నష్టపరిహారం

18:24 - September 14, 2018

న్యూఢిల్లీ: ఆయన ఓ సాంకేతిక విజయాన్ని దేశానికి అందించిన అత్యంత ప్రతిభావంతుడు. రాకెట్ల ప్రయోగంలో ఓ కీలక ప్రయోగానికి నాంది పలికిన విజ్ఞాని. అప్పటివరకూ ద్రవ ఇంధనాన్ని రాకెట్ ప్రయోగంలో వినియోగించలేదు. 70వ దశకంలోనే అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఘనుడు కేరళకు చెందిన నంబి నారాయణన్. ఇస్రోలో పనిచేసిన సమయంలో మెదటిసారిగా ద్రవ ఇంధనాన్ని రాకెట్ ప్రయోగంలో ఉపయోగించిన గొప్ప శాస్త్రవేత్త. అటువంటి శాస్త్రజ్ఞుడిని మిలిటరీ రహస్యాలను మాల్దీవుల సీక్రెట్ ఏజెంట్లకు అమ్మివేశాడని ఆరోపిస్తూ 1994లో కేరళ పోలీసులు అరెస్టు చేశారు.

50 రోజుల పాటు జైలులో ఉంచారు.  ఈయనతోపాటు డి.శశికుమారన్ అనే మరోక శాస్త్రవేత్తను కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ప్లైట్ టెస్ట్ డాటాను రహస్యంగా అమ్మివేశారన్న ఆరోపణలతో ఆయనను ముగ్గురు పోలీసులు సిబీ మాథ్యూ, కెకె జోషువా, ఎస్ విజయన్ లాకప్ లో చిత్రహింసలకు గురిచేశారు.

ఆ తర్వాత ఆ కేసును సీబీఐ తీసుకోవడంతో నారాయణన్ ను నిర్దోషి అని తేల్చి వదిలేశారు. తనకు జరిగిన అన్యాయాన్ని, అవమానాన్ని వివరిస్తూ కేరళ హైకోర్టులో పిటీషన్ వేశారు. దీనిపై స్పందించిన కోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని రూ.1 లక్ష రూపాయల నష్టపరిహారాన్ని ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. దీంతో మరింత కృంగిపోయిన 70 ఏళ్ల నారాయణన్ సుప్రీంకోర్టులో తిరిగి పోరాటం ప్రారంభించారు. దీనిపై తీర్పును శుక్రావారంనాడు వెలువరిస్తూ నారాయణన్ కు రూ. 50 లక్షల నష్టపరిహారాన్ని ఇవ్వాల్సిందిగా ఆదేశించింది.

‘‘ దోషిగా..దేశద్రోహిగా ఇక నన్ను ఎవరూ పిలవలేరు. నన్ను ఈ కేసులో ఇరికించిన పోలీసలు వాళ్లు ఎంత తప్పు చేశారో అర్థమయితే చాలు. సుప్రీంకోర్టు తీర్పు నాకు ప్రశాంతతను ఇచ్చింది. నేను ఇప్పుడు నా కుటుంబంతో సంతోషంగా జీవించగలను..‘‘  అంటూ నారాయణన్ కోర్టు తీర్పు అనంతరం ఎన్డీటీవీతో తన ఆవేదనను పంచుకున్నారు.

 

07:42 - June 2, 2018

సిద్ధిపేట : మల్లన్న సాగర్‌ ప్రాజెక్ట్‌ నిర్మాణంలో ఇళ్ళు కోల్పోయితున్నందుకు బాధపడాల్సిన అవసరం లేదన్నారు మంత్రి హరీష్‌రావు. డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్ళు తీసుకున్నాకే.. ఇక్కడి నుంచి ఖాళీ చేయాలని భూ నిర్వాసితులకు మంత్రి సూచించారు. కాంగ్రెస్‌ నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దన్నారు మంత్రి. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని రెడ్డి సంక్షేమ భవనంలో..  మల్లన్న సాగర్‌ ప్రాజెక్ట్‌  భూ నిర్వాసితులకు మంత్రి హరీష్‌ రావు నష్టపరిహారం కింద చెక్కులు పంపిణీ చేశారు. ఏడు గ్రామాల్లో భూసేకరణ వంద శాతం పూర్తయింది మంత్రి తెలిపారు.

 

19:29 - November 15, 2017

ఢిల్లీ : దాడులకాదేదీ అనర్హం అన్నట్లుగా ఉంది..ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే. ఎందుకంటే దళితులు..ఇతరులపై దాడులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రాజస్థాన్ అల్వార్ లో ఉమర్ ఖాన్ ఆవులను కొనుక్కొని వస్తుండగా గో సంరక్షకులు దాడి చేసి చంపేసిన సంగతి తెలిసిందే. దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు పెరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వంపై పలువురు మండిపడుతున్నారు. బుధవారం ఢిల్లీలోని బికనీర్ హౌస్ వద్ద ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆందోళన నిర్వహించాయి. ఆల్ ఇండియా కిసాన్ సభ, ఐద్వా, ఆదివాసి, ముస్లిం, విద్యార్థి సంఘ నేతలు పాల్గొన్నారు. ఉమర్ ఖాన్ కుటుంబానికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించడంతో పాటు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

11:21 - November 8, 2017

హైదరాబాద్ : రైతుల సమ్మతితో భూ సేకరణ చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు తెలంగాణ శాసనసభలో వెల్లడించారు. బుధవారం ప్రారంభమైన శాసనసభలో భూ సేకరణపై సభ్యులు పలు ప్రశ్నలు అడిగారు. టి.కాంగ్రెస్ సభ్యుడు జీవన్ రెడ్డి ఈ అంశంపై మాట్లాడారు. ఎక్కువ సేపు మాట్లాడుతుండడంపై స్పీకర్ మధుసూధనాచారి అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనితో కొంత వాగ్వాదం చోటు చేసుకుంది.

బీఏసీలో 11 గంటల తరువాత ఐదు నిమిషాల్లో ప్రశ్న..అనంతరం ప్రభుత్వం సమాధానం చెప్పడం చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందని అందరూ బీఏసీ నిర్ణయానికి పాటుపడాలని మంత్రి హరీష్ రావు సూచించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన అనంతరం రైతులకు మెరుగైన నష్టపరిహారం చెల్లించాలి..నష్టపోకుండా ఉండే విధంగా చూస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా భూములు కోల్పోతున్న రైతులకు రూ. 6 లక్షల ఉంటే దానిని రూ. 10లక్షలు పెంచడం జరిగిందని, కోటి ఎకరాలకు నీరు అందించాలంటే ప్రాజెక్టుల పురోగతి కావాలని..ఇందుకు భూ సేకరణ చాలా ముఖ్యమన్నారు. రైతుల సమ్మతితో భూ సేకరణ చట్టం చేయడం జరుగుతోందని, ఎలాంటి బలోపేతం లేదని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. 

12:36 - November 7, 2017

హైదరాబాద్: నష్టపోయిన పత్తి రైతులను ఆదుకోవాలని, తడిచిన పంటను కొనుగోలు చేయాలని కాంగ్రెస్‌ సభ్యుడు జీవన్‌రెడ్డి కోరారు. దీనిపై స్పందించిన కేసీఆర్‌... రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్దమే కానీ.. పత్తికి నష్టపరిహారం ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. తెలంగాణ అసెంబ్లీలో పత్తి రైతులను ఆదుకోవాలని కాంగ్రెస్ నేతలు చర్చను చేపట్టారు. ఈ చర్చలో జీవన్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు సీఎం కేసీఆర్ సమాధానం ఇచ్చారు. పూర్తి నష్టపరిహారం ఇవ్వాలంటే నాలుగు సంవత్సరాల బడ్జెట్ కూడా సరిపోదని కేసీఆర్ పేర్కొన్నారు. కాటన్ ధర గురించి కనీస మద్ధతు ధర కంటే ఎక్కువ ధర వచ్చేందుకు చర్యలు చేపట్టామన్నారు. 100 జిన్నింగ్ మిల్లులు పెట్టబోతున్నామని పేర్కొన్నారు. తడిసిపోయిన వారికి కొంత సహకారం అందించేందుకు ప్రయత్నిస్తామని స్పష్టం చేశారు. సకాలంలో రైతులకు సహాయం అందిస్తున్నామని తెలిపారు.

ఇకపై రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏ పంటలు పండించాలో ప్రణాళికలు సిద్దం చేస్తున్నామన్నారు సీఎం కేసీఆర్‌. రాజేంద్రనగర్‌ వ్యవసాయ యూనివర్సిటీకి పునర్‌ వైభవం తీసుకొస్తామన్నారు కేసీఆర్‌. రైతుల పట్ల ప్రభుత్వానికి అందరికంటే ఎక్కువ చిత్తశుద్ది ఉందన్నారు. వ్యవసాయం దండగ కాదు... పండుగ అని నిరూపిస్తామని... రైతును రాజును చేస్తామన్నారు కేసీఆర్‌.

14:05 - November 5, 2017

సూర్యాపేట : జిల్లాలో నష్టపరిహారం కోసం ఓ రైతు ఆందోళనకు దిగాడు. జిల్లాలోని యండ్లపల్లిలో రైతు కృష్ణయ్య...దోమకాటుతో నష్టపోయిన వరిపంటకు నష్టపరిహారం చెల్లించాలంటూ టవర్ ఎక్కాడు. తనకు న్యాయం చేయకపోతే దూకుతానని బెదిరిస్తున్నాడు. 

20:17 - October 25, 2017
20:54 - August 4, 2017

విజయవాడ : గరగపర్రులో దళితులకు న్యాయం చేయాలంటూ అఖిలపక్షం ఆధ్వర్యంలో సంఘీభావ సమావేశాన్ని నిర్వహించారు. మరో 5 రోజుల్లో దళితులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించకపోతే ఛలో విజయవాడ కార్యక్రమం చేపడుతామని సీపీఎం రాష్ట్రకార్యదర్శి మధు హెచ్చరించారు. ఈ ఆందోళన కోసం రాష్ట్రవ్యాప్తంగా దళితులను ఏకం చేస్తామన్నారు. గ్రామంలో దళితుల బహిష్కరణ జరిగి 3 నెలలు గడుస్తున్నా..చంద్రబాబు ప్రభుత్వం వారికి ప్రకటించిన హామీలను నెరవేర్చలేదని సీపీఐ రాష్ట్రకార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు.  

17:11 - July 25, 2017

నిర్మల్ : జిల్లాలోని మామడ మండలం పానకల్ గ్రామంలో 1.58 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో సదర్మట్ బ్యారేజీ రిజర్వాయర్ ను నిర్మిస్తున్నారు. ఈ రిజర్వాయర్ నిర్మాణానికి రూ. 516 కోట్ల బడ్జెట్ కేటాయించింది. కానీ ప్రాజెక్టు కింద భూములు కోల్పోతున్న రైతులకు మాత్రం నష్ట పరిహారం చెల్లించడం లేదు. తమ సమస్యలపై మంత్రి ఇంద్రకిరణ్ స్పందించకపోవడం పట్ల రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

08:46 - June 15, 2017

హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని హఫీజ్‌పూర్‌ గ్రామంలో భూముల విషయంలో తాను ఎలాంటి తప్పు చేయలేదని టీఆర్ఎస్ ఎంపీ కేశవరావు ప్రకటించారు. భూమి విషయంలో న్యాయపరమైన అంశాలను పరిశీలించాకే కొనుగోలు చేసినట్టు చెప్పారు. ఆ భూముల జోలికి వెళ్లేదిలేదని స్పష్టంచేశారు. ఈ భూముల కోసం తాము చెల్లించిన నగదును తిరిగి ఇప్పించే ఏర్పాటు చేయాలని కేకే కోరారు. హఫీజ్‌పూర్‌ గ్రామంలోని భూముల కొనుగోలులో తమ కుటుంబ సభ్యులు ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదన్నారు. ఈ భూములు ప్రభుత్వ భూములని వివాదం తలెత్తడంతో సేల్‌డీడ్‌ నుంచి తప్పుకోవాలని కుటుంబ సభ్యులకు సూచించినట్టు చెప్పారు. భూముల కొనుగోలు సొమ్మును వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని విర్గో గ్లోబల్‌ మీడియా లిమిటెడ్‌ను కేకే డిమాండ్‌ చేశారు. తనకు జరిగిన పరువు నష్టానికి పరిహారం చెల్లించాలన్నారు. ఈ మేరకు లీగల్‌ నోటీసులు పంపనున్నట్టు చెప్పారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - నష్టపరిహారం