నితిన్

06:39 - September 25, 2018

ఢిల్లీ : భారత్‌లో దోచుకున్నవాడికి దోచుకున్నంతగా అన్న చందంగా మారిపోయింది. స్కామ్ లు, ప్రజాధనాన్ని దోచుకునే తెలివితేటలు వుంటే చాలు లక్షలాది కోట్లు దోచేసుకోవచ్చు. దానికి కావాల్సిందల్లా నేతల అండదండులంటే చాలు. మరే పెట్టుబడి అవరమేలేదు. వేలాది, లక్షలాది కోట్లు దోచేసుకుని బడా వ్యాపారస్తులా చలామణి అవుతు విదేశాలకు చెక్కేస్తున్నారు. దీని ప్రభుత్వం కూడా తమ వంతుగా సహకరిస్తున బడాబాబులు కొమ్ముకాస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ లో మరో విజయ్ మాల్యా ఉదంతం వెలుగులోకి వచ్చింది. 
వ్యాపారవేత్త విజయ్ మాల్యా, వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ తరహాలోనే మరో వ్యాపారవేత్త ప్రభుత్వ రంగ బ్యాంకులకు షాకిచ్చాడు. ఆంధ్రాబ్యాంకు నేతృత్వంలోని కన్సార్టియం నుంచి రూ.5,383 కోట్ల రుణం తీసుకున్న స్టెర్లింగ్ బయోటెక్ అధినేత నితిన్ సందేశర భారత్ నుంచి నైజీరియాకు చెక్కేశాడు. ఇప్పటికే సీబీఐతో పాటు ఈడీ కేసులు ఉన్నప్పటికీ నితిన్ భారత్ నుంచి చల్లగా జారుకోవడం పట్ల సర్వత్ర విస్మయం వ్యక్తమవుతోంది.
గుజరాత్‌కు చెందిన స్టెర్లింగ్ బయోటెక్ తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంకులు సీబీఐకి ఫిర్యాదు చేశాయి. ఈ నేపథ్యంలో నితిన్‌తో పాటు కంపెనీలో భాగస్వాములుగా ఉన్న అతని కుటుంబ సభ్యులపై సీబీఐ, ఈడీలు కేసును నమోదుచేశాయి. దీంతో విచారణను తప్పించుకునేందుకు నితిన్ విదేశాలకు పారిపోయినట్లు తెలుస్తోంది. తొలుత నితిన్‌ను దుబాయ్ లో పోలీసులు అరెస్ట్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే అది నిజం కాదనీ, ఇప్పటికే నితిన్ కుటుంబం నైజీరియాకు వెళ్లిపోయిందని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ అధికారి తెలిపారు. బ్యాంకుల నుంచి రూ.5,383 కోట్ల రుణం తీసుకున్న నితిన్ ఈ మొత్తాన్ని 300 డొల్ల కంపెనీల ద్వారా దేశవిదేశాల్లోని అకౌంట్లలోకి అక్రమంగా మళ్లించాడని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసిన ఈడీ ఇప్పటికే రూ.4,700 కోట్ల విలువైన స్టెర్లింగ్ బయోటెక్ ఆస్తులను జప్తు చేసింది. కాగా, ప్రస్తుతం నైజీరియాలో తలదాచుకున్నారని భావిస్తున్న నితిన్ కుటుంబాన్ని భారత్ కు రప్పించేందుకు ఇంటర్ పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసులను జారీచేసే అవకాశముందని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. 

 

15:28 - April 7, 2018

అఘ్నాతవాసితో దెబ్బతిన్న త్రివిక్రమ్.. కథతో, పవన్ కళ్యాణ్ నిర్మాణంలో యూత్ స్టార్ నితిన్ తన 25 వ సినిమాగా చేస్తున్నాడంటేనే..అందర్లో క్యూరియాసిటీ ఏర్పడింది. దానికి తగ్గట్టు గానే.. ఫస్ట్ లుక్ నుంచి థియేట్రికల్ ట్రైలర్ వరకూ ఫ్రెష్ రోమ్ క్యామ్ టచ్ తో ఈ సినిమాపై అంచనాలు క్రియేట్ చేసింది సినిమా టీమ్. ప్రీ రిలీజ్ కు పవన్ రాకతో .. అన్ని రకాలుగా సినిమాకు కావల్సిన క్రేజ్ ఏర్పడింది. అలా అంచలంచెలుగా అంచనాలు పెంచి థియేటర్ లోకి వచ్చిన 'చల్ మోహన్ రంగ'.. హుషారుగా చల్ అన్నాడా.. లేక డల్ అయ్యాడా అన్నది తెలుసుకుందాం...

సినిమా కథ...
సినిమా కథ విషయానికొస్తే..పనీ పాటా, చదువూ సంధ్యా అంటూ ఏమీ లేకుండా లైఫ్ ని లైట్ గా లీడ్ చేసే మోహన్ రంగ చిన్నతనంలోనే ..మేఘ ను చూసి ఇంప్రెస్ అవుతాడు. ఆమె కోసం అమెరికా వెళ్లడానికి చాలా ప్రయత్నాలు చేసి చివరికి అమెరికా వెళ్తాడు. అక్కడికి వెళ్లిన తర్వాత సినిమాటిక్ గానే మేఘ తో పరిచయం, ప్రేమ, ఆ ప్రేమ ను వ్యక్తపరచలేని సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతాయి. దాంతో మేఘ ఇండియా వచ్చేస్తుంది. ఆమెను వెతుక్కుంటూ ఇండియా వచ్చేసిన మోహన్ రంగ ఆమెను ఎలా కలుసుకున్నాడు..? తన ప్రేమను ఎలా వ్యక్తపరచాడు..? అతని ప్రేమను ఆమె యాక్సెప్ట్ చేసిందా..? అన్న విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

నటీనటుల అభినయం...
నటీనటుల విషయానికొస్తే..యూత్ స్టార్ నితిన్ ఈ సినిమాలో నటన పరంగా చాలా పరిణితి కనపర్చాడు. స్టైలింగ్ కూడా బావుంది. కాకపోతే తన గాడ్ అయిన..పవన్ కళ్యాణ్ ని చాలా ఎక్కువగా వాడేశాడు. చాలా చోట్ల ఇమిటేట్ కూడా చేశాడు. నితిన్ మిగతా సినిమాలతో పోలిస్తే.. కామెడీ టైమింగ్ పరంగా చాలా ఇంప్రూవ్ మెంట్ చూపించాడు. ఇక లై సినిమాలో తన లుక్స్ తో అందరినీ ఇంప్రెస్ చేసిన మేఘ ఆకాష్..ఈ సినిమాలో కూడా లుక్స్ తో ఆకట్టుకుంది. కానీ యాక్టింగ్ పరంగా మాత్రం చాలా పేలవంగా అనిపించింది. సిచ్యువేషన్ కి సింక్ గాని ఎక్స్ ప్రెషన్స్ తో కన్ ఫ్యూజ్ చేసింది. చాల రోజుల తర్వాత సిల్వర్ స్క్రీన్ మీద కనిపించిన లిజి.. ఏ ప్రత్యేకతా లేని సాదాసీదా క్యారెక్టర్ లో కనిపించింది. నితిన్ ప్రెండ్స్ గా నటించిన మధు నందన్, పమ్మిసాయి, మంచి కామెడీ జనరేటర్స్ గా ఉపయోగపడ్డారు. ఇక రావు రమేష్, నరేష్, నర్రాశీను క్యారెక్టర్స్ సినిమాను సేవ్ చేసే ఎలిమెంట్స్ గా నిలిచాయి. ముఖ్యంగా సెకండాఫ్ లో రావు రమేష్, నర్రాశీనుల మధ్య వచ్చే ఎపిసోడ్స్..సెకండాఫ్ మొత్తాన్ని కాపాడింది. సత్య కామెడీ అక్కడక్కడా...నవ్వించినా.. కాస్త ఓవర్ గా అనిపిస్తుంది. మిగతా నటీనటులందరూ..డైరెక్టర్ చెప్పిన విధంగా ..తమపాత్రల పరిధి మేర నటించారు.

టెక్నీషియన్స్...
టెక్నీషియన్స్ విషయానికొస్తే.. టైటిల్స్ లో ఈ కథ త్రివిక్రమ్ దే అని వేశారు. సినిమా చూశాక మాత్రం అసలు ఈ కథ త్రివిక్రమ్ దేనా..అని డౌట్ రావడం కామన్. క్లారిటీ లేని క్యారెక్టరైజేషన్, సెంటర్ పాయింట్ లేని స్టోరీ.. త్రివిక్రమ్ ఇచ్చాడు అంటే నమ్మడం కష్టం. ఇక ఈ సినిమాకి రైటర్ కమ్ డైరెక్టర్ అయిన కృష్న చైతన్య ..స్క్రీన్ ప్లే లో ఎలాంటి మెరుపులు యాడ్ చెయ్యలేదు. ఫస్టాఫ్ లో u.s యాంబియెన్స్ వల్ల, కృష్ణ చైతన్య కామెడీ టైమింగ్ వల్ల సినిమా అలా అలా నడిచిపోతుంది. ఇంట్రవెల్ కార్డ్ తోనే సినిమాలో ఉన్న లోపాన్ని బయట పెట్టిన డైరెక్టర్, సెకండాఫ్ స్టార్టింగ్ నుంచి ఫ్లాట్ గా స్టోరీ ని నడిపించేశాడు. మిత్ర క్యారెక్టర్ ఎంట్రీ వరకూ..సినిమా అసలు ఎటు పోతుందో అర్దం కాదు. సెకండాఫ్ పూర్తిగా గాడి తప్పడంతో, స్టోరీలో కొత్తదనం లేకుండా పోవడంతో ఒక సగటు సినిమాగా నిలిచింది చల్ మోహన రంగ. అయితే సినిమాను నిలబెట్టడానికి..ఆర్.ఆర్ పరంగా బాగా హార్డ్ వర్క్ చేశాడు తమన్. కానీ సీన్స్ లో బలమైన కంటెంట్ లేకపోవడంతో ఆర్.ఆర్ కూడా ఓవర్ లౌడింగ్ అనిపిస్తుంది. నటరాజ్ సుబ్రమణ్యన్ సినిమాటోగ్రఫీ..చల్ మోహన రంగా టెక్నీషియన్స్ లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ లో నిలుస్తుంది. U.S ని గానీ, ఊటీ అందాలను గానీ.. అతను ప్రజెంట్ చేసిన తీరు అద్భుతం అనిపిస్తుంది. ఏరియల్ షాట్స్..విజువల్ ట్రీట్ గా ఉన్నాయి. ఇక పవన్ కళ్యాణ్, సుధాకర్ రెడ్డి ల నిర్మాణ విలువలు బావున్నాయి.
ఓవరాల్ గా చెప్పాలంటే జనరల్ స్టోరీలైన్, క్లారిటీ లేని స్క్రీన్ ప్లే, అసలు ఆకట్టుకోలేని ఎమోషన్స్, అనేక బలహీనతలతో తెరకెక్కిన 'చల్ మోహనరంగా' కి క్యామెడీ బ్యాకింగ్ ఒక్కటే అండగా నిలిచింది. ఆ కామెడీ ఆడియన్స్ కి ఎంతవరకూ కనెక్ట్ అవుతుంది అనే దానిపై మోహనరంగా బాక్సాఫీస్ స్టామినా ఆధారపడి ఉంది.

ప్లస్..
ఫస్టాఫ్
కామెడీ
సినిమాటోగ్రఫీ
నిర్మాణ విలువలు

మైనస్
రొటీన్ కథ
స్క్రీన్ ప్లే
కనెక్ట్ కాని ఎమోషన్స్
కన్ ఫ్యూజింగ్ క్యారెక్టర్స్

రేటింగ్...విశ్లేషణ కోసం వీడియో క్లిక్ చేయండి...
 

13:19 - March 7, 2018

టాలీవుడ్ లో లవర్ బాయ్ గా ఎంట్రీ ఇచ్చి ఇపుడు డిఫరెంట్ సినిమాలతో ఎంటర్టైన్ చేస్తున్నాడు యంగ్ హీరో. తన ప్రీవియస్ సినిమాల్లో ఎంతో కొంత కొత్తదనం ఉండేలా చూసుకుంటూ సినిమాలని హిట్ ట్రాక్ లో పెడుతున్నాడు. హీరో 'నితిన్' లవ్ స్టోరీ తో స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన ఈ యంగ్ హీరో ఆ తరువాత కొన్ని యాక్షన్ సినిమాలు చేసాడు. యూత్ ని ఆకట్టుకుంటూ సినిమాలు సెలెక్టివ్ గా చేస్తున్న ఈ హీరో ఇప్పుడు మరో కొత్త సినిమాతో రాబోతున్నాడు. 'అ ఆ' సినిమాలో ఫామిలీ హీరోగా కనిపించి ఎంటర్టైన్ చేసాడు నితిన్. సమంత కి జోడిగా నటించిన ఈ 'అ ఆ' సినిమా ఆడియన్స్ నుండి మంచి టాక్ తెచ్చుకుంది.

కెరీర్ స్టార్టింగ్ లో లవ్ సినిమాలు చేస్తూ లవర్ బాయ్ గ తన కెరీర్ ని స్టార్ట్ చేసి ఇప్పుడు స్టార్ హీరో ఇమేజ్ తెచ్చుకున్నాడు హీరో నితిన్. 'లై' సినిమాతో తాను హాలీవుడ్ లెవెల్ లో యాక్షన్ సీక్వెన్స్ కూడా చెయ్యగలను అని నిరూపించాడు నితిన్. ఇప్పుడు 'చల్ మోహన రంగ' అంటూ అలరించడానికి రెడీ అయ్యాడు. లిరికల్ వీడియోతోపాటు రిలీజ్ అయినటీజర్ కి కూడా మంచి టాక్ వస్తోంది.

12:38 - February 26, 2018

జయం చిత్రంలో చిత్రసీమలో ప్రవేశించిన నితిన్ ఆ తర్వాత వచ్చిన దిల్ సినిమాతో తనకంటు ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత కొన్ని ప్లాప్ లు వచ్చిన ఈ యంగ్ హీరో మళ్లీ గాడిలో పడ్డాడు. ప్రస్తుతం నితిన్ చల్ మోహన రంగ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ పూర్తైయ్యాయి. ఇక పాటల చిత్రీకణ మిగిలి ఉన్నట్టు తెలుస్తోంది. అయితే నితిన్ ప్రతి సినిమాలో వైవిధ్యమైన స్టెప్పులు వేస్తుంటాడు. దానికి చాలా శమ్రించాల్సి ఉంటుంది. నితిన్ గత సినిమాలు గమనిస్తే డాన్స్ వెరైటీలు చూపిస్తూ వస్తున్నాడు. చలో మోహన రంగ చిత్రంలో పాట షూటింగ్ లో నితిన్ డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఓ క్రిటికల్ స్టెప్పు వెస్తున్నప్పుడు అతిని భుజ కండారలు పట్టెసినట్లు తెలిసింది. దీంతో చిత్ర యూనిట్ షూటింగ్ ప్యాకప్ చెప్పి నితిన్ డాక్టర్ చూపించారట. ఈ చిత్రాన్ని పవన్, త్రివిక్రమ్, సుధాకర్ రెడ్డి కలిసి నిర్మిస్తున్నారు. 

10:22 - February 16, 2018

తన ఫామిలీ హీరోలకి కాకుండా తనను నిజంగా అభిమానించే నటుడికి మంచి సపోర్ట్ ఇస్తున్నాడు ఈ స్టార్ హీరో. ఆ స్టార్ హీరోతో పాటు స్టార్ డైరెక్టర్ కూడా తన సపోర్ట్ ని అనౌన్స్ చేశాడు. లవర్ బాయ్ గా తన కెరీర్ ని స్టార్ట్ చేసి ఇప్పుడు స్టార్ హీరో ఇమేజ్ తెచ్చుకున్నాడు హీరో 'నితిన్'. యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకోవడంలో 'నితిన్' ముందు ఉంటాడు. 'లై' లాంటి సినిమాలతో పాటు ఫామిలీ స్టోరీస్ కూడా టచ్ చేసిన 'నితిన్' తన ప్రీవియస్ సినిమా 'లై' లో ఇంటరెస్టింగ్ రోల్ తో ఆడియన్స్ ని ఆకట్టుకోవాలని ట్రై చేశాడు. 'లై' సినిమాలో 'నితిన్' నటనకు మంచి మార్కులే పడ్డాయి.

'నితిన్' ని లవర్ బాయ్ గా యాక్సెప్ట్ చేసిన ఆడియన్స్ ఫామిలీ హీరోగా నటించిన 'అ ఆ' సినిమాని కూడా హిట్ చేశారు. 'త్రివిక్రమ్ శ్రీనివాస్' డైరెక్షన్ లో వచ్చిన 'అ ఆ' సినిమా ఆడియన్స్ ని రీచ్ అయింది. 'నితిన్' స్వతహాగా 'పవన్ కళ్యాణ్' అభిమాని. పవన్ కళ్యాణ్ కూడా ఇపుడు 'నితిన్' సినిమాకి సపోర్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఏప్రియల్ 5న విడుదలయ్యే ఈ సినిమా తాలూకు ఫస్ట్ లుక్ ను ఫిబ్రవరి 12న రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకి డైరెక్టర్ కృష్ణ చైతన్య. పవన్ కళ్యాణ్ తో పాటు నితిన్ తో 'అ ఆ' సినిమా తీసిన త్రివిక్రమ్ కూడా 'నితిన్' కి సపోర్ట్ ఇస్తున్నాడు.

ఫీల్ గుడ్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో 'మేఘా ఆకాశ్' క‌థానాయిక‌గా నటిస్తోంది. 'ప‌వ‌న్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్', 'శ్రేష్ట్ మూవీస్' సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి కథ అందించగా, మూవీకి 'గుర్తుందా శీతాకాలం' అనే టైటిల్ ని పరిశీలిస్తున్న‌ట్టు తెలుస్తుంది. 

11:16 - January 5, 2018

జయం సినిమాతో టాలీవుడ్ కు పరిచయమై హీరో నితిన్ తర్వాత దిల్ సినిమాతో మాస్ ప్రేక్షకుల మానసు దొచుకున్నారు. ఆ తర్వాత సై చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. తర్వాత నితిన్ చేసిన సినిమాలు ఏవి కూడా హిట్ట్ కాలేపోయాయి. చాలా రోజుల తర్వాత వచ్చి ఇష్క్ తో నితిన్ మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చాడు. గుండె ఝారిగల్లంతయిందే, అఆ సినిమాతో మరింత క్రేజ్ సంపదించాడు నితిన్. అయితే లెటెస్ట్ గా వచ్చిన లై సినిమా కాస్త నిరశపరిచిన ప్రస్తుతం త్రివిక్రమ్, పవన్ కల్యాణ్ నిర్మాణ సారధ్యంలో కృష్ణ చైతన్య దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఆ సినిమా కు గుర్తుందా శీతాకాలం టైటిల్ ను ఖరారు చేశారు. ఈ మూవీ తర్వాత దిల్ నిర్మిస్తున్న శ్రీనివాస కళ్యాణంలో చేస్తున్నాడు. 

11:21 - November 27, 2017

దిల్ రాజు 14 ఏళ్ల కింద నితిన్ తో తీసిన చిత్రం దిల్. దిల్ చిత్రంతో ఆయన పేరే మారిపోయింది. దిల్ సినిమాకు ముందు దిల్ రాజు పేరు వెంకటరమణ దిల్ సినిమా తర్వాత ఆయన పేరు దిల్ రాజు గా మారింది. మూవీ పేరే తన పేరుగా మారిపోయిందంటే ఆ సినిమా ఎంత బ్లాక్ బస్టరో చెప్పనక్కర్లేదు. మరి దాదాపు దశాబ్దన్నర తర్వాత వీరి కలయికలో మరో చిత్రం వస్తోంది. చిత్రం పేరు శ్రీనివాస కల్యాణం ఫిక్స్ చేశారు. ఈ చిత్రానికి శతమానం భవతి ఫేమ్ సతీష్ వెగ్నేశ్న దర్శకత్వం వహిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ గా మిక్కీ జె మేయర్ వ్యవహిరించనున్నారు. ఈ చిత్ర రెగ్యూలర్ షూటింగ్ వచ్చే సంవత్సరం మార్చి నుంచి మొదలై ఆగస్టు పూర్తి కానున్నట్టు తెలుస్తోంది. మిగతా నటినటుల వివరాలను త్వరలో విడుదల చేస్తామని తెలిపారు. ఈ చిత్రాన్ని శ్రావణమాసంలో విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. నితిన్ ప్రస్తుతం పవన్ కల్యాణ్ నిర్మిస్తున్న చిత్రంలో చేస్తున్నారు. చూద్దాం 14 ఏళ్ల తర్వాత చరిత్ర రీపిట్ అవుతుందో.....!  

12:34 - October 26, 2017

టెన్ టివి సినిమా : టాలీవుడ్ లో దూసుకుపోతున్న యువ కథానాయకుల్లో నితిన్ ఒకరు. జయం సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించికున్నాడు. ఆ తర్వాత దిల్ సినిమాతో మాస్ ప్రేక్షకుల్లో ఫాలోయింగ్ పెంచ్చుకున్నాడు. రాజమౌళి సై సినిమాతో ఇండస్ట్రీలో పాతుకుపోయాడు. అయితే ఆ తర్వాత వచ్చి సినిమాలన్ని ప్లాప్ కావడంతో అతని ఇమేజ్ తగ్గుకుంటూ వచ్చింది. అయితే చాలా గ్యాబ్ తర్వాత వచ్చి ఇష్క్, గుండెజారి ఘల్లంతయ్యిందే తో తో నితిన్ మళ్లీ గాడిలో పడ్డాడు. తివిక్రమ్ దర్శకత్వం వహించిన సినిమా అఆ తో బ్లాక్ బస్టర్ కొట్టి టాప్ హీరోల్లో చోటు దక్కించుకున్నాడు.

అయితే నితిన్ అభిమానులు తమ హీరో పెళ్లి ఎప్పుడు చేసుకుంటారో అని ఎదురు చూస్తున్నారు. వీరి ఎదురు చూపులకు తెరదించేందుకు నితిన్ కూడా ప్రయత్నిస్తునట్టు తెలుస్తోంది. నితిన్ ప్రస్తుతం కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో మేఘ ఆకాశ్ హీరోయిన్ గా నటిస్తోంది. గతంలో వీరిద్దరూ గతంలో లై సినిమాలో నటించారు. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య ఉన్న స్నేహం ప్రేమగా మారిందని వార్తలు వినిపిస్తున్నాయి.

వీరిద్దరూ పెళ్లిచేసుకోవలనుకుంటున్నారని అందుకు నితిన్ తల్లిదండ్రులు కూడా ఒకే చెప్పినట్టు సమాచారం సాగుతోంది. పెళ్లి ఆలోచన కారణంగాణే మేఘ ఆకాశ్ వేరే సినిమాలు ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది. అయితే ఇంతవరకు ఈ వార్తలను ఇద్దరు ఖండించపోవడంతో ఈ వార్తలకు బలాన్ని చేకురుస్తున్నాయి. 

09:45 - July 31, 2017

టాలీవుడ్ యంగ్ హీరో 'నితిన్' తాజా చిత్రం 'లై' సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఎక్కువ భాగం విదేశాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. హను రాఘవపూడి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. నితీన్ సరసన మేఘ ఆకాష్ హీరోయిన్ గా నటిస్తోంది.

యాక్షన్ ప్రధానంగా చిత్రం ఉంటుందని అందరికీ వినోదాన్ని కలిగిస్తుందని నిర్మాతలు పేర్కొన్నారు. ఇటీవలే విడుదలైన పాటలు..టీజర్ కు భారీ రస్పాన్స్ వస్తోందని, ఆగస్టు 11న చిత్రం విడుదల చేస్తామన్నారు. వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ ముందుకెళుతున్న 'నితిన్' ‘లై' చిత్రంలో మరోసారి భిన్నంగా కనిపించనున్నాడని టాక్. ఈ సినిమా పోస్టర్స్..టీజర్ చూస్తుంటే నిజమనిపిస్తోంది. 'నితిన్' కు విలన్ గా యాక్షన్ కింగ్ 'అర్జున్' నటిస్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదిలా ఉంటే ఆగస్టు మొదటి వారంలో ట్రైలర్ రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది. 

16:05 - July 24, 2017

పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' కి హీరో 'నితిన్' పెద్ద అభిమాని అన్న సంగతి అందరికీ తెలిసిందే. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన 'అ..ఆ' చిత్రంతో ఇటీవల భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నా 'నితిన్' హీరోగా మరో సినిమా మొదలైంది. ఇప్పటికే 'లై' అనే చిత్రంతో 'నితిన్' బిజీగా ఉన్నాడు. ఎక్కువ భాగం విదేశాల్లో సినిమా షూటింగ్ కొనసాగుతోంది.

ఇదిలా ఉంటే 'పవన్ కళ్యాణ్' క్రియేటివ్ వర్క్స్, శ్రేష్ట్ మూవీస్ బేనర్ పై ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం గత ఏడాది నవంబర్ పూజా కార్యక్రమాలు జరుపుకుంది. కృష్ణ చైతన్య దర్శకుడు కాగా ఈ సినిమాకు 'త్రివిక్రమ్' స్వయంగా కథను అందిస్తుండడం విశేషం. తన అభిమాని కోసం ఓ సినిమాను నిర్మించడానికి 'పవన్ కళ్యాణ్’, 'త్రివిక్రమ్' లు ముందుకు రావడం విశేషం.

తాజాగా ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైనట్లు సామాజిక మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయి. తొలి ఐదు రోజుల పాటు హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకోనుందని తెలుస్తోంది. అనంతరం భారీ షెడ్యూల్ కోసం విదేశాలకు వెళ్లనున్నట్లు సమాచారం. ఇక నితిన్ పక్కన ఏ హీరోయిన్ నటించనుందో తెలియడం లేదు. పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

Pages

Don't Miss

Subscribe to RSS - నితిన్