నాంపల్లి కోర్టు

21:17 - November 8, 2018

హైదరాబాద్: మద్దెలచెరువు సూరి హత్యకేసులో నిందితుడుగా ఉన్న మంగలికృష్ణను ఈరోజు హైదరాబాద్ లో  వెస్ట్ జోన్ పోలీసులు అరెస్టు చేశారు. నాంపల్లి కోర్టుకు హజరై తిరిగి వెళుతుండగా అదుపులోకి తీసుకున్న పోలీసులు టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో విచారిస్తున్నారు. మంగలికృష్ణ పై  హైదరాబాద్ లో దౌర్జన్యం,దాడి,భూకబ్జా కేసులు నమోదయ్యాయి.  హైదరాబాద్ లో  దుర్గారావు అనే రియల్ ఎస్టేట్ వ్యాపారిని, వ్యాపారంలో భాగస్వామ్యం ఇవ్వాలని మంగలికృష్ణ  గత కొంతకాలంగా బెదిరిస్తున్నాడు. ఇందులో భాగంగా మంగలికృష్ణ అనుచరులు దుర్గారావు ఇంట్లో విధ్వంసం సృష్టించారు. కేసు నమోదు చేసుకున్నపోలీసులు సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలించిగా....  కడప జిల్లా పులివెందులకు చెందిన సమీర్ అనే వ్యక్తిని గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించారు. మంగలి కృష్ణ ఆదేశాల మేరకు మరో నలుగురితో కలిసి దాడి చేసినట్లు సమీర్ ఒప్పుకున్నాడు. ఇదే కేసుకు సంబంధించి మంగలికృష్ణ ఈరోజు హైదరాబాద్ నాంపల్లి కోర్టులో లొంగి పోగా న్యాయస్ధానం బెయిల్ మంజూరుచేసింది. అనంతరం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. 

22:32 - October 24, 2018

హైదరాబాద్ : హీరా గ్రూప్ చైర్‌పర్సన్ నౌహీరా షేక్‌కు నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. సీసీఎస్ పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. నౌహీరా షేక్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

ప్రాసిక్యూషన్ వాదనలతో సంత‌ృప్తి చెందని కోర్టు.. కస్టడీ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. రూ.5 లక్షలతోపాటు రెండు షూరిటీలతో రూ.5 కోట్లను ఈనెల 29లోగా కోర్టులో డిపాజిట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. సమయానికి డిపాజిట్ చేయకపోతే మాత్రం బెయిల్ రద్దు చేస్తామని పిటిషనర్‌ను కోర్టు హెచ్చరించింది. దీంతోపాటు కోర్టు అనుమతి లేకుండా నగరం విడిచి వెళ్లకూడదని.. నౌహీరా షేక్ పాస్‌పోర్టును సీజ్ చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

నౌహీరా తరపు న్యాయవాది వినీత్‌దండా కోర్టులోకి వస్తున్న సమయంలో బాధితులు ఆందోళనకు దిగారు. బాధితులపై అతని బౌన్సర్లు దాడికి పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు బౌన్సర్లను పోలీసీులు అరెస్టు చేశారు.  

 

11:37 - August 27, 2018

హైదరాబాద్ : గోకుల్‌చాట్‌, లుంబినీపార్క్‌ బ్లాస్ట్‌లో ఇవాళ ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించనుంది. ఈ తీర్పుపై దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఈనేపథ్యంలో చర్లపల్లి జైలు, నాంపల్లి కోర్టు వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. చర్లపల్లి జైలు వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. నాంపల్లి కోర్టు వద్ద ప్రత్యేక బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. 
2007 ఆగస్టు 25న బాంబు బ్లాస్ట్‌ 
2007 ఆగస్టు 25న ఈ బాంబు బ్లాస్ట్‌ జరిగింది. మొదట సెక్రటేరియట్‌ ఎదురుగా ఉన్న లుంబినీ పార్క్‌లో బాంబు పేలుడు సంభవించింది. ఆ తర్వాత ఐదు నిమిషాలకే కోఠిలోని అత్యంత రద్దీ ప్రదేశమైన గోకుల్‌చాట్‌ బండార్‌లో మరో బాంబు పేలింది.  రెండు ఘటనల్లో 42 మంది మృతి చెందగా.. 70 మందికిపైగా గాయాలు అయ్యాయి. ఈ పేలుళ్ల వెనుక ఇండియన్‌ ముజాహిద్దీన్‌ హస్తం ఉన్నట్టు ఎన్‌ఐఏ విచారణలో తేలింది. రెండేళ్ల అనంతరం ఐదుగురు నిందితులను ఎన్‌ఐఏ అరెస్ట్ చేసింది. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. పాకిస్తాన్‌ ప్రేరణతో సాగుతున్న ఈ సంస్థకు చెందిన రియాజ్‌ భత్కల్‌, యాసిన్‌ భత్కల్‌, ఇక్భాల్‌ భత్కల్‌ నాయకత్వం వహించినట్టు ఎన్ఐఏ అధికారులు తేల్చారు. నిందితుల నుంచి కీలక ఆధారాలు సేకరించిన ఎన్ఐఏ.. 11 వందల 25 పేజీల చార్జిషీటు దాఖలు చేసింది. 2 వందల 86 మందిని విచారించిన ఎన్ఐఏ.. 11 మందిపై అభియోగాలు నమోదు చేసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్లపల్లి జైలు వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఎవరినీ కూడా లోపలికి రానివ్వడం లేదు. ములాఖత్ లకు అనుమతించడం లేదు. మరోవైపు నాంపల్లి కోర్టు వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రత్యేక బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్లపల్లి జైలు నుంచి నిందితులను ప్రవేశపెట్టనున్నారు. 

16:55 - April 16, 2018

హైదరాబాద్‌ : మక్కా మసీదు పేలుళ్ల కేసును నాంపల్లి కోర్టు కొట్టినవేసిన నేపథ్యంలో పాతబస్తీలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు 1500 మంది పోలీసులతో శాంతిభద్రతలు పర్యవేక్షిస్తున్నారు. పరిస్థితిని పోలీసు ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. పాతబస్తీలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయంటున్న దక్షిణ మండలం డీసీపీ సత్యనారాయణతో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

12:12 - January 19, 2018

హైదరాబాద్ : యాంకర్ ప్రదీప్ కు జైలు శిక్ష పడుతుందా ? లేక జరిమాన విధిస్తారా ? అనే చర్చ జరుగుతోంది. డిసెంబర్ 31న మోతాదుకు మించి మద్యం సేవించి పోలీసులకు పట్టుబడిన సంగతి తెలిసిందే. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి కౌన్సిలింగ్ కు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు.

కానీ ప్రదీప్ కోర్టుకు హాజరు కాలేదు. తాను ఇతర షూటింగ్ లో బిజీగా ఉన్నానని..త్వరలోనే కౌన్సెలింగ్ కు హాజరవుతానని పేర్కొంటూ ఒక వీడియో విడుదల చేశారు. అనంతరం కౌన్సెలింగ్ కు హాజరయ్యారు. 22వ తేదీన కోర్టుకు హాజరవుతానని చెప్పిన ప్రదీప్ శుక్రవారం కోర్టుకు వచ్చాడు. పట్టుబడిన సందర్భంంలో 178 పాయింట్ల ఆల్కాహాల్ ఉన్నట్లు తేలడంతో ఆయనపై కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి. జరిమానతో సరిపుచ్చుతుందా ? లేక జైలు శిక్ష విధిస్తుందా ? అనేది కొద్ది గంటల్లో తేలనుంది. 

12:01 - January 10, 2018

హైదరాబాద్ : డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులో యాంకర్‌ ప్రదీప్‌ ఇవాళ నాంపల్లి కోర్టుకు హాజరవుతున్నారు. మద్యం సేవించిన కారునడిపిన కేసులో ఏడాదిపాటు లైసెన్స్‌ రద్దయ్యే ఛాన్స్‌ ఉందని లాయర్లు అంటున్నారు.అలాగే 2రోజుల పాటు జైలుశిక్షపడే అవకాశంకూడా ఉందంటున్నారు.  

10:26 - January 9, 2018

హైదరాబాద్ : డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులో పట్టుబడిన యాంకర్‌ ప్రదీప్‌ ఎట్టకేలకు పోలీసుల ముందు హాజరయ్యారు. గోషామహల్‌ ట్రాఫిక్‌ ఇన్‌స్టిట్యూట్‌లో కౌన్సిలింగ్‌కు హాజరయ్యారు. డిసెంబర్ 31 రాత్రి తాగి వాహనం నడుపుతూ ట్రాఫిక్‌ పోలీసులకు దొరికిన ప్రదీప్‌ తన తండ్రితో కలిసి కౌన్సిలింగ్‌ తీసుకున్నారు. ప్రదీప్‌ను పోలీసులు ఇవాళ నాంపల్లి కోర్టులో హాజరు పరచనున్నారు. 

నూతన సంవత్సర వేడుకల్లో మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడ్డ యాంకర్ ప్రదీప్... ట్రాఫిక్ పోలీసుల ముందుకు వచ్చారు. షూటింగ్‌లో బిజీగా ఉండటం వల్ల వారం రోజుల తర్వాత ప్రదీప్‌ ఈ కౌన్సిలింగ్‌కు హాజరయ్యారు. డిసెంబర్ 31 రాత్రి బ్రీతింగ్‌ ఎనాలసిస్‌లో 178 పాయింట్లు నమోదు కావడంతో పోలీసులు ప్రదీప్‌ వాహనాన్ని సీజ్‌ చేసి కౌన్సిలింగ్‌కు హాజరుకావాలని చెప్పారు. 

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులో పట్టుబడడం తప్పేనని ఒప్పుకున్నారు ప్రదీప్‌. ఇంకెప్పుడూ అలాంటి తప్పు చేయనన్నారు. అనుకోకుండా ఆరోజు అలా జరిగిందన్నారు. తనలాంటి తప్పు మరొకరు చేయకూడదన్నారు. కౌన్సిలింగ్‌లో పాల్గొన్న ప్రదీప్‌ ఇకనుంచి నిబంధనల ప్రకారం నడుచుకుంటానని చెప్పారు. 

ఒకరికి చెప్పాల్సిన స్థానంలో ఉన్న ప్రదీప్ .. తానే ఇలా మద్యం సేవించి వాహనం నడపడంతో ప్రదీప్ కేసును పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. మంగళవారం కోర్టులో ప్రవేశ పెట్టిన తర్వాత న్యాయమూర్తి తీర్పును బట్టి ఎలాంటి శిక్ష పడుతుందన్నది న్యాయమూర్తిపై ఆధారపడి ఉందంటున్నారు ట్రాఫిక్ పోలీసులు. దీంతో ప్రదీప్ మంగళవారం నాంపల్లి కోర్టుకు హాజరుకానున్నారు. న్యాయస్థానం ఎన్ని రోజుల శిక్ష విధిస్తుందో కూడా తేలుతుంది. 

11:28 - January 5, 2018
10:47 - October 13, 2017

 

హైదరాబాద్ : కాసేపట్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ నాంపల్లి సీబీఐ కోర్టు హాజరుకానున్నారు. పాదయాత్ర నేపథ్యంలో ప్రతి శుక్రవారం సీబీఐ కోర్టుకు హాజరు నుంచి మినహాయించాలని జగన్ కోర్టుకు విన్నవించనున్నాడు. 6నెలల పాటు మినహాయింపు ఇవ్వాలని కోరునట్టు తెలుస్తోంది. సీబీఐ కోర్టు కాసేపట్లో ఈ పిటిషన్ విచారించనుంది. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

15:54 - August 3, 2017

హైదరాబాద్ : అపోలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జైన విక్రమ్‌గౌడ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసి.. నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. మరోవైపు విక్రమ్‌గౌడ్‌ బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. విక్రమ్‌ గౌడ్‌ను వైద్యులు డిశ్చార్జ్‌ చేయగానే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. వీల్‌చైర్‌పైనే నాంపల్లి కోర్టుకు తరలించారు. విక్రమ్‌ను నిన్ననే అరెస్ట్ చేయాల్సిఉన్నా... అతడు పూర్తిగా కోలుకోలేదని వైద్యులు తెలిపారు. వైద్యుల సూచనతో నిన్న విక్రమ్‌ను పోలీసులు అరెస్ట్ చేయలేదు. ఇవాళ అతన్ని అపోలో ఆస్పత్రినుంచి డిశ్చార్జ్ చేశారు. ఆ వెంటనే విక్రమ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కాల్పుల కేసులో విక్రమ్‌ గౌడే సూత్రదారి అని పోలీసులు తేల్చారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

Pages

Don't Miss

Subscribe to RSS - నాంపల్లి కోర్టు