నవదీప్

15:42 - November 8, 2018

మిల్కీబ్యూటీ తమన్నా, సందీప్ కిషన్ జంటగా, బాలీవుడ్ డైరెక్టర్ కునాల్ కోహ్లి దర్శకత్వంలో, రైనా జోషి, అక్షయ్ పూరి నిర్మిస్తున్న చిత్రానికి నెక్స్ట్ ఏంటి అనే టైటిల్ ఫిక్స్ చేసారు. నవదీప్, పూనమ్ కౌర్ ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో పాటలే సినిమాకి టైటిల్స్‌గా పెట్టడం చూస్తున్నాం. నాని హీరోగా నటించిన నేను లోకల్ మూవీలో, నెక్స్ట్ ఏంటి అనే సాంగ్ పాపులర్ అయింది. ఇప్పుడు ఈ సినిమాకి అదే టైటిల్ పెట్టారు. కునాల్ కోహ్లి  బాలీవుడ్‌లో, అమీర్ ఖాన్‌తో ఫనా, సైఫ్ అలీఖాన్‌తో హమ్‌తుమ్ వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న నెక్స్ట్ ఏంటి చిత్ర షూటింగ్, లండన్, హైదరాబాద్‌లలో జరగనుంది. తమన్నా ప్రస్తుతం ఎఫ్2, అభినేత్రి 2, క్వీన్ తెలుగు రీమేక్ దటీజ్ మహాలక్ష్మితో పాటు, హిందీలో ఖామోషీ అనే సినిమాలు చేస్తుంది. నెక్స్ట్ ఏంటి  మూవీకి లియోన్ జేమ్స్ సంగీతమందిస్తున్నారు. త్వరలో ఫస్ట్‌లుక్, టీజర్ రిలీజ్ చెయ్యనున్నారు.  

15:27 - July 26, 2017

డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొని సిట్ ఎదుట విచారణకు హాజరై సినీ సెలబ్రిటీలందరూ డ్రస్ కోడ్ పాటించడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. మొదటి రోజు పూరి జగన్నాథ్. ఆతర్వాత సుబ్బరాజు, మొన్న తరుణ్, నిన్న నవదీప్ వీళ్లంతా వైట్ షర్ట్‌లతోనే విచారణకు హాజరయ్యారు. డ్రగ్స్ విచారణను ఎదుర్కొంటున్న వారంతా డ్రెస్ కోడ్ వాడుతున్నారా..? లేక డ్రగ్స్ కోడ్ వాడుతున్నారా అనేది ఇప్పుడు ప్రజల్లో మొదలైన అనుమానం. వాస్తవానికి వైట్ షర్ట్ అంటే శాంతికి చిహ్నం. అదే బ్లాక్ షర్ట్‌లు వేసుకుంటే... నిరసన తెలిపినట్లు అర్థం. ప్రస్తుత పరిస్థితులు చూస్తే... తమపై వచ్చిన ఆరో్పణలపై... నటులంతా నిరసన వ్యక్తం చేయాలి. అంటే నల్ల చొక్కాలు దరించి విచారణకు హాజరుకావాలి. తాజాగా నవదీప్ కూడా వైట్ షర్ట్ వేసుకుని విచారణకు రావడంతో.. సోషల్ మీడియాలో ఇప్పుడు ఇవే గుసగుసలు మొదలయ్యాయి.

ఒక్క శ్యాంకే నాయుడు తప్ప...

ఇప్పటి వరకూ విచారణకు హాజరైన ఐదుగురు సినీ ప్రముఖుల్లో ఒక్క శ్యాంకే నాయుడు మాత్రమే వైట్ షర్ట్ ధరించలేదు. అయితే ఆయన ఒక్కడినే అతి తక్కువ సేపు విచారించిన వదిలేశారు. వైట్ షర్ట్‌లు ధరించి విచారణకు హాజరైన మిగిలినవారంతా... సుమారు 12 గంటల నుంచి 13 గంటలు వరకూ సిట్ విచారణ ఎదుర్కొన్నారు. వీరి వద్దనుంచే శాంపిల్స్ సైతం సేకరించారు. అంటే ఈ డ్రగ్స్ కోడ్ లోనే శ్యాంకే నాయుడు లేరా... లేక డ్రగ్స్ కేసుతోనే శ్యాంకే నాయుడుకి సంబంధం లేదా..? డ్రగ్స్ విచారణకు... డ్రెస్ కోడ్‌గా వైట్ షర్ట్‌లతో హాజరుకావడం... యాదృచ్చికంగానే జరిగిందా..? కావాలే జరుగుతుందా..? ఇప్పుడు ఇదే అంశం తేలాల్సి ఉంది. ఏది ఏమైనా... డ్రగ్స్ విచారణకు నటులంతా ఒక డ్రెస్ కోడ్‌లో రావడం మాత్రం ఆశ్చర్యం కలిగిస్తున్న అంశం.

07:11 - July 25, 2017

హైదరాబాద్ : డ్రగ్స్‌తో తనకు ప్రత్యక్ష సంబంధం లేదని తేల్చిచెప్పారు సినీ హీరో నవదీప్‌. సినీ పరిశ్రమలో చాలామందికి డ్రగ్స్‌తో ప్రమేయం ఉన్నట్లు వెల్లడించారు. నవదీప్‌ను సుదీర్ఘంగా విచారించిన సిట్‌ కీలక సమాచారాన్ని రాబట్టింది. కెల్విన్‌తోనూ తనకు ఎలాంటి లింకులు లేవని స్పష్టం చేశారు. డ్రగ్స్ కేసులో హీరో నవదీప్‌ను సిట్‌ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. ఉదయం 10.30 గంటల సమయంలో సిట్‌ కార్యాలయానికి వచ్చిన నవదీప్‌పై అధికారులు వరుస ప్రశ్నలు సంధించారు. ప్రధానంగా కెల్విన్‌తో సంబంధాలపైనే ఆరా తీశారు. ఒకే ప్రశ్నను పలు కోణాల్లో సంధించి తికమకపెట్టారు. 11 గంటలకు పైబడి సిట్‌ అధికారులు నవదీప్‌ను విచారించి కీలక సమాచారం రాబట్టారు.

సినీ పరిశ్రమలో డ్రగ్స్ సరఫరా..
డ్రగ్స్‌తో తనకు ప్రత్యక్ష సంబంధం లేదన్న నవదీప్‌..మీడియేటర్ల ద్వారా సినీ పరిశ్రమలో డ్రగ్స్‌ సరఫరా అవుతుందని చెప్పారు. టాలీవుడ్‌లో పలువురికి డ్రగ్స్‌తో ప్రమేయం ఉన్న విషయాన్ని వెల్లడించారు. అయితే కెల్విన్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని..అతని అరెస్ట్‌కు వారం ముందు అతనితో ఈవేంట్‌ చేయించినట్లు తెలిపారు. ఈవెంట్‌కు సంబంధించి కెల్విన్‌తో అనేకసార్లు ఫోన్‌లో మాట్లాడినట్లు సిట్‌కు వివరించారు. సినీ పరిశ్రమలో చాలామంది ప్రముఖులతో కెల్విన్‌కు సంబంధాలు ఉన్నట్లు బయటపెట్టారు. ముఖ్యంగా డ్రగ్స్‌తో సంబంధం ఉన్నవారు మారుపేర్లతో చలామణి అవుతుంటారని చెప్పుకొచ్చారు. ఇక విచారణలో భాగంగా టింకు అనే యువకుడి పాత్రను కూడా నవదీప్‌ సిట్‌ అధికారులకు చెప్పినట్లు తెలుస్తోంది. భోజన విరామం తర్వాత నవదీప్‌ను వెంట వెంటనే ప్రశ్నలు సంధిస్తూ కావాల్సిన సమాచారాన్ని రాబట్టినట్లు తెలుస్తోంది. నవదీప్‌ విచారణలో కీలకమైన సమాచారాన్ని సిట్‌ అధికారులు రాబట్టడంతో ఇంకా కొంతమందికి నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది.

సమాచారం ఇచ్చానన్న నవదీప్..
విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన నవదీప్‌.. డ్రగ్స్‌కు సంబంధించి తనకు తెలిసిన సమాచారాన్ని సిట్‌ అధికారులకు చెప్పినట్లు తెలిపారు. ఈవెంట్‌ మేనేజర్ల గురించి వివరాలు ఇచ్చినట్లు చెప్పారు. తనపై విచారణ అధికారులు ఎలాంటి ఒత్తిడి చేయలేదన్నారు. అవసరమేతే మళ్లీ కాల్‌చేస్తామని అధికారులు చెప్పారన్నారు. సిట్‌ విచారణకు ఎప్పుడు పిలిస్తే అప్పుడు హాజరవుతానని చెప్పారు. సిట్‌ విచారణలో భాగంగా నవదీప్‌..రక్తనమూనాలు, చేతిగోళ్లు, తల వెంట్రుకలు ఇచ్చేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. దీంతో ఉస్మానియా వైద్యులు శాంపిల్స్‌ తీసుకోకుండానే వెనుదిరిగినట్లు సమాచారం. మంగళవారం ఆర్ట్‌ డైరెక్టర్‌ చిన్నాను సిట్‌ అధికారులు విచారించనున్నారు.

21:36 - July 24, 2017

హైదరాబాద్ : డ్రగ్స్‌ కేసులో హీరో నవదీప్‌ను సిట్‌ విచారిస్తోంది. ఉదయం 10.30 గంటల నుంచి విచారణ కొనసాగుతోంది. ప్రధానంగా కెల్విన్‌ కాల్‌డేటాలో నవదీప్‌ అగ్రస్థానంలో ఉన్నట్లు సిట్‌ గుర్తించింది. నవదీప్‌కు చెందిన బీపీఎమ్ పబ్బులో డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. డ్రగ్స్‌ ముఠాతో ఫోన్‌కాల్స్‌, ఫొటోలు, వీడియోల సాక్ష్యం ఆధారంగా నవదీప్‌ను సిట్‌ విచారిస్తున్నారు. నవదీప్‌ విచారణలో కీలక సమాచారం వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

12:41 - July 24, 2017

హైదరాబాద్ :సిట్‌ కార్యాలయంలో నవదీప్‌ విచారణ కొనసాగుతోంది. 10.30 గంటల నుంచి సిట్‌ అధికారులు నవదీప్‌ను విచారిస్తున్నారు. కెల్విన్‌ కాల్‌డేటాలో నవదీప్‌ అగ్రస్థానంలో ఉన్నట్లు సిట్‌ అధికారులు గుర్తించారు. ఈ కేసులో నవదీప్‌ కీలకంగా సిట్‌ భావిస్తోంది. నవదీప్‌కు చెందిన బీపీఎం పబ్బులో డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. డ్రగ్స్‌ ముఠాతో ఫోన్‌కాల్స్‌, ఫొటోలు, వీడియోల సాక్ష్యం ఆధారంగా నవదీప్‌ను సిట్‌ విచారిస్తున్నారు. ఎవరెవరు ఈ పబ్‌కు వచ్చేవారు... ఏ డ్రగ్స్‌ను కొనుగోలు చేశారనే అంశాలపై సిట్‌ అధికారులు ఆరా తీస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

10:31 - July 24, 2017

హైదరాబాద్ : డ్రగ్స్ కేసుల నోటీసులు అందుకున్న నటుడు నవదీప్ సిట్ ఆఫీస్ చేరుకున్నారు. ఈ రోజు విచారణలో నవదీప్ కు కెల్విన్ తో ఉన్న సంబంధాలపై విచారించనున్నారు. గతంలో డ్రగ్స్ ముఠాతో మాట్లాడిన ఫోన్ కాల్స్, ఫోటోలు, వీడియోల సాక్ష్యంతో సిట్ నవదీప్ ను ప్రశ్నించనుంది. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

09:05 - July 24, 2017

హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో నేడు హీరో నవదీప్ ను సిట్ విచారించనుంది. అబ్కారీ కార్యలయంలో ఉదయం 10.30 గంటలకు విచారణ ప్రారంభం కానుంది. సిట్ డ్రగ్స్ వ్యవహారంలో నవదీప్ కు ఉన్న సంబంధాలపై ఆరా తీయనుంది. అయితే సిట్ విచారణలో నవదీప్ నిజాలు చెబుతాడా లేదా అనేది చూడాలి. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

08:08 - July 24, 2017

హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో నేడు హీరో నవదీప్ ను సిట్ విచారించనుంది. అబ్కారీ కార్యలయంలో ఉదయం 10.30 గంటలకు విచారణ ప్రారంభం కానుంది. సిట్ డ్రగ్స్ వ్యవహారంలో నవదీప్ కు ఉన్న సంబంధాలపై ఆరా తీయనుంది. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

 

06:52 - July 24, 2017

హైదరాబాద్ : జై సినిమాతో నవదీప్ హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచమయ్యాడు. గౌతమ్‌ SSC, చందమామ సినిమాల్లో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత వరుసగా పరజయాలతో సతమతమయ్యాడు. హీరోగా అవకాశాలు రాకపోవడంతో చిన్న చిన్న పాత్రలకూ ఓకే చెప్పేశాడు. సినీ నటుడు నవదీప్‌పై ఇప్పటికే పలు ఆరోపణలున్నాయి. గతంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో అడ్డంగా బుక్కయ్యాడు. అనుమతిలేని బోట్ షికారు నడపడటంతో పాటు..నగర శివార్లలో రేవ్‌ పార్టీలు నిర్వహించినట్లు ఆరోపణలున్నాయి. స్వయంగా పబ్ నిర్వహిస్తున్న నవదీప్.. ఆ కేంద్రంగా డ్రగ్స్ రాకెట్ నడిపిస్తున్నట్లు సిట్ అధికారులు కీలక ఆధారాలు సేకరించారు. డ్రగ్ సప్లయర్ కెల్విన్ నుంచి సినీ ఇండస్ట్రీలోని మాదక ద్రవ్యాల వాడకం దారులకు పబ్బుల నుంచే పంపిణీ అవుతున్నట్లు గుర్తించారు. సినీ ఇండస్ట్రీని శాసించే పెద్ద కుటుంబాల పిల్లలు సైతం నవదీప్ పబ్ కస్టమర్లని సిట్ అధికారులు వివరాలు సేకరించారు.

16 బార్లలో డ్రగ్స్ అమ్ముతున్నట్టు గుర్తించారు
హైదరాబాద్‌లోని 16 బార్లలో డ్రగ్స్ అమ్ముతున్నట్టు అధికారులు గుర్తించారు. పలు పబ్బుల్లో డ్రగ్స్ తీసుకోవడానికే యూత్, విద్యార్థులు, సినీ ప్రముఖులు రెగ్యులర్‌గా వస్తుంటారని సిట్ అధికారుల దర్యాప్తులో తేలింది. అంతేకాకుండా, నవదీప్ కు చెందిన బీపీఎం పబ్ సహా క్లౌడ్ నైన్, వాటర్స్ పబ్, టెన్ డౌనింగ్ స్ట్రీట్, లిక్విడ్స్, డూప్లిన్ పబ్స్ లోనూ డ్రగ్స్ అమ్మకాలు జరిగినట్టు సిట్ గుర్తించింది. డ్రగ్స్ వ్యవహారంలో నటుడు నవదీప్ సోమవారం సిట్ అధికారుల విచారణ ఎదుర్కోనున్నాడు.

నవదీప్ ఏం చెబుతాడో
ఇప్పటికే సిట్‌ అధికారుల నుంచి నోటీసులు అందుకున్న నటుడు నవదీప్‌.. త‌న‌కు డ్రగ్స్‌ ముఠాతో ఎలాంటి సంబందం లేదంటున్నాడు. కెల్విన్ త‌న పేరు చెప్పడం త‌న‌ను ఆశ్చర్యప‌రిచింద‌ని చెబుతున్నాడు. సిట్ విచార‌ణ‌లో అన్ని విష‌యాలు వెలుగులోకి వ‌స్తాయంటున్నాడు. గతంలో డ్రంక్ అండ్ డ్రైవ్ లాంటి విషయాల్లో తప్పులు చేసి సరిదిద్దుకున్నట్లు తెలిపాడు. ఇప్పటికే నోటీసులు అందుకున్న 12 మంది సినీ ప్రముఖుల్లో పలువురు వాడకం దారులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. డ్రగ్స్ తీసుకున్న విషయం వెల్లడయినా వారికి కౌన్సిలింగ్ చేస్తారు. కాని డ్రగ్స్ సప్లయర్, అమ్మకం దారులుగా తేలిన వారికి 5 నుంచి పదేళ్ల వరకు శిక్షలున్నాయి. నవదీప్‌ విషయంలో ఏం జరుగుతుందో సిట్ విచారణ ముగిసిన తర్వాతగాని తెలియదు.

18:50 - July 14, 2017

హైదరాబాద్ : డ్రగ్స్‌ వ్యవహారంలో తనకు నోటీసులు వచ్చిన మాట వాస్తవమే అన్నారు ప్రముఖ హీరో నవదీప్‌. కానీ డ్రగ్స్‌కు తనకు ఎలాంటి సంబంధంలేదని నవదీప్ వివరణ ఇచ్చారు. డ్రగ్స్‌ కేసులో పట్టుబడ్డ ఒక ఈవెంట్‌ మేనేజర్‌తో తనకు పరిచయాలు ఉన్నాయని..దాంతో పోలీసులు తనకు నోటీసులు జారీచేశారన్నారు.హీరో నవదీప్‌ సిట్‌ విచారణకు హాజరై అన్ని విషయాలు వివరిస్తామన్నారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - నవదీప్