నేడే విడుదల

20:53 - August 18, 2017

మహివీ రాఘవ డైరెక్ట్ చేసిన సినిమా ఆనందో బ్రహ్మ. ఈ సినిమాకు నిర్మాత విజయ్ చిల్లా. ఈ చిత్రంలో హీరోయిన్ తాప్సీ, నటులు వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, శకలక శంకర్ తదితరులు నటించారు. సినిమా ఈరోజు ప్రేక్షకులకు ముందుకు వచ్చింది. సినిమా రివ్యూ, రేటింగ్ విశేషాలను వీడియోలో చూద్దాం... 

19:20 - June 2, 2017

టుడే అవర్ రీసెంట్ రిలీజ్ ఫిల్మ్... 'అంధగాడు'. మరి సినిమా కహాని ఎంటో ఇప్పుడు చూద్దాం.....

 

19:19 - June 2, 2017

టుడే అవర్ రిసెట్ రిలీజ్ ఫిల్మ్స్ లేడిస్ టైలర్ మరి సినిమా కహాని ఎంటో ఇప్పుడు చూద్దాం.....

19:36 - May 12, 2017
18:40 - November 11, 2016

'ప్రేమమ్' తో బ్లాక్ బస్టర్ హిట్టు ఖాతాలో వేసుకున్న 'అక్కినేని నాగచైతన్య' లేటెస్ట్ గా మూవీ 'సాహసం శ్వాసగా సాగిపో'తో ఆడియన్స్ ముందుకొచ్చాడు. ఈ సినిమా శుక్రవారం నుంచి థియేటర్స్ లో సందడిచేస్తోంది. 'ఏ మాయ చేశావె' లాంటి క్యూట్ లవ్ స్టోరీని తెరకెక్కించిన దర్శకుడు గౌతమ్ మీనన్, నాగచైతన్యతో మరోసారి మ్యాజిక్ రిపీట్ చేయబోతున్నాడు. 'ప్రేమమ్' విజయం తర్వాత 'నాగచైతన్య' నటించిన సినిమా కావడంతో ఈ సినిమాపై హైప్ బాగా పెరిగిపోయింది. మరి ఈ సినిమా ఎలా ఉంది ? ప్రేక్షకుల అభిప్రాయాలు..సినిమా రివ్యూ తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

18:57 - November 4, 2016

సంగీత దర్శకుడిగా మంచి సంగీతంతో అలరించిన ఆర్పీ ప‌ట్నాయ‌క్ శ్రీను వాసంతి లక్ష్మి సినిమాలో సడెన్ గా నటుడిగా ఎంట్రీ ఇచ్చారు. తన నటనతో ప్రేక్షకులను విమర్శకులను కూడా మెప్పించారు. ఆర్పీ సినిమా చేస్తున్నారంటే త‌ప్ప‌కుండా అందులో ఏదో ఒక ఆస‌క్తిక‌ర‌మైన అంశం ఉంటుంద‌నే న‌మ్మ‌కం ప్రేక్ష‌కుల‌కు ఉంది. ఈ సారి మీడియాని ప్ర‌శ్నిస్తున్నామంటూ ఆర్పీ మ‌న‌లో ఒక‌డు సినిమాతో ముందుకొచ్చారు. ఇంత‌కు ముందు `బ్రోక‌ర్‌`తో ప్ర‌జాద‌ర‌ణ పొందిన ఆయ‌న ద‌ర్శ‌కుడిగా, న‌టుడిగా మ‌న‌లో ఒక‌డు చిత్రంతో ఆక‌ట్టుకుంటానా ? ఈ చిత్రంలో మీడియాను ఆర్పీ ఎలా ప్ర‌శ్నించారు? మీడియాలోని త‌ప్పొప్పుల‌ను ఎత్తిచూప‌డంలో ఆర్పీ సక్సెస్ అయ్యారా? తెలుసుకోవాలంటే `మ‌న‌లో ఒక‌డు` రివ్వ్యూ చూడండి..ఈ సినిమాకు 10టీవీ ఇచ్చిన రేటింగ్ కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

18:44 - November 4, 2016

హాయ్ హలో వెల్కం టు సెన్సేషనల్ ఫిలిం రివ్యూ షో నేడే విడుదల....ఈ రోజు నేడే విడుదలలో మనం మాట్లాడుకుబోయేది సుమంత్ హీరోగా వస్తున్న నరుడా..డోనరుడా.. అండ్.. ఆర్.పి పట్నాయక్ హీరోగా మనలో ఒకడు సినిమాల గురించి. లేట్ గా వస్తున్నా..లేటెస్ట్ గా డిఫరెంట్ సినిమాతో వస్తున్నాడు సుమంత్. చాలా గ్యాప్ తర్వాత హిందీ రీమేక్ మూవీ..నరుడా..డోనరుడా సినిమాతో ఆడియన్స్ ని పలకరించనున్నాడు.. ఈ సినిమా పర్ ఫెక్ట్ రివ్యూ షోలో 10 టివి ఇచ్చిన రేటింగ్ తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి..

18:41 - September 23, 2016

నేచురల్ స్టార్ నాని, మలయాళ భామ అను ఇమాన్యువేల్ జంటగా నటించిన వెరైటీ ప్రేమకథాచిత్రం మజ్నూ. ఉయ్యాల జంపాల ఫేమ్ విరించి వర్మ డైరెక్ట్ చేసిన ఈ సినిమాతో నాని ఈ సంవత్సరం హ్యాట్రిక్ కొట్టాడా? లేదా?

నానిని తనను నేచురల్ స్టార్ అని ఎందుకంటారో ఇప్పటివరుకూ చాలా సినిమాల్లో ప్రూవ్ చేసుకున్నాడు. కేవలం తన యాక్టింగ్ టాలెంట్ తో కంటెంట్ ఏమీ లేకపోయినా కూడా సినిమాను హిట్టు గట్టెక్కించగలడు . అదే హిట్టైతే దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందో , లాస్ట్ ఇయర్ భలే భలే మగాడివోయ్ తో నిరూపించాడు. ఇప్పుడు మజ్నూ విషయానికొస్తే , కథ పాతదే అయినా, కథనాన్ని తనదైన యాక్టింగ్ తో మసిపూసి మారేడు కాయ చేసేసాడు. సినిమా స్టోరీ, తరువాత ఏం జరుగుతుందో అందరూ ఎక్స్ పెక్ట్ చేసేదే, కాకపోతే హాయిగొలిపే సన్నివేశాలతో , బోర్ కొట్టించని నెరేషన్ తో ఈ సినిమాని బ్యాలెన్స్ డ్ గా తెరకెక్కించాడు విరించి వర్మ. అసలు నాని ప్రేమకథాచిత్రాలు చేసే స్థాయి ఎప్పుడో దాటిపోయాడు గానీ, ఈ సినిమాలో నాని హీరో అవడం వల్ల కథనానికే బలమొచ్చి, జనానికి కాస్తంత రిలాక్స్డ్ గా అనిపిస్తుంది. అదే వేరే ఇతర హీరోలెవరైనా ఈ సినిమా చేసి ఉండుంటే మాత్రం ఓ మామూలు రొటీన్ సినిమాలా మిగిలిపోయి ఉండేదేమో.

తన ప్రాణ స్నేహితుడు కాశి ప్రేమవ్యవహారం సెట్ చేద్దామని బైలుదేరిన ఆదిత్య, కిరణ్ అనే ఆ అందమైన అమ్మాయిని చూసి తొలిచూపులోనే ఆమెతో ప్రేమలో పడతాడు. ఆమెను రోజూ ఫాలో చేస్తూ అనుకోకుండా ఆమె చదివే కాలేజ్ లోనే జూనియర్ లెక్చరర్ గా జాయిన్ అవుతాడు. కొద్దిరోజులకు ఇద్దరి మధ్యా ప్రేమముదిరి పాకాన పడుతుంది. అయితే కాశీతో ఆదిత్య తనకన్నా బాగా క్లోజ్ గా ఉండడాన్నిభరించలేకపోతుంది కిరణ్. ఇద్దరి మధ్యా వాదోపవాదాలు జరుగుతాయి. దాంతో ఆమె మీద కోపంతో ఆమెను వదిలిపెట్టి వేరే ఊరు వెళ్లిపోతాడు. అక్కడ సుమ అనే మరో అమ్మాయికి ఆకర్షితుడై , ఆమెను తన ప్రేమలో పడేస్తాడు ఆదిత్య.అయితే తను ప్రేమిస్తున్న విషయాన్ని ఆదిత్య కు చెబుతూ, తనతో పాటే కిరణ్ ని తన కజిన్ గా పరిచయం చేస్తుంది సుమ. ఇద్దరి మధ్యా చిక్కుకున్న ఆదిత్య చివరికి తన ప్రేమను ఎలా గెలుచుకున్నాడన్నదే మిగతా కథ.

ఇలాంటి రొటీన్ కథను చివరి వరుకూ బోర్ కొట్టించకుండా నడిపించాలంటే ఎలాంటి డైరెక్టర్ కైనా కత్తి మీద సామే. అయితే డైరెక్టర్ మంచి మంచి సన్నివేశాలు రాసుకోవడం వల్ల, అందరూ మాట్లాడుకొనే సాధారణమైన సంభాషణల్ని పలికించడం వల్ల, అసలు ప్రేక్షకులకు టైమే తెలియకుండా పోతుంది . నాని తనదైన నటనా చాతుర్యంతో ,సంభాషణా చమత్కృతులతో ఈ సినిమా ఆద్యంతం ఆహ్లాదకరంగా సాగిపోతుంది. ఇక హీరోయిన్స్ గా నటించిన ఇద్దరమ్మాలు బాగా నటించడంతో సినిమా బాగానే సాగిపోతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ ఆసక్తికరంగా పడుతుంది. ప్రేమ విఫలమైనవాళ్లంతా మజ్నూలు అవ్వక్కర్లేదని, ప్రేమ నిజమైతే ఎవరూ మజ్నూలు కానవసరం లేదని విరించి వర్మ కొత్తగా చెప్పడానికి ట్రై చేసాడు. అయితే ఈ తరహా సినిమాల్ని మల్టీ ప్లెక్స్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతారు. మామూలు మాస్ ప్రేక్షకుడు ఎంతవరుకూ ఇష్టపడతాడో చెప్పలేం. క్లైమాక్స్ ను చాలా బ్యాలెన్స్ డ్ గా, ఫన్నీగా తెరకెక్కించాడు దర్శకుడు. టోటల్ గా సినిమా మరీ దారుణం లేకుండా , అలా అని మరీ సూపర్ గా కాకుండా, చూడ్డానికి బాగానే ఉంటుందనే కన్ క్లూజన్ కు వస్తారు ప్రేక్షకులు . ఈ వారం సినిమాలేవీ లేవు కాబట్టి, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బాగానే పాసైపోతుంది. 

20:56 - September 8, 2016

ప్రయోగాత్మక చిత్రాలంటే గుర్తుకువచ్చే నటుడు విక్రమ్. తమిళ నటుడే అయినా తెలుగులో విక్రమ్ సినిమాలకు మంచి క్రేజ్ ఉంటుంది. విలక్షణమైన కథలను ఎన్నుకుంటూ..రొటీన్ కు భిన్నమైన పాత్రలు పోషించే మంచి నటుడు విక్రమ్. తాజాగా విక్రమ్ మరో ప్రయోగాత్మక చిత్రంలో నటించాడు..లేదు లేదు జీవించాడంటేనే సరైంది. తమిళంలో 'ఇరు ముగన్’ సినిమాని తెలుగులో ‘ఇంక్కొక్కడు’అనే టైటిల్ తో తెలుగులోకి విడుదలచేశారు.

సైన్స్ ఫిక్షన్ కథాంశం
‘అరిమనంబి’ అనే తమిళ చిత్రంతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆనంద్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నయనతార, నిత్యమీనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో విక్రమ్ కండలుతిరిగిన దేహంతో కొత్త లుక్ లో అభిమానులను ఆకట్టుకున్నాడు. హారిస్ జయరాజ్ అందించిన సంగీతం మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాకు 10టీవీ ఇచ్చే రేటింగ్ తెలుసుకోవాలంటే ఈ వీడియో క్లిక్ చేయండి..

20:08 - June 17, 2016

ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండేవాళ్లు ముభావంగా ఉంటే చూడలేం. తెరపైనా అంతే...అమాయకపు క్యారెక్టర్లతో, హాస్యంతో ఆకట్టుకునే కథానాయకులను అలాగే చూడలనుకుంటాం. భిన్నంగా కనిపిస్తే...ఒంటబట్టించుకునేందుకు కొంతం సమయం పడుతుంది. ఇలాగే...నాని జెంటిల్ మన్ సినిమా పోస్టర్ లో సీరియస్ లుక్స్ తో కనిపించగానే...ఇదేంటి...నాని ఇలాగేంటి.. అనుకున్నారంతా. ఐతే నాని చేస్తున్నాడంటే ఏదో కొత్తదనం సినిమాలో ఉంటుందన్న నమ్మకం ప్రేక్షకుల్లో ఉంది. మరి ఈ నమ్మకం జెంటిల్ మన్ సినిమాతో నిలబడిందా...? లేదా..?.సమీక్షలో చూద్దాం...

ఇద్దరు అమ్మాయిలు నివేద, సురభి విమానంలో ప్రయాణిస్తుంటారు. మాటలు కలిసి స్నేహితులవుతారు. సురభి తను త్వరలో పెళ్లి చేసుకోబోయే అబ్బాయి గురించి...నివేద తన ప్రేమికుడి గురించి ఒకరికొకరు చెప్పుకుంటారు. ఈ కబుర్లు ఇద్దరికీ ఆసక్తికరంగా ఉంటాయి. విమానం దిగగానే సురభి కోసం ఎదురుచూస్తున్న నాని....నివేద ప్రేమించిన అబ్బాయి ఒక్కరే. ఇది కథలో ప్రధాన మలుపు. నివేద ప్రేమించిన నాని....సురభికి కాబోయే భర్త ఎలా అయ్యాడన్నది ఫ్లాష్ బ్యాక్ తో సాగిన మిగిలిన కథ.......

 

థ్రిల్లర్ కథగా ప్రచారం చేసుకున్న జెంటిల్ మన్ లో థ్రిల్లింగ్ విషయాలేవీ లేవు. పైగా ఇలా ప్రచారం చేసుకోవడం వల్ల సినిమాకు నష్టమే జరిగింది. మొదట హీరోయిన్లు చెప్పుకున్న రెండు ప్రేమ కథలు కాస్త బాగున్నాయి. ఇవి సినిమా టేకాఫ్ కు పనికొచ్చాయి. ఐతే కథానాయకుడు నెగిటివ్ షేడ్స్ లో కనిపించిన సన్నివేశాలు బలహీనంగా తయారయ్యాయి. హైప్ తీసుకురావాల్సిన ఆ ఘట్టాలన్నీ తేలిపోయాయి. హీరో ఎందుకు ఇలా మారాడన్న అయోమయం ఏర్పడింది. కాసేపు సినిమా ఎటెల్తుందో ప్రేక్షకులకు అర్థం కాదు. మళ్లీ చివరి పది నిమిషాల్లో కథకు స్పష్టతనిచ్చాడు దర్శకుడు. కథనాన్ని ఇంకాస్త సరిచేస్తే మంచి సినిమా

నటీనటుల ప్రతిభ చూస్తే....నటనపరంగా ఎప్పుడూ తన సినిమాల్లో నానిదే పైచేయి. తను బాగా నటించాడని పేరొచ్చాకే..మిగతా వాళ్ల పేర్లు వినిపిస్తాయి. కానీ జెంటిల్ మన్ సినిమాలో ఈ పేరు నాయిక నివేదకు దక్కింది. మొత్తం సినిమాను లీడ్ చేసింది తనే. నాని నటించలేక కాదు...కథలో ఆ పాత్రకు అవకాశం లేదు. వెన్నెల కిషోర్ చేసిన పాత్ర బాగా నవ్వించింది. సినిమాలో ప్రేక్షకులకు ఈ పాత్రే ఉపశమనం కలిగించింది. అవసరాల శ్రీనివాస్ నెగిటివ్ క్యారెక్టర్ లో మెప్పించాడు. మణిశర్మ స్వరాల్లో అలజడి..అలజడి అనే పాట బాగుంది. నేపథ్య సంగీతం కథనాన్ని బాగా ఫాలో అయ్యింది. పీజీ విందా సినిమాటోగ్రఫీ అలరించింది. మొత్తానికి నాని కొత్త సినిమా మల్టీఫ్లెక్సులు, ఏ సెంటర్ల వరకు నిలబడొచ్చు. బీ, సీ సెంటర్లలో ఫలితం మిశ్రమంగానే వచ్చే అవకాశాలున్నాయి...

ఫ్లస్ పాయింట్స్....

1.నివేద నటన

2.వెన్నెల కిషోర్ హాస్యం

3.మణిశర్మ సంగీతం

మైనస్ పాయింట్స్...

1.పట్టులేని కథనం

2.సెకండాఫ్ సన్నివేశాలు

3.కథానాయకుడి పాత్ర

Pages

Don't Miss

Subscribe to RSS - నేడే విడుదల