నాదెండ్ల మనోహర్

14:54 - December 12, 2018

అమెరికా : జనసేనాని పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో భాగంగా పలు పర్యటలు  జరుపుతున్నారు. దీంట్లో భాగంగా పవన్ అమెరికాలోని వాషిగ్ టన్ లో పర్యటనకు వెళ్లారు. వాషింగ్టన్ లోని హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్ సెక్రటరీ బెన్ కార్సన్ తదితరులతో ఆయన భేటీ అయ్యారు. భేటీ అనంతరం పవన్ మాట్లాడుతూ, వెనుకబడ్డ ప్రాంతాల్లో పెట్టుబడులు రాబట్టేందుకు గల సాధ్యాసాధ్యాలపై బెన్ కార్సన్ తో చర్చించానని తెలిపారు. ఈ పర్యటనలో పవన్ తో పాటు ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు. కాగా రాష్ట్ర విభజన అనంతరం అజ్నాతంలోకి వెళ్లిపోయిన నాందెండ్ల భాస్కర్ రావు ఇటీవల జనసేన పార్టీలో చేరిన విషయం తెలిసిందే. కాగా రానున్న 2019 ఎన్నికల్లో పవన్ పోటీలోకి దిగనున్న నేపథ్యంలో వెనుకబడిన ప్రాంతాలో పర్యటించి వారి కష్టసుఖాలను తెలుసుకుంటున్న విషయం తెలిసిందే.దీంతో రానున్న ఎన్నికల్లో జనసేన అధికారంలోకి వస్తే తీసుకొవాల్సిన జాగ్రత్తలు..దానికి కావాల్సిన పెట్టుబడుల విషయంలో ఇప్పటి నుండే పవన్ ముందస్తుగా అమెరికా పర్యటనలో భాగంగా వాషింగ్ టన్ లోని హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్ సెక్రటరీ బెన్ కార్సన్ తదితరులతో ఆయన భేటీ అయినట్లుగా భావించవచ్చు.  

07:55 - October 27, 2018

గుంటూరు : జనసేన పార్టీలోకి చేరికలు షురూ అయ్యాయి. కానీ పార్టీలో చేరేవారు భిన్నరంగాలకు చెందినవారు కావటం విశేషం. ఈ నేపథ్యంలో  రిటైర్డ్ జడ్జ్ టీఎస్ రావు జనసేన పార్టీలో చేరారు. హైదరాబాద్‌లో పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. పవన్ ప్రకటించిన విజన్ డాక్యుమెంటులోని అంశాలు, జనసేన ఏడు సిద్ధాంతాలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయనీ.. కులాలను కలిపే ఆలోచనా విధానం, మతాల ప్రస్తావన లేని రాజకీయాలు అవసరమని ఈ సందర్బంగా ఆయన పేర్కొన్నారు. రైతు సమస్యలు, భూ సంస్కరణల అమలు తీరుపై తనకున్న అవగాహన, అనుభవాన్ని పార్టీ కోసం వినియోగిస్తానని అన్నారు. కార్యక్రమంలో పార్టీ నేతలు నాదెండ్ల మనోహర్, ప్రధాన కార్యదర్శి ముత్తంశెట్టి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
 

10:18 - October 13, 2018

విజయవాడ:ఆంధ్రప్రదేశ్ లో అధికార తెలుగుదేశం పార్టీ నాయకుల అవినీతిని ప్రశ్నిస్తూ, ప్రభుత్వంలోని అవకతవకలు ఎత్తి చూపుతూ నిత్యం జనంతో మమేకమై రోడ్ షోలు నిర్వహిస్తున్న జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  విజయవాడ పార్టీ కార్యాలయాన్నిశనివారం ప్రారంభించారు. మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ తో  కలిసి  బెంజిసర్కిల్ లో  ఏర్పాటు  చేసిన కార్యాలయాన్నిఈఉదయం ఆయన ప్రారంభించారు. ఈకార్యక్రమంలో పార్టీకి చెందిన పలువురు నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో అధికార టీడీపీ, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలకు గట్టి పోటీ ఇవ్వనున్న జనసేన పార్టీలోకి ఇప్పటికే  ఇతర పార్టీల నుంచి నాయకుల వలసలు మొదలయ్యాయి. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే సరికి ఇంకెంత మంది జనసేన పార్టీలో చేరతారో వేచి చూడాలి.  

21:40 - October 12, 2018

విజయవాడ : వెంకటేశ్వరస్వామి సన్నిధిలో మనస్ఫూర్తిగా నాదెండ్ల మనోహర్ జనసేనలో చేరారని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రజలకు అండగా ఉండటానికి బలమైన కుటుంబం కావాలన్నారు. పార్టీని ముందుకు నడిపించడానికి బలమైన వ్యక్తిత్వమున్న వ్యక్తులు కావాలని..ఆలాంటి వ్యక్తి నాదేండ్ల మనోహర్ అని పవన్ తెలిపారు. పార్టీలో నాదెండ్ల తనకు పెద్దన్నలాంటి వారని కొనియాడారు. 

 

14:40 - October 11, 2018

విజయవాడ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్పీకర్‌గా ఉన్న నాదెండ్ల మనోహర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన జనసేనలో చేరబోతున్నారు. ఆయన పార్టీలో చేరితే కృ‌ష్ణా, గుంటూరు జిల్లాలో సామాజిక సమీకరణాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలున్నాయి. కానీ నాలుగేళ్లుగా పవన్‌తో నాదెండ్ల మైత్రి పూర్వక సంబంధం కొనసాగిస్తున్నారు. పవన్ నిర్వహించే సభలు..సమావేశాలకు మనోహర్ సూచనలు చేస్తున్నారు. జనసేన భావజాలం, పవన్ వ్యక్తిత్వం..నాదెండ్ల నిర్ణయానికి దోహదం చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కులాల మధ్య సఖ్యత పెంచాలని ఇరువురి మధ్య ఏకాభిప్రాయం ఉందనే చెప్పవచ్చు. అంతేగాకుండా జనసేనకు దూరంగా ఉన్న సామాజిక వర్గాన్ని అక్కున్న చేర్చుకొనే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. నాదెండ్ల మనోహర్ వ్యక్తిగతంగా వివాదరహితుడిగా పేరొందారు. మరి నాదెండ్ల ఎంతమేరకు సక్సెస్ అవుతారు ? ఆయనకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తారా ? లేదా ? అనేది చూడాలి. 

12:18 - October 11, 2018

హైదరాబాద్: ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ కాంగ్రెస్‌కు మరో షాక్ తగిలింది. కాంగ్రెస్ సీనియర్ నేత, ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ జనసేనలో చేరనున్నారు. రేపు తిరుపతిలో పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆయన జనసేన కండువా కప్పుకోనున్నారని వార్తలు వస్తున్నాయి. 

న‌వ‌త‌రం రాజ‌కీయాలే ల‌క్ష్యంగా నాదెండ్ల‌ మ‌నోహ‌ర్ జ‌న‌సేన పార్టీలో చేర‌నున్నారని తెలుస్తోంది. అక్టోబ‌ర్ 12న అందుకు ముహుర్తం ఖ‌రార‌య్యింది. జ‌న‌సేన చీఫ్ పవన్, మ‌నోహ‌ర్ మధ్య కొంతకాలంగా స్నేహం కొన‌సాగుతోంది. జ‌న‌సేన పార్టీ ఆవిర్భావం నాటి నుంచి జ‌న‌సేన సైద్దాంతిక విధానాలపై ప‌వ‌న్‌‌తో మనోహర్  మాట్లాడుతూనే ఉన్నారు. గత నాలుగేళ్లుగా జ‌న‌సేన పార్టీ స‌భ‌లు, ప‌వ‌న్‌ ప్ర‌సంగాల‌ని కూలంకుషంగా ప‌రిశీలిస్తూ త‌న అభిప్రాయాల‌ని తెలియ‌జేస్తున్నారు. పవన్ భావ‌జాలం, నాదెండ్ల‌ మ‌నోహ‌ర్‌ రాజ‌కీయ ల‌క్ష్యాలు ఒకే విధంగా ఉండ‌డంతో, వీరిద్ద‌రి మైత్రి మ‌రింత బ‌ల‌ప‌డింది. రాజ‌కీయ విలువ‌లు, ఉన్న‌త ల‌క్ష్యాలు క‌లిగిన మ‌నోహ‌ర్ రాక‌తో జ‌న‌సేన పార్టీ మ‌రింత బ‌లోపేతం అవుతుంద‌ని పార్టీ వ‌ర్గాలు భావిస్తున్నాయి. 

11:54 - May 2, 2018

బెంగళూరు : కర్నాటకలో మరోసారి అధికారంలోకి కాంగ్రెస్ వస్తుందని ఆ పార్టీ నేత, మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ అన్నారు. ఈమేరకు ఆయన టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. కర్నాటకలో ఉన్న తెలుగువారు కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉన్నారని తెలిపారు. అవినీతి ఆరోపణలున్న బీజేపీ నేతలను ప్రజలను నమ్మరని చెప్పారు. జనతాదళ్ (ఎస్) పై ప్రజల్లో నమ్మకం లేదన్నారు. అవినీతి కేసుల్లో ఉన్న గాలి జనార్ధన్ రెడ్డి కుటుంబానికి బీజేపీ టిక్కెట్లు ఇస్తోందని చెప్పారు.

 

08:25 - June 4, 2017

గుంటూరు : ప్రత్యేక హోదా వస్తేనే ఏపీ అభివృద్ధి జరుగుతుందని మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఆదివారం జిల్లాలో ప్రత్యేక హోదా పేరిట ఓ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. రాహుల్..పలువురు జాతీయ నేతలు సభకు హాజరౌతున్నారు. ఈసందర్భంగా టెన్ టివితో నాదెండ్ల మనోహర్ ముచ్చటించారు. ప్రత్యేక హోదాను టిడిపి..బీజేపీ పార్టీలు విస్మరించాయని, ప్యాకేజీని ఒప్పుకోవడం ద్వారా ఏపీకి తీరని అన్యాయం జరిగిందన్నారు. పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీని ఎన్డీయే అమలు చేయలేదని తెలిపారు. హోదా ముగిసిన అధ్యాయమని నీతి ఆయోగ్ ప్రకటన చేసిందని, ఇలా చేయడం సరికాదన్నారు. అఖిలపక్షాన్ని ప్రధాన మంత్రి దగ్గరకు తీసుకెళ్లాలని మూడు సంవత్సరాలుగా చెప్పడం జరిగిందని కానీ అలా చేయడం లేదన్నారు. ప్యాకేజీ..విషయంలో చట్టబద్ధత కల్పించలేదని, ప్రజలను అయోమయంలోకి గురి చేస్తున్నారని విమర్శించారు. 2016లో మార్చి రాజమండ్రి పర్యటనలో ఏపీకి లక్షా 40వేల కోట్లు ఇచ్చినట్లు అమిత్ షా పేర్కొన్నారని, టిడిపి నేత ఒక్కరూ కూడా స్పందించలేదని..ప్రభుత్వం కూడా వివరణ ఇవ్వలేదన్నారు. అనంతరం వేరే సభలో లక్షా 75వేల కోట్లు సహాయం చేశామని అమిత్ షా పేర్కొంటే రూ. 2.36 కోట్ల సహాయం చేశామని వెంకయ్య నాయుడు పేర్కొన్నారని గుర్తు చేశారు. ప్రభుత్వం పంపించిన ప్రతిపాదనలపై రిలీజ్ చేసింది పది శాతమేనని తేలిందని నాదెండ్ల మనోహర్ తెలిపారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

Don't Miss

Subscribe to RSS - నాదెండ్ల మనోహర్