నోటిఫికేషన్

21:10 - February 23, 2018

ఢిల్లీ : రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఏపీలో 3, తెలంగాణలో 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. మార్చి 5న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల..నామినేషన్ల దాఖలుకు గడువు మార్చి 12..మార్చి 23న రాజ్యసభ ఎన్నికలు జరుగనున్నాయి. 16 రాష్ట్రాల్లోని 58 స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఉదయం 9గంటల నుండి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ జరుగనుంది. అదే రోజు సాయంత్రం 5గంటలకు ఓట్లను లెక్కించనున్నారు. 

16:58 - January 21, 2018

ఢిల్లీ : 20 మంది ఆప్ ఎమ్మెల్యేల అనర్హతపై నోటిఫికేషన్ జారీ అయింది. ఈసీ ప్రతిపాదనను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదించారు. 20 మంది ఆప్ ఎమ్మెల్యేలపై రాష్ట్రపతి అనర్హత వేటు వేశారు.

12:39 - January 7, 2018

మహబూబాబాద్ : మరో వారం రోజుల్లో కానిస్టేబుళ్ల నోటిఫికేషన్ విడుదల చేస్తామని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ప్రకటించారు. దాదాపు 10 వేల పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని ఆయన అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పోలీసు శాఖ నిర్వహిస్తున్న ట్రైయినింగ్ సెంటర్ ప్రారంభించారు. 

06:41 - December 14, 2017

విజయవాడ : ఉపాధ్యాయ అర్హత పరీక్ష, టెట్‌ షెడ్యూల్‌ను ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారి ప్రభుత్వం టెట్‌ పరీక్ష నిర్వహిస్తోందని.. టెట్‌ అర్హత సాధిస్తేనే ఉపాధ్యాయ నియామక పరీక్షకు అర్హులవుతారన్నారు. ప్రైవేటు, సాంఘిక సంక్షేమ శాఖ, ఐటీడీఏలు నిర్వహించే ఉపాధ్యాయ నియామకాలకు టెట్‌ అవసరమన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ టీచర్స్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ షెడ్యూల్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. నోటిఫికేషన్‌ ఈ నెల 14న విడుదల చేస్తున్నట్లు విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాస రావు చెప్పారు. టెట్‌ ఫీజును ఈ నెల 18 నుంచి 30 వరకు చెల్లించవచ్చన్నారు. ఆన్‌ లైన్‌ ద్వారా ఈ నెల 18 నుంచి 2018 జనవరి 1వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. డిసెంబర్‌ 19వ తేదీ నుంచి 31వ తేదీ వరకు పని వేళల్లో హెల్ప్‌ డెస్క్‌ సేవలు అందుబాటులో ఉంటాయని వివరించారు. దరఖాస్తులు, ఇతర అంశాలకు సంబంధించి ఆన్‌లైన్‌లో ఫిర్యాదులు ఈ నెల 19 నుంచి 30 వరకు స్వీకరిస్తామని చెప్పారు. జనవరి 9వ తేదీ నుంచి హాల్‌ టికెట్లను డౌన్‌ లోడ్‌ చేసుకోవచ్చిని తెలిపారు. టెట్‌ షెడ్యూల్‌కు సంబంధించి పూర్తి వివరాల కోసం

జనవరి17 నుంచి 27 వరకు టెట్‌ పరీక్షలు జరుగుతాయన్నారు. టెట్‌లో రెండు పేపర్లు ఉంటాయని తెలిపారు. మొదటి పేపర్‌కి డీఎడ్ వారు మాత్రమే అర్హులన్నారు. పేపర్‌-2కి బీఈడీ వారు అర్హులని తెలిపారు. మొదటి పేపర్‌కు ఇంటర్‌లో 50 శాతం మార్కులు పొందిన వారు అర్హులని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు 45 శాతం మార్కులు పొంది ఉంటే సరిపోతుందని తెలిపారు.

మొదటి సెషన్‌ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండవ సెషన్‌ మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరుగుతుందన్నారు. జనవరి 29న ప్రాధమిక కీ విడుదల చేస్తామని.. కీ పై అభ్యంతరాలను జనవరి 29 నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు తెలుపవచ్చన్నారు. ఫిబ్రవరి 6న ఫైనల్‌ కీ విడుదల చేసి.. ఫిబ్రవరి 8న ఫలితాలు ప్రకటిస్తామని మంత్రి గంటా తెలిపారు. ఒకసారి టెట్‌ అర్హత సాధిస్తే ఏడేళ్ల వరకు అవకాశం ఉంటుందని చెప్పారు. మరోవైపు ఉపాధ్యాయ పోస్టుల భర్తీ బాధ్యత ఏపీపీఎస్సీకి అప్పగించే ఆలోచనలో ఉన్నట్లు మంత్రి గంటా తెలిపారు. జూన్ నాటికి పోస్టులు భర్తీ చేయవలసి ఉన్నందున, సాధ్యాసాధ్యాలను పరిశీలించవలసి ఉందన్నారు. ఏపీపీఎస్సీ చైర్మన్‌ తో పాటు. సీఎం చంద్రబాబుతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు.

15:47 - December 13, 2017

గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌లో టెట్‌ పరీక్షకు సంబంధించి నోటిఫికేషన్‌ విడుదలైంది. విద్యాశాఖ మంత్రి ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఈ నెల 18 నుండి 30 వరకు అప్లికేషన్‌లు స్వీకరిస్తారు. ఆన్‌లైన్‌ అప్లికేషన్లు జనవరి 1 వరకు స్వీకరిస్తారు. జనవరి 9 నుండి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని మంత్రి తెలిపారు. జనవరి 17 నుండి 27 వరకు పరీక్షలు జరగుతాయన్నారు. ఉదయం తొమ్మిదిన్నర నుండి మధ్యాహ్నం 12 వరకు అలాగే మధ్యాహ్నం రెండున్నర నుండి 5 గంటల వరకు పరీక్ష జరగుతుందని తెలిపారు. ఫిబ్రవరి 8వ తేదీన పరీక్ష ఫలితాలు వెల్లడిస్తామన్నారు. 

22:08 - December 12, 2017

హైదరాబాద్ : ఉపాధ్యాయ నియామక పరీక్ష నోటిఫికేషన్‌కు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సవరణ చేసింది. పాత 10 జిల్లాలకు అనుగుణంగా మార్పులు చేసింది. ప్రత్యేక బీఈడీ, డీఈడీ చదివిన వారు కూడా పరీక్ష రాసేందుకు అవకాశం కల్పించింది. గతంలో 8,792 పోస్టుల భర్తీ కోసం.. 31 జిల్లాల ప్రాతిపదికన నోటిఫికేషన్‌ ఇవ్వడంతో కొంతమంది కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు.. రాష్ట్ర ప్రభుత్వం జీవోను సవరించి విడుదల చేసింది. ఈనెల 15తో ముగియనున్న గడువును... 30వ తేదీ వరకు పొడిగించింది. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని టీఎస్‌పీఎస్సీ స్పష్టం చేసింది. అయితే.. జిల్లాలను అభ్యర్థులు అప్‌డేట్‌ చేసుకోవాలని సూచించింది. 

07:24 - November 25, 2017

ఉపాధ్యాయ నియామక నోటిఫికేషన్‌ టీఆర్టీపై, తెలంగాణ సర్కార్‌కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. టీఆర్‌టీకి సంబంధించిన జీవో నంబర్ 25 ను సవరించి తీరాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. 10 జిల్లాల ప్రకారమే టీఆర్‌టీ నోటిఫికేషన్ ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశాలపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో వినయ్ కుమార్ (విశ్లేషకులు), వేలూరి శ్రీనివాస రావు (టీఆర్ఎస్) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. 

06:29 - November 25, 2017

హైదరాబాద్ : టీఆర్‌టీ నోటిఫికేషన్‌పై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. జీవో నంబర్ 25కి అనుగుణంగా 31 జిల్లాల ఆధారంగా టీఆర్‌టీ పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం అక్టోబర్ 10న నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిని వ్యతిరేకిస్తూ పలువురు హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. దీనిపై వాదోపవాదనలు విన్న న్యాయస్ధానం నోటిఫికేషన్ సవరించాల్సిందేనని స్పష్టం చేసింది.

ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన జి.అరుణ్‌కుమార్‌ సహా నలుగురు వ్యక్తులు, టీఆర్టీ నోటిఫికేషన్‌ను వ్యతిరేకిస్తూ.. కోర్టులో పిల్‌ వేశారు. తెలంగాణలోని పూర్వపు పది జిల్లాలకే రాష్ట్రపతి ఆమోదం ఉందని.. కొత్తగా ఏర్పడిన జిల్లాలకు ఆమోదం లేదని.. పిటిషనర్ తరపు వాదించిన రాహుల్‌రెడ్డి కోర్టుకు విన్నవించారు. నోటిఫికేషన్‌ ప్రకారం, కొత్త జిల్లాలోని అభ్యర్ధులు... పూర్వపు జిల్లాలో స్ధానికేతరుడై నష్టపోతారని వివరించారు. పాలనా సౌలభ్యం కోసమే 31 జిల్లాల ఏర్పాటు జరిగిందని, ఉద్యోగ నియామకాలకు ఈ జిల్లాలను ప్రామాణికంగా తీసుకోవడం చట్ట విరుద్ధమని రాహుల్‌రెడ్డి వాదించారు.

మరోవైపు సుప్రీం కోర్టు ఆదేశాల మేరకే టీఆర్‌టీ నిర్వహిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర అడ్వకేట్ జనరల్ దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి కోర్టుకు తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి రెండో వారంలో పరీక్షలు నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయం అమలయ్యేలా చూడాలని.. పరీక్ష వాయిదా పడకుండా చూడాలని ఆయన కోర్టును అభ్యర్ధించారు. 31 జిల్లాలను పరిగణనలోకి తీసుకుని పరీక్ష నిర్వహిస్తే స్థానిక అభ్యర్థులకు అన్యాయం జరగదని, రాష్ట్రపతి ఉత్తర్వుల్ని ఉల్లంఘించినట్లు కాదని ఏజీ వాదించారు.ఇరువురి వాదోపవాదనలు విన్న హైకోర్టు రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధమన్న పిటిషనర్ వాదనతోనే ఏకీభవిస్తూ తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన నోటీఫికేషన్ సవరించాలని ఆదేశించింది. న్యాయస్థానం ఉత్తర్వులతో.. టీఆర్టీకి సిద్ధపడుతున్న అభ్యర్థుల్లో హర్షం వ్యక్తమవుతోంది. 

13:35 - November 24, 2017

హైదరాబాద్ : టీఆర్‌టీ(టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్) నోటిఫికేషన్ పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తెలుగు రాష్ట్రాల హైకోర్టు మొట్టికాయలు వేసింది. కొత్త జిల్లాల వారీగా కాకుండా పాత జిల్లాల వారీగా నోటిఫికేషన్ అభ్యర్థులు డిమాండ్ చేస్తూ హైకోర్టు మెట్లు ఎక్కారు. దీనిపై దశల వారీగా విచారణ జరిగింది. శుక్రవారం తుది తీర్పును వెలువరించింది. పాత జిల్లాల ప్రకారమే నోటిఫికేషన్ విడుదల చేయాలని టీఎస్పీఎస్పీకి ఆదేశాలు జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రక్రియ గడువు డిసెంబర్ 15 వరకు పొడిగించాలని సూచించింది.

  • టీఆర్‌టీ ద్వారా 8,792 ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్సీ మొత్తం ఐదు నోటిఫికేషన్లను విడుదల చేసిన సంగతి తెలిసిందే.
  • స్కూల్‌ అసిస్టెంట్లు 1941, పీఈటీ 416 పోస్టులు,
  • స్కూల్‌ అసిస్టెంట్లు (వ్యాయామ విద్య) 9, భాషా పండితులు 1011,
  • ఎస్‌జీటీ 5,415 పోస్టుల చొప్పున భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు విడుదల చేశారు.
  • వచ్చే ఏడాది ఫిబ్రవరి రెండో వారంలో పరీక్ష తేదీలను ప్రకటించనున్నట్టు టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది.
  • స్కూల్‌ అసిస్టెంట్లు, ఎస్‌జీటీ, భాషా పండితుల పోస్టులకు టెట్‌ 20శాతం వెయిటేజీ కల్పించనున్నారు.
  • తాజా తీర్పుతో టీఎస్పీఎస్సీ, ప్రభుత్వ పెద్దలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. 
17:05 - November 14, 2017

హైదరాబాద్ : టీఆర్‌టీ(టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్) నోటిఫికేషన్ పై ఇంకా గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇటీవలే టీఎస్పీఎస్సీ ఈ నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. కానీ కొత్త జిల్లాల వారీగా కాకుండా పాత జిల్లాల వారీగా నోటిఫికేషన్ వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. దీనితో హైకోర్టులో దీనిపై పిటిషన్ దాఖలైంది. కొత్త జిల్లాల మాదిరిగా కాకుండా పాత జిల్లాల ప్రకారమే నోటిఫికేషన్ విడుదల చేయాలని పిటిషన్ లో కోరారు. వారం రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణనను వారం రోజులకు వాయిదా వేసింది. 

Pages

Don't Miss

Subscribe to RSS - నోటిఫికేషన్