నరేంద్రమోడీ

21:57 - November 8, 2018

దంతెవాడ: చత్తీస్ ఘడ్ రాష్ట్రం దంతెవాడలో ప్రధానమంత్రి నరేంద్రమోడీని పోలిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నారు. మనుషులను పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని అంటారు. చత్తీస్ ఘడ్ కు చెందిన అభినందన్ పాఠక్ అచ్చు మోడీ లాగానే ఉంటారు. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున బస్తర్ ప్రాంతంలో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు.  గతంలో బీజేపీ కార్యకర్తగానే ఉన్న పాఠక్ ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరారు. దంతెవాడ, కొండగావ్‌, జగ్దల్‌పూర్‌, బస్తర్‌ జిల్లాల్లో ప్రచారం నిర్వహిస్తున్నపాఠక్ తో ఓటర్లు సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహం చూపుతున్నారు.

16:40 - October 24, 2018

ఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్ధ (సీబీఐ) లో అధికారుల మధ్య అంతర్గతపోరు మొత్తానికి సంస్ధ పరువును బజారుకీడ్చి ప్రభుత్వాన్నిఇరకాటంలోకి నెట్టుతోంది. ఇప్పటికే విపక్షాలు బీజేపీ ప్రభుత్వంపై విమర్శల దాడి మొదలెట్టాయి. ఇద్దరు అధికారులను శలవుపై పంపినప్పటికీ, అందులో ఒకరు ప్రధానమంత్రి నరేంద్రమోడి ఏరికోరి తెచ్చుకున్నఅధికారి రాకేష్ఆస్ధానా కూడా ఉండటంతో విపక్షాల విమర్శలు మరింత ఎక్కువయ్యాయి. విచారణలో పారదర్శకత, సీబీఐ సమగ్రత, విశ్వసనీయత కాపాడటానికే ఇద్దరు అధికారులను ప్రభుత్వం శలవుపై పంపిందని కేంద్రఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. 
మోడీ ప్రభుత్వం సీబీఐ ప్రతిష్టను, విశ్వసనీయతను దెబ్బతీసిందని, రాజకీయ ప్రతీకారాలకు, కుట్ర రాజకీయాలకు సీబీఐ బలవుతోందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. రాఫెల్ డీల్ కు సంబంధించిన కేసు కాగితాలు తెప్పిస్తున్నందునే  అలోక్ వర్మను  తప్పించారని రాహుల్ విమర్శించారు.
ప్రభుత్వం చేసిన తప్పులను కప్పిపుచ్చుకోటానికి, తమకు అనుకూలంగా వ్యవహరించి, అవినీతికి పాల్పడిన అధికారిని రక్షించేందుకే, ఇంకో అధికారిని ప్రభుత్వం చట్టవ్యతిరేకంగా తొలగించిందని సీపీఐ  జాతీయ ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. 
మోడీ సీబీఐని కాస్తా(బీబీఐ) బీజేపీ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లాగా మార్చారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ వ్యాఖ్యానించారు. 
సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మను శలవుపై పంపించడం పట్ల ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. లోక్ పాల్  చట్టపరిధిలో ఏర్పాటైన సంస్ధపై కేంద్రం పెత్తనం ఏంటని కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏదో దాచటానికి ప్రయత్నిస్తోందని, రాఫెల్ కుంభకోణంపై అలోక్ వర్మ విచారణ చేపట్టాలనుకున్నారా? ఆయన్ను తప్పించడానికి, రాఫెల్ కుంభకోణానికి ఏమైనా సంబంధం ఉందా ? అని కేజ్రీవాల్   ప్రశ్నించారు.

 

19:33 - October 20, 2018

హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోడీ  దేశానికి కాపలాదారులా కాకుండా అంబానీలకు కాపలా దారులా వ్యవహరిస్తున్నారని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. హైదరాబాద్ చార్మినార్ వద్ద జరిగిన రాజీవ్ సద్భావనా యాత్రలో పాల్గొన్న ఆయన కేసీఆర్ పైనా విమర్శలు చేశారు. కేంద్రంలో మోడీ తీసుకున్ననిర్ణయాల వల్ల అన్నివర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రాహుల్ అన్నారు. దేశంలో అమలు చేస్తున్న జీఎస్టీ వల్ల చిరువ్యాపారులు ఉపాధి కోల్పోయారని ఆయన ఆరోపించారు. రైతుల రుణాలు మాఫీచేయని బీజేపీ ప్రభుత్వం విజయ్మాల్యాకు చెందిన 9వేల కోట్ల రూపాయల రుణాలను మాఫీచేసిందని రాహుల్ ఆరోపించారు. బ్యాంకులను మోసంచేసి విజయ్మాల్యా, నీరవ్మోడీలాంటి ఆర్ధికనేరగాళ్లు దేశం విడిచిపారిపోవటానికి మోడీ ప్రభుత్వం సహకరించిందని ఆయన చెప్పారు. రక్షణమంత్రి ప్రమేయం లేకుండా యుధ్దవిమానాల తయారీని రిలయన్స్కు అప్పగించారని, హెచ్ఏఎల్ తయారు చేయాల్సిన యుధ్దవిమానాలను అంబానీలకు అప్పగించి పెద్ద కుంభకోణానికి పాల్పడ్డారని రాహుల్ గాంధీ మోడీని విమర్శించారు. మోడీ అవినీతిని గురించి ఫ్రాన్స్ అధ్యక్షుడు చెప్పాల్సిన పరిస్దితి వచ్చిందని చెపుతూ రాహుల్ గాంధి, రాఫెల్ కుంభకోణం వ్యవహారాలను చెప్పుకొచ్చారు. ధనికులైన తన మిత్రులు లబ్ది పొందేందుకే మోడీ  పెద్దనోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారని రాహుల్ గాంధీ అన్నారు. నరేంద్రమోడీ తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్నికేసీఆర్ సమర్ధించారని, పార్లమెంట్లో కూడా టీఆర్ఎస్ బీజేపీకి మద్దతిస్తోందని రాహుల్  చెప్పారు.

20:24 - August 22, 2017

మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కడే పంద్రాగష్టి జెండా గోల్గె అవద్దం జెప్పిండేమో అనుకున్నంగదా..? అటు ఎర్రకోట మీద జెండా ఎగిరేశిన మోడీ గూడ..? మోసమే జేశిండు జనాన్ని..? ఈడ కేసీఆర్ సారేమో.. ఆర్టీసీల ముప్పైతొమ్మిది వందల ఉద్యోగాలు భర్తీ జేశ్నమని అవద్దం జెప్తె.. మోడీ ఏం జెప్పిండో సూడుండ్రి.. సోషల్ మీడియల జోర్గ తిర్గుతున్నది ఈ ముచ్చట గూడ..గీ ముచ్చట చూడాలంటే వీడియో క్లిక్ చేయండి..

21:55 - August 14, 2017

ఢిల్లీ : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదిని కలుసుకున్నారు. అరగంటసేపు వీరి సమావేశం జరిగింది. అన్నాడిఎంకెలో రెండు వర్గాల విలీనం, తదితర అంశాలపై సెల్వం ప్రధానితో చర్చలు జరిపినట్లు సమాచారం. తమిళనాడులో నెలకొన్న రాజకీయ పరిస్థితులను పన్నీర్‌ సెల్వం ప్రధానికి వివరించినట్లు ఆ పార్టీ నేత మైత్రేయన్ తెలిపారు. రెండు రోజుల క్రితం తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి కూడా ప్రధానితో సమావేశం జరిపిన విషయం తెలిసిందే. ఎఐఎడిఎంకేని పన్నీర్‌, పళని స్వామి వర్గాలను ఏకం చేసి ఎన్డీయే చేర్చుకోవడానికి బిజెపి యత్నిస్తోంది.

21:32 - May 24, 2017

హైదరాబాద్ : అధికారంలోకి వచ్చిన అయిదో నెలలోనే స్వచ్ఛభారత్ సంకల్పాన్ని చాలా గ్రాండ్ గా ఆవిష్కరించారు ప్రధాని నరేంద్రమోడీ. గాంధీజీ జయంతి సందర్భంగా 2014 అక్టోబర్ 2న ప్రారంభించిన స్వచ్ఛభారత్ సాధించిన పరిశుభ్రత ఎంత? దాని ప్రచారానికి పెట్టిన ఖర్చెంత? తొలినాళ్లలో స్వచ్ఛభారత్ అంటూ చీపుళ్లు పట్టుకున్న సెలబ్రిటీలంతా ఏమైపోయారు? బ్రాండ్ అంబాసిడర్ లు ఎక్కడున్నారు? స్వచ్ఛ భారత్ విషయంలో మోడీ చేస్తున్న మానిటరింగ్ ఏమిటి? స్వచ్ఛ భారత్ తో పాటు మరో ఆరు ఏడు పథకాల ప్రచారానికి గత సంవత్సరం 350 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. అంతకు ముందు సంవత్సరం 200 కోట్లపైగా ఖర్చు పెట్టారు. ప్రచారానికి చేసిన ఖర్చుకు తగ్గట్టుగా ఫలితమొస్తోందా? తమ పట్టణాల్లో మునిపటి మాదిరిగానే మురుగునీరు ప్రవహిస్తున్నా స్వచ్ఛ భారత్ సెస్ పేరుతో జనం పన్ను కట్టుకోవాల్సి వస్తోంది.

మేకిన్ ఇండియా
స్వచ్ఛ భారత్ తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించిన మరో సుందర స్వప్నం మేకిన్ ఇండియా. భారతదేశంలో తయారీ రంగాన్ని ప్రోత్సహించాలన్న లక్ష్యంతో ప్రారంభించిన మేకిన్ ఇండియా సాధించిన పురోగతి ఏమిటి? 25 రంగాలలో నైపుణ్యాల అభివృద్ధి, ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా 2014 సెప్టెంబర్ 25న ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించిన మేకిన్ ఇండియాకు రెండు నెలల్లోనే లక్షా 20 వేల కోట్ల రూపాయల విలువైన ప్రతిపాదనలొచ్చాయన్నారు. 2016 ఫిబ్రవరిలో వారం రోజుల పాటు ముంబైలో నిర్వహించిన మేకిన్ ఇండియా వీక్ ఎన్నెన్నో ఆశలు రేకెత్తించింది. 72 దేశాల నుంచి వాణిజ్య ప్రతినిధులు, 68 దేశాల నుంచి ప్రభుత్వ ప్రతినిధులు పాల్గొన్న మేకిన్ ఇండియా వీక్ లో 15.2 లక్షల కోట్ల విలువైన ప్రతిపాదనలొచ్చినట్టు అమిత్ కాంత్ అప్పట్లోనే ప్రకటించారు. వాటిలో కార్యరూపం దాల్చినవెన్ని?

స్టాండప్ ఇండియా
2016 ఏప్రిల్ 5న ప్రధాన నరేంద్ర మోడీ ప్రారంభించిన స్టాండప్ ఇండియా ద్వారా ఎంత మంది ఎస్సీ, ఎస్టీ, మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించారు. పది లక్షల నుంచి కోటి రూపాయల వరకు బ్యాంక్ ల ద్వారా రుణ సదుపాయం పొందిన స్టాండప్ ఇండియా లబ్ధిదారులెందరు? స్కిల్ ఇండియా అంటూ 2015 జులై 15న నరేంద్రమోడీయే ప్రారంభించిన పథకంలో ఎంత మందికి నైపుణ్య శిక్షణనిచ్చారు? 2022 నాటికి 40 కోట్ల మందికి నైపుణ్య శిక్షణ ఇవ్వాలన్న లక్ష్యం లో ఇప్పటికి సాధించిదెంత?

ఎన్ని పథకాలు
మేకిన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా, స్కిల్ ఇండియా ఇలా ఎన్ని పథకాలు ప్రారంభించినా మోడీ పాలనలో ఉద్యోగాల సృష్టి పెరగలేదన్న సంగతిని కేంద్ర ప్రభుత్వ లేబర్ బ్యూరో లెక్కలే ఏకరువు పెడుతున్నాయి. నరేంద్రమోడీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు సంవత్సరంలో అంటే 2013లో మన దేశంలో 4,19,000 ఉద్యోగాలను సృష్టిస్తే, మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుసటి సంవత్సరం 2015లో అది 1,35,000కి పడిపోయింది. 2016లోనూ పరిస్థితి పెద్దగా మెరుగుపడలేదు. 2016లో సృష్టించింది కేవలం 2 లక్షల 31 వేల ఉద్యోగాలే. ఉద్యోగాల సృష్టిలో కనీసం 2011 స్థాయిని చేరుకోవాలంటే ఇంకెన్నేళ్లు పడుతుంది?. ఆ ఏడాది మన దేశంలో 9,30,000 ఉద్యోగాలు సృష్టించినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. రాబోయే రెండేళ్లలో మోడీ ప్రభుత్వం ఈ రికార్డును బద్దలు కొట్టగలదా? దేశంలో ఎనిమిది అతిపెద్ద ఉపాధి రంగాలైన టెక్స్ టైల్స్, లెదర్, మెటల్, ఆటోమొబైల్, జెమ్స్ అండ్ జ్యువెలరీ, రవాణా, ఐటి, హ్యాండ్ లూమ్ రంగాల్లో ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి. 2015లో జెమ్స్ అండ్ జువెలరీ రంగంలో 19వేల ఉద్యోగాలు, హ్యాండ్ లూమ్, పవర్ లూమ్ రంగాల్లో 11వేల ఉద్యోగాలు కోల్పోయారు. ఇప్పుడు ఐటిరంగంలో ఉద్యోగుల మీద వేటుపడుతోంది. కాగ్నిజెంట్, విప్రో, ఇన్ఫోసిస్, టెక్ మహేంద్ర, ఐబిఎం, సిస్కో ఇలా వివిధ దిగ్గజ సంస్థలు ఉద్యోగులను తొలగిస్తుండడంతో ఐటి ఉద్యోగులు హడలిపోతున్నారు.

వ్యవసాయం
వ్యవసాయం తర్వాత అత్యధిక శాతం మందికి ఉపాధి చూపిస్తున్న నిర్మాణరంగం ఈ మూడేళ్లలో పుంజుకోలేదు. నోట్ల రద్దు తర్వాత అది మరింతగా దెబ్బతింది. చిన్న సూక్ష్మ పరిశ్రమలు దెబ్బతిన్నాయి. ఓ వైపు ఉత్పత్తి వ్యయం పెరుగుతోంది. మరోవైపు పన్నుల భారం నడ్డివిరుస్తోంది. కార్పొరేట్ సంస్థల ఆదాయాలు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంటే, ప్రోత్సాహకాలు లేక చిన్న సూక్ష్మ పరిశ్రమలు చతికిలపడుతున్నాయి. ఈ కామర్స్ లో లే ఆఫ్ లు. బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాల కోత. ఎప్పుడు ఎవరి ఉద్యోగం పోతుందో అన్న భయంతో ఐటీ రంగం. రోజూ ఇవే వార్తలు. ఉద్యోగుల తొలగింపునకు సంబంధించిన వార్తలే హెడ్ లైన్స్ లో వుంటున్నాయి.

నల్లధనం
విదేశీ బ్యాంక్ ల్లో దాచిపెట్టిన డబ్బు గుంజుకొస్తామన్న నరేంద్ర మోడీ హయాంలో మొండిబకాయిలు మరింతగా పెరిగి బ్యాంకింగ్ వ్యవస్థకే సవాలు విసురుతున్నాయి. గత డిసెంబర్ నాటికి మొండిబకాయిలు ఆరున్నర లక్షల కోట్లు దాటిపోవడం మోడీ ప్రభుత్వ వైఫల్యం కాదా? మొండిబకాయిల విలువ 11 లక్షలు కోట్లు దాటిందన్నది తాజా అంచనా. వీటి వసూళ్లకు నరేంద్రమోడీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలేమిటి? నిరర్ధక ఆస్తుల విలువ 12శాతానికి పెరగడం బ్యాంకింగ్ వ్యవస్థనే కలవరపెడుతోంది. ఈ మూడేళ్లలో స్టాక్‌ మార్కెట్‌ ఉరకలెత్తింది. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత సెన్సెక్స్‌ ఆరువేల పాయింట్లు పెరిగింది. 2014లో 75 లక్షల కోట్లున్న లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ 125 లక్షల కోట్లకు పెరిగింది. అయితే, లాభాలలో అత్యధిక భాగం టాటా, బిర్లా, అంబానీ, అదానీ, బజాజ్‌, మహీంద్రా కంపెనీల ప్రధాన ప్రమోటర్లు ఎగరేసుకుపోయారు. భారతదేశ అభివృద్ధిలోనూ, ఉపాధి కల్పనలోనూ, సామాజిక బాధ్యతల నిర్వహణలో కీలకపాత్ర పోషించే ప్రభుత్వ రంగ సంస్థల మార్కెట్‌ విలువ పెద్దగా పెరగలేదు. ప్రభుత్వరంగ సంస్థల పట్ల మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలే ఇందుకు కారణం కాదా?

10:52 - November 17, 2016

ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయం వల్ల సామాన్యులే ఇబ్బందులు పడుతున్నారని వక్తలు తెలిపారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో టీకాంగ్రెస్ నాయకురాలు ఇందిర, బీజేపీ నేత ఆచారి, లక్ష్మణ్ రావు పాల్గొని, మాట్లాడారు. నోట్ల రద్దు వల్ల చిన్న వ్యాపారుల ఇబ్బందులు వస్తున్నాయని చెప్పారు. వస్తువుల కొనుగోళ్లు, అమ్మకాలు పూర్తిగా తగ్గిపోయాయని తెలిపారు. రూ.500, 1000 నోట్లను అనుమతించాలన్నారు. నోట్ల రద్దు నిర్ణయం వల్ల నల్లధనం పూర్తిగా తగ్గిపోదన్నారు. నల్లధనం ఉన్నవారు డబ్బును మార్చుకుంటున్నారని తెలిపారు. ఎన్నికల సమయంలో విదేశాల్లో ఉన్న బ్లాక్ మనీ తీసుకొస్తామని చెప్పారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

17:58 - October 16, 2016

 గోవా : ఆర్థిక సమృద్ధికి ఉగ్రవాదం నుంచి తీవ్ర ముప్పు పొంచి ఉందని ప్రధాని నరేంద్రమోదీ పాకిస్తాన్‌పై దుమ్మెత్తిపోశారు. గోవాలో జరుగుతున్న 8వ బ్రిక్స్‌ సదస్సులో మోదీతో పాటు సభ్యదేశాధినేతలు పాల్గొన్నారు. ఉగ్రవాదానికి పాకిస్థాన్‌ తల్లిలాంటిదని మోదీ విమర్శించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉగ్రమూకలన్నింటికి.. పాకిస్తాన్‌లోని ముష్కర సంస్థలతో సంబంధాలున్నాయని ప్రధాని అన్నారు. రాజకీయ లబ్ధి కోసం ఉగ్రవాదాన్ని సమర్థించే ధోరణిని మోదీ తీవ్రంగా ఖండించారు. బ్రిక్స్‌ దేశాలన్నీ ఉగ్రభూతానికి వ్యతిరేకంగా ఏకమై.. కలిసి కట్టుగా పోరాడాల్సిన అసవరం ఉందన్నారు. టెర్రరిజం నిర్మూళనకు త్వరలోనే అంతర్జాతీయ స్థాయిలో సమగ్ర ఒప్పందం కుదిరేలా కృషి చేయాల్సిన ఆవశ్యకత ఉందని ప్రధాని అన్నారు. 

14:46 - October 15, 2016

గోవా : భారత్, రష్యాల మధ్య కీలక ఒప్పందాలు కుదిరాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్ తో ప్రధాని నరేంద్రమోడీ భేటీ అయ్యారు. ఇరు దేశాధినేతల సమక్షంలో కీలక ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. పారిశ్రామిక అభివృద్ధి కోసం రష్యాతో భారత్ ఒప్పందం చేసుకుంది. 

07:55 - September 27, 2016

జన్యుమార్పిడి పంటలపై సీరియస్ చర్చ నడుస్తోంది. ఆవాల పంటలో జన్యుమార్పిడి విధానం అనుమతించేందుకు నరేంద్రమోడీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు తీవ్ర వివాదస్పదమయ్యాయి. అసలు జన్యుమార్పిడి పంటలంటే ఏమిటి? జన్యుమార్పిడి పంటల విషయంలో ప్రపంచ అనుభావాలేమిటి? భారత్ అనుభవాలేమిటి? పత్తి లాంటి వాణిజ్యపంటల్లో జన్యుమార్పిడి విధానాన్ని అనుమతించిన భారత్ ఆహార పంటలు, నూనెగింజల విషయంలో అనుమతించకపోవడానికి కారణం ఏమిటి? ఆవ గింజల్లో జన్యుమార్పిడి విధానం ప్రోత్సహిస్తే ఏమవుతుంది? ఇలాంటి అంశాలపై ఇవాళ్టి జనపథంలో మాట్లాడేందుకు రైతు సంఘం నేత, వ్యవసాయ శాస్త్రవేత్త అరిబండి ప్రసాదరావు 10టీవీ స్టూడియోకి వచ్చారు. ఈ అంశంపై మరింత సమాచారానికి వీడియో చూడండి. 

Pages

Don't Miss

Subscribe to RSS - నరేంద్రమోడీ