నేరేళ్ల

18:21 - January 6, 2018

సిద్ధిపేట : నేరేళ్ల బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ సిద్దిపేట నుండి నేరేళ్ల వరకు పాదయాత్ర చేపట్టారు వామపక్ష నేతలు. పాదయాత్రను విజయవంతం చేయాలని టీజేఏసీ చైర్మన్‌ కోదండరాం ప్రజలకు సూచించారు. కేసీఆర్‌ బంధువులే ఇసుక మాఫియాలో ముఖ్య పాత్ర వహిస్తున్నారని ఆరోపించారు సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. నేరేళ్ల ఘటనపై మంత్రి కేటీఆర్‌ ఇంత వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. 

 

18:13 - December 15, 2017
07:19 - September 13, 2017

కరీంనగర్ : తెలంగాణ ఉద్యమానికి, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ఉత్తర తెలంగాణ మొదటి నుంచి అండగా నిలిచింది. ఇందులోనూ కరీంనగర్‌జిల్లా అయితే టీఆర్‌ఎస్‌కు పెట్టని కోట. ముఖ్యమంత్రి తనయుడు కేటీఆర్‌ కూడా ఇదే జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కరీంనగర్‌ కేంద్రంగా ఇటీవల జరిగిన పరిణామాలు ప్రభుత్వ పాలనకు మాయని మచ్చలా మిగిలాయి. నేరెళ్లలో దళితులపై పోలీసుల దాష్టీకం మొదలుకొని నిన్నటి మానకొండూరు ఘటన వరకు ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకతను తీసుకొచ్చాయి. నేరెళ్లలో ఇసుక లారీలను దగ్దం చేశారన్న కారణంతో దళితులను అరెస్ట్‌ చేసిన పోలీసులు వారిని చిత్రహింసలకు గురిచేశారు. ఒక్కొక్కరు సరిగా నడవలేని స్థితికి తీసుకొచ్చారు. దీంతో పోలీసులు, ప్రభుత్వ తీరుపై నిరసనలు వెల్లువెత్తాయి. నెరెళ్లలో ఇసుక మాఫియా దళితులపై దాడి చేశారని ప్రతిపక్షాలు విమర్శిస్తే... వారి ముఖాన దళితులు అని రాసిఉందా ఉంటూ కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీంతో రోజురోజుకు నేరెళ్ల దళితుల ఘటన ప్రభుత్వంపై వ్యతిరేకత తీసుకొచ్చింది.

ఇద్దరు దళిత యువకుల ఆత్మహత్యాయత్నం
మూడెకరాల భూమి పంపిణీ పథకంలో తమకు అన్యాయం జరిగిందని ఆత్మహత్యాయత్నం చేసిన ఇద్దరు దళిత యువకుల ఘటన కూడా ప్రభుత్వంపై వ్యతిరేకతను పెంచింది. సిద్ధిపేట జిల్లా బెజ్జంకి మండలం గూడెం వాసి మహంకాళి శ్రీనివాస్ , యాలాల పరశురాములు అనే యువకులు పంద్రాగస్టు రోజున ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయాలు కావడంతో వారిని కరీంనగర్‌ జిల్లా ఆసుపత్రికి... ఆ తర్వాత హైదరాబాద్‌కు తరలించారు. దీంతో గ్రామస్తులు, యువకుల బంధువుల ఆగ్రహాన్ని ప్రభుత్వం చవి చూడాల్సి వచ్చింది.

ప్రశ్నార్దకంగా చెన్నమనేని రమేష్‌ పౌరసత్వం
ఈ వివాదాల నుంచి ఎలా గట్టెక్కాలని ప్రభుత్వం ఆలోచిస్తోంటే... వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌ రూపంలో మరో సమస్య తెరపైకి వచ్చింది. చెన్నమనేని రమేష్‌ పౌరసత్వమే ప్రశ్నార్దకంగా మారింది. వరుస ఘటనలు ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెడుతుండడంతో అధికార టీఆర్‌ఎస్‌ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. దీంతో సీఎం అసలు ఏం జరుగుతుందో తెలుసుకునే పనిలోపడ్డారు. జిల్లా ప్రజాప్రతినిధులు, మంత్రులతో సమావేశం జరిపారు. పార్టీ నేతలపై కేసీఆర్‌ సీరియస్‌ అయినట్టు తెలుస్తోంది. మొత్తానికి టీఆర్‌ఎస్‌కు పెట్టని కోటగా ఉన్న కరీంనగర్‌లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోంది. మరి దీన్ని తగ్గించుకునేందుకు గులాబీబాస్‌ ఏ వ్యూహాలు రచిస్తారో వేచి చూడాలి.

13:25 - September 12, 2017

హైదరాబాద్ : గతంలో నేరెళ్ల ఘటనపై జస్టీస్‌ చంద్రకుమార్‌ రాసిన లేఖను హైకోర్టు పిల్‌గా స్వీకరించింది. ఘటనపై మూడు వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశించింది.గాయపడిన దానయ్య, హరీశ్‌లకు నిమ్స్‌ డాక్టర్లతో... వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచించింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

21:26 - September 8, 2017

హైదరాబాద్ : నిమ్స్‌ ఆస్పత్రిలో నేరెళ్ల బాధితులకు చికిత్స చేయకుండా బయటకు గెంటివేయడంపై కాంగ్రెస్‌ నేతలు మండిపడ్డారు. ప్రభుత్వ ఒత్తిడితోనే వైద్యులు వారిని బయటకు పంపారన్నారు సీఎల్పీ నేత జానారెడ్డి. కేటీఆర్‌ డైరెక్షన్‌తో బాధితులను పోలీసులు వేధిస్తున్నారన్నారు. బాధితుల పట్ల అమానుషంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ తీరుపై... మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు. బాధితులకు న్యాయం కోసం ఈనెల 15 నుంచి నేరేళ్లలో రిలే నిరాహార దీక్షలు చేపడతామరి జానారెడ్డి అన్నారు. 

Don't Miss

Subscribe to RSS - నేరేళ్ల