నియంత్రణ

16:39 - January 26, 2018

ఢిల్లీ : గణతంత్ర దినోత్సవం సందర్భంగా నియంత్రణ రేఖ వద్ద పాకిస్తాన్‌ రేంజర్ల నుంచి స్వీట్లు, శుభాకాంక్షలను అందుకోవడానికి బిఎస్‌ఎఫ్‌ నిరాకరించింది. సరిహద్దులో పాకిస్తాన్ తరచూ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతుండడమే ఇందుకు కారణం. గత కొన్ని నెలలుగా పాకిస్తాన్‌ రేంజర్లు జరిపిన కాల్పుల్లో పలువురు జవాన్లతో పాటు స్థానిక పౌరులు మృతి చెందిన విషయం తెలిసిందే. రిపబ్లిక్‌ డే సందర్భంగా మిఠాయిలు ఇచ్చిపుచ్చుకోవడం చేయరాదని పాక్‌ ఆర్మీకి గురువారమే బిఎస్‌ఎఫ్ స్పష్టం చేసినట్లు సమాచారం. ఇరుదేశాల్లో జాతీయ పండగల సందర్భంగా నియంత్రణ రేఖ వద్ద స్వీట్లు పంచుకోవడం ఆనవాయితీ.

11:09 - January 2, 2018

హైదరాబాద్ : పేరెంట్స్ అసోసియేషన్ ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉంది. తిరుపతిరావు కమిటీ చేసిన ప్రతిపాదనలు పేరెంట్స్ కు అనుకూలంగా నిర్ణయాలు లేవని, కార్పొరేట్ స్కూల్ యాజమాన్యాలకు అనుకూలంగా ఉందని స్కూల్ పేరెంట్స్ నేతలు పేర్కొంటున్నారు. మంగళారం డిప్యూటి సీఎం కడియం శ్రీహరిని ప్రతినిధులు కలిశారు. సమావేశం అనంతరం వాళ్లు మీడియాతో మాట్లాడారు. ఏటా పది శాతం ఫీజులు పెంచుకోవ్చని చెప్పడం దారుణమని, తక్షణమే దీనిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సంక్రాంతికి శుభవార్త చెబుతామని గతంలో ప్రకటించారని, బంగారు తెలంగాణలో విద్య అందని ద్రాక్షగా ఉంటుందని సమావేశం అనంతరం అర్థమయ్యిందని తెలిపారు. ఆర్డినెన్స్ జారీ చేసే ప్రతిపాదన ప్రభుత్వంలో లేదని పేర్కొనడం సబబు కాదన్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

18:56 - October 12, 2017

హైదరాబాద్ : ప్లాస్టిక్‌ నియంత్రణను బల్దియా మరోసారి తెరపైకి తీసుకొచ్చింది. 50 మైక్రాన్ల కన్నా తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ ఉత్పత్తులను బ్యాన్‌ చేయాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. అనుకున్న వెంటనే ఉత్పత్తి కేంద్రాలపై.. షాపులపై దాడులు చేస్తోంది. ఇంతవరకూ బాగానే ఉంది కానీ అప్పుడప్పుడు హడావిడి చేసి.. తరువాత తమకు పట్టనట్లుగా జీహెచ్‌ఎంసీ వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పెరిగిపోతున్న ప్లాస్టిక్‌ వినియోగం 
భాగ్యనగరంలో ప్లాస్టిక్‌ వినియోగం రోజురోజుకీ పెరిగిపోతోంది. ఏ చిన్న వస్తువు కొన్నా.. దానిని తీసుకెళ్లేందుకు కవర్‌ కావాల్సిందే. అది కూరగాయలు, రేషన్‌ సరుకులు, మటన్‌, చికెన్‌లే కాదు, టిఫిన్‌, టీ,కాఫీ లాంటి ద్రవపరార్థాలకూ పాలిథిన్‌ కవర్లను వాడుతున్నారు. ప్లాస్టిక్‌ వస్తువులు, పాలిథిన్‌ కవర్లు లేకుండా మనుషులు కొన్ని గంటలు కూడా ఉండలేనంతగా వాటి వినియోగం పెరిగింది. అయితే ఇది హైదరాబాద్‌లాంటి నగరాల్లో మరీ ఎక్కువైంది. 2016 సాలీడ్ వేస్ట్‌ రూల్స్‌ ప్రకారం 50 మైక్రాన్ల కంటే ఎక్కువ మందం ఉన్న కవర్లు మాత్రమే ఉపయోగించాలి. 
దేశంలో రోజుకి 15,342 టన్నుల ప్లాస్టిక్‌ ఉత్పత్తి 
సెంట్రల్ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు లెక్కల ప్రకారం.. ప్రతీ రోజు మన దేశంలో 15, 342 టన్నుల ప్లాస్టిక్‌ ఉత్పత్తి అవుతోంది. ఇందులో సగం మాత్రమే రీసైకిల్ అవుతోంటే.. మిగిలినదంతా అలానే వదిలేస్తున్నారు. ప్లాస్టిక్‌ వ్యర్థాలు భూమిలో కలిసిపోవడానికి వందల ఏళ్లు పడుతుంది. అయితే ఏడాదికి ఒక వ్యక్తి పాలిథిన్‌ కవర్ల వినియోగం 8 నుంచి 10 కిలోలు ఉంటుందని.. ఈ ఏడాదికి చివరి నాటికి 12 కేజీలకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. వర్షాలొచ్చినప్పుడు నాలాలు పొంగిపొర్లడానికి ప్రధాన కారణం పాలిథిన్‌ కవర్లేనని అధికారులంటున్నారు. దాదాపు 2,000 దుకాణాలను తనిఖీలు చేసిన అధికారులు.. 14 లక్షల ఫైన్ విధించారు. 
చిత్తశుద్ధితో పని చేయడం లేదనే ఆరోపణలు 
కార్పొరేషన్‌ ఈ సమస్యపై చిత్తశుద్ధితో పని చేయడం లేదనే ఆరోపణలున్నాయి. 2009 నుండి వచ్చిన కమిషనర్లు, మేయర్లు సిటీలో ప్లాస్టిక్‌ను నిరోధించడం తమ మొదటి లక్ష్యమని ప్రకటించారు. కానీ దానిని పూర్తి స్థాయిలో అరికట్టడం, ప్రమాణాలకు అనుగుణంగా వాడేలా చూడటంలో మాత్రం పూర్తిగా విఫలమయ్యారు. అప్పుడప్పుడు సామాన్యులపై పడి ఫైన్‌లు వసూలు చేస్తున్నారు. అసలు కవర్లను ఉత్పత్తి చేస్తున్న సంస్థలను పట్టించుకోకుండా వాటిని ఉపయోగిస్తున్న చిరు వ్యాపారులపై అధికారులు జులుం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలున్నాయి.  
ప్లాస్టిక్‌ను బ్యాన్‌ చేయాలని రిపోర్టు 
గతంలో ప్రభుత్వం స్వచ్ఛ హైదరాబాద్‌ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో ప్లాస్టిక్‌ ముఖ్యమైన సమస్యగా గుర్తించిన స్వచ్ఛ కమిటీ.. దానిని బ్యాన్‌ చేయాలని రిపోర్టు ఇచ్చింది. అప్పుడే నగరం, నాలాలు, డ్రైన్లు శుభ్రంగా ఉంటాయని చెప్పింది. అయినా అది ఆచరణలో మాత్రం సాధ్యం కావడం లేదు. 

 

15:55 - September 28, 2017

శ్రీకాకుళం : పట్టణ జనాభా పెరిగిపోతోంది. ఇరుకురోడ్లు, వాహనాల రద్దీతో ట్రాఫిక్ పద్మవ్యూహాన్ని తలపిస్తోంది. ఈ పరిస్థితుల్లో ట్రాఫిక్‌ నియంత్రణ పోలీసులకు సవాల్‌గా మారింది. దీన్ని అదిగమించేందుకు శ్రీకాకుళం జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది.  ట్రాఫిక్‌ కష్టాలకు చెక్‌ పెట్టేందుకు పరికరాలు పెద్ద  ఎత్తున కొనుగోలు చేస్తోంది. 

ట్రాఫిక్‌ సమస్యను ఎదుర్కొనేందుకు శ్రీకాకుళం జిల్లా అధికారులు యాక్షన్‌ప్లాన్‌ను మొదలు పెట్టారు. ట్రాఫిక్‌ నియంత్రణకోసం ప్రత్యేక పరికరాలను సమకూర్చుకుంటున్నారు. 

శ్రీకాకుళం నగరంలో వాహనాల రద్దీ రోజురోజుకు పెరిగిపోతోంది. పట్టణ స్థాయి నుంచి నగరంగా విస్తరిస్తున్న సిక్కోలు లో మూడు ప్రధాన రోడ్లు తప్పించి..మిగత అన్నిచోట్ల ఇరుకు రోడ్లే దర్శనం ఇస్తున్నాయి. డేఅండ్‌ నైట్‌ జంక్షన్‌, ఏడురోడ్ల కూడలి, రామలక్షణ జంక్షన్‌, పాతబస్టాండు ఏరియాల్లో మాత్రమే ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ అందుబాటులో ఉన్నాయి. మిగత రోడ్లన్నీ వాహనాల రాకపోకలతో నిత్యం బిజీగా ఉంటున్నాయి. ట్రాఫిక్‌నియంత్రణ వ్యవస్థలు లేకపోవడంతో నిత్యం ప్రమాదాలు, ట్రాఫిక్‌జామ్‌లు జరుగుతున్నాయి. దీనిపై దృష్టిపెట్టిన జిల్లా అధికారులు.. ట్రాఫిక్‌ నియంత్రణ పరికరాలను పెద్ద ఎత్తున సమకూర్చుకుంటున్నారు. జిల్లాకేంద్రంతోపాటు  ఇతర ముఖ్య పట్టణాలు, జాతీయరహదారుల వద్ద  ప్రమాదాల జరగకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నారు. 

మరోవైపు సెప్టెంబర్‌ 28నుంచి  జిల్లా వ్యాప్తంగా హెల్మెట్‌వాడకం తప్పని సరి చేసినట్టు శ్రీకాకుళం జిల్లా అధికారులు ప్రకటించారు. హెల్మెట్‌ ధరించి విలువైన ప్రాణాలు కాపాడుకోవాలని వాహనదారులకు చెబుతున్నారు. దాన్లో భాగంగానే జిల్లా వ్యాప్తంగా ట్రాఫిక్‌ నియంత్రణ వ్యవస్థలను పటిష్టం చేస్తున్నట్టు అధికారులు అంటున్నారు. దీనిపై సిక్కోలు జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదాల నివారణకు మరిన్ని చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. 

ట్రాఫిక్‌ కష్టాలకు చెక్‌పెట్టేందుకు శ్రీకాకుళం జిల్లా అధికారుల చర్యలు 

17:48 - September 19, 2017

హైదరాబాద్ : ప్రొఫెసర్‌ తిరుపతిరావు ఆధ్వర్యంలో ఈ ఏడాది మార్చిలో... తెలంగాణ ప్రభుత్వం ఫీజుల నియంత్రణ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ ఏర్పాటై నెలలు గడుస్తున్నా ఏమాత్రం పురోగతి లేకుండా పోయింది. పైగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సిన తిరుపతిరావు కమిటీ వాయిదాలతోనే సరిపెడుతోంది. దీంతో తిరుపతిరావు కమిటీ అసలు ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తిరుపతిరావు కమిటీ వాస్తవానికి ప్రైవేట్‌, కార్పొరేట్‌ పాఠశాలల ఫీజుల దోపిడీపై అధ్యయనం చేసింది. విచ్చల విడిగా ప్రతిఏటా వేలకువేలు ఫీజులు పెంచడంపై సమాచారాన్ని సేకరించింది. ఫీజులు ఎందుకు పెంచాల్సి వస్తుందో స్పష్టం చేయాలని ప్రైవేట్‌ స్కూల్స్‌ను తిరుపతిరావు కమిటీ కోరింది. ఇందుకు ఆదాయ, వ్యయాల నివేదికలను సమర్పించాలని ప్రైవేట్‌ స్కూల్స్‌ను ఆదేశించింది. కానీ ఇప్పటి వరకు చాలా స్కూల్స్‌ వాటిని సమర్పించనేలేదు. ఇప్పటికే ఇందుకోసం పలుమార్లు గడువు పొడిగించిన ప్రభుత్వం.. ఇప్పుడు మరోసారి నెలరోజులు గడువు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీనిపై తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. ప్రైవేట్‌ స్కూల్స్‌ యాజమాన్యాలకు అనుకూలంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఈ ఏడాది ఫీజుల నియంత్రణ అనేది కలగానే మిగిలిపోయేలా కనిపిస్తోంది. 

06:40 - July 19, 2017

విద్యాసంవత్సరం ప్రారంభించిన తర్వాత విద్యారంగ సమస్యలు పరిష్కారిస్తామని, ఫీజుల నియంత్రణకు చట్టల తీసుకొస్తామని చెప్పిన ప్రభుత్వం దాన్ని మరిచిపోయిందని, ప్రైవేట్ విద్యాసంస్థలు లక్షల ఫీజులు వసూల్ చేశారని, 4వేల ప్రభుత్వ పాఠశాల మూసివేతకు ప్రయత్నిస్తున్నారని, డిగ్రీలో పెరిగిని ఫీజులను ప్రభుత్వం భరించాలని డిమాండ్ తో అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఎల్లుండి రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్ పిలుపునిచ్చామని తెలంగాణ ఎస్ఎఫ్ఐ కార్యదర్శి తెలిపారు.

08:54 - July 14, 2017

హైదరాబాద్ : తెలంగాణలో ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల నియంత్రణ వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. ఫీజుల నియంత్రణపై మార్గదర్శకాలు తయారు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఈ వ్యవహారం ఇప్పట్లో కొలిక్కిరాదని తేల్చి చెప్పింది. తుది నివేదిక సమర్పించడానికి మరో రెండు నెలల గడువు కోరింది. దీంతో ఫీజులు తగ్గుతాయని ఆశపడ్డ తల్లిదండ్రుల ఆశలు అడియాశలయ్యాయి. 
ఫీజుల నియంత్రణకు కమిటీ ఏర్పాటు
ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు మార్గదర్శకాలు తయారు చేసేలా తెలంగాణ ప్రభుత్వం గత మార్చిలో ఓ కమిటీని నియమించింది. ఓయూ మాజీ వీసీ ప్రొఫెసర్ తిరుపతి రావు నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ  తుది నివేదికను సమర్పించాల్సి ఉంది. అయితే పలు కారణాలతో కమిటీ ప్రభుత్వాన్ని గడువు కోరుతూనే ఉంది. తాజాగా ప్రభుత్వం మరో రెండు నెలల గడువును పొడిగించింది. 
కొలిక్కి రాని కమిటీ నివేదిక
ఇప్పటికే అనేక సార్లు సమావేశాలు నిర్వహించిన కమిటీ సభ్యులు ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలతో పాటు విద్యార్ధుల తల్లిదండ్రులు, ప్రజా సంఘాల ప్రతినిధుల నుంచి అభిప్రాయాలు సేకరించారు. అయినా కమిటీ నివేదిక ఓ కొలిక్కి రాలేదు. మరోవైపు ప్రొ.తిరుపతిరావు కమిటీ ఉద్దేశ పూర్వకంగానే నివేదికను ఆలస్యం చేస్తోందని పేరెంట్స్ అసోసియేషన్లు ఆరోపిస్తున్నాయి.  ప్రైవేటు స్కూల్స్ ఒత్తిడి మేరకే కమిటి నివేదిక ఇవ్వడంలేదని విమర్శిస్తున్నాయి.
తల్లిదండ్రుల ఆగ్రహం 
అయితే ప్రైవేటు స్కూళ్లకు వెళ్లి అక్కడి పరిస్థితులు పరిశీలించిన పిమ్మటే నిర్ణయం తీసుకుంటే మంచిదని కమిటీ సభ్యులు తేల్చి చెప్పడంతో  విద్యార్ధుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సెకెండ్ టర్మ్ ఫీజు చెల్లించే నాటికైనా ఫీజుల నియంత్రణపై క్లారిటి వచ్చేలా ప్రభుత్వ నిర్ణయం తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 

 

08:29 - May 8, 2017

ఢిల్లీ: మావోయిస్టుల నియంత్రణకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు కేంద్ర హోంశాఖ ఇవాళ ఢిల్లీలో కీలక సమావేశం ఏర్పాటు చేసింది. ఇటీవల చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల దాడిలో 25 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృతిచెందడంతో... ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాలపై మార్పులు చేయాలని కేంద్రం భావిస్తోంది. మావోయిస్టుల కట్టడి వ్యూహంతో పాటు.. ప్రభావిత ప్రాంతాల్లో తీసుకోవాల్సిన అభివృద్ధి పనులపై కూడా చర్చించనున్నారు. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన జరగనున్న ఈ భేటీలో.. మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల నుంచి 10మంది ముఖ్యమంత్రులు, హోంసెక్రటరీలు, డీజీపీలతో పాటు... పారా మిలిటరీ, నిఘా విభాగాల అధిపతులు హాజరవుతున్నారు.

17:55 - April 3, 2017

హైదరాబాద్: తెలంగాణలోని ప్రైవేట్‌, కార్పొరేట్ ఫీజుల నియంత్రణపై ఓ కమిటీని వేయాలని టీజేఏసీ చైర్మన్ కోదండరామ్ డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ పేరెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మిగతా రాష్ట్రాలతో పోల్చితే హైదరాబాద్‌లోనే ఫీజులు ఎక్కువగా ఉన్నాయన్నారు. ఫీజుల దోపిడిపై పెద్ద ఎత్తున ఉద్యమించాలని పిలుపునిచ్చారు. 

09:34 - January 24, 2017

మందుల ధరలను ఇష్టానుసారంగా పెంచుతున్నారని.. ప్రభుత్వ నియంత్రణ ఉండాలని తెలంగాణ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ అసోసియేషన్ నాయకులు రాజు భట్ అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపథం చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ లు ఫిబ్రవరి 3న దేశవ్యాప్తంగా సమ్మె చేపట్టబోతున్నారు. ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఈ సమ్మెకు పిలుపునిచ్చింది. ఈ సమ్మెకు కార్మిక సంఘాలు కూడా సంఘీభావం ప్రకటిస్తున్నాయి. ఇంతకీ మెడికల్  అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ దేశ వ్యాప్త సమ్మెకు కారణం ఏమిటి? ఈ సమ్మె సందర్భంగా మెడికల్ అండ్  సేల్స్ రిప్రజెంటేటివ్స్ ప్రభుత్వం ముందు పెడుతున్న డిమాండ్స్ ఏమిటి? దేశీయ ఫార్మాస్యూటికల్ రంగం ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లేమిటి? ఆన్ లైన్ లో  మందుల అమ్మకాల వల్ల జరుగుతున్న మంచి చెడులేమిటి ? ఇలాంటి అంశాలపై ఆయన మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

Pages

Don't Miss

Subscribe to RSS - నియంత్రణ