నాగచైతన్య

సినిమా : అక్కినేని నాగ చైతన్య, హీరోయిన్ సమంత మధ్య ప్రేమ నాలుగు ఐదు సంవత్సరాలు కొనసాగింది. ఎట్టకేలకు వీరి ప్రేమ పెళ్లి పీఠలు ఎక్కింది. నాగ చైతన్య, సమంత పెళ్లి గోవాలో హిందు, క్రైస్తవ పద్దతలో జరిగింది. అయితే ఈ పెళ్లి తంతు అభిమానులకు దూరంగా జరిగింది. దీని పై నాగర్జున మాట్లాడుతూ పెళ్లి గోవాలో జరిగిన రిసెప్షన్ హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కానీ తేదీని మాత్రం ప్రకటించ లేదు. దీంతో చైతు సమంత రిసెప్షన్ జరుగుతుందా లేదా అభిమానుల్లో గందరగోళం మొదలైంది. పెళ్లి తర్వాత నాగచైతన్య సమంత రిసెప్షన్ నాగచైతన్య అమ్మ లక్ష్మీ గారి ఇంట్లో దగ్గుబాటి కుంటుం సమక్షంలో ప్రైవేట్ గా జరిగింది.నాగచైతన్య, సమంతల రిసెప్షన్ నవంబర్ 12న ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ ఫంక్షన్ కు ప్రముఖులనే ఆహ్వానిస్తారా లేక అభిమానులను కూడా పిలుస్తార తెలియరాలేదు.
గోవా : ఆహ్లాద గోవాతీరం ఆనందానికి వేదికైంది. నాలుగేళ్లుగా ప్రేమలో విహరించిన లవ్‌బర్డ్స్ ఇపుడు ఒకేగూటికి చేరాయి. పెళ్లి వేడుకతో చైతు, సమంత మురిసిపోతున్నారు. బంధుమిత్రుల కేరింతల మధ్య చై, సామ్‌ల పెళ్లి అదుర్స్ అనిపించింది. పెళ్లి డ్రెస్స్‌ల్లో చై, శామ్ చమక్మన్నారు. వేదమంత్రాలు, కుటుంబ పెద్దలు, సన్నిహితుల మధ్య నాగచైతన్య, సమంత వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఏడడుగులతో పంచభూతాలు, నాలుగుదిక్కుల సాక్షిగా మూడుముళ్ల బంధంతో ఇద్దరూ ఒక్కటయ్యారు. శుక్రవారం హిందూ సంప్రదయంలో ప్రేమపక్షులు ఏడడుగులు నడిచాయి. మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యాయి.
'ఏ మాయచేశావే'లో ఎవరికి ఎవర్ని జంటగా అనుకుంటారో.. ఆఖరికి వాళ్లనే ఓ చోట కలిపేస్తాడు అంటూ తొలి సినిమా పాడుకున్న ఈ జంట.. ఇప్పుడు పెళ్లితో ఒక్కటయింది. అక్కినేని, దగ్గుపాటి కుటుంబాలతో పాటు వధువరుల సన్నిహితులు, మిత్రుల సమక్షంలో వివాహం అట్టహాసంగా జరిగింది. రెండు మతాల సంప్రదాయాల్లో చైతు, సమంత పెళ్లి జరిగింది. మొదటిరోజు హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లివేడుక బంధుమిత్రులకు కన్నుల పండుగే అయింది. శనివారం ఉదయాన్నే నాగచైతన్యను పెళ్లి కొడుకుని చేసి కళ్యాణ తిలకం దిద్దారు. మెహందీ ఫంక్షన్ తరువాత సమంతతో నాగచైతన్య ఫోటో సెషన్ జరిగింది. ఈ ఫోటోలు చూసి ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. మెహందీ కార్యక్రమం తరువాత.. సంగీత్ నిర్వహించారు. ఆట పాటలతో వేడుక ఘనంగా జరిగింది. సమంత, దగ్గుపాటి సురేష్ బాబులతో పాటు కుటుంబ సభ్యులంతా నృత్యాలతో సంబరాలు చేసుకున్నారు. ఆ తరువాత పండితులు నిర్ణయించిన సుభ ముహూర్తాన సమంత మెడలో చైతూ మూడుముళ్లు వేశాడు. వధువరులిద్దరు కళ్యాణ దుస్తుల్లో తళుక్కుమన్నారు.
ఇక ముందుగా అనుకున్న ప్రకారం ముదుగా హిందూ సంప్రదాయం ప్రకారం మూడుముళ్లతో ఒక్కటైన చైతు-సామ్ ..శనివారం క్రిస్టియన్ సంప్రదాయ పద్దతిలో పెళ్లి చేసుకున్నారు. ఈ వేడుకకు వధువరుల కుటుంబ సభ్యులతో పాటు మరికొంతమంది బంధుమిత్రులు మాత్రమే హాజరయ్యారు.
టాలీవుడ్లో నాగచైతన్య, సమంతది మోస్ట్ హ్యాపెనింగ్ వెడ్డింగ్. ఈ ఇద్దరి పెళ్లి కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూశారు. ఇప్పుడు చైతూ, సామ్ పెళ్లి వేడుకను చూసి తెగ మురిసిపోతున్నారు. రెండు మతాల సంప్రదాయాలను గౌరవిస్తూ వధువరులు రెండు పద్ధతుల్లో పెళ్లి చేసుకోవాలనుకోవడం తెగ నచ్చిందని వధువరుల కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పడు ఐదురోజుల పాటు జరిగే పెళ్లి సంబరాలు జరిగేవి. తర్వాత మూడు రోజులు, ప్రస్తుతం ఒక్కరోజు.. ఇంకా చెప్పాలంటే కొన్ని గంటల్లోపే కానిచ్చేస్తున్నారు. కాని.. చైతుసామ్ మ్యారేజి మాత్రం స్పెషల్‌గా నిలిచింది. రెండు మతాల సంప్రదాయంలో అదిరిపోయే లెవల్లో పెళ్లిచేసుకోవడం బంధు-మిత్రులు, అభిమానుల ఆనంద పడుతున్నారు.
గోవా : ప్రేమజంట ఒక్కటయింది. పేమతో మొదలయిన బంధం పెళ్లితో మరింత బలపడింది. టాలీవుడ్ ప్రేమికులు నాగచైతన్య, సమంత వివాహం గోవాలో ఘనంగా జరిగింది. అక్కినేని, దగ్గుబాటి కుటుంబాలతోపాటు సమంత కుటుంబసభ్యులు, బంధువులు ఈ వేడుకలో పాల్గొన్నారు. గోవాలోని ఓ స్టార్హోటల్లో ఏర్పాటు చేసిన పెళ్లివేదికపై చైతు-సమ్మి ఏడడుగులు నడిచారు. శుక్రవారం రాత్రి 11.45 కు హిందూ సంప్రదాయం ప్రకారం చైతూ- సమంత ఒక్కటయ్యారు..కాగా ఇవాళ క్రిష్టియన్ సంప్రదాయం ప్రకారం మరోసారి పెళ్లి జరగనుంది. పెళ్లి కొద్ది మంది అతిథుల సమక్షంలో జరిగినా.. ఈనెల 10 హైదరాబాద్‌లో రిసెప్షన్‌ను అక్కినేని ఫ్యామిలీ గ్రాండ్‌గా ఏర్పాటు చేస్తోంది.
హైదరాబాద్ : నగరంలోని సుచిత్రలో చెన్నయ్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం జరిగింది. హీరో అక్కినేని నాగచైతన్య, హీరోయిన్ కాజల్ అగర్వాల్ షాపింగ్ మాల్ ను ప్రారంభించారు. 9 వ చెన్నయ్ షాపింగ్ మాల్ ప్రారంభం అయింది.
మరిన్ని వివరాలను వీడియలో చూద్దాం...
అక్కినేని నాగచైతన్య, లావణ్య త్రిపాఠి జంటగా తెరకెక్కిన చిత్రం 'యుద్ధం శరణం'. వారాహి చలనచిత్రం బ్యానర్‌పై సాయి కొర్రపాటి నిర్మాతగా కృష్ణ మరిముత్తు దర్శకత్వంలో చిత్రం తెరకెక్కింది. యుద్ధం శరణం మూవీ టీమ్ తో 10 టివి చిట్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా నాగచైతన్య, లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ సినిమా విశేషాలను తెలిపారు. తమ అనుభవాలను వివరించారు. వారు తెలిపిన పలు ఆసక్తరమైన అంశాలను వీడియోలో చూద్దాం...

హైదరాబాద్: అక్టోబర్ 6 పెళ్లి తో నాగచైతన్య, సమంత ఒకటి కానున్నారు. తాజాగా తన కొడుకు చైతు పెళ్లి విషయం పై బర్త్ డే బాయ్ నాగార్జున ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. అక్టోబర్ 6 న చైతు, సామ్ ల పెళ్లి .. గోవాలో అని ఖరారు చేశాడు. ఒకే రోజు హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాల ప్రకారం పెళ్లి జరగనున్నదని చెప్పాడు.. పెళ్లి అనంతరం హైదరాబాద్ రిసెష్పన్ ఘనంగా ఉంటుంది అని చెప్పాడు.. పెళ్లి సింపుల్ గా చేసుకోవడం అనేది మాత్రం వారిద్దరి నిర్ణయం అని నాగ్ చెప్పారు..

‘కంగ్రాట్స్ కోడలా' అంటూ 'సమంత'ను టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున అభినందించారు. నాగార్జున తనయుడు 'నాగ చైతన్య'..’సమంత'లు త్వరలో ఒక్కటి కాబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే వీరి ఎంగేజ్ మెంట్ జరిగింది. అనంతరం ఇరువురు పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా మారారు. నాగ చైతన్య, రకూల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్న 'రారండోయ్ వేడుక చూద్దాం' అనే సినిమా రూపొందుతోంది. ఈ సినిమా సాంగ్స్ ను యూ ట్యూబ్ లో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి నాగార్జున..సమంతల మధ్య ఫోన్ లో చాటింగ్ జరిగింది. ఈ చాటింగ్ జరిగిన తీరును నాగార్జున సోషల్ మీడియాలో పోస్టు చేశారు. 'కంగ్రాట్స్ కోడలా..' అని నాగార్జున పేర్కొంటే, 'లవ్ మామా' అని సమంత మెసేజ్ చేసింది. 'రారండోయ్ వేడుక చూద్దాం' సినిమాలో అక్కినేని నాగచైతన్య చాలా బాగున్నాడనీ, 'ఎవ్రిథింగ్ వర్క్స్' అని సమంత చెప్పుకొచ్చింది.

అక్కినేని నాగార్జున తనయుడు 'నాగ చైతన్య' మెగా ఫ్యామిలీ వారు వెళుతున్న దారిలో వెళుతున్నాడా ? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇటీవలే మెగా హీరోలు నటించిన పలు చిత్రాల ఆడియో వేడుకలు నిర్వహించకుండానే యూ ట్యూబ్ లలో రోజుకొకటి..రెండు రోజుల ఒకటి విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా 'నాగ చైతన్య' నటిస్తున్న 'రారండోయ్ వేడుక చూద్దాం' సినిమా పాటలను కూడా ఆన్ లైన్ లో విడుదల చేస్తున్నారు. 'బుగ్గచుక్క పెట్టుకుంది సీతమ్మా. సీతమ్మా!.. కంటి నిండా ఆశలతో మా సీతమ్మ... తాళిబొట్టు చేతబట్టి.. రామయ్యా!.. రారండోయ్ వేడుక చూద్దాం. సీతమ్మను, రామయ్యను ఒకటిగా చేద్దామంటూ'.. .సాగే టైటిల్ సాంగ్‌ను శనివారంనాడు ఆన్లైన్లో ఆవిష్కరించారు.
నాగచైతన్య, రకుల్‌ప్రీత్‌సింగ్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియో బేనర్లో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. 'సోగ్గాడే చిన్నినాయన' ఫేమ్ కళ్యాణ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఈనెల 19న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఆదివారం సాయంత్రం 4.30 గంటలకు ఈ పాటకు సంబంధించిన 30 సెకన్ల టీజర్ రిలీజ్ చేస్తామని, త్వరలోనే ఇదే పాటకు 90 సెకన్ల వీడియోను విడుదల చేస్తామని నిర్మాత నాగార్జున వెల్లడించారు.

నాగ చైతన్య..రకూల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన 'రారండోయ్ వేడుక చూద్దాం' చిత్రం విడుదలకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో శ్రీమతి అక్కినేని అన్నపూర్ణ ఆశీస్సులతో అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై అక్కినేని నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్స్ విడుదలైన సంగతి తెలిసిందే. చిత్రీకరణ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకొంటోంది. మే 19వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం పేర్కొంది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో 'మనం', 'సోగ్గాడే చిన్నినాయనా' చిత్రాల తర్వాత వస్తున్న మరో సూపర్‌హిట్ చిత్రమిదని పేర్కొంది. ఇక ఈ చిత్రంలో జగపతి బాబు, సంపత్, కౌసల్య ఇర్షాద్ (పరిచయం) తదితరులు నటించారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్ అందించారు.

వీకెండ్స్..శనివారం..ఆదివారాల కోసం ఎంతో మంది ఎదురు చూస్తుంటారు. ముఖ్యంగా ఆదివారం రోజున చాలా మంది ప్లాన్స్ చేసుకుంటుంటారు. ఆదివారం సరదాలకు, సంతోషాలకు వేదికగా నిలిచే రోజుగా పేర్కొంటుంటారు. సామాన్య మానవుడి నుండి స్టార్స్ వరకు సండేను గొప్పగా మలుచుకోవాలని అనుకుంటుంటారు. తాజాగా టాలీవుడ్ అగ్ర నటీమణుల్లో ఒకరైన 'సమంత' కూడా సండేను బాగా సెలబ్రేట్ చేసుకుందంట. సండే బీ పర్ ఫెక్ట్ అంటూ 'సమంత' సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసుకుంది. ప్రియుడు నాగచైతన్య కూడా పక్కనే ఉన్నాడు. వీరివురికీ ఇటీవలే వివాహ నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. త్వరలోనే వీరు ఒక్కటి కాబోతున్నారు. ఆదివారం సరదాగా గడిచిపోయిందని సమంత చెబుతోంది. కుక్కపిల్లను తన ఒడిలో కూర్చొబెట్టుకొని ఆనందపరవశరాలువుతున్న ఫొటోను అభిమానులతో పంచుకుంది. 'సమంత' షేర్ చేసిన ఈ ఫొటో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
Pages
Don't Miss
