నరేంద్ర మోడీ

11:49 - October 14, 2018

ఢిల్లీ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని చంపుతామంటూ బెదిరింపులు వచ్చాయి. దీనితో సెక్యూర్టీ ఏజెన్సీలు అప్రమత్తమయ్యాయి. ఢిల్లీ పోలీసు కమిషనర్ అమూల్య నాయక్‌కు గుర్తు తెలియని వ్యక్తలు ఈమెయిల్ పంపారు. అస్సాం రాష్ట్రం నుండి ఈమెయిల్ వచ్చినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ మెయిల్‌లో మోదీని ఎప్పుడు హత్య చేస్తారో తేదీ కూడా తెలిపినట్లు తెలుస్తోంది. దీనిపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
గతంలో కూడా ఈ తరహా బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రధాన మంత్రి మోడీ ఈసారి పలు ర్యాలీలు, బహిరంగసభల్లో పాల్గొననున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పకడ్బందీ భద్రతా ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. 

07:03 - October 12, 2018

శ్రీకాకుళం:  తిత్లీ తుపాను ధాటికి తీవ్రంగా దెబ్బతిన్న శ్రీకాకుళం జిల్లాను అన్ని రకాలుగా ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజలకు హామీ ఇచ్చారు. గురువారం శ్రీకాకుళం చేరుకున్నఆయన రాత్రి పొద్దుపోయే వరకు సహయక చర్యలపై సమీక్ష నిర్వహిస్తూ అధికారులను అప్రమత్తం చేసారు. ఉత్తరాంధ్ర సాధారణ స్ధితికి వచ్చే వరకు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం అక్కడే ఉండి పని చెయ్యాలని ఆదేశించారు. పంటలకు జరిగిన నష్టం అంచనా వేయటానికి వ్యవసాయ శాస్త్రవేత్తలను పిలిపించాలని ఆదేశించారు. మరణించిన వారి కుటుంబాలకు నష్ట  పరిహారం తక్షణం అందించాలని  ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. తిత్లీ తుపాను ధాటికి జిల్లాలోని 18 మండలాలు పూర్తిగా దెబ్బితిన్నాయి. చంద్రబాబునాయుడు తుపాను పరిస్ధితిపై కలెక్టరేట్లో  సమీక్ష నిర్వహిస్తున్న సమయంలోనే  ప్రధానమంత్రి నరేంద్రమోడీ సీఎంకు ఫోన్ చేసి పరిస్ధితి అడిగి తెలుసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా 196 గ్రామాలలో ఇబ్బందికర పరిస్ధితులు ఉన్నాయి. తిత్లీ తుపాను ధాటికి ఇచ్చాపురం నుంచి పైడి భీమవరం వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వచ్చే 3 రోజుల్లో అన్ని గ్రామాలలోను విద్యుత్ సరఫరా పునరుద్దరించాలని సీఎం అధికారులను ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా 1లక్షా 96 వేల ఎకరాల్లో పంట నష్టం  జరిగినట్లు కలెక్టర్ ధనుంజయ్ రెడ్డి ప్రాధమిక అంచనా వేశారు. మరికొద్దిసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తుపాను దెబ్బతిన్న ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. 

17:43 - August 20, 2018

పాకిస్థాన్ : ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన మాజీ క్రికెటర్ ఇమ్రాన్‌ఖాన్‌కు ప్రధాని నరేంద్రమోదీ లేఖ రాసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ లేఖలో ఇరుదేశాల చర్చలకు సంబంధించి మోది ప్రస్తావించలేదు. పొరుగు దేశాలతో మంచి సంబంధాలనే కోరుకుంటామని మోది లేఖలో తెలిపారు. ఇమ్రాన్‌ఖాన్‌కు మోదీ లేఖ రాసినట్లు పాక్ విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌ఎమ్ ఖురేషి తెలిపారు. ఇమ్రాన్‌ఖాన్‌కు శుభాకాంక్షలు తెలిపేందుకు మోదీ మర్యాదపూర్వకంగానే లేఖ రాసినట్లు సమాచారం. పాకిస్తాన్‌కు 22వ ప్రధానిగా పిటిఐ అధినేత ఇమ్రాన్‌ఖాన్‌ శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. పొరుగు దేశాలతో సంబంధాలను మెరుగుపరచుకోవాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.

07:42 - August 16, 2018
14:10 - June 2, 2018

కర్నూలు : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై ఏపీ మంత్రి అఖిల ప్రియ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆళ్లగడ్డలో నవ నిర్మాణ దీక్షల కార్యక్రమంలో అఖిల ప్రియ పాల్గొని ప్రసంగించారు. ఏపీలో మహిళల అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని..వారి అభివృద్దికి కృషి చేస్తున్నారని తెలిపారు. బాబు ఇలా చేస్తుంటే భారత ప్రధాని మోడీ మాత్రం మహిళలపై ఎక్కడ పడితే అక్కడ అత్యాచారాలు చేయాలని..దాడులు చేయాలని రెచ్చగొట్టి ముందుకు పంపించడం జరుగుతోందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

 

12:54 - April 29, 2018

ఢిల్లీ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీది చేతల ప్రభుత్వం కాదని..మాటల ప్రభుత్వవమేనని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ పేర్కొన్నారు. రాంలీలా మైదాన్ లో కాంగ్రెస్ నిర్వహించిన జనాక్రోశ్ ర్యాలీలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మోడీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. వెళ్లిన ప్రతిచోట మోడీ తప్పుడు హామీలలిస్తున్నారని, ప్రజల కళ్లలో మోడీ పట్ల ఆగ్రహాన్ని చూస్తున్నానన్నారు. ప్రధాని మాట్లాతుంటే ప్రజలు నిజాలు వెతుక్కుంటున్నారని ఎద్దేవా చేశారు. తాను రాష్ట్రాల్లో పర్యటించే సమయంలో పలువురిని కలవడం జరుగుతూ ఉంటోందని..ఈ సందర్భంగా సంతోషంగా ఉన్నారా ? అని మాట్లాడిస్తే వారు సంతోషంగా లేము..ఇందుకు ప్రభుత్వమే కారణమని వారు పేర్కొంటున్నారని విమర్శించారు. యెడ్యూరప్పను పక్కన పెట్టుకుని మోడీ మాట్లాడడంలో అంతర్యం ఏమిటని ప్రశ్నించారు. అవినీతి అంంతం చేస్తానంటూ మోడీ చెప్పేవన్నీ అబద్ధాలేనని, నేరస్తులకు టికెట్ ఇచ్చిన ఘత మోదీనన్నారు. ఇప్పటి వరకు నీరవ్ మోడీపై నోరు మెదపలేదని తెలిపారు. 

19:31 - April 21, 2018

హైదరాబాద్ : సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యాఖ్యలపై కాషాయ నేతలు మండిపడుతున్నారు. ప్రత్యేక హోదా..రాష్ట్ర విభజన హామీలు అమలు చేయాలంటూ సీఎం చంద్రబాబు నాయుడు శుక్రవారం ధర్మపోరాట దీక్ష చేసిన సంగతి తెలిసిందే. ఈ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే బాలయ్య ప్రధాని మోడీని ఉద్ధేశిస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు సరియైంది కాదని బీజేపీ నేతలు పేర్కొన్నారు. పక్కనే ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలను ఖండించకపోవడం దారుణమని, వెంటనే బాలకృష్ణ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై బీజేపీ నేతలు ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ కు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే శనివారం సాయంత్రం ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటిని ముట్టడించేందుకు బిజెపి నేతలు, కార్యకర్తలు ప్రయత్నించారు. అక్కడనే ఉన్న పోలీసులు నిలువరించే ప్రయత్నం చేశారు. ఇరువర్గాల మధ్య తోపులాట..వాగ్వాదం చోటు చేసుకుంది. చివరకు నేతలను, కార్యకర్తలను అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. బాలకృష్ణ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ముందస్తు చర్యలో భాగంగా బాలకృష్ణ ఇంటి వద్ద రెండంచెల భధ్రతను పోలీసులు ఏర్పాటు చేశారు. 

21:07 - April 20, 2018

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు చేపట్టిన ధర్మపోరాట దీక్షకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు కదిలాయి. జిల్లాకేంద్రాలు, నియోజకవర్గాలు, పట్టణాల్లో దీక్షలు చేపట్టారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా, విభజన చట్టం హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా, విభజన చట్టం హామీల సాధన కోసం ఏపీ సీఎం చంద్రబాబు చేపట్టిన ధర్మపోరాట దీక్షకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా సంఘీభావం వ్యక్తమైంది. పలు జిల్లాల్లో ముఖ్యమంత్రి పోరాటానికి మద్దతుగా ఉపవాస దీక్షలు చేపట్టారు.

గుంటూరుజిల్లా సత్తెనపల్లిలో స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు దీక్షను చేపట్టారు. స్వల్ప అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చంద్రబాబు దీక్షకు మద్దతుగా నిరశన చేపట్టారు. సెలైన్‌ ఎక్కించుకుంటూనే కోడెల దీక్షలో పాల్గొన్నారు. పెద్ద ఎత్తున తరలి వచ్చిన టీడీపీ కార్యకర్తలు ధర్మదీక్షకు సంఘీభావం ప్రకటించారు. విజయనగరం, విశాఖజిల్లాల్లో టీడీపీ నేతలు పెద్ద ఎత్తున దీక్షకు దిగారు. విజయనగరం పట్టణంలో కేంద్ర మాజీ మంత్రి అశోకగజపతి రాజు, రాష్ట్ర మంత్రి సుజయ కృష్ణరంగారావు దీక్షల్లో పాల్గొన్నారు. విశాఖలో మంత్రి గంటా శ్రీనివాసరావు దీక్ష చేశారు. అటు నర్సీపట్నంలో మంత్రి అయ్యన్న పాత్రుడు నేతృత్తంలో పెద్ద ఎత్తున నిరశన దీక్షలు చేపట్టారు. నెల్లూరులోని పొట్టిశ్రీరాములు విగ్రహం వద్ద మంత్రి నారాయణ నిరశన చేపట్టారు. చంద్రబాబు ధర్మదీక్షకు సంఘీభావం ప్రకటించారు. పట్టణంలోని తల్పగిరి రంగనాథుడి ఆలయంలో పూజలు చేశారు. సీఎం చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కర్నూలు జిల్లావ్యాప్తంగా చంద్రబాబు ధర్మదీక్షకు టీడీపీ నేతలు మద్దతు ప్రకటించారు. కర్నూలు పట్టణంలో ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, ఎంపీ టీజీ వెంకటేశ్‌ దీక్షలో పాల్గొన్నారు. పత్తికొండలో టీడీపీ నేతలు శ్యాంబాబు నేతృత్వంలో దీక్ష చేపట్టగా.. ఎమ్మిగనూరులో ఎమ్మెల్యే బి.వి జయనాగేశ్వర్‌రెడ్డి దీక్షకు దిగారు. అంతకు ముందు పట్టణంలో బైక్‌ర్యాలీ నిర్వహించారు.

తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ధర్మపోరాట దీక్షలు చేపట్టారు. మండపేటలో ఎమ్మెల్యే జోగేశ్వరరావు దీక్షను చేపట్టగా.. రంపచోడవరంలోజరిగిన నిరశనలో ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి పాల్గొన్నారు. అటు కాకినాడరూరల్‌ సర్పవరం సెంటర్‌లో హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప దీక్షలో పాల్గొన్నారు. రాజమండ్రిలోని గోకవరం బస్టాండ్‌ వద్ద జరిగిన దీక్షలో టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నాయి. అటు రామచంద్రాపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు పాదయాత్ర నిర్వహించారు. ద్రాక్షారామం నుంచి రామచంద్రాపురం వరకు సాగిన యాత్రలో పెద్దసంఖ్యలో టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. విభజన చట్టం హామీలను నెరవేర్చకుండా కేంద్రంలో మోదీ ప్రభుత్వం అన్యాయం చేసిందని నాయకులు విమర్శించారు.

చంద్రబాబు దీక్షకు మద్దతుగా పశ్చిమగోదావరిలో పెద్ద ఎత్తున దీక్షలు చేపట్టారు. నర్సాపురంలో ఎమ్మెల్యే బండారు మధవనాయుడు ఆధ్వర్యంలో ఒకరోజు ఉపవాస దీక్ష చేపట్టారు. అటు కడపజిల్లా వ్యాప్తంగా చంద్రబాబు దీక్షకు మద్దతు తెలుపుతూ ర్యాలీలు నిర్వహించారు. కడప పట్టణంతో పాటు బద్వేలు, మైదుకూరులో టీడీపీ నేతలు పెద్ద ఎత్తున దీక్షలు చేపట్టారు. కడపలో మంత్రి ఆదినారాయణ దీక్షలో పాల్గొన్నారు. రాష్ట్రానికి న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో చంద్రబాబు ధర్మదీక్షకు మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద ఎమ్మెల్యే సూర్యనారాయణ దీక్షను చేపట్టారు. అటు హిందూపురంలోని సద్భావనా సర్కిల్‌లో ఎంపీ నిమ్మల కిష్టప్ప దీక్ష నిర్వహించారు. తాడిపత్రిలో ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ధర్మదీక్షలో పెద్దఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. 

15:16 - April 18, 2018

హైదరాబాద్ : ప్రధాని మోదీ అనుసరిస్తున్న విభజించి పాలించు విధానాలతో దేశ ప్రజలు నడిరోడ్డు మీదకు నెట్టివేయబడ్డారని త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్‌ సర్కార్‌ విమర్శించారు. హైదరాబాద్‌లో జరుగుతున్న సీపీఎం జాతీయ సభలకు అధ్యక్షత వహించిన మాణిక్‌ సర్కార్‌... దేశ స్వాతంత్ర్యోద్యంలో ఏ రకమైన పాత్ర పోషించని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ శక్తులు వినాశకర విధానాలకు తెరతీశాయని మండిపడ్డారు. ధనికులు, పేదల మధ్య ఆర్థిక తారతమ్యాలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. స్వాతంత్ర్యానంతరం ఇలాంటి అభివృద్ధి నిరోధక శక్తులను చూడలేదని...బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌పై మాణిక్‌ సర్కార్‌ మండిపడ్డారు. 

11:09 - April 12, 2018

ఢిల్లీ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి కావేరి సెగ తగిలింది. తమిళనాడు రాష్ట్రమంతటా కావేరి సెగలు కక్కుతున్నాయి. ఓ యువకుడు ఆత్మహత్య చేసుకోవడం తీవ్రమైన ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. ఓ రెండు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు గురువారం ఉదయం ప్రధాన మంత్రి మోడీ చెన్నైకి చేరుకున్నారు. ఈయన పర్యటనను నిరసిస్తూ తమిళనాడు సంఘాల ప్రతినిధులు నల్లజెండాలతో ప్రదర్శన నిర్వహించారు. 'మోడీ గో బ్యాక్'అంటూ నినాదాలు చేశారు. మోడీ ప్రయాణించే కాన్వాయ్ మొత్తం నల్లజెండాలు ప్రదర్శించారు. ఇదిలా ఉంటే కావేరీ బోర్డును ఏర్పాటు చేసే నేపథ్యంలో కేంద్రం వైఖరి..మోడీ పర్యటనను నిరసిస్తూ ఓ యువకుడు కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. అప్పటికే ఆ యువకుడు మృతి చెందాడు. ఇదిలా ఉంటే బుధవారం ఓ యువకుడు ట్రైన్ పైకి ఎక్కి విద్యుత్ తీగలు పట్టుకోవడంతో తీవ్రగాయాలపాలయ్యాడు. ప్రస్తుతం ఇతని పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. 

Pages

Don't Miss

Subscribe to RSS - నరేంద్ర మోడీ