న్యాయమూర్తులు

06:42 - April 1, 2018

హైదరాబాద్ : న్యాయ స్థానాల్లో కేంద్ర ప్రభుత్వ జోక్యం ఎక్కువైందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. సీనియర్ న్యాయ మూర్తులు లేవనెత్తిన అంశాలపై చర్చ జరగాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. అలాగే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంలో మార్పులు తేవాలనుకోవడంపై దళిత, వామపక్ష సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయని అన్నారు. ఏప్రిల్2న దళిత సంఘాల దేశవ్యాప్త నిరసనలకు సీపీఐ మద్దతు ఇస్తుందని చెప్పారు. కేసీఆర్‌ ప్రభుత్వం నియంతృత్వంగా వ్యవహరిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. నూతన పంచాయతీ రాజ్ చట్టం గ్రామాల్లో వైషమ్యాలు తెచ్చేలా ఉందని ఆయన ఆరోపించారు. ఒక్క మహిళకూ తన మంత్రివర్గంలో స్థానం లేదు కేసీఆర్ సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఏప్రిల్ 1 నుంచి 4 వరకు ఆర్టీసీ కళ్యాణ మండపంలో సీపీఐ రాష్ట్ర మహాసభలు జరుగుతాయి అని తెలిపారు.

12:11 - March 1, 2018

హైదరాబాద్ : న్యాయం కోసం వాదించే న్యాయవాదులు రోడ్డెక్కారు. తమ సమస్యలు..డిమాండ్లు పరిష్కరించాలంటూ ఆందోళన చేపట్టారు. ఉమ్మడి హైకోర్టులో తెలంగాణ...ఏపీ న్యాయవాదులు గురువారం విధులను బహిష్కరించి ప్లకార్డులు పట్టుకుని ఆందోళన చేశారు. హైకోర్టుకు పూర్తిస్థాయి ప్రధాన న్యాయమూర్తిని నియమించాలని, ఖాళీగా ఉన్న న్యాయమూర్తుల పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అంతేగాకుండా సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. న్యాయవాదుల ఆందోళనతో పోలీసులు భారీగా మోహరించారు.

రెండు రోజుల పాటు ఈ ఆందోళన కొనసాగనుందని తెలుస్తోంది. ఉమ్మడి రాష్ట్రాల బార్ అసోసియేషన్ సభ్యులు కూడా ఆందోళనలో పాల్గొంటున్నారు. ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు చొరవ తీసుకుని సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. మరి వీరి డిమాండ్లపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయో చూడాలి. 

21:16 - January 13, 2018

మహారాష్ట్ర : సుప్రీంకోర్టులోని నలుగురు న్యాయమూర్తులు మీడియా సమావేశం ఏర్పాటు చేయడాన్ని శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే ప్రశంసించారు. న్యాయ దేవతను మూగ, చెవిటిని చేసే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా పనులు కొనసాగుతున్నాయని పరోక్షంగా బిజెపిని టార్గెట్‌ చేశారు. న్యాయ వ్యవస్థలో ప్రభుత్వం జోక్యం చేసుకోకుండా...తన పని తాను చేసుకునేలా చూడాలని సూచించారు. న్యాయమూర్తి లోయా అనుమానస్పద మృతిపై విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. సుప్రీంకోర్టు పాలనా వ్యవస్థ, పనితీరుపై నలుగురు జడ్జిలు జస్టిస్‌ చలమేశ్వర్, జస్టిస్‌ రంజన్‌ గోగోయ్, జస్టిస్ మదన్‌ లోకుర్‌, జస్టిస్‌ కురియన్ మీడియా సమావేశంలో ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఉద్ధవ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. న్యాయ వ్యవస్థను నమ్మాలో...లేదో...అన్న సందిగ్ధం ఏర్పడిందని ఉద్ధవ్ ఠాక్రే పేర్కొన్నారు.

21:16 - January 13, 2018

ఢిల్లీ : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రాకు... నలుగురు న్యాయమూర్తులకు మధ్య నెలకొన్న వివాదం సమసిపోనుందని అటార్ని జనరల్‌ కెకె వేణుగోపాల్‌ తెలిపారు. సుప్రీంకోర్టు హితాన్ని దృష్టిలో పెట్టుకుని న్యాయమూర్తులు ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుంటారన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఓ మీడియా ఛానల్‌తో మాట్లాడుతూ ... సుప్రీంకోర్టులో ఉన్న న్యాయమూర్తులు అనుభవజ్ఞులు, రాజనీతీజ్ఞులని అటార్ని జనరల్‌ పేర్కొన్నారు. మరోవైపు చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా...తిరుగుబాటు చేసిన నలుగురు న్యాయమూర్తులు జస్టిస్‌ చలమేశ్వర్, జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌, జస్టిస్‌ మదన్ లోకూర్‌, జస్టిస్‌ కురియన్‌లతో ఆదివారం సాయంత్రం సమావేశమవుతారని సమాచారం. సుప్రీంకోర్టులో పాలనా వ్యవస్థ సరైన దిశలో లేదని...ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదమని... నలుగురు జడ్జిలు ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. 

19:53 - January 12, 2018

స్వతంత్ర భారత న్యాయవ్యవస్థ చరిత్రలో శుక్రవారం ఒక సంచలనం. సాధారణంగా సామాన్యుడు న్యాయవ్యవస్థను విమర్శించాలంటే భయపడాల్సిన పరిస్థితి...ఉన్నటు వంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులైన నలుగురు సుప్రీంకోర్టు పనితీరును ప్రశ్నించడం హాట్ టాపిక్ అయ్యింది. చీఫ్ జస్టిస్ పై తీవ్రమైన అభియోగాలతో కూడిన విమర్శలు గుప్పించారు. వీరు లేవనెత్తిన అంశాలపై పారదర్శకత ఏర్పడుతుందా ? సుప్రీం పనితీరు ఎలా ఉంది ? తదితర అంశాలపై టెన్ టివి ప్రత్యేక చర్చ చేపట్టింది. ఈ చర్చలో 40 సంవత్సరాలు పాటు న్యాయసేవలందించిన న్యాయ శాస్త్ర నిపుణులు జస్టిస్ చంద్రకుమార్, సీనియర్ న్యాయవాది సురేష్ లు పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి...

19:49 - January 12, 2018

తిరుగుబాటు సరియైంది కాదని, న్యాయవ్యవస్థలో ప్రక్షాళన చేయడంలో వీరు ముందుకొచ్చారని తెలిపారు. న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యల అనంతరం జరుగుతున్న రూమర్స్ పెద్ద ప్రమాదమన్నారు. అన్యాయాలు..అక్రమాలు..తదితర విషయాలపై సరియైన విధంగా అనుసరించడం లేదన్నప్పుడు సరి చేయాలన్నారు. అనేక కుంభకోణాలను న్యాయవ్యవస్థ బయటపెట్టిందని..ఆయా కుంభకోణాల్లో చాలా మందికి శిక్షలను జడ్జి విధించారని గుర్తు చేశారు. కోట్లాను కోట్లు సంపాదించిన వారు కూడా జైలు శిక్ష అనుభవించారని తెలిపారు. న్యాయవ్యవస్థను ప్రతిష్టను పెంచుతూ వచ్చాయని, ఎక్కడో చిన్న లోపాలు జరుగుతున్నాయంటే..లోపాలను..సరిదిద్దలేదని అనుకోవచ్చా అని ప్రశ్నించారు. న్యాయవాదులు ఎన్నో ప్రయత్నాలు..చేసిన తరువాత బహిరంగంగా వచ్చే పరిస్థితి ఏర్పడిందన్నారు. అందులో భాగంగా చీఫ్ జస్టిస్ కు ఒక లేఖ రాయడం జరిగిందని, ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు. 

12:50 - April 17, 2016

హైదరాబాద్ : దేశంలోని న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల ఖాళీల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. అన్ని కోర్టుల్లో 5 వేలకు పైగా జడ్జి పోస్టులు ఖాళీగా ఉన్నట్టు నివేదికలు చెబుతున్నాయి. దీంతో న్యాయస్థానాల్లో పనిభారం పెరిగి, కోట్లాది కేసులు అపరిష్కృతంగా మిగిలిపోతున్నాయని న్యాయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశంలో ప్రస్తుతం ప్రతి పదిలక్షల మంది జనాభాకు 17 మంది న్యాయమూర్తులు ఉన్నారు. ఈ సంఖ్యను యాభైకి పెంచాలని లా కమిషన్‌ సిఫారసు చేసింది.

కోర్టుల్లో వేలాది జడ్జిల పోస్టులు ఖాళీగా ......

దేశంలోని కోర్టుల్లో వేలాది జడ్జిల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దేశంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా న్యాయస్థానాలు అందుబాటులోలేని విషయాన్ని లా కమిషన్‌ నివేదికలు గుర్తు చేస్తున్నాయి. ఉన్న కోర్టుల్లో కూడా భారీగా న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉండటంపై న్యాయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

దిగువ కోర్టులకు మంజూరైన జడ్జి పోస్టులు 20,214.....

దేశవ్యాప్తంగా వివిధ కోర్టుల్లో జడ్జిల ఖాళీల సంఖ్య ఐదు వేలు దాటిందని లా కమిషన్‌ నివేదిక చెబుతోంది. దిగువ కోర్టుల్లో మంజూరైన న్యాయమూర్తుల పోస్టులు 20,214. కానీ 4,600 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మంజూరైన పోస్టుల్లో ఇది 23 శాతం. అలాగే దేశంలోని 24 హైకోర్టుల్లో 1056 మంది న్యాయమూర్తులు ఉండాలి. కానీ 462 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. హైకోర్టుల్లో 44 శాతం న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో దిగువ కోర్టులతోపాటు హైకోర్టుల్లో పెండింగ్‌ కేసుల సంఖ్య 3.10 కోట్లకు చేరినట్టు లా కమిషన్‌ నివేదిక గణాంకాలు చెబుతున్నాయి. సుప్రీంకోర్టులో 31 మంది న్యాయమూర్తులు ఉండాలి. కానీ ప్రస్తుతం 25 మందే ఉన్నారు. ఆరు పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

10 లక్షల జనాభాకు 11 మంది న్యాయమూర్తులు ఉండాలి......

పెరుగుతున్న జనాభా అవసరాలను అనుగుణంగా కోర్టులతోపాటు, న్యాయమూర్తుల సంఖ్యను పెంచాలని లా కమిషన్‌ సిఫారసు చేస్తోంది. ప్రతి పదిలక్షల మంది జనాభాకు 11 మంది న్యాయమూర్తులు ఉండాలని 1987లో లా కమిషన్‌ చెప్పింది. అప్పటి జనాభాను బట్టి 7,675 మంది న్యాయమూర్తులు ఉన్నారు. ఆ తర్వాత ప్రతి పది లక్షల మంది జనాభాకు 17 మంది న్యాయమూర్తులు ఉండాలని లా కమిషన్‌ సిఫారసు చేసింది. ప్రస్తుతం ఇదే నిష్పత్తిలో న్యాయమూర్తులు ఉన్నారు. దేశంలోని కోర్టుల్లో రోజురోజుకు పెరుగుతున్న అపరిష్కృత కేసులను దృష్టిలో పెట్టుకుని... ప్రతి పది లక్షల మంది జనాభాకు 50 మంది న్యాయమూర్తులు ఉండాలని లా కమిషన్‌ 120 నివేదికలో సిఫారసు చేశారు. 2014లో లా కమిషన్‌ సమర్పించిన 245వ నివేదికలో కూడా ఇదే అంశాలన్ని నివేదించారు. అయినా పాలకులు ఈ దిశగా తీసుకుంటున్న చర్యలు శూన్యమని న్యాయ నిపుణులు పెదవి విరుస్తున్నారు.

అమెరికాలో ప్రతి పది లక్షల మంది జనాభాకు 107 మంది....

అమెరికాలో ప్రతి పది లక్షల మంది జనాభాకు 107 మంది న్యాయమూర్తులు ఉంటే, కెనాడాలో 75, బ్రిటన్‌లో 51, అస్ట్రేలియలో 42 మంది న్యాయమూర్తులు ఉన్నారని లా కమిషన్‌ నివేదికలు చెబుతున్నాయి. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా న్యాయమూర్తుల సంఖ్యను పెంచకపోతే అపరిష్కృత కేసుల సంఖ్య మరింత పెరిగిపోయే ప్రమాదం ఉందని న్యాయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

06:32 - March 20, 2016

హైదరాబాద్ : కేసుల విచారణ వీలైనంత త్వరగా పూర్తి చేయడం న్యాయవ్యవస్థకు సవాల్‌ గా మారిందన్నారు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏఆర్ దవే. ఉమ్మడి హైకోర్టు రాష్ట్ర స్థాయి జ్యుడీషియల్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో ప్రారంభమైన ఈ సదస్సులో... బాధితులకు సత్వర న్యాయ సేవలను ఎలా అందించాలన్నదానిపై.. న్యాయమూర్తులు... సలహాలు, సూచనలు అందించారు.
పదేళ్ల తరువాత నిర్వహించిన స్టేట్ లెవల్ జ్యుడీషియల్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ కు ఇరు రాష్ట్రాలకు చెందిన 900 పైగా న్యాయమూర్తులు హాజరయ్యారు. పెండింగ్ కేసుల సత్వర పరిష్కారం, కక్షిదారులకు అందించే సేవలపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశాలను ఈ సమావేశంలో చర్చించారు. జస్టిస్ ఏఆర్ దవే, జస్టిస్ ఎన్‌వీ రమణ, జస్టిస్ దీపక్ మిశ్రాలు న్యాయవాదులకు పలు సూచనలు, సలహాలు అందించారు. న్యాయ వ్యవస్థకు సంబంధించి ఏపీ ప్రభుత్వం పూర్తి సహకారాన్ని అందిస్తుందని సీఎం చంద్రబాబు చెప్పారు. కొత్త రాజధాని అమరావతిలో న్యాయమూర్తుల కోసం ప్రత్యేక సదుపాయలతో వసతి సౌకర్యాలు కలుగజేస్తామన్నారు.

న్యాయమూర్తుల పాత్ర ఎంతో కీలకం..
న్యాయస్థానాన్ని ప్రజలు దేవాలయాలుగా భావిస్తారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే ఆధ్వర్యంలో కేసుల పరిష్కారం 35 శాతం పెరగడం సంతోషమని అభినందించారు. కేసులను సత్వరం పరిష్కరించి కక్షిదారులకు మెరుగైన సేవలు అందించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. న్యాయవ్యవస్థలో న్యాయమూర్తుల పాత్ర ఎంతో కీలకమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏఆర్ దవే అన్నారు. న్యాయం చేకూర్చి బాధితుల కష్టాలను తీర్చడం ఒక మహోన్నతమైన కర్తవ్యమన్నారు. పాజిటివ్‌ ఆలోచనలతో కేసులను పరిశీలించాలని న్యాయమూర్తులు తెలిపారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో 6 సెషన్స్ పై చర్చించనున్నారు. 

21:55 - October 31, 2015

ఢిల్లీ : సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకంలో పారదర్శకంగా వ్యవహరించాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. ఈ విషయంతో అత్యునత ప్రమాణాలు పాటించాలని కోరారు. న్యాయవ్యవస్థలో ఉన్నత పదవులను ప్రాధాన్యత ఆధారంగానే భర్తీ చేయాలని కోరారు. న్యాయవ్యవస్థ క్రియాశీలత కారణంగా రాజ్యాంగం కల్పించిన అధికార వికేంద్రీకరణ నీరుగారి పోకూడదని పేర్కొన్నారు. మన ప్రజాస్వామ్యానికి చెందిన ప్రతి అంగం తనకు నిర్దేశించిన పరిధిలోనే పనిచేయాలి కానీ, ఇతర వ్యవస్థలకు కేటాయించిన వాటిలోకి చొరబడకూడదని చెప్పారు. జాతీయ న్యాయనియమకాల కమిషన్ చట్టాన్ని కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ఇటీవల తీర్పును ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్రపతి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఢిల్లీ హైకోర్టు స్వర్ణోత్సవం సందర్భంగా ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రసంగించారు.

 

21:20 - October 19, 2015

ఒకవైపు న్యాయ వ్యవస్థ... మరో వైపు శాసన వ్యవస్థ...రాజ్యాంగ సవరణలపై రెండు అత్యున్నత వ్యవస్థల మధ్య... ఎడతెగతని వివాదం... తాజాగా కొలీజియం, ఎన్ జిఎసీలపై సరికొత్త వైరుధ్యం దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. పార్లమెంట్ ఆమోదించిన ఎన్ జిఎసీ చట్టాన్ని సుప్రీంకోర్టు కొట్టివేయడంతో రెండు వ్యసస్థల మధ్య ఆధిపత్య ధోరణి తారా స్థాయికి చేరిందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. దేశానికి రెండు కళ్లలాంటి ఈరెండింటి మధ్య ఏమిటీ సంవాదం... ఈ సంఘర్షణ... ఎలాంటి పరిణామాలాకు దారి తీస్తుంది. న్యాయమూర్తుల నియామకంపై ఏకాభిప్రాయం కుదరడం సాధ్యం కాదా... ఇదే ఇవాళ్లి వైడ్ యాంగిల్..ప్రత్యేక కథనం.. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

Don't Miss

Subscribe to RSS - న్యాయమూర్తులు