నడింపల్లి

19:50 - April 16, 2018

నిర్మల్‌ : ఖానాపూర్‌ మండలంలోని నడింపల్లి గ్రామాన్ని గ్రామ పంచాయితీగా ఏర్పాటు చేయాలని గ్రామస్థులు నిర్మల్‌ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. అనంతరం ఖానాపూర్‌ ఎంపీడీవోకు వినతి పత్రం ఇచ్చారు. ఇప్పటికైన ప్రభుత్వం మాకు న్యాయం చేయకపోతే కోర్టు ద్వారానైనా గ్రామ పంచాయితీని సాధించుకుంటామని గ్రామస్థులు స్పష్టం చేశారు. చిన్న చిన్న తండాలను గ్రామ పంచాయితీలుగా ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం తమ గ్రామాన్ని చిన్న చూపు చూస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

 

07:22 - December 26, 2016

నాగర్‌కర్నూలు : అచ్చంపేట మండలం నడింపల్లిలో ఘోర ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి ఎదురెదురుగా వస్తున్న ఆర్టీసీబస్సు, బొలేరో వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. వీరిని హైదరాబాద్‌కు తరలించారు. మృతులు లిఫ్టు ఇరిగేషన్‌లో కాంట్రాక్టర్‌, సూపర్‌వేజర్‌లుగా పనిచేస్తున్న సుబ్బారెడ్డి, రాము, అనిల్‌గా గుర్తించారు. ఈ ప్రమాదంలో బొలేరో వాహనం నుజ్జునుజ్జయ్యింది.

10:27 - February 8, 2016

అనంతపురం : జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళా కూలీలు గాయపడ్డారు. ఈ ఘటన నల్ల చెరువు వద్ద చోటు చేసుకుంది. రోడ్డు నిర్మాణ పనుల కోసం నడింపల్లి నుండి కొందరు మహిళా కూలీలు వెళుతున్నారు. వీరి రాకపోకల కోసం కాంట్రాక్టర్ ఆటోను సమకూర్చాడు. ఎప్పటిలాగానే నడింపల్లి నుండి ఏడుగురు మహిళలు ఆటోలో ప్రయాణిస్తున్నారు. నడింపల్లికి సమీపంలో ఆటోను ఆర్టీసీ బస్సు వేగంగా ఢీకొంది. దీనితో ఆటో బోల్తా కొట్టింది. ఈప్రమాదంలో ఆటో ఉన్న ఏడుగురు మహిళా కూలీలు, ఆటో డ్రైవర్ కు గాయాలయ్యాయి. వీరిని కదిరి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇద్దరు మహిళా కూలీలకు తీవ్రగాయాలయ్యాయి. వీరికి మెరుగైన వైద్య చికిత్స కోసం బెంగళూరు లేదా ఇతర ప్రాంతాలకు తరలిస్తారని తెలుస్తోంది. 

Don't Miss

Subscribe to RSS - నడింపల్లి