నోటీసులు

15:14 - July 17, 2017

విజయవాడ : వైసీపీ ఎమ్మెల్యే రోజా మరోసారి చిక్కుల్లో పడ్డారు. గతంలో నిండు అసెంబ్లీలో వ్యవహరించిన తీరుపై ప్రభుత్వం నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. మరోసారి ఆమె చేసిన వ్యాఖ్యలపై ఏపీ స్పీకర్ కోడెల ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. వ్యాఖ్యలపై రోజాకు నోటీసులు ఇవ్వాలని కోడెల అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించారు.

ఎందుకు నోటీసులు..
రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం పలు ఏర్పాట్లు చేసింది. అందులో భాగంగా అధికార పక్షానికి చెందిన సభ్యులకు సీఎం చంద్రబాబు నాయుడు మాక్ పోలింగ్ నిర్వహించారు. అనంతరం పలువురు సభ్యులు ఓటింగ్ వేశారు. వైసీపీ ఎమ్మెల్యే రోజా కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. స్పీకర్ కోడెల తీరును ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. టిడిపి నాయకులకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్పీకర్ కోడెల ఎలా పాల్గొంటారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వచ్చి మాక్ ఓటింగ్‌ లో పాల్గొనడం సరికాదని..స్పీకర్ కూడా అందుకు సహకరించారని ఆరోపణలు గుప్పించారు. స్పీకర్ హుందాగా ప్రవర్తిస్తే బాగుంటుందని కానీ స్పీకర్ పదవికి ఆయన గౌరవం లేకుండా చేశారంటూ వ్యాఖ్యానాలు చేశారు.

కోడెల ఆగ్రహం..
స్పీకర్‌ను కించపరిచే విధంగా రోజా మాట్లాడారంటూ స్పీకర్ కోడెలకు విషయాన్ని తెలియచేశారు. దీనితో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. రోజాకు వెంటనే నోటీసులు జారీ చేయాలని అసెంబ్లీ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. దీంతో వైసీపీలో మరోసారి టెన్షన్ మొదలైంది.

14:35 - July 15, 2017

హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో సిట్ నోటీసుల పై ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ స్పందించారు. తనకు ఎలాంటి నోటీసులు అందలేదని ఆయన ట్వీట్టర్ ద్వారా తెలిపారు. తను ఎవరికీ స్టేట్మెంట్ ఇవ్వలేదని, ప్రస్తుతం తను పైసా వసూల్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నానని పేర్కొన్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

10:30 - July 15, 2017

హైదరాబాద్ : డ్రగ్స్‌ కేసులో ఎక్సైజ్‌ శాఖ రెండో జాబితా సిద్ధం చేసింది. ఇవాళ పలువురికి నోటీసులు జారీ చేసే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు నోటీసులు అందుకున్నవారిని ఈ నెల 19నుంచి 27వరకూ విచారించనుంది. కేసు కీలక దర్యాప్తులో ఉండగా అకున్ సబర్వాల్ సెలవులపై వెళ్లడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదిలావుంటే కొంతమంది సినీ నటులు తమకు నోటీసులు అందలేదని అంటున్నారు. మరికొంతమంది సినీ నటులు తమకు డ్రగ్స్ కేసుతో ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారు. నోటీసులపై నటుడు సుబ్బరాజు స్పందించారు. తనకు నోటీసులు వచ్చిన వార్త నిజమేనని ఒప్పుకున్నారు. కానీ కెల్విన్ లిస్ట్‌లో తన పేరు ఎలా వచ్చిందో ఇప్పటికీ అర్థంకావడంలేదన్నారు. డ్రగ్స్ కేసులో తనకు నోటీసులు వచ్చిన వార్త అవాస్తవమన్నారు నటుడు నందు. తనకు ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్  నుంచి ఎటువంటి నోటీసులు అందలేదని స్పష్టం చేశారు. ఎటువంటి ఆధారాలు లేకుండా తన పేరు లాగొద్దని ఎక్సైజ్ కార్యాలయానికి వచ్చి విజ్ఞప్తి చేశారు. డ్రగ్స్‌ కేసులో సిట్‌ నుంచి తనకు ఎలాంటి నోటీసులు అందలేదని యువ హీరో తనీష్‌ తెలిపారు. తనకు డ్రగ్స్‌ తీసుకునే అలవాటు లేదన్నారు. డ్రగ్స్‌ కేసుతో తనకు ఎలాంటి సంబంధమూ లేదన్నారు. నోటీసులు అందుకున్న ఐటమ్ గర్ల్ ముమైత్‌ఖాన్‌ కూడా తనకు డ్రగ్స్‌ వ్యవహారంతో సంబంధం లేదని తెలిపారు. డ్రగ్స్‌ మాఫియా సినీ పరిశ్రమకు విస్తరించడం దురదృష్టకరమని సినీయర్ నటులు అన్నారు. డ్రగ్స్ కేసులో తప్పు చేసిన స్టార్స్‌కి మా అసోసియేషన్ నుంచి ఎలాంటి సాయం ఉండబోదని మా అధ్యక్షులు శివాజీరాజా స్పష్టం చేశారు. 

15:36 - July 14, 2017

హైదరాబాద్ : డ్రగ్స్‌ కేసులో సిట్‌ నుంచి తనకు ఎలాంటి నోటీసులు అందలేదని హీరో తనీష్‌ తెలిపారు. తనకు డ్రగ్స్‌ తీసుకునే అలవాటు లేదన్నారు. డ్రగ్స్‌ కేసుతో తనకు ఎలాంటి సంబంధమూ లేదన్నారు. అనవసరంగా తనపేరు బయటకులాగారని వాపోయారు. 

12:51 - July 14, 2017

హైదరాబాద్ : డ్రగ్స్‌ సేవిస్తున్న పలువురు సినీరంగ ప్రముఖులకు నోటీసులు అందజేశామని అకున్‌సబర్వాల్‌ తెలిపారు.  ఈనెల 19 నుంచి నోటీసులు అందిన వారిని విచారిస్తామన్నారు. ఒక్కొక్కరినీ ఒక్కోరోజు వ్యక్తిగతం విచారించనున్నట్టు తెలిపారు. ఎవరు ఏరోజు విచారణకు హాజరుకావాలో నోటీసుల్లో తెలిపామన్నారు. డ్రగ్‌ నోటీసులు అందుకున్న వారిలో ప్రముఖ హీరోలు రవితేజ, తరుణ్‌, నవదీప్‌, తనీష్‌ పేర్లు బయటకొచ్చాయి. హీరోయిన్లు ఛార్మి, ముమైత్‌ఖాన్‌లు కూడా సిట్‌ నోటీసులు అందుకున్నవారిలో ఉన్నారు. క్యారెక్టర్‌ ఆర్టిస్టులు సుబ్బరాజు, నందు, ఆర్ట్‌ డైరెక్టర్‌ చిన్నా, నిర్మాత శ్రీనివాసరావు, డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ సిట్ నోటీసులు అందుకున్నారు. వీరందరిని సిట్ కార్యాలయంలోనే విచారిస్తామని అకున్‌సబర్వాల్‌ అంటున్నారు. ఛార్మి, ముమైత్‌ఖాన్‌లను మాత్రం వారు కోరుకున్న చోటే విచారిస్తామని చెప్పారు. ఈ నెల 19 నుంచి విచారణ ప్రారంభం కానుంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

12:38 - July 14, 2017
16:17 - July 12, 2017

హైదరాబాద్ : డ్రగ్స్‌ కేసులో సినీ ఇండస్ట్రీకి చెందిన 10 మందికి సిట్‌ నోటీసులు జారీ చేసింది. ముగ్గురు యువ హీరోలు, నలుగురు డైరెక్టర్లు, ఇద్దరు నిర్మాతలకు నోటీసులు అందజేసింది. 6 రోజుల్లోగా హాజరుకావాలని సిట్‌ ఆదేశించింది. ఆలోగా హాజరుకానిపక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

10:09 - July 11, 2017

హైదరాబాద్: దేశంలోకి వచ్చే విదేశీ విరాళాలపై కేంద్రం నిఘా పెట్టింది. అందులో భాగంగా వివిధ పార్టీలు, పలు స్వచ్ఛంద సంస్థలకు నోటీసులు జారీ చేసింది. అధికార బీజేపీ, కాంగ్రెస్, ఆప్, తదితరల పార్టీలను కేంద్రం కోరింది. విడివిడిగా ఆయా పార్టీలకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ మేరకు సమాచారం ఇచ్చింది. విదేశాల్లో ఉంటున్న వ్యక్తులు, వ్యాపార సంస్థల సహా ఎవరెవరు విరాళాలు ఇచ్చారో ఆ వివరాలు తమకు ఇవ్వాలని కేంద్ర హోం శాఖ కోరినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఇందులో భాగంగా దాదాపు ఆరువేల స్వచ్ఛందసంస్థలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది హోంశాఖ. స్వచ్ఛంద సంస్థలు.. విదేశాల నుంచి విరాళాలు పొందాలంటే విదేశీ విరాళాల నియంత్రణ చట్టం- ఎఫ్‌సీఆర్‌ఏ కింద నమోదు చేయించుకోవాలి. దీనికి సంబంధించి ప్రతి ఏడాది రిటర్న్స్ సమర్పించాలి. 2010-11 మొదలు 2014–15 మధ్య 18,523 స్వచ్ఛంద సంస్థలు రిటర్న్స్ దాఖలు చేయలేదు. ఆయా సంస్థలకు జూలై 8న షోకాజ్‌ నోటీసులిస్తూ వివరణ ఇవ్వాలంటూ జూలై 23 వరకు గడువు ఇచ్చింది. రిజిస్ట్రేషన్‌ను ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలంటూ 5,922 ఎన్జీవోలకు నోటీసులు ఇచ్చింది. ఇలా నోటీసులు అందుకున్న సంస్థల్లో తెలుగు రాష్ర్టాలకు చెందినవి కూడా వున్నాయి.

13:54 - June 27, 2017

హైదరాబాద్ : సివిల్స్ మూడో ర్యాంకర్ రోణంకి గోపాలకృష్ణకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. గోపాలకృష్ణ తప్పుడు ధృవీకరణపత్రంతో వికలాంగుల కోటాలో ర్యాంక్ సాధించారని లాయర్ మురళీకృష్ణ హైకోర్టులో పిల్ వేశారు. పిల్ పై విచారణ చేపట్టిన కోర్టు గోపాలకృష్ణకు నోటీసులు పంపింది. కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, యూపీఎస్సీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. 
మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

19:41 - June 12, 2017

ప్రకాశం : జిల్లా విద్యాశాఖాధికారుల అత్యుత్సాహం విద్యార్థుల జీవితాలను రోడ్డున పడేస్తోందని.. మాజీ మంత్రి పాలేటి రామారావు అన్నారు.. స్కూళ్లు మూసివేయాలంటూ కొన్ని ప్రైవేటు పాఠశాలలకు నోటీసులు జారీ చేయడాన్ని రామారావు తప్పుబట్టారు.. చైతన్య, నారాయణలాంటి విద్యాసంస్థలకూ నోటీసులు జారీచేసి అధికారులు చిత్తశుద్ది చాటుకోవాలని కోరారు.. విద్యాసంస్థలకు నోటీసులపై ఒంగోలు కలెక్టర్‌ కార్యాలయంలో తల్లిదండ్రులతోకలిసి డిఆర్ ఓకు వినతిపత్రం అందజేశారు..

Pages

Don't Miss

Subscribe to RSS - నోటీసులు