నాగార్జున

14:48 - July 28, 2017

వెండితెర‌పై రికార్డుల మ్రోత మోగించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ రీసెంట్ గా బిగ్ బాస్ షోతో బుల్లితెర‌కి ప‌రిచ‌యం అయిన సంగ‌తి తెలిసిందే. 12 మంది సెల‌బ్రిటీలు, 70 రోజులు, 60 కెమెరాల మ‌ధ్య ఈ షో ర‌స‌వ‌త్త‌రంగా సాగుతుంది. ఈ షోకి టీ ఆర్పీ రేటింగ్ 16.18 గా వ‌చ్చిన‌ట్టు తెలుస్తుండ‌గా, గ‌తంలో ఏ రియాలిటీ షో కి కూడా ఇంత రేటింగ్ రాలేద‌ని అంటున్నారు. తాజాగా కింగ్ నాగార్జున త‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా ఎన్టీఆర్ ని ప్ర‌శంసించారు. 'తొలి వారంలో సాధించిన ఘ‌న‌త‌కి అభినంద‌న‌లు. నీ ఎనర్జీ నాకు ఎంత‌గానో నచ్చుతుంద‌ని' ట్వీట్ చేశాడు నాగ్. దీనికి వెంట‌నే రియాక్ట్ అయిన ఎన్టీఆర్ కింగ్ నాగ్ కి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తూ.. బుల్లితెర‌పై మీరు ఒక ట్రెండ్ సెట్ చేశారు. మా లాంటి వారికి ఓ మార్గం చూపారని రిప్లై ఇచ్చాడు జూనియ‌ర్.

16:15 - July 9, 2017

వరుస చిత్రాలతో బిజీ బిజీగా మారిపోతున్న 'కాజల్' కు మరో ఆఫర్ వచ్చినట్లు సోషల్ మాధ్యమాల్లో వార్తలు వెలువడుతున్నాయి. స్టార్ హీరోల పక్కన మంచి మంచి అవకాశాలు పట్టేస్తూ ప్రేక్షకులను 'కాజల్' అలరిస్తోంది. మెగాస్టార్ 'చిరంజీవి' సరసన 'ఖైదీ నెంబర్ 150’లో చిందేసిన ఈ ముద్దుగుమ్మ తమిళంలో కూడా బిజీగా ఉంది. గ్లామర్ హీరోయిన్ గా హావా కొనసాగిస్తున్న ఈ భామ 'నాగార్జున' నటిస్తున్న 'రాజు గారి గది 2’ సినిమాలో నటిస్తోందని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో 'సమంత' కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆమె షూటింగ్‌లో సైతం పొల్గొందని టాక్. పాత్ర నచ్చడంతోనే నటించేందుకు 'కాజల్' ఒప్పుకుందని పుకార్లు షికారు చేస్తున్నాయి. ప్రధాన పాత్ర పోషిస్తున్న సీరత్ కపూర్ సరసన 'కాజల్' నటించందా ? లేక 'నాగార్జున' సరసన నటించిందా అనేది చూడాలి. 'రానా' సరసన 'నేనే రాజు నేనే మంత్రి' చిత్రంలో 'కాజల్' నటిస్తోంది.

10:39 - June 17, 2017

 

            మీరు విన్నది నిజమే అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్ అక్కినేని రెండో సినిమా రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రారంభమయ్యింది. సాధారణంగా హీరో హీరోయిన్ మూవీ కాస్టింగ్ ను ముందే అనౌన్స్ చేస్తుంటారు. కానీ ఈ సినిమా హీరోయిన్ పేరును ఇప్పటి వరకు వెల్లడించలేదు. మొదట్లో మేఘా ఆకాష్, అనుపమా పరమేశ్వరన్ ల పేర్లు వినిపించినప్పటికీ వారు ఈ సినిమాలో లేరని స్వయంగా అక్కినేని నాగార్జున చెప్పేశారు. దీంతో ఇప్పటికే షూటింగ్ ప్రారంభమయ్యింది కానీ హీరోయిన్ ఎవరబ్బా అని ఎదురు చూస్తున్నారు సినీ ప్రేక్షకులు. 
           యితే ఈ సినిమా హైప్ పెంచేందుకోసమే ఈ ట్రిక్ ప్లే చేస్తున్నారంటున్నాయి సినీ వర్గాలు. ఇటీవల ఒక సినిమాకి చివరి క్షణం వరకు హీరో ఫేస్ చూపించకుండా ప్రచారం చేసుకున్న నేపథ్యంలో హీరోయిన్ పేరు కూడా చివరి వరకూ ప్రకటించరా అనే అనుమానం రాకమానదు. అయితే హీరోయిన్ ను ఇప్పుడే చూపించకుండా.. ఆమె షెడ్యూల్ స్టార్ట్ అయినప్పటినుంచి ప్రచారంలోకి తేవాలనే ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తుంది. హీరోయిన్ అనౌన్స్ మెంట్ కోసం ఇంత హంగామా చేస్తున్నారంటే ఓ పేరుమోసిన స్టార్ కూతురును ఇంట్రడ్యూస్ చేసే అవకాశాలున్నాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి. 

13:24 - June 12, 2017

టాలీవుడ్ మన్మథుడిగా పేరొందిన 'అక్కినేని నాగార్జున' ‘అమల' వివాహ బంధానికి 25 ఏండ్లు నిండాయి. ఈ సందర్భంగా 'నాగార్జున' తమ పెళ్లి ఫొటోను ఫేస్ బుక్ లో పోస్టు చేస్తూ..నేటికి 25 ఏండ్లు అవుతోంది..అని పేర్కొన్నారు. 1987లో 'కిరాయిదాదా' చిత్రంలో నాగార్జున, అమలలు నటించారు. తరువాత 'చిన్నబాబు'..’శివ'..’ప్రేమ యుద్ధం'..’నిర్ణయం'..వంటి చిత్రాల్లో నటించారు. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. 1992 జూన్ 11వ తేదీన వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వివాహమయ్యాక 'అమల' సినిమాలకు దూరంగా ఉంటూ సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. చాలా కాలం తర్వాత 2012లో విడుదలైన 'లైఫ్‌ ఈజ్‌ బ్యూటీఫుల్‌' చిత్రంలో తల్లి పాత్రలో 'అమల' మెరిశారు. 'నాగార్జున' మాత్రం వైవిధ్యమైన చిత్రాలు చేస్తూ అభిమానుల మన్ననలు పొందుతున్నారు. ప్రస్తుతం 'రాజుగారి గది 2' చిత్రంలో 'నాగార్జున' నటిస్తున్నారు.

12:49 - June 2, 2017

'టబు'..బాలీవుడ్ నటి తెలుగులో పలు చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. 'నాగార్జున' 'టబు' జంటగా నటించిన 'నిన్నే పెళ్లాడితా' సినిమా ఆ రోజుల్లో ఎంత సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. క్రేజీ ఫెయిర్ గా వారికి పేరు తెచ్చింది. 'నాగార్జున' తనయుడు 'అఖిల్' మొదటి సినిమా అనంతరం రెండో సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభమైన సంగతి తెలిసిందే. 'మనం' ఫేమ్‌ విక్రమ్‌కుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకంపై ఈ నాగార్జున నిర్మిస్తున్నారు. ఇందులో తల్లి పాత్ర కోసం 'టబు'ను ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది. కీలక పాత్రకు 'టబు' అయితే బాగుంటుందని భావించిన చిత్ర బృందం ఆమెను కలిశారని తెలుస్తోంది. కథ విన్న తరువాత ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ చిత్ర కొత్త షెడ్యూల్ వచ్చే నెలలో హైదరాబాద్ లో ప్రారంభం కానుంది. చిత్రంలో టబు..అఖిల్ కు తల్లిగా నటిస్తారా ? లేదా ? ఏదైనా కీలక పాత్ర పోషిస్తారా ? అనేది చిత్ర యూనిట్ స్పందిస్తే గాని తెలియదు.

16:13 - May 26, 2017

కంటెంట్ ఏదైనా తన రోల్ కి న్యాయం చేసే నటులు చాల తక్కువ మంది ఇండస్ట్రీ లో ఉంటారు. లవ్ అండ్ రొమాంటిక్ సినిమాల్లో అదరగొట్టిన 'మన్మధుడు' ఇప్పుడు హారర్ ఎఫెక్ట్ తో రాబోతున్నాడు. కథ ఏదైనా ఆడియన్స్ కి నచ్చే అంశాలని జోడించి బిజినెస్ చేసుకోవడం బాగా తెలిసిన నిర్మాతకూడా ఈయనే. 'నాగార్జున'కు ఉన్న 'మన్మధుడు' అనే పేరును సార్ధకం చేసిన సినిమా 'సోగ్గాడే చిన్ని నాయన'. నాగార్జున డ్యూయెల్ రోల్ చేసి మెప్పించిన సోషియో ఫాంటసీ ఫిలిం సోగ్గాడే చిన్ని నాయన. ఈ సినిమాలో నాగార్జున సరసన రమ్యకృష్ణ తో పాటు లావణ్య త్రిపాఠి స్క్రీన్ ని పంచుకున్నారు. ప్రతి ఫ్రేమ్ లో అందాన్ని చూపించిన ఈ సినిమా కి డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ. సినిమాల విషయం లో పర్టికులర్ గా ఉంటూ ..సెలెక్టివ్ గా స్టెప్ వేస్తున్న సీనియర్ హీరో నాగార్జున. ట్రెండ్ మిస్ అవ్వకుండా సినిమాలు తీస్తూ యంగ్ హీరోలకు పోటీ కూడా ఇస్తున్నాడు.

సంతృప్తి లేదన్న నాగ్..
'
రాజు గారి గది' అనే చిన్న సినిమా పెద్ద కలెక్షన్స్ కురిపించిన విషయం తెలిసిందే.. యాంకర్ గా తన కెరీర్ మొదలు పెట్టి ఇప్పుడు డైరెక్టర్ గా ఈ సినిమాతోనే హిట్ కొట్టాడు ఓంకార్. టైటిల్ తోనే మంచి కురియాసిటీ పెంచి ఆడియన్స్ ని ఆకర్షించాడు. ఒకే ఒక పాత భవనం లో జరిగే హారర్ సస్పెన్సు కథగా వచ్చిన 'రాజు గారి గది' సినిమా హిట్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. 'నాగ్' హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమా 'రాజు గారి గది-2' తెరకెక్కుతోంది. షూటింగ్ యమ స్పీడ్ గా జరిగి రిలీజ్ కి పోటీ పడబోతున్న ఈ సినిమాలో రీషూట్ యాస్పెక్ట్ ఎంట్రీ ఇచ్చింది. నాగ్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమా 'రాజు గారి గది-2'కి కూడా రీషూట్ సజెస్ట్ చేసినట్లు ఓ ఇంటర్వ్యూలో నాగ్ వెల్లడించడం విశేషం. ఈ సినిమాకు సంబంధించి తన పని పూర్తయిందని.. ఐతే రషెస్ చూశాక కొన్ని సన్నివేశాల విషయంలో సంతృప్తి చెందలేదని.. దర్శక నిర్మాతలకు ఆ సన్నివేశాలు రీషూట్ చేద్దామని చెప్పానని.. వాళ్లు సరే అన్నారని నాగ్ తెలిపాడు. మళ్లీ పది రోజుల పాటు ఈ సినిమా షూటింగులో పాల్గొనబోతున్నట్లు నాగ్ వెల్లడించడం విశేషం. ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పొట్లూరి వరప్రసాద్ నిర్మిస్తున్నారు.

09:57 - May 24, 2017

టాలీవుడ్ మన్మథుడు 'నాగార్జున' తనయుడు 'అఖిల్' మొదటి చిత్రం అనంతరం చాలా గ్యాప్ తీసుకున్నాడు. మొదటి చిత్రం అంతగా ఆకట్టుకోలేక పోయేసరికి చాలా రోజులు విరామం తీసుకుని రెండో సినిమాకు సన్నద్ధం అయిన సంగతి తెలిసిందే. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్ర షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. విక్రమ్ దర్శకత్వంలో 'మనం' చిత్రం రూపొందిన సంగతి తెలిసిందే. కానీ ఈ సినిమా షూటింగ్ ఆగిపోయిందని సోషల్ మాధ్యమాల్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అఖిల్ పై యాక్షన్ పార్ట్ షూటింగ్ జరిగిన అనంతరం నెక్ట్స్ షెడ్యూల్ హీరోయిన్ తో ఉన్నట్లు తెలుస్తోంది. కానీ హీరోయిన్ ఇంకా ఫైనల్ కాలేకపోవడంతో షూటింగ్ కు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే నలుగురి అమ్మాయిలను ఫైనలైజ్ చేసినట్లు..అందులో ఒకరిని సెలక్ట్ చేస్తారని టాక్. ఎవరనేది తేలిన తరువాత అఖిల్ సినిమాకు సంబంధించి రెండో షెడ్యూల్ స్టార్ట్ అవుతుందని తెలుస్తోంది.

11:13 - May 19, 2017

టాలీవుడ్ లో ఓ జంటపై సోషల్ మాధ్యమాల్లో రకరకాలైన వార్తలు వైరల్ అవుతుంటాయి. వారి సంబంధించని విషయాలపై అభిమానులు ఆసక్తి కనబరుస్తుంటారు. టాలీవుడ్ మన్మథుడు 'నాగార్జున' తనయుడు 'నాగ చైతన్య'..’సమంతల' వివాహం ఈ సంవత్సరంలో జరగనుందని తెలుస్తోంది. ఇటీవలే వారి నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. అయితే పలు సందర్భాల్లో దిగిన ఫొటోలను 'సమంత' సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తోంది. కానీ తనకు మాత్రం అలా చేయడం నచ్చదని 'నాగ చైతన్య' పేర్కొంటున్నట్లు తెలుస్తోంది. వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియాలో పంచుకోవడం నచ్చదని, కానీ శ్యామ్ మాత్రం ఫొటోలూ తీస్తూ పోస్టు చేస్తూ ఉంటోందన్నారు. కానీ అలా నచ్చకపోయినా తాను మాత్రం ఎంజాయ్ చేస్తున్నట్లు, పెళ్లికి ముందు ఈ ఎమోషన్స్..సెలబ్రేషన్స్ జీవితంలో ఒక్కసారి మాత్రమే వస్తాయని ఓ ఇంటర్వ్యూలో నాగ చైతన్య పేర్కొన్నట్లు సమాచారం. నాగ చైతన్య, రకూల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్న 'రారండోయ్ వేడుక చూద్దాం' సినిమా ఈనెల 26న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే.

10:48 - May 18, 2017

‘కంగ్రాట్స్ కోడలా' అంటూ 'సమంత'ను టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున అభినందించారు. నాగార్జున తనయుడు 'నాగ చైతన్య'..’సమంత'లు త్వరలో ఒక్కటి కాబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే వీరి ఎంగేజ్ మెంట్ జరిగింది. అనంతరం ఇరువురు పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా మారారు. నాగ చైతన్య, రకూల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్న 'రారండోయ్ వేడుక చూద్దాం' అనే సినిమా రూపొందుతోంది. ఈ సినిమా సాంగ్స్ ను యూ ట్యూబ్ లో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి నాగార్జున..సమంతల మధ్య ఫోన్ లో చాటింగ్ జరిగింది. ఈ చాటింగ్ జరిగిన తీరును నాగార్జున సోషల్ మీడియాలో పోస్టు చేశారు. 'కంగ్రాట్స్‌ కోడలా..' అని నాగార్జున పేర్కొంటే, 'లవ్‌ మామా' అని సమంత మెసేజ్‌ చేసింది. 'రారండోయ్‌ వేడుక చూద్దాం' సినిమాలో అక్కినేని నాగచైతన్య చాలా బాగున్నాడనీ, 'ఎవ్రిథింగ్‌ వర్క్స్‌' అని సమంత చెప్పుకొచ్చింది.

10:58 - May 17, 2017

చాలా ఏళ్ల తరువాత రీ ఎంట్రీ ఇచ్చి 'ఖైదీ నెంబర్ 150'తో తన సత్తా ఏంటో 'చిరంజీవి' చూపెట్టాడు. దీనితో నెక్ట్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంపైనే చిరు పూర్తిగా దృష్టి కేంద్రీకరించినట్లు తెలుస్తోంది. కానీ చిత్రం ఎప్పుడు ప్రారంభమవుతుందా ? విలన్..హీరోయిన్ ఎవరనే దానిపై అప్పుడే చర్చలు ప్రారంభమయ్యాయి. 'రామ్‌ చరణ్‌' మొన్న 'నాన్నగారి 151వ చిత్రం ఆగస్టులో ప్రారంభిస్తాం' అని స్వయంగా ప్రకటించినా నిర్ధిష్టమైన తేదీని మాత్రం వెల్లడించలేదు. తాజాగా ముహూర్తం ఖరారు చేసినట్లు టాక్. చిరంజీవి బర్త్ డే అయిన ఆగస్టు 22వ తేదీన చిత్రానికి క్లాప్ కొట్టవచ్చునని ప్రచారం జరుగుతోంది. రెగ్యులర్‌ షూటింగ్‌ మాత్రం సెప్టెంబర్‌ నుంచి మొదలు కానుందని, తెలుగు, తమిళ్‌ భాషల్లో నిర్మాణమయ్యే ఈ చిత్రానికి రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.

Pages

Don't Miss

Subscribe to RSS - నాగార్జున