నటుడు

19:48 - September 5, 2018

ముంబై : మొగల్-ఏ-అజమ్, నవ్యదౌర్, దేవదాస్, గంగా జమునా, కర్మ లాంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను దిలీప్ కుమార్ బాలీవుడ్ సీనియర్ నటుడు దిలీప్ కుమార్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఛాతి ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న ఆయన ప్రస్తుతం ముంబయిలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని దిలీప్ కుమార్ అధికారిక ట్విట్టర్ లో పేర్కొన్నారు. దిలీప్ కుమార్ ప్రస్తుతం కోలుకుంటున్నారని, ఆయన ఆరోగ్యం మెరుగుపడాలని ప్రార్థనలు చేయాలని ఆ ట్వీట్ లో కోరారు. ‘జెడీ కింగ్’ గా పేరు సంపాదించుకున్న దిలీప్ కుమార్ 1998 నుంచి సినిమాలకు దూరంగా ఉన్నారు.1994లో దాదా సాహెబ్ ఫాల్కే, 2015లో పద్మ విభూషణ్ అవార్డులతో దిలీప్ కుమార్ ని ప్రభుత్వం గౌరవించింది.

06:53 - July 31, 2018

హైదరాబాద్ :, బహుముఖ ప్రజ్ఞాశాలి..రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీత...ప్రముఖ సినీ నిర్మాత కె. రాఘవ కన్నుమూశారు. ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత కె.రాఘవ సోమవారం రాత్రి ఫిలింనగర్ లోని ఆయన నివాసంలో 104 సంవత్సరాల వయస్సులో రాఘవ గుండెపోటుతో కన్నుమూశారు. తూర్పుగోదావరి జిల్లాలోని కోటిపల్లిలో జన్మించిన రాఘవ సినీ రంగానికి ఎనలేని సేవలు చేశారు. 15 సంవత్సరాల వయసులో ఇంటినుండి పారిపోయిన రాఘవ ఎన్నో కష్టనష్టాలకు ఓర్చుకుని మూకీ చిత్రాలనుండి పెనవేసుకున్న ఆయన సినిమా చరిత్ర నిర్మాతస్థాయికి ఎదిగి టాలీవుడ్ లో ఎంతోమంది ప్రతిభావంతుల్ని రాఘవ సినీ రంగానికి పరిచయం చేశారు. ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేతగా సుఖదుఃఖాలుసినిమాకు సహ నిర్మాతగా..జగత్ కిలాడీలు,జగత్ జెట్టీలు,జగత్ జెంత్రీలు,తాత మనవడు,సంసారం-సాగరం,తూర్పు పడమర,ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య,తరంగిణి,సూర్యచంద్రులు,చదువు సంస్కారం,అంతులేని వింతకథ,త్రివేణి సంగమం,ఈ ప్రశ్నకు బదులేది,యుగకర్తలు సినిమాలను నిర్మించారు. నటుడిగా మారిన రాఘవ బాలనాగమ్మ, చంద్రలేఖ సినిమాలలో నటించారు. స్టంట్ మాస్టర్‌గా తన మార్కుతో పల్నాటి యుద్ధం,పాతాళ భైరవి,రాజు పేద సినిమాలకు పనిచేశారు. ప్రొడక్షన్ మేనేజర్‌గా కూడా పనిచేసిన ఆయన కీలుగుర్రం, టార్జాన్ గోస్ ఇండియా -అంనే ఇంగ్లీస్ సినమాకు పనిచేశారు. వీరపాండ్య కట్టబొమ్మన్ అనే తమిళచిత్రం,భలే పాండ్య,అంతేకాదు హిందీ చిత్రం దిల్ తేరా దీవానా సినిమాకు పనిచేశారు. దర్శకరత్న దాసరి నారాయణ రావును తాతమనవడు సినిమాతో దర్శకుడిగా పరిచయం చేశారు. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాతో కోడి రామకృష్ణకు దర్శకుడిగా అవకాశమిచ్చారు. సినీ పరిశ్రమకు దర్శక దిగ్గజాలను పరిచయం చేశారు కె.రాఘవ. గొల్లపూడి, భానుచందర్, మాధవి వంటి నటీనటులను పరిచయం చేశారు. అంచెలంచెలుగా సినిమా పరిశ్రమలో ఎదిగిన కె.రాఘవ పాండిచ్చేరికి చెందిన నిర్మాత ఎం.కె.రాధా చెల్లెలు హంసారాణిని వివాహం చేసుకున్నాడు. వారికి కుమారుడు ప్రతాప్, కూతురు ప్రశాంతి ఉన్నారు.

 

 

13:12 - July 17, 2018

తిరుమల : తిరుపతి ఎర్రచందనం స్మగ్లింగ్‌లో వర్తమాన నటుడు హరి టాస్క్ ఫోర్స్ ఐజీ కాంతారావు ముందు లొంగిపోయాడు. తన తల్లికి అనారోగ్యం కారణంగా తాను ఒకేఒక్కసారి ఎర్రచందనం స్మగ్లింగ్ లో పాల్గొన్నానని హరి పేర్కొంటున్నాడు. కానీ తనను కావాలనే ఓ పోలీస్ కానిస్టేబుల్ తనపై కేసులు ఇరికించాడని హరి అంటున్నాడు. గతంలో ఆ పోలీస్ కానిస్టేబుల్ ను కొన్ని కేసుల విషయంలో తాను బైటపెట్టినందుకు తనను పలు కేసుల్లో సదరు కానిస్టేబుల్ ఇరికించాడని నటుడు హరి వాపోతున్నాడు. కాగా హరిపై ఇప్పటికే దాదాపు 20 కేసుల వరకూ వున్న నేపథ్యంలో పోలీసులు విచారణను కొనసాగిస్తున్నారు.
పలు షోల్లో నటించిన హరి..
తిరుపతి ఎర్రచందనం స్మగ్లింగ్‌లో వర్తమాన నటుడు హరిని ఉన్నట్లు పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. గతంలో పలు టీవీ కామెడీ షోల్లోను, తాజాగా రిలీజైన ఓ మూవీకి ఫైనాన్స్‌ చేయడంతో పాటు ఆ సినిమాలో ప్రధాన పాత్ర పోసించినట్లుగా పోలీసులు గుర్తించారు. స్మగ్లింగ్‌లో మరో ఇద్దరు నటుల ప్రమేయం ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు. సుమారు 20కేసుల్లో నిందితుడుగా వున్నట్లుగా పోలీసులు పేర్కొంటున్నారు. 

13:40 - July 12, 2018

చిత్తూరు : తిరుపతి ఎర్రచందనం స్మగ్లింగ్‌లో వర్తమాన నటుడు హరి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గతంలో పలు టీవీ కామెడీ షోల్లో నటించాడు హరి. తాజాగా రిలీజైన ఓ మూవీకి ఫైనాన్స్‌ చేయడంతో పాటు ఆ సినిమాలో ప్రధాన పాత్ర పోశించాడు. స్మగ్లింగ్‌లో మరో ఇద్దరు నటుల ప్రమేయం ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్దారించారు. సుమారు 20కేసుల్లో నిందితుడుగా వున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ప్రత్యేక బృందాల ద్వారా రెడ్ శ్యాండిల్స్‌ టాస్క్‌ ఫోర్స్‌ నటుల కోసం గాలిస్తున్నాయి. 

12:16 - June 13, 2018

కొందరు హీరోలు కేవలం రీల్ లో మాత్రమే హీరోలు..రియల్ లైఫ్ లో వారు జీరోలే కాదు..విలన్ ల కంటే దారుణంగా ప్రవర్తిస్తుంటారు. సినిమా డైలాగుల్లో సూక్తులు చెబుతుంటారు. నిజజీవితంలో రాక్షసుల్లా ప్రవర్తిస్తుంటారు అనే దానికి ఈ హీరోనే నిదర్శనం.

ఆర్మాన్ కోహ్లీ అరెస్ట్..
తన భార్య, ఫ్యాషన్ స్టయిలిస్ట్ నీరూ రంధావాను దారుణంగా హింసించిన కేసులో బాలీవుడ్ నటుడు అర్మాన్ కోహ్లీని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. గత వారంలో నీరూ ఫిర్యాదు మేరకు అర్మాన్ పై కేసును రిజిస్టర్ చేసిన శాంతాక్రజ్ పోలీసులు, అప్పటి నుంచి ఆయన కోసం గాలిస్తున్నారు.

నీరు తలను నేలకేసి బాదిన కోహ్లీ..
ఈ నెల 3వ తేదీన ఆర్థిక వివాదంలో అర్మాన్, నీరూల మధ్య వాగ్వాదం జరుగగా, నీరూ తలను అర్మాన్ నేలకేసి బలంగా కొట్టాడన్నది ప్రధాన ఆరోపణ. ఈ ఘటనలో నీరూ రంధావాకు బలమైన గాయాలు కాగా, కోకిలాబెన్ దీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో ఆమెకు చికిత్స చేశారు. తన తలకు 15 కుట్లు పడ్డాయని, తలపై మచ్చ జీవితాంతం ఉంటుందని డాక్టర్ చెప్పిన మాటలు విని తానెంతో ఆందోళన చెందుతున్నానని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన అనంతరం నీరూ వ్యాఖ్యానించారు. కాగా, నిందితుడు అర్మాన్ ను న్యాయస్థానం ముందు హాజరు పరచనున్నట్టు శాంతాక్రజ్ పోలీసులు తెలిపారు.

19:49 - December 4, 2017

ముంబై : ప్రముఖ బాలీవుడ్ నటుడు శశికపూర్ కన్నుమూశారు. శశికపూర్ కోల్ కత్తాలో 1938 లో జన్మించారు. ఆయన 2011లో పద్మభూషణ్, 2015లో దాదాసహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు. ఆయన హీరోగా 61 సినిమాల్లో నటించారు. మొత్తంగా 116 సనిమాల్లో శశికపూర్ నటించారు. 

18:18 - September 23, 2017

హైదరాబాద్ : అత్యాచారం కేసులో బాలీవుడ్‌ ప్రొడ్యూసర్ కరీమ్ మొరానీ ఎట్టకేలకు హైదరాబాద్‌ రాచకొండ పోలీసులకు లొంగిపోయాడు. 2015లో ఢిల్లీకి చెందిన యువతిపై ముంబై, హైదరాబాద్‌లో పలుమార్లు అత్యాచారం చేసిన కేసులో కరీమ్ నిందితుడిగా ఉన్నాడు. ముంబైకి చెందిన యువతి సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న క్రమంలో నిర్మాత కరీం పరిచయం అయ్యాడు. కరీం మొరానీ సినిమాలో అవకాశం ఉందంటూ పిలవడంతో 2015లో ఆమె ఢిల్లీ నుంచి ముంబై వచ్చింది. సదరు నిర్మాత తన స్నేహితురాలి తండ్రి కావడంతో సినిమాలో అవకాశం నిజంగానే ఇస్తాడని భావించింది. ఆ తర్వాత యువతి ఉంటున్న హోటల్‌కి వెళ్లిన కరీం మొరాని..ఆమెకు మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేశాడు. ఆ సమయంలోనే న్యూడ్‌ ఫొటోలుతీసి, బ్లాక్‌మెయిల్‌చేస్తూ పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టాడు.

హయత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో
జనవరి10న హయత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో బాధితురాలు నిర్మాత కరీమ్‌ మురానీపై ఫిర్యాదుచేసింది. 'దిల్‌వాలే' షూటింగ్‌ సమయంలో హయత్‌నగర్‌ సమీపంలో కరీం పలుమార్లు తనపై అత్యాచారం జరిపాడని పేర్కొంది. ముంబైలోనూ తనపై పలుమార్లు లైంగికదాడి చేసినట్లు చెప్పింది. తనకు మాఫీయాతో సంబంధాలున్నాయని, విషయం బయటికి చెబితే చంపేస్తానని కరీం మొరానీ బెదిరించాడని తెలిపింది. చివరికి వేధింపులు భరించలేని స్థితిలో పోలీసులకు ఫిర్యాదుచేశానంది. దీంతో కరీం మొరానీపై నిర్భయ చట్టం, మరో నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. సంచలనాత్మక 2జీ కుంభకుణంలోనూ కరీం మొరానీ నిందితుడిగా ఉన్నాడు.

నాన్ బెయిల‌బుల్ వారెంట్‌
ట్రయల్‌ కోర్టునుంచి ముందస్తు బెయిల్‌ తీసుకున్న కరీం మొరానీ.. ముంబైకి వెళ్లిపోయాడు. బాధితురాలు హైకోర్టును ఆశ్రయించడంతో.. సెప్టెంబర్ 5న అతడికి నాన్ బెయిల‌బుల్ వారెంట్‌ను ఇష్యూ చేసింది. దీంతో.. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసుకున్నాడు. అయితే.. ఆయన అప్పీల్‌ను సుప్రీం కూడా తిరస్కరించి హైకోర్టు తీర్పును సమర్థించింది. ఈనెల 22న హైదరాబాద్‌ పోలీసులకు లొంగిపోవాలని ఆదేశించింది. దీంతో నిందితుడు కరీం.. రాచకొండ పోలీసులకు లొంగిపోయాడు. ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం నిందితుడిని...పోలీసులు రంగారెడ్డి కోర్టులో ప్రవేశపెట్టారు. షారూఖ్‌ఖాన్‌ హీరోగా నటించిన దిల్‌వాలే, చెన్నై ఎక్స్‌ప్రెస్‌, రా.వన్‌ సినిమాలకు కరీమ్‌ ప్రొడ్యూసర్‌గా ఉన్నాడు. బాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాతగా కొనసాగుతున్న ఇతడు..క్షణికసుఖాల కోసం చేసిన తప్పు కటకటాల పాలు చేసింది. 

13:10 - September 15, 2017

చెన్నై : తమిళ ఎమ్మెల్యేల తీరుపై కమల్ హస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు రిసార్టుల్లో ఉండడంపై కమల్ పెదవి విరిచారు. ఎమ్మెల్యేలు అమ్ముడుపోయి రిసార్టుల్లో కూర్చుంటే పాలన ఎలా అని ట్వీట్ చేశారు. పని చేయకపోతే జీతం లేదనే సూత్రం ఉద్యోగులకేనా..? అని కమల్ ప్రశ్నించారు. మరి బేరసారాలు సాగిస్తూ రిసార్టుల్లో కూర్చనే రాజకీయా నేతల సంగతేంటి, సమ్మె చేస్తున్న ఉపాధ్యాయులను హెచ్చరించిన కోర్టు ఎమ్మెల్యేలను కూడా హెచ్చరించాలని కమల్ అభప్రాయపడ్డారు. కమల్ హసన్ ట్వీట్ తమిళ రాజకీయంలో సంచలనం రేపుతున్నాయి. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

21:20 - August 19, 2017

నటుడు, కమెడియన్ నవీన్ తో టెన్ టివి స్పెషల్ చిట్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా నవీన్ తన సినీ కెరీర్ గురించి వివరించారు. నేనే రాజు నేనే మంత్రి సినిమా షూటింగ్ అనుభవాలను తెలిపారు. ఆయన తెలిపిన పలు ఆసక్తిరమైన విషయాలను వీడియోలో చూద్దాం..

 

20:34 - July 15, 2017

Pages

Don't Miss

Subscribe to RSS - నటుడు