నియంత

18:39 - April 16, 2018

విజయవాడ : ప్రధాని మోడీ నియంతలా వ్యవహరిస్తున్నారని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. ప్రత్యేక హోదా విషయంలో మోడీ ప్రభుత్వం దిగిరావాలన్నారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలని...పార్లమెంట్ లో చేసిన చట్టాలను అమలు చేయాలని చెప్పారు. 2014 ఏప్రిల్ 20న ఏ హామీలు ఇచ్చారో వాటిని అమలు చేయాలని కోరుతున్నామని చెప్పారు. బీజేపీ నేతలు అర్ధసత్యాలు, అవాకులు, చెవాకులు పేలుతున్నారని పేర్కొన్నారు. ఏపీ బీజేపీ ఎన్నికల మ్యానిఫెస్టో ఆ పార్టీ నేతలు చదువుకోవాలని.. మ్యానిఫెస్టోను అమలు చేయాలన్నారు. లేకపోతే పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 13 జిల్లాల్లో ప్రజలు స్వచ్ఛందంగా బంద్ లో పాల్గొని, విజయవంతం చేసినందకు అభినందలు తెలిపారు. సీఎం చంద్రబాబు అధికారంలో ఉంటే ఒకమాట..లేకుంటే మరోమాట మాట్లాడుతున్నారని అన్నారు. చంద్రబాబు ఆధ్వాన్నంగా మాటమార్చుతున్నారని చెప్పారు. మాటమార్చుకోవడం మానుకోవాలని హితవుపలికారు. ప్రజలను తప్పుదోవ పట్టించడం సరికాదన్నారు. తమను ప్రశ్నిస్తున్న చంద్రబాబు ఏపీలో దీక్ష ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. దమ్ముంటే చంద్రబాబు ఢిల్లీలో దీక్ష చేయాలన్నారు. మోడీ, చంద్రబాబు పాపాలు చేశారని చెప్పారు. ఈ  పాపంలో వెంకయ్యనాయుడి పాత్ర కూడా ఉందన్నారు. చంద్రబాబు, వెంకయ్యనాయుడు ప్రజలను తప్పుదోవపట్టించారని... మభ్య పెట్టారని మండిపడ్డారు. ఇద్దరి పాపాల వల్ల రాష్ట్రానికి అన్యాయం జరిగిందన్నారు. మోడీకి దిమ్మతిరిగే విధంగా బ్లాక్ డే పాటిస్తామని చెప్పారు. స్వచ్ఛందంగా ప్రజలు బిజిలీ బంద్ పాటించాలన్నారు.

 

15:59 - April 10, 2018

కడప : మోదీ ప్రధాని రూపంలో నియంతలా వ్యవహరిస్తుంటే... సీఎం చంద్రబాబు కార్పొరేట్లకు రెడ్‌ కార్పెట్‌ పరుస్తున్నారని సీపీఐ రాష్ర్టకార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. పేదల సమస్యలపై ఈనెల 23న ప్రభుత్వాలు దద్దరిల్లేలా ఆందోళన చేపడతామని అన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్ల జీతాలు పెరిగాయి కానీ... పేదల బతుకులు మెరుగపడలేదన్నారు. పింఛన్లు, ఇళ్ళస్థలాలు, రేషన్‌ కార్డుల వంటి పేదల సమస్యలపై ప్రభుత్వ కార్యాలయాల ఎదుట భారీస్థాయిలో ఆందోళన చేస్తామని తెలిపారు. భవిష్యత్‌ రాజకీయాల్లో వామపక్షాలదే కీలక పాత్ర అన్నారు.

 

17:42 - March 14, 2018

హైదరాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్‌ నియంతలా వ్యవహరిస్తున్నారని బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ నేతలు తీవ్రంగా విమర్శించారు. అసెంబ్లీలో ఇద్దరు ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దుచేయడాన్ని చీకటి రోజుగా అభివర్ణించారు బీఎల్‌ఎఫ్‌  ఛైర్మన్‌ నల్లా సూర్యప్రకాష్.  హైదారాబాద్‌లోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. బడుగులకు రాజ్యాధికారమే లక్ష్యంగా ఏర్పడిన బీఎల్ఎఫ్... తెలంగాణ సర్కార్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్న అన్నివర్గాలను ఒకే తాటిపైకి తెచ్చి.. వచ్చే ఎన్నికల్లో పోటీచేసేందుకు సన్నద్ధం అవుతోందన్నారు. 

 

16:26 - March 3, 2018

హైదరాబాద్ : ఎన్ కౌంటర్ ఘటనను తెలంగాణ సీపీఐ మావోయిస్టు పార్టీ ప్రతినిధి జగన్ ఖండించారు. ఇది బూటకపు ఎన్ కౌంటర్ అని పేర్కొన్నారు. కాసేపటి క్రితం అయిన ఆడియో టేప్ ను విడుదల చేశారు. పోలీసులు ఏకపక్షంగా కాల్పులు జరిపారని, మృతి చెందిన వారిలో పార్టీ టాప్ క్యాడర్ ఎవరూ లేరన్నారు. ప్రజా సమస్యలు చర్చించుకుని సేద తీరుతున్న సమయంలో ఓ ద్రోహి ఇచ్చిన సమాచారంతో గ్రే హౌండ్స్ కాల్పులు జరిపారని తెలిపారు. అనారోగ్యంతో ఉన్న వారిని పట్టుకుని, కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళుతున్న వారిపై పోలీసులు కాల్పులు జరిపి చంపేశారని పేర్కొన్నారు. జిల్లా కమిటీ సభ్యుడు దడబోయిన స్వామి అలియాస్ ప్రభాకర్, రాంపూర్ మండలంకు చెందిన రత్నా అనే నక్సల్స్ దాడిలో ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు. మిగతా వారంతా సుక్మా, దంతేవాడ జిల్లాలకు చెందినవారన్నారు. గిరిజనులకు చెందిన ఖనిజ సంపద, వనరులను ప్రభుత్వాలు అమ్మేస్తున్నాయని ఆరోపించారు. పోలీసు అధికారులు, టీఆర్ఎస్ నేతలు మూల్యం చెల్లించుకోకతప్పదని, మావోయిస్టు పార్టీ నిర్మూలనే లక్ష్యంగా ప్రభుత్వం దాడులు చేస్తోందన్నారు. ఇంకా ఏమీ మాట్లాడారో వీడియో వినండి...

18:13 - December 3, 2017

విజయవాడ : చంద్రబాబు నియంతలా వ్యవహరిస్తున్నారని, సోమ్ము చేసుకోవడానికే పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టారని మాజీ ఎంపీ ఉండవల్లి ఘాటు విమర్శలు చేశారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రంతో సంబంధం లేకుండానే పోలవరం నిర్మాణం చేపట్టారని, పట్టిసీమ వద్దని చెప్పినా బాబు పట్టించుకోలేదన్నారు. ప్రాజెక్టు కోసం 17,500 క్యూబిక్ ఫీట్ల తవ్వింది దివంగత వైఎస్ హాయంలోనేనని తెలిపారు. కాపు రిజర్వేషన్లపై ఉండవల్లి స్పందించారు. మంజునాథ రిపోర్టు లేకుండానే అసెంబ్లీలో ప్రవేశ పెట్టడం..తీర్మానం చేయడం ఎంతవరకు కరెక్టని ప్రశ్నించారు. 

17:52 - July 15, 2017

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో నియంత పాలన కొనసాగుతోందని ఆరోపించారు కాంగ్రెస్ సీనియర్ నేత వీ.హనుమంతరావు. ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విఫలమయ్యారని మండిపడ్డారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రజలు ఇంటికి వెళ్తే కలవరని.. ధర్నా చౌక్‌లు తీసేస్తారని ఆరోపించారు. అటు ఏపీలో కాపు నేత ముద్రగడ పద్మనాభం ఈనెల 26 న చేపట్టనున్న పాదయాత్రకు చంద్రబాబు ప్రభుత్వం ఎటువంటి అవాంతరాలు కలిగించినా టీడీపీ పతనం తప్పదని వీహెచ్ అన్నారు.

12:35 - January 11, 2017

ఢిల్లీ : ప్రధాని నరేంద్రమోడీపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోడీ నియంతలా వ్యవహరిస్తున్నారని ఘాటుగా విమర్శించారు. ఈమేరకు ఢిల్లీలో రాహుల్ ఓ సమావేశంలో మాట్లాడారు. మోడీ నినాదాలు దేశాభివృద్ధికి ప్రతిబంధకంగా మారాయని పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దుతో దేశాభివృద్ధి కుంటుపడిందన్నారు. నోట్ల రద్దు తర్వాత ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. నగదు కొరత దేశ ప్రజలను ఇంకా వెంటాడుతుందని చెప్పారు. ప్రజా సమస్యలను ప్రధాని మోడీ పట్టించుకోవడం లేదని విమర్శించారు. పెద్ద నోట్ల రద్దుపై రెండో దశ ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే దేశానికి మంచి రోజులు వస్తాయని స్పష్టం చేశారు.
 

 

13:25 - November 23, 2016

ఢిల్లీ : నోట్ల రద్దుతో సామాన్యులు ప్రతిరోజూ నరకం చూస్తున్నారని.. ఎంపీ కేవీపీ అన్నారు.. సాక్షాత్తూ కేంద్రమంత్రి సోదరుడు చనిపోతే ఆస్పత్రిలో పాతనోట్లు తీసుకోలేదని గుర్తుచేశారు.. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రధాని మోదీ నియంతలా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు..

13:34 - February 7, 2016

హైదరాబాద్ : ఏపీ ప్రభుత్వం నియంతలా వ్యవమరిస్తోందని ఏపీ పీసీస చీఫ్ రఘువీరా వ్యాఖ్యానించారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ముద్రగడ చేస్తున్న దీక్షపై ఆయన మాట్లాడారు. ఆదివారం ఇందిరా భవన్ లో మీడియాతో మాట్లాడారు. బీసీల రిజర్వేషన్ లు పెరగడానికి, కాపులను బీసీల్లో పేర్చడం ఆస్కారం ఉందన్నారు. అన్ని పార్టీలు ఒప్పుకొన్నా కావాలని సమస్యను జఠిలం చేయవద్దని సూచించారు. రెండు మాసాల్లో సమస్యలను పరిష్కరించవచ్చని ముద్రగడకు సూచించడం జరిగిందన్నారు. ఇదే విషయాన్ని ప్రభుత్వానికి చెప్పాలని ప్రయత్నించడం జరిగిందన్నారు. కానీ ఏ ఒక్క అధికారి ఫోన్ తీయడం లేదని రఘువీరా ఆరోపించారు. 

11:30 - September 28, 2015

హైదరాబాద్ : ఎన్ డిఎ లో పాలనలో రిజర్వేషన్లపై దాడి జరుగుతోందని వక్తలు పేర్కొన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో విశ్లేషకుడు తెలకపల్లి రవి, బిజెపి నేత రాకేష్ రెడ్డి, కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఇందిర, టిడిపి నేత.. పట్టాభిరామ్, టిఆర్ ఎస్ ఎమ్మెల్సీ సుధాకర్ రెడ్డి పాల్గొని, మాట్లాడారు. ఆర్ ఎస్ ఎస్ కనుసన్నల్లో మోడీ సర్కార్ పాలన కొనసాగుతుందన్నారు. ఆర్ ఎస్ ఎస్ విధానాలను బిజెపి సర్కార్ అమలు చేస్తుందన్నారు. టీసర్కార్ పాలనపై చర్చించారు. సీఎం కేసీఆర్ నియంత పాలన సాగుతోందని విమర్శించారు. అధికార పార్టీ.. ప్రతి పక్షాల గొంతు నొక్కుతుందని చెప్పారు. వరంగల్ లో మంత్రి కడియం శ్రీహరి, టిడిపి నేత ఎర్రబెల్లి దయాకర్ ల మధ్య జరిగిన ఘర్షణతో ప్రజలకు ఎలాంటి సంబంధం లేదన్నారు. వ్యక్తిగత, రాజకీయ ఘర్షణలు కొనసాగుతున్నాయన్నారు. వారు తెలిపిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

Don't Miss

Subscribe to RSS - నియంత