నాని

19:27 - April 14, 2018

సందీప్ కిషన్ హీరోగా వచ్చిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజా సినిమాలతో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న మేర్లపాక గాంధీ కృష్ణార్జున యుద్ధం సినిమాలో రియల్ స్టార్ నానితో డ్యుయల్ రోల్ చేయించి మరో బిగ్గెస్ట్ సక్సెస్ ను అందుకున్నాడు. ఈ సినిమాలో మాస్ క్యారెక్టర్ లో చిత్తూరు జిల్లా యాసతో నాని చితక్కొట్డాడు. ఆ యాసతో ఇప్పటివరకూ పెద్దగా సినిమాలు రాలేదు. దాన్ని గమనించిన గాంధీ తన స్థానిక యాసతో మరో హిట్ ను కాదు కాదు బిగ్గెస్ట్ హిట్ ను అందుకున్నాడు. ప్రముఖ సినీ రచయిత మేర్లపాక మురళికి గాంధీ కుమారుడు కూడా. చిత్తూరు జిల్లా, రేణిగుంట మండలం, వెదుళ్ళచెరువు గ్రామంలో జన్మించిన గాంధీ..సినిమాలపై వున్ ఆసక్తితో చెన్నైలోని ఎల్. వి. ప్రసాద్ సంస్థలో సినిమా రంగానికి చెందిన మెలకువలు నేర్చుకున్నాడు. ఆ తర్వాత హైదరాబాదుకు వచ్చి 2013 లో వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో దర్శకుడిగా ప్రయానం ప్రారంభించి తన ప్రతిభతో వరుస హిట్స్ ను అందుకుంటున్నాడు. తండ్రి మేర్లపాక మురళి ప్రముఖ రచయిత మరియు విలేఖరి. ప్రముఖ వార్తా పత్రిలకు పనిచేశాడు. ఆయన రాసిన 24 నవలలు స్వాతి వారపత్రికలో ప్రచురించబడ్డాయి. ఈయనకు చే గువేరా అంటే అభిమానం ఉండటంతో కుమారుడికి అదే పేరు పెట్టాడు, కానీ ఊర్లోని వాళ్ళకి ఆ పేరు పలకడం చేతకాకపోవడంతో అతని ఐదో యేట గాంధీ అని పేరు మార్చాడు. 

19:28 - April 12, 2018

వరుస విజయాలతో దూసుకుపోతున్న నాని ఈసారి ఏకంగా డ్యూయల్ రోల్ లో కృష్ణార్జున యుద్ధం అనే సినిమా చేశాడు.. నాని హీరోగా, రెండు హిట్లు ఇచ్చిన.. మెర్లపాక గాంధి డైరక్టర్ గా మంచి రైజింగ్ లో ఉన్న దిల్ రాజు.. రిలీజ్ అనగానే ఈ సినిమా గ్యారంటీగా సక్సెస్ అని ఫిక్స్ అయిపోయారు ఆడియన్స్.. మరి ఆ రేంజ్ అంచనాలతో థియేటర్స్ లోకి వచ్చిన కృష్ణార్జునుడు ఏ రేంజ్ సక్సెస్ అందుకున్నాడు.. వాళ్ల యుద్ధం లో ఎలాంటి సక్సెస్ సాధించాడు ఇప్పుడు చూద్దాం..

 

కథ విషయానికి వస్తే.. ఒక మారుమూల పల్లెటూరిలో ఆడుతూ పాడుతూ జీవితాన్ని గడివేసే కృష్ణను అతని బిహేవియర్ వల్ల ఏ అమ్మాయి ప్రేమించదు..కాని హైదరాబాద్ నుండి వచ్చిన రియా కృష్ణను ప్రేమిస్తుంది... అలాగే యూరప్ లో రాక్ స్టార్ గా ఉన్న అర్జున్ ప్లే భాయ్.. కాని ఇండియా నుండి వచ్చిన సుబ్బలక్ష్మీని చూసి సిన్సియర్ గా లవ్ చేస్తాడు.. కాని ఆమె అర్జున్ ను రిజక్ట్ చేసి హైదరాబాద్ కి వస్తుంది... ఇక రియాతో కూడా కృష్ట నీకు కరెక్ట్ కాదు అని, ఆమెను బలవంతంగా హైదరాబాద్ కు పంపిస్తాడు వాళ్ళ తాత.. అలా హైదరాబాద్ వచ్చిన రియా, సుబ్బలక్ష్మీ ఇద్దరూ కనపడకుండా పోతారు.. అసలు వాళ్ళు ఏమైయ్యారు... కృష్ణ, అర్జున్ ఇద్దరూ ఎలాంటి పరిస్థితుల్లో కలుసుకున్నారు.. చివరికి రియా,సుబ్బలక్ష్మీలను ఎలా కాపాడుకున్నారు.. లాంటి విషయాలు సినిమా చూసి తెలుసుకోవలసిందే..

 

నటీనటుల విషయానికి వస్తే.. మినిమమ్ కంటెంట్ ఉన్న సినిమాను కూడా తన నాచ్యూరల్ ఫర్ఫామెన్స్ తో నిలబెట్టేస్తాడు అనే పేరున్న నాని,... ఈ సినిమాలో కూడా అలాంటి ప్రయత్నమే చేశాడు.. కెరీర్ లో రెండో సారి డ్యూయల్ రోల్ చేసిన నాని రెండు పాత్రల మధ్య వేరియేషన్స్ చూపిస్తూ.. ఆ రెండు పాత్రలను ఆడియన్స్ కి కనెక్ట్ చేయడానికి చాలా హర్డ్ వర్క్ చేశాడు.. అయితే... కృష్ట పాత్రలో కల్లకపటం లేని పల్లెటూరి.. అబ్బాయిగా ఒదిగిపోయి.. ఫుల్ ఫన్ ను జనరేట్ చేసిన నాని.. ప్లేబయ్ తరహా రాక్ స్టార్ గా మాత్రం అంత ఇంపాక్ట్ చూపించలేకపోయాడు.,. అతనికి ఉన్న నాచ్యూరల్ స్టార్ అనే టాగ్ వల్ల.. రాక్ స్టార్ క్యారక్టర్ లో ఉన్న నెగెటీవ్ టచ్.. అంతగా ఎలివేట్ కాలేదు.. ఇక స్టైలింగ్ కూడా చాలా సాధాసీదాగా అనిపిస్తుంది.. కృష్ట పాత్ర మాత్రం సినిమాను కాపాడే ఎలిమెంట్ గా నిలిచింది.. ఇక ఇప్పటి వరకు పర్ఫామెన్స్, క్యారక్టర్ లో అలరించిన అనుపమా పరమేశ్వరన్ లిమిటెడ్ ప్రజన్స్ ఉన్న రోల్ లో కనిపించింది... మరో హీరోయిన్ రుక్సార్ మీర్ కూడా స్క్రీన్ ప్రజన్స్ పరంగా, పర్ఫామెన్స్ పరంగా.. జస్ట్ ఓకే అనిపిస్తుంది.. ఇక గాంధీ సినిమాలకు కామెడీ బ్యాక్ బోన్ గా మంచి సపోర్ట్ ఇస్తున్న బ్రహ్మాజీ ఈ సినిమాలో కూడా హిల్లేరియస్ కామెడీని జనరేట్ చేసే క్యారక్టర్ పడటంతో, ఆ పాత్రకు అతను పూర్తి న్యాయం చేశాడు.. అతను చేసిన కామెడీ ఫస్ట్ ఆఫ్ కి హైలెట్ అని చెప్పవచ్చు.. ఇక యూట్యూబ్ స్టార్స్ కాస్త ఇంపార్టెట్స్ ఉన్న క్యారక్టర్స్ లో కనిపించి.. పర్వాలేదు అనేలా నవ్వించారు.. ఇక మిగతా నటీనటులు అంతా, పాత్రల పరిది మేరా డీసెంట్ పర్ఫామెన్స్ ఇచ్చారు...

 

ఇక టెక్నీషియన్స్ విషయానికి వస్తే.. రైటర్ గా డైరక్టర్ గా మొదటి రెండు సినిమాలతో గ్రాండ్ హిట్స్ అందుకున్న గాంధీ ఈ సినిమాకు కూడా మంచి స్పానూ ఉన్న స్టాండెడ్స్ సెంట్రల్ పాయింట్ ను కథగా ఎంచుకున్నాడు.. కాని మొదటి రెండు సినిమాలలా స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేయడం కాని, టెంపోను మెంటేయిన్ చేయడంలో కాని బాగా తడబడ్డాడు. ఫస్ట్ ఆఫ్ సినిమాను నాని నిలబెట్టలేసినా... రెండో ఆఫ్ వచ్చేసరికి.. ఊహాజనితమైన కథ. సో సో గా సాగే స్క్రీన్ ప్లేతో సినిమా సైడ్ ట్రాక్ అయిపోయింది.. రచయితగా అక్కడక్కడా మెరిసిన గాంధీ..డైరక్టన్ పరంగా ఓకే అనిపించుకున్నాడు... స్క్రీన్ ప్లే పంరంగా మరింత కసరత్తు చేసి ఉంటే బెటర్ రిజల్ట్ వచ్చి ఉండేది,.. ఇక డైరక్టర్స్ కి ఫుల్ సపోర్డ్ ఇచ్చే. వ్యూ ఉన్న కెమేరా మెన్ కార్తీక్ ఘట్టమనేని ఈ సినిమా విజ్యూవల్స్ పరంగా ఫుల్ క్రెడిట్ ఇవ్వచ్చు.. రెండు క్యారక్టర్స్ మధ్య వేరియేషన్స్ చూపించడంలో, యూరప్ అందాలను కెమేరాలో బంధించడంలో, క్యారక్టర్స్ లోని ఎమోషన్స్ ఆడియన్స్ కి కనెక్ట్ చేయడంలో.. అతను పెట్టిన ఎఫర్ట్ స్క్రీన్ పై కనిపించింది.. ఇక మ్యూజిక్ డైరక్టర్ హిప్ హాప్ తమిళ్ ఈ సినిమాకు కాస్త తమిళ్ టచ్ ఉన్న మ్యూజిక్ ఇచ్చాడు.. దృవ సినిమాకు తన మ్యూజిక్ తో మంచి హైప్ తెచ్చిన హిప్ హాప్ తమిళ్ ఈ సినిమా వరకు మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయాడు.. పాటలలో తమిళ వాసన, ఆర్ ఆర్ లో రొటీన్ నెస్ కనిపించాయి.. ఆర్ట్స్ డైరక్టర్ సాయి సురేష్.. ఎడిటర్ సత్య తమ క్రాఫ్ట్స్ లో బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చారు.. నిర్మాణ విలువలు బాగున్నాయి..

ఓవర్ ఆల్ గా చెప్పాలి అంటే.. ఒక క్యారక్టర్ తోనే సినిమాను నిలబెట్టేసే నాని.. ఈ సినిమాలో రెండు క్యారక్టర్స్ చేసినప్పట్టికీ.. పెద్దగా ఇంపాక్ట్ లేని కథ. ఊహాజనితమైన స్క్రీన్ ప్లే ఉండటంలో అక్కడక్కడ చూస్తూ ఉండిపోవలసి వచ్చింది.. తనకు స్కోప్ ఉన్నంతలో బెస్ట్ప్ పర్ఫమెన్స్ ఇచ్చిన నాని ప్రయత్నం.. ఎంత వరకు మైలేజ్ ఇస్తుందో, బాక్సీఫీస్ దగ్గర ఎలాంటి ఫలితం వస్తుందో తెలియాలి అంటే వేచి చూడాల్సిందే..

 

 

ప్లస్ పాయింట్స్

కృష్ట క్యారక్టరైజేషన్

కెమెర వర్క్

బ్రహ్మాజీ కామెడి

ప్రొడక్షన్ వాల్యూస్

మైనస్ పాయింట్స్

రొటీన్ కథ

అర్జున్ క్యారక్టర్

మెరుపులు లేని స్క్రీన్ ప్లే

పేలని విలేజ్ కామెడి

 

13:36 - February 26, 2018

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రాజకీయంలో బీజిగా మారడంతో పవన్ కోసం వేచి చూస్తున్న అనేక మందికి డైరెక్టర్లకు నిరాశ మిగిలింది. పవన్ ఇక నుంచి సినిమాలు చేయడంలేదని ప్రకటించడం వీరికి నిరాశకు కారణం. పవన్ సినిమాకు డైరెక్ట్ చేయడానికి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్ పవన్ ప్రకటన తో బాధలో పడ్డారట. అయితే అదే స్టోరీని నానీ హీరో గా మైత్రి మూవీస్ బ్యానర్ లో చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది. పవన్ కోసం రాసిని స్టోరీ దర్శకుడు నాని వినిపించినట్టు దానికి నాని ఓకే చెప్పినట్టు తెలిసింది.

16:22 - February 21, 2018

తెలుగు ఇండస్ట్రీలో వస్తున్న కొత్త టాలెంట్ ఇప్పుడు హిట్ ట్రాక్ లో నడుస్తుంది. చిన్న చిన్న సినిమాలతో హిట్ కొట్టి ఇప్పుడు వరుస అవకాశాలను అందుకుంటున్నారు. కొత్త డైరెక్టర్స్ హావా పెరుగుతుంది. ఇండస్ట్రీ లో కొత్త డైరెక్టర్స్ కి మంచి అవకాశాలు వస్తున్నాయి. రీసెంట్ గా చిన్న సినిమాగా వచ్చి హిట్ కొట్టిన 'చలో' సినిమా కూడా కొత్తడైరెక్టర్ వెంకీ కుడుములు నుండి వచ్చిందే. యంగ్ హీరో నాగ శౌర్య హీరోగా రష్మిక హీరోయిన్ గా వెంకీ కుడుముల డైరెక్షన్ లో ఉష మూల్పూరి నిర్మాతగా వచ్చిన ఈ లవ్ అండ్ ఎంటర్టైనర్ 'చలో' సినిమా కలక్షన్స్ బాగా రాబట్టింది.

యూత్ ఫుల్ లవ్ సబ్జక్ట్స్ కి రైటర్ గా ఉంటూ ..కొత్తదనం ఉన్న స్టోరీ లైన్స్ మీద వర్క్ చేసిన వెంకీ అట్లూరి డైరెక్షన్ లో వచ్చిన ఫ్రెష్ లవ్ స్టోరీ ఈ 'తొలిప్రేమ' సినిమా. ఫ్రెష్ లవ్ స్టోరీస్ వచ్చి చాల రోజులైంది అని వెయిట్ చేసే ఆడియన్స్ కోసం కొత్త తరహా లవ్ స్టోరీ ని ప్రెజెంట్ చేసాడు వెంకీ అట్లూరి. నటుడిగా రైటర్ గా పరిచయం ఉన్న వెంకీ అట్లూరి ఇప్పుడు డైరెక్టర్ గా మారి హిట్ కొట్టాడు.

షార్ట్ ఫిలిం డైరెక్టర్ గా కెరీర్ స్టార్ట్ చేసి ఇప్పుడు పెద్ద స్క్రీన్ కి పరిచయం అయ్యాడు ప్రశాంత్ వర్మ. కథానాయకుడిగా వరుస విజయాలతో దూసుకెళ్తున్న నాని.. నిర్మాతగా మారి ప్రశాంత్ వర్మను దర్శకుడిగా పరిచయం చేస్తూ తీసిన సినిమా 'అ!’. విభిన్నమైన.. ఆసక్తికర ప్రోమోలతో ఈ చిత్రం ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ తీసుకొచ్చింది. హిట్ ట్రాక్ తో కలక్షన్స్ రాబడుతుంది ఈ సినిమా. 

12:59 - February 16, 2018

తెలుగు సినిమాల్లో స్పీడ్ పెరిగింది. కొత్త కొత్త కథలతో న్యూ టాలెంట్ ఫ్లో బాగా వస్తుంది. వెరైటీ సినిమాలతో ఆడియన్స్ అలరించడానికి ఈ వారం కూడా రెండు ఇంటరెస్టింగ్ సినిమాలు ట్రాక్ లో ఉన్నాయ్. మరి ఈ వారం ఈ సినిమాల టాక్ ఎలా ఉంటుంది అనేది ఆడియన్స్ ఛాయిస్.

వెరైటీ కాన్సెప్ట్ తో రాబోతున్న సినిమా 'అ!'. కథలో కొత్తదనం ఉన్న సినిమాగ ట్రైలర్ టీజర్ చూస్తే తెలుస్తుంది. నాచురల్ స్టార్ నాని 'అ!' సినిమా నిర్మిస్తున్నాడు. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను వాల్ పోస్టర్ బ్యానర్ పై నానియే స్వయంగా ప్రొడ్యూస్ చేశాడు. 'అ!' సినిమాలో కాజల్ అగర్వాల్.. నిత్య మీనన్.. రెజీనా కెసాండ్రా.. ఈషా రెబ్బా నాయికలుగా నటిస్తున్నారు. ఇందులో వీళ్లందరివీ డిఫరెంట్ రోల్స్. ఈ సినిమా శుక్రవారం రిలీజ్ అయ్యింది.

మహేష్ బాబు అక్కగానే కాక నటిగా కూడా సుపరిచితురాలు 'మంజుల ఘట్టమనేని'. కృష్ణ గారి ముద్దుల కూతురిగా మాత్రమే కాక ఒక మంచి నిర్మాతగా కూడా ఈమె టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమే. తను దర్శకత్వం వహిస్తోన్న తొలి చిత్రంగా మన ముందుకు రాబోతోంది 'మనసుకు నచ్చింది'. ఈ సినిమా లో సందీప్ కిషన్ - అమైరా దస్తూర్ ముఖ్య తారాగణం. ట్రైలర్ తోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ సినిమా కూడా రిలీజ్ అయ్యింది. మరి ఏ సినిమా ప్రేక్షకాదరణ పొందిందో రానున్న రోజుల్లో తెలియనుంది. 

10:40 - February 16, 2018

టాలీవుడ్ నేచురల్ స్టార్ గా పేరొందిన నటుడు 'నాని'. దర్శకులకు ఇతను ఓ వరంలా మారిపోయాడు. ఇతను నటించిన సినిమాలు వరుసుగా విజయవంతం అవుతూ వస్తున్నాయి. తాజాగా ఇతను నిర్మాతగా మారిపోయాడు. వాల్ పోస్టర్ అనే బ్యానర్ ను ఏర్పాటు చేసి సినిమా తీశాడు. వైవిధ్యమైన కథతో సినిమా తీయడం జరిగిందని 'నాని' పేర్కొనడంతో చిత్రంపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. 'నాని' నిర్మాతగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'అ!'లో నిత్యా మీనన్, కాజల్ అగర్వాల్, రెజీనా, ఈషా రెబ్బ, శ్రీనివాస్ అవసరాల, ప్రియదర్శి, మురళి శర్మ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా నేడు నేడు (ఫిబ్రవరి 16న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

చిత్ర ఫస్ట్ లుక్..టీజర్..ట్రైలర్ లు చిత్రంపై ఆసక్తిని పెంచాయి. చిత్ర టైటిల్ కూడా వైవిధ్యంగా ఉండడంతో..సినిమా కూడా అంతేస్థాయిలో ఉంటుందని ప్రేక్షకులు ఊహిస్తున్నారు. శుక్రవారం రిలీజైన ఈ చిత్రంపై మంచి టాక్ వినిపిస్తోందని తెలుస్తోంది. సినిమా అద్భుతంగా ఉందంటూ సోషల్ మాధ్యమాల్లో కామెంట్స్ కనిపిస్తున్నాయి. మరి ఈ సినిమా ఎలా ఉంది ? మరింత విశేషాల కోసం టెన్ టివిలో సాయంత్రం ప్రసారమయ్యే 'టెన్ టివి ఫర్ ఫెక్ట్ షో'లో చూడండి. 

10:23 - February 16, 2018

సినీ ఇండస్ట్రీ అంటేనే లక్కుతో ముడిపడి ఉంటుంది. హార్డ్ వర్క్ టాలెంట్ తో పాటు అదృష్టం కూడా ఉంటె ఈ ఇండస్ట్రీ లో అవకాశాలకు కొదువు ఉండదు. తన మొదటి సినిమాతో హిట్ కొట్టిన డైరెక్టర్ ని ఇప్పుడు స్టార్ హీరోలు పిలిచి మరి ఆఫర్స్ ఇస్తున్నారట. మారుతున్న ట్రెండ్ ని ఫాలో అవుతూ హిట్ ట్రాక్ లో ఉన్నాడు నాని. తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటుడు నాని ఈ మధ్య సినిమాలన్నీ ఆడియన్స్ కి రీచ్ అయ్యేలా ప్లాన్ చేసుకున్నాడు. రీసెంట్ గా 'ఎంసి ఏ' అంటూ వరుస విజయాలతో దూసుకువెళ్తున్నాడు ఈ యంగ్ హీరో. మంచి నటుడిగా గుర్తింపు ఉన్న సరే కమర్షియల్ గా ఒక మంచి హిట్ కోసం చూస్తున్న యంగ్ హీరో 'శర్వానంద్'. వరుస విజయాలతో మంచి జోరు మీదున్న హీరో 'శర్వానంద్' కి 'మహానుభావుడు' సినిమా మరో హిట్ గా మారింది. రెగ్యులర్ సినిమాలకు బై బై చెప్పి ఎప్పుడైతే డిఫెరెంట్ సినిమాలను చెయ్యడానికి ఫిక్స్ అయ్యాడో అప్పటినుండి 'శర్వానంద' కి మంచి హిట్స్ పడుతున్నాయి.

ఇటీవల చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ అయింది 'ఛలో'. ఈ సినిమా డైరెక్టర్ వెంకీ. రీసెంట్ గా ఛలో సినిమాతో విజయం అందుకున్న వెంకీ కుడుముల కూడా ఇప్పుడు యంగ్ హీరోలకి డైరెక్టర్ గామారాడు. త్రివిక్రమ్ దగ్గర ఒకప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసిన వెంకీ 'ఛలో' సినిమాలో మంచి ఎంటర్టైన్ ని అందించాడు. రీసెంట్ గా 'నాని - శర్వానంద్' 'ఛలో' సినిమా చూసి చాలా ఇంప్రెస్ అయ్యారట. దీంతో సరికొత్త కథలు ఇంకేమైనా ఉంటే చూడు చేయడానికి సిద్ధమే అని ఇద్దరు హీరోలు ఓ సిగ్నల్ ఇచ్చారట. ఇది మేటర్....

12:55 - February 15, 2018

వెరైటీ పాత్రలతో అలరిస్తున్న యంగ్ హీరో నటుడిగా క్లిక్ అయి ఇప్పుడు ప్రొడక్షన్ లో అడుగు పెట్టి ఇంటరెస్టింగ్ సినిమాతో రాబోతున్నాడు. అటు నటుడిగా ఇప్పుడు ప్రేసెంటెర్ గా రెండు రోల్స్ లో కనిపించబోతున్నాడు. తెలుగు ఇండస్ట్రీ లో నాచురల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న 'నాని' కెరీర్ స్టార్టింగ్ లో వెరైటీ పాత్రలతో అలరించాడు. 'ఈగ' సినిమాలో తన పాత్ర మొత్తం 'ఈగ' లాగ మారిపోయినా కానీ అభ్యంతరం చెప్పకుండా ఆ రోల్ చేసాడు నాని. ఇలా వైవిధ్యమైన సినిమాలు చేస్తూ తనకంటూ తెలుగు ఆడియన్స్ మైండ్ లో మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. పెర్ఫార్మన్స్ వైజ్ గా 'జండాపై కపిరాజు' లో యాక్టింగ్ కి అద్దం పెట్టె సినిమా అని చెప్పొచ్చు.

నటుడిగా కాకుండా ఇప్పుడు ప్రొడ్యూసర్ గా మారాడు 'నాని'. రెండు చేతుల డబ్బులు సంపాదించడానికి స్కోప్ ఉన్నపుడు ఎవరు మాత్రం కాదంటారు. వెరైటీ కాన్సెప్ట్ తో రాబోతున్న సినిమా 'అ’. నాచురల్ స్టార్ నాని ఈ సినిమా నిర్మిస్తున్నాడు. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను వాల్ పోస్టర్ బ్యానర్ పై నానియే స్వయంగా ప్రొడ్యూస్ చేశాడు. 'అ!’ సినిమాలో కాజల్ అగర్వాల్.. నిత్య మీనన్.. రెజీనా కెసాండ్రా.. ఈషా రెబ్బా నాయికలుగా నటిస్తున్నారు. ఇందులో వీళ్లందరివీ డిఫరెంట్ రోల్స్.

17:00 - February 2, 2018

నాగార్జున .. నాని కాంబినేషన్ లో మల్టీ స్టారర్ చిత్రం తెరకెక్కనుంది. నాగార్జున .. నాని కాంబినేషన్లో ఒక మల్టీ స్టారర్ రూపొందనున్నట్టు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించనున్న ఈ సినిమాని అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందా అనే ఆసక్తితో అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాను వచ్చేనెల 24వ తేదీన సెట్స్ పైకి తీసుకెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారు. నాగార్జున మాఫియా డాన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో, నాని డాక్టర్ గా కనిపించనున్నాడు. ఈ సినిమా కోసం కథానాయికల పేర్లను పరిశీలిస్తున్నారు. త్వరలోనే ఎంపిక చేసిన కథానాయికల పేర్లను వెల్లడించనున్నారు. కామెడీ ఎంటర్టైనర్ గా నిర్మితమవుతోన్న ఈ సినిమాను వేసవి సెలవుల్లో విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.  

12:00 - December 31, 2017

'నాని'...టాలీవుడ్ దర్శక..నిర్మాతలకు వరంగా మారిపోయాడు. ఆయన నటించిన సినిమాలన్నీ వరుసగా విజయవంతమవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన నటించిన 'ఎంసిఏ' మిడిల్ క్లాస్ అబ్బాయి చిత్రం డివైడ్ టాక్ పొందినా భారీగా కలెక్షన్లు సాధిస్తూ ముందుకెళుతోంది. ఈ సినిమా షూటింగ్ కొనసాగుతుండగానే 'మేర్లపాక గాంధీ' చిత్రంలో కూడా నాని నటిస్తున్నాడు. ఇందులో నాని డబుల్ రోల్ పాత్ర పోషిస్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ సినిమాకు 'కృష్ణార్జున యుద్ధం' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. బోయనపల్లి సమర్పణలో షైన్‌ స్క్రీన్న్‌ పతాకంపై సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మిస్తున్నారు. 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌', 'ఎక్స్‌ప్రెస్‌ రాజా' చిత్రాల దర్శకుడు మేర్లపాక దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతోంది. వెంకట్‌ అనుపమ పరమేశ్వరన్‌, రుఖ్సార్‌ మీర్‌ నాయికలుగా నటిస్తున్నారు.

ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకొంటోంది. ఈ షెడ్యూల్ లో కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ తో చిత్ర షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్‌ 12న గ్రాండ్‌ రిలీజ్‌ చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. 

Pages

Don't Miss

Subscribe to RSS - నాని