న్యాయం

13:26 - July 16, 2017

గిదేమి న్యాయం..పేదోడికి ఒక న్యాయం..డబ్బున్నోడికి ఒక న్యాయం..మతానికొక న్యాయం..కులానికి ఒక న్యాయం..మాములు ఆడదానికొక న్యాయం...ప్రశ్నించాల్సిన వారు ఏం చేస్తున్నరు ? అంటూ ఘటనలపై జనాలు ప్రశ్నిస్తున్నరు. మరి వారి ప్రశ్నలకు సమాధానం ఉందా ?

కలెక్టర్ చేయి పట్టుకున్న ఎమ్మెల్యే...
ఇటీవలే రెండు ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో యాదృచ్చికంగా చోటు చేసుకున్నాయి. ఈ రెండు ఘటనలపై కొన్ని మీడియా..ప్రతికలు విభిన్నంగా స్పందించాయి. మహిళలపై జరుగుతున్న వాటిపై పోరాడాల్సిందే..వారికి న్యాయం జరగాలని నినదించాల్సిందే. అందులో  ఎలాంటి డౌట్ అవసరం లేదు. కానీ ఇక్కడ జరిగింది విభిన్నంగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ చేసిన నిర్వాకం అందరికీ తెలిసిందే. మహిళా అధికారి అయిన కలెక్టర్ తో అమర్యాదగా ప్రవర్తించారు. ఈ ఘటన తీవ్ర సంచలనం రేకేత్తించింది. ఇలాంటి ఘటనను అందరూ ముక్తకంఠంతో ఖండించారు కూడా.

గరగపర్రు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమగోదావరి జిల్లా 'గరగపర్రు' సాంఘీక బహిష్కరణ మీద గత కొన్ని రోజులుగా ఆందోళనలు జరుగుతున్నాయి. భీమవరంలో ఉద్యమిస్తున్న ఓ యువతిపై మగ ఖాకీ పట్టుకున్న విధానం అత్యంత దారుణం. భీమవరానికి వెళ్లేందుకు ప్రయత్నించిన గరగపర్రు దళితులను పోలీసులు అడ్డుకున్నారు. దీనితో ఇరువర్గాలకు మధ్య దళితులకు తోపులాట జరిగి ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. వీరికి మద్దతుగా తరలివచ్చిన సీపీఎం శ్రేణులను అరెస్టు చేశారు.

విభిన్న స్పందనలు..
ఈ ఘటనలపై కొన్ని పత్రికలు..కొన్ని మీడియా ఛానెల్స్ విభిన్నంగా స్పందించాయి. ఎందుకలా ? మహిళలను మహిళ పోలీసులే అరెస్టు చేయాలి అనే కనీస విషయాన్ని మరిచిపోయారా ? మహిళకు మీరు ఇస్తున్నటు వంటి రక్షణ ఇదేనా అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నలు కురిపిస్తున్నారు. మహిళలపై జరుగుతున్న వాటిని ఎవరైనా ఖండించాల్సిందే కానీ ఏ ఘటనకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారనే విషయాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు. భీమవరంలో మహిళలను మగ పోలీసులు అవమానించిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. బలహీన వర్గాల విషయంలో కూడా ఇలాగే వ్యవహరిస్తారా ? ప్రజాస్వామ్యయుతంగా పాలకులు కానీ, మీడియా ప్రవర్తించడం లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. గతంలో తహశీల్దార్ వనజాక్షి పై ఎమ్మెల్యే చింతమనేని చేసిన దౌర్జన్యం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. అనంతరం ఈ ఘటనలో పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.

మహిళలపై అరాచకం..అన్యాయం జరిగినా..ఖండించాల్సిందేనని..కానీ కలెక్టర్ కి ఒక న్యాయం..మండల అధికారికి ఒక న్యాయం...సామాన్య మహిళకి ఒక న్యాయమా? ఆలోచించాలంటూ సూచనలు వినిపిస్తున్నాయి.

16:10 - April 14, 2017

20 రోజులయినా తేలని నిజాలు..డిగ్రీ స్టూడెంట్ రాజేష్ ది హత్యా ? ఆత్మహత్యా? ప్రేమ వ్యవహారంలోనే ఘోరం జరిగిందా ?

మరో దళిత కుటుంబం న్యాయం కోసం 20 రోజులుగా పోలీస్ స్టేషన్ చుట్టూ ప్రదిక్షణలు చేస్తోంది. మర్రిపాలెం గూడెం కు చెందిన రాజేష్ నిరుపేద కుటుంబం. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో రాజేష్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో దళిత యువకుడు రాజేష్ చదువుతున్నాడు. రాజేష్ బావిలో శవమై కనిపించాడు. ప్రేమ వ్యవహారంలోనే హత్యకు గురయ్యాడని కన్నవారు చెబుతుండగా పోలీసులు మాత్రం ఆత్మహత్యే అంటూ పేర్కొంటున్నారు. పోలీసులు ఎందుకు స్పందించడం లేదని కుటుంసభ్యులు ప్రశ్నిస్తున్నారు. మరి వీరికి న్యాయం దక్కుతుందా ? రాజేష్ ది హత్యా ? ఆత్మహత్యా ? అనేది తేలుతుందా ? చూడాలి. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి...

20:38 - April 4, 2017

హైదరాబాద్: తెలిసి చేశారో.. తెలియకచేశారో...అస్సలు చేయలేదో మొత్తానికి ఊచలు లెక్కపెడుతున్నారు. కానీ ఏ విషయం తేల్చాలి కదా? అయితే బయటికి.. లేదంటే లోపలికి పంపాలి కదా? కానీ బీ అండర్ ట్రైల్ గానే ఉంచేస్తున్నారు. అస్సలు కంటే కొసలుతోనే శిక్షిస్తున్నారు. ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గేలా చేస్తున్నారు. ఇంకా కొన్ని చోట్ల సత్యం బాబు లాంటి వారు అనే మంది అన్యాయం శిక్షను అనుభవిస్తున్నారు. వీరిలో నిరుపేద దళితులు, ఎస్టీలు, ముస్లింలు ఎక్కువగా ఉన్నారని సర్కారీ లెక్కలే స్పష్టం చేస్తున్నాయి. దేశంలో బడుగు జీవులకు న్యాయం జరగకుండా ఆమడ దూరంలో ఉందని స్పష్టం అవుతోంది. ఇదే అంశం పై నేటి వైడాంగిల్ సోరీ. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

22:13 - March 31, 2017

బాధితులుయ...32 లక్షల మంది....మోసం రూ.6380కోట్లు, కన్నీళ్లు కొలవలేనన్ని, న్యాయం జరుగుతుందా..? ఇదే అంశంపై ఇవాళ్టి వైడ్ యాంగిల్ ప్రత్యేకం కథనం. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం..

 

20:33 - March 31, 2017

హైదరాబాద్ : కోర్టుల్లో ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని సత్యంబాబు తరపు న్యాయవాది ప్రతాప్‌రెడ్డి అన్నారు. ఈమేరకు ఆయన టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. పోలీసులు ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరించినప్పుడే ఇలాంటి తప్పిదాలు జరుగుతాయన్నారు. సత్యంబాబు దోషికాదని ఆయేషా తల్లి కూడా చెబుతూనే ఉందని తెలిపారు. అయినా పోలీసులు అసలు దోషులను వదిలిపెట్టి.. అమాయకుడైన సత్యం బాబును ఇరికించారని చెప్పారు. ఏమైనా సత్యంబాబును నిర్దోషిగా ప్రకటించడంపై అందరికీ కోర్టులపై గౌరవం పెరుగుతుందన్నారు. 

21:49 - March 30, 2017

ఢిల్లీ : కృష్ణా జలాల పంపిణీలో తెలంగాణకు న్యాయం చేయాలని ఎంపీ వినోద్ కేంద్రాన్ని కోరారు. లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఎంపీ వినోద్ ఈ అంశంపై మాట్లాడారు. కృష్ణా ట్రిబ్యునల్ తీరుపై తెలంగాణ సర్కార్ కేంద్రానికి ఫిర్యాదు చేసినా..ఇప్పటివరకు కేంద్రం స్పందించలేదన్నారు. న్యాయంగా తమకు రావాల్సిన నీటి కోసమే తెలంగాణ పోరాటం జరిగిందని వినోద్ స్పష్టం చేశారు. కృష్ణా జలాల పంపిణీకి సంబంధించి ఏపి, తెలంగాణ సిఎంల మధ్య సయోధ్య కుదరలేదని-దీనిపై కమిటీ వేశామని మంత్రి సంజీవ్‌కుమార్‌ బలయాన్‌ చెప్పారు. బజాజ్‌ కమిటి నివేదిక అందాక తదుపరి చర్యలు తీసుకుంటామని మంత్రి హామి ఇచ్చారు.

 

21:56 - March 27, 2017

పదో తరగతి విద్యార్థులకు న్యాయం చేయాలని వక్తలు కోరారు. పదో తరగతి పరీక్ష పత్రాలు...లీకేజీ.. అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో జూ.లెక్చరర్స్ ఆసోసియేషన్ నేత మధుసూదన్ రెడ్డి, టీఎస్ యూటీఎఫ్ నేత నర్సిరెడ్డి, భౌతికశాస్త్ర నిపుణులు కృష్ణకుమార్, టీఆర్ ఎస్ నేత రాకేష్ పాల్గొని, మాట్లాడారు.  'విద్యార్థుల జీవితాలతో తెలంగాణ విద్యాశాఖ చెలగాటమాడుతుంది. ప్రశ్నపత్రాల వరుస లీకేజీలతో పదో తరగతి విద్యార్థులు హడలెత్తిపోతున్నారు. దీనికితోడు అవుట్‌ ఆఫ్‌ సిలబస్‌ నుంచి ఫిజిక్స్‌ ప్రశ్నాపత్రం రావడం.. అనుభవం లేని కన్సల్టెంట్లు పేపర్లు తయారు చేయడం.. విద్యార్థుల పాలిట శాపంగా మారుతోంది. పరీక్షలు.. విద్యార్థుల జీవితానికే పరీక్షగా మారాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి'. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

08:50 - March 26, 2017

గుంటూరు : అగ్రిగోల్డ్ బాధితులకు తప్పకుండా న్యాయం చేస్తామని ఏపీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్పష్టం చేశారు. నిష్పక్షపాతంగా విచారణ జరిపి నిందింతులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అగ్రిగోల్డ్ కేసు సహారా కేసు లాంటిదని డీజీపీ సాంబశివరావు అన్నారు. కేసు విచారణలో జాప్యం జరుగుతుందన్న వాదనలో వాస్తవం లేదని తెలిపారు.

 

18:48 - March 25, 2017

అమరావతి: అసెంబ్లీలలో తమ రాజకీయాల కోసం కాకుండా.. నిజంగా అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఘర్షణ పడితే బాగుంటుందని అగ్రిగోల్డ్‌ బాధిత సంఘం గౌరవ అధ్యక్షులు ముప్పాళ వెంకటేశ్వరరావు అన్నారు. బాధితులకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా ప్రతిపక్షం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని అన్నారు.

08:41 - March 23, 2017

ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ అసోసియేషన్ తిరుమలరావు డిమాండ్ చేశారు. ఇదే అంశంపై ఇవాళ్టి జనపథంలో ఆయన మాట్లాడారు. 'అగ్రిగోల్డ్ బాధితులు మరోసారి పోరుబాట పట్టారు. రెండు రోజుల క్రితం అగ్రిగోల్డ్ బాధితులు విజయవాడలో భారీ ర్యాలీ నిర్వహించారు.  మార్చి 3 నుంచి నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. 32 లక్షల మంది వున్న బాధితులకు సత్వర న్యాయం చేయకపోతే, ఎమ్మెల్యేల ఇంటి ముందు ధర్నాలు చేయకతప్పదంటూ హెచ్చరిస్తున్నారు. బాధితులకు ఒక్కొక్కరికి పది లక్షల రూపాయల చొప్పున తక్షణ ఎక్స్ గ్రేషియా చెల్లించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లింపుల విషయంలో ఎందుకు జాప్యం జరుగుతోంది? అనే అంశాలపై ఆయన మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

Pages

Don't Miss

Subscribe to RSS - న్యాయం