నిర్లక్ష్యం

12:32 - August 10, 2018

శ్రీకాకుళం : సిక్కోలు రిమ్స్ ఆసుపత్రికి మాయరోగం ఆవహించింది. కోట్లాది రూపాయలు నిధులు ఖర్చుపెడుతున్నా.. బాధ్యతాయుతమైన సేవలు కరువవుతున్నాయి. వైద్యుల ఇష్టారాజ్యం.. సిబ్బంది నిర్లక్ష్యం.. ప్రజాప్రతినిధుల అలసత్వంతో ... సిక్కోలు పెద్దాసుపత్రికి నిర్లక్ష్యపు జబ్బు పడుతోంది. ఇటీవల ఇంజక్షన్ వికటించి ముగ్గురు మృతిచెందగా.. మరో పదిహేడు మంది పరిస్థితి విషమంగా మారడం ఈ పరిస్థితులకు అద్దం పడుతోంది.
నిధులు ఫుల్...సేవలు నిల్
శ్రీకాకుళంలోని రాజీవ్ గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రిమ్స్ ఆసుపత్రి ఇది.. దాదాపు జిల్లాలోని ముప్పై ఎనిమిది మండలాల్లోని రోగులకు పెద్ద దిక్కుగా మారిన ఈ ఆసుపత్రికి నిలువునా నిర్లక్ష్యపు జబ్బు చేసిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల ఇంజక్షన్ వికటించి ముగ్గురు మృతి చెందడంతో పాటు, మరో పదిహేడు మంది ప్రాణాల మీదకు రావడానికి కారణం వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యమేనన్న ఆరోపణలున్నాయి. 
రిమ్స్ కు వందల కోట్ల బడ్జెట్ కేటాయింపులు 
వందలాది మంది వైద్యులు, సిబ్బంది విధులు నిర్వర్తించే రిమ్స్ ఆసుపత్రికి వందల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయింపులు చేస్తున్నారు. ఆసుపత్రి భవనాలు సైతం కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దారు. అయినప్పటికీ.. జిల్లాలో ఉన్న ఏకైక ఈ ధర్మాసుపత్రిలో బాధ్యతాయుత సేవలు కరువుతున్నాయి. ఆసుపత్రిలో చేరుతున్న రోగులకు సరైన సేవలు అందడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. వైద్య పరీక్షలు, స్కానింగ్ లు, ఇతర రిపోర్టులు అవసరమైనప్పుడు బయట ప్రయివేటు లేబొరేటరీలపై ఆధారపడాల్సివస్తోందని బాధితులు వాపోతున్నారు. వీటికి తోడు.. వైద్యులు ఎప్పుడు వస్తారో ఎప్పుడు పోతారో తెలియదని రోగులు చెబుతున్నారు. నర్సుల పరిస్థితీ అంతే.  రిమ్స్ ఆసుపత్రి ప్రాంగణం అంతా అపరిశుభ్రంగా తయారవుతున్నా పట్టించుకునే నాధుడు కరువయ్యాడని రోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
నీరుగారిపోతోన్న రిమ్స్ లక్ష్యం  
అయితే లక్షలాదిమంది జిల్లా వాసులకు పెద్ద దిక్కుగా ఉన్న ఈ ఆసుపత్రి మరింత భరోసా కల్పించేలా రోగులకు సేవలందించాలని స్థానికులు కోరుతున్నారు. రిమ్స్ లక్ష్యం ఇలాంటి పరిణామాలతో నీరుగారిపోతోంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నా ప్రయోజనం ఉండదు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైద్యులు, వైద్య సిబ్బందిపట్ల  ప్రభుత్వం ముందస్తు కార్యాచరణతో కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.  

 

16:53 - August 2, 2018

ఆదిలాబాద్ : మంత్రి కేటీఆర్ సిర్పూర్ కాగజ్ నగర్ లో కేటీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. తెలంగాణ ప్రభుత్వం తప్పు లేకుండానే పేపర్‌ మిల్లు ముతపడిందని అన్నారు మంత్రి కేటీఆర్‌. మిల్లు యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల పేపర్‌ మిల్లు మూతపడిందని తెలిపారు. 

 

08:27 - July 22, 2018

ఏపీకి ప్రత్యేకహోదా విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో టీడీపీ నేత నాగుల్ మీరా, కాంగ్రెస్ నేత మీసాల రాజేశ్వరరావు, బీజేపీ నేత షేక్ బాజీ పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

16:59 - July 15, 2018
09:55 - July 14, 2018

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలోని మణుగూరు మండలం గాంధీనగర్ లో వర్షం పడింది. ఓబీ కట్టతెగి సమీప ఇళ్లల్లోకి వర్షపు  నీరు చేరింది. కాలనీ వాసులు నీటిని తోడిపోస్తున్నారు. సింగరేణి నిర్లక్ష్యంతో ఓబీ కట్ట తెగింది. ఇళ్లల్లోని సామాగ్రి నీటిపై తేలి ఆడుతోంది. బియ్యం, ఇతర నిత్యావసరాలు తడిశాయి. అన్నపానీయాలు లేక గాంధీనగర్ వాసులు అష్టకష్టాలు పడుతున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

07:46 - July 1, 2018

కడప ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని వక్తలు అన్నారు. రాష్ట్ర విభజన హామీలను అమలు చేయడంలో కేంద్రానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో కాంగ్రెస్ నేత గంగాధర్, బీజేపీ నేత బాజీ, టీడీపీ నేత నాగుల్ మీరా పాల్గొని, మాట్లాడారు. ఎంపీ సీఎం రమేష్ దీక్ష ఎన్నికల స్టంట్ అని బీజేపీ, కాంగ్రెస్ నేతలు విమర్శించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

08:39 - June 29, 2018

మైనార్టీల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు నడిపిస్తోంది.. ఇది మన తెలంగాణ ముఖ్యమత్రి కేసీఆర్‌ పదేపదే చెప్పేమాట. కానీ మైనార్టీ సంక్షేమం విషంయంలో తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆవాజ్‌ విమర్శిస్తోంది. మైనార్టీలకు రుణాలిస్తామని చెప్పి... దరఖాస్తు పెట్టుకున్నాక ఇంతవరకూ చాలా మందికి రుణాలివ్వలేదని, ఇప్పుడు మళ్ళీ దరఖాస్తు పెట్టుకోమంటున్నారని, ఇదెక్కడి పద్ధతంటూ ఆవాజ్‌ ప్రశ్నిస్తోంది. అన్యాక్రాంతమైన వక్ఫ్‌ బోర్డ్‌ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పేద ముస్లీంలకు ఇళ్ళు నిర్మించి ఇవ్వాలని ఆ సంఘం డిమాండ్‌ చేస్తోంది. మైనార్టీల సంక్షేమం కోసం తీసుకోవాల్సిన చర్యలపై ఇవాళ్టి జనపథంలో ఆవాజ్‌ తెలంగాణ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి అబ్బాస్‌ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీసర్కార్ చేతల ప్రభుత్వం కాదని.... మాటల ప్రభుత్వమని ఎద్దేవా చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

08:47 - May 31, 2018

హైదరాబాద్ : అధికారుల నిర్లక్ష్యం ఇద్దరు కార్మికుల ప్రాణాలను బలిగొంది. జలమండలి వాటర్‌ పైప్‌లైన్‌ నిర్మాణం పనుల్లో భాగంగా... ఇద్దరు కార్మికులు మ్యాన్‌ హోల్‌లోకి దిగి సెంట్రింగ్‌ కర్రలు తీస్తుండగా విషవాయువులు వెలువడ్డాయి. దీంతో కార్మికులు మ్యాన్‌హోల్‌లో పడి మృతి చెందారు. దీంతో మృతుల కుటుంబాలలో విషాద ఛాయలు అలుముకున్నాయి.  
మ్యాన్‌ హోల్‌లోకి దిగిన ఇద్దరు కార్మికులు మృతి 
హైదరాబాద్‌ ఉప్పల్‌ క్రికెట్‌ స్టేడియం వద్ద విషాదం నెలకొంది. జల మండలి వాటర్‌పైప్‌లైన్‌ నిర్మాణ పనుల్లో భాగంగా మ్యాన్‌ హోల్‌లోకి దిగిన ఇద్దరు కార్మికులు మృతి చెందారు. సెంట్రింగ్‌ కర్రలు తీస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 
విషవాయువుల కారణంగా ఊపిరి ఆడక మృతి 
ఉప్పల్‌ స్టేడియం రోడ్డులో రెండు భారీ పైపులైన్‌లను వేరు చేస్తూ ఇన్స్‌పెక్షన్‌ ఛాంబర్ నిర్మించారు. అయితే ఉప్పల్‌ స్టేడియంలో ఐపీఎల్‌ మ్యాచ్‌లు జరగడంతో ఆ ఛాంబర్‌ కోసం ఏర్పాటు చేసిన సెంట్రింగ్‌ కర్రలు తొలగించలేదు. ఇటీవలే మ్యాచ్‌లు పూర్తి కావడంతో ఎల్‌ అండ్‌ టీకి నిర్మాణ సంస్థ అధికారులు అక్కడ పనులు మొదలు పెట్టారు. అయితే ఎలాంటి భద్రతా ప్రమాణాలు పాటించకుండా చాంబర్‌లో ఉన్న సెంట్రింగ్‌ను తొలగించాలని కార్మికులను ఆదేశించారు అధికారులు. దీంతో మ్యాన్‌హోల్‌లోకి దిగిన కార్మికులు విషవాయువుల కారణంగా ఊపిరి ఆడక చనిపోయారు. వీరిద్దరూ ఒరిస్సాకు చెందిన సంతోష్‌,విజయ్‌లుగా గుర్తించారు. 
ఘటనపై పూర్తి స్థాయి విచారణ 
ఘటనా స్థలాన్ని జలమండలి అధికారులు పరిశీలించారు. కార్మికుల మృతితో ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించారు. నిర్మాణ సంస్థలకు నోటీసులు ఇచ్చి, బాధ్యులపై క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామన్నారు. చనిపోయిన వారి కుటుంబీకులకు 10 లక్షల పరిహారం అందిస్తామని ప్రకటించారు. అయితే ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా కొన్ని నిర్మాణ సంస్థలు తమ తీరు మార్చుకోకపోవడంతో ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు కఠిన చర్యలు తీసుకోకపోతే మరిన్ని ప్రాణాలు బలి కావాల్సి ఉంటుందంటున్నారు నిపుణులు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలంటున్నారు.
 

 

07:36 - May 30, 2018

కరీంనగర్ : ఓ లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యం ఏడు నిండు ప్రాణాలను బలితీసుకుంది. అతి వేగంతో వెళ్తున్న లారీ ఆర్టీసీ బస్సును ఢీ కొనడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. కరీంనగర్‌ జిల్లా మానకొండూరు మండలం చంజర్ల వద్ద లారీ-బస్సు ఢీకొన్న ప్రమాదంలో ఏడుగురు చనిపోగా, 15 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో జరిగిన మరో ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. 
అతి వేగమే ప్రమాదానికి కారణం
కరీంనగర్‌ జిల్లా మానకొండూరు మండలం చంజర్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 40 మంది ప్రయాణికులతో... కరీంనగర్‌ వెళ్తున్న ఆర్టీసీ బస్సును లారీ ఢీకొంది. రెండు లారీలు ఒకదానికి ఒకటి ఓవర్‌ టేక్‌ చేసుకుంటూ రావడంతో అదుపుతప్పి బస్సును మధ్య భాగంలో ఢీ కొంది. దీంతో బస్సులో ఉన్న ఏడుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో గాయపడ్డవారిని కరీంనగర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు చెప్పారు. 
ప్రమాదంపై సీఎం కేసిఆర్ తీవ్ర దిగ్భ్రాంతి 
చెంజర్ల వద్ద జరిగిన ప్రమాదం పై సీఎం కేసిఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై విచారణకు ఆదేశించారు. మంత్రి ఈటల రాజేందర్‌ ఘటనా స్థలానికి చేరుకుని.. ప్రమాదానికి గల కారణాలను పోలీసులను అడిగి తెలుసుకున్నారు. ఘటనపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. చనిపోయిన కుటుంబాలకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గాయపడ్డవారికి మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు ఆస్పత్రికి తరలించినట్లు ఈటల తెలిపారు. వైద్యానికి అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ఇలాంటి ఘటనలు  పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఈటల అన్నారు. కరీంనగర్‌-వరంగల్‌ ప్రధాన రహదారిపై తరచూ ప్రమాదాలు జరుగుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. 
రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం
రంగారెడ్డి జిల్లాలోనూ రోడ్డు ప్రమాదం జరిగింది. షాద్‌నగర్‌ టోల్‌ప్లాజా వద్ద బైక్‌ను లారీ ఢీ కొట్టడంతో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు మృతి చెందారు. హైదరాబాద్‌ నుండి జడ్చర్ల వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

 

16:57 - May 28, 2018

సంగారెడ్డి : సంగారెడ్డికి మెడికల్ కాలేజీ ఇవ్వడంలో తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర రాజనర్సింహ్మా అన్నారు. జగ్గారెడ్డి దీక్షకు ఆయన సంఘీభావం తెలపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సిద్దిపేటలో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయడంలో అభ్యంతరం లేదన్నారు. కానీ సంగారెడ్డికి రావాల్సిన మెడికల్ కాలేజీని సిద్దిపేటకు తీసుకపోవడం బాధాకరమన్నారు. సంగారెడ్డిని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించారు. సంగారెడ్డికి మెడికల్ కాలేజీ ఇవ్వడంలో సీఎం కేసీఆర్ జాప్యం చేస్తున్నారని అన్నారు. సంగారెడ్డికి మెడికల్ కాలేజీ సాధిస్తామని చెప్పారు. తాము అధికారంలోకి వస్తే మొదటి ప్రయారిటీ సంగారెడ్డికి మెడికల్ కాలేజీ ఉంటుందన్నారు.

 

Pages

Don't Miss

Subscribe to RSS - నిర్లక్ష్యం