్ ప్రేక్షకులు ముందుకొచ్చింది. మరి ఈ కాంబినేషన్ అలరించిందా ? 'జై సింహా' సినిమా ఎలా ఉంది ? తదితర విషయాలు తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

10:49 - September 8, 2017

‘కొట్టేయడంతో పాటు కొట్టడమూ వచ్చురా' అంటూ 'కుశ' పాత్రలో 'ఎన్టీఆర్' పలికిన డైలాగ్ అభిమానులను అలరిస్తోంది. ఆయన తాజా చిత్రం 'జై లవ కుశ' టీజర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ చిత్రంలో 'ఎన్టీఆర్'..’జై', ‘లవ', ‘కుశ' పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈపాత్రలకు సంబంధించిన పోస్టర్స్..టీజర్స్ లను చిత్ర బృందం విడుదల చేస్తోంది.

ఎన్టీఆర్ సోదరుడు నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మాణంలో బాబీ దర్శకత్వంలో ఈ సినిమా ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది. ఎన్టీఆర్ ఏకంగా మూడు పాత్రలు పోషిస్తుండడం..ఆ పాత్రలకు దేనికవే భిన్నంగా ఉండడంతో చిత్రంపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. సంకెళ్ళ‌తో క‌ట్టివేయ‌బ‌డిన 'ఎన్టీఆర్' రౌద్రం రాజ‌సం క‌లిసిన 'జై' లుక్ ఉండగా...సింపుల్ అండ్ స్టైలిష్ గా 'లవ'.. ఇక 'కుశ' పాత్రలో 'ఎన్టీఆర్' డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో ట్రెండీగా కనిపిస్తున్నాడు.

‘కుశ' కు సంబంధించిన టీజర్ విడుదల చేశారు. ‘కొట్టేయడంతో పాటు కొట్టడమూ వచ్చురా...ఈ డబ్బు తీసుకెళ్లి అమెరికాలో ఇన్వెస్ట్ చేసి ఆ ఆధార్ కార్డేదో నాకు ఇప్పించేయండి బాబు' అని ఎన్టీఆర్ పలికితే 'దాన్ని ఆధార్ కార్డు అనరమ్మ..గ్రీన్ కార్డు అంటారు' అనే డైలాగ్స్ ఉంది. ఎన్టీఆర్ సరసన రాశీ ఖన్నా..నివేదా థామస్ లు నటిస్తున్నారు. దసరా కానుకగా ఈ చిత్రం సెప్టెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Pages

Don't Miss

Subscribe to RSS - నందమూరి