పంచాయతీ

09:08 - September 12, 2018

హైదరాబాద్ : జూనియర్ పంచాయతీ కార్యదర్శి పోస్టులకు దరఖాస్తు గడువు అయిపోయిందని చింతిస్తున్నారా ? అదేం లేదు దరఖాస్తు గడువును ప్రభుత్వం పొడిగించింది. ఫీజు చెల్లింపునకు మంగళవారం చివరి తేదీ అని దరఖాస్తుకు బుధవారం అని ఇదివరకే ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ దరఖాస్తు నమోదులో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనే ఫిర్యాదులు రావడంతో గడువు తేదీని పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అభ్యర్థులకు అసౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకున్న అధికారులు… గడువు పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ ఆపద్ధర్మ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు సూచ‌న‌ల‌తో.. రెండురోజుల గ‌డువు పొడిగిస్తూ నియామక కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఫీజు చెల్లించడానికి గడువును సెప్టెంబరు 14 వరకు, దరఖాస్తు చేసుకోవడానికి గడువును సెప్టెంబరు 15 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

14:00 - July 16, 2018

హైదరాబాద్ : గాంధీభవన్‌లో జరుగుతున్న గ్రేటర్‌ కాంగ్రెస్‌ నాయకుల సమావేశంలో అజారుద్దీన్‌ వ్యవహారంపై గందరగోళం నెలకొంది. ఇటీవల సికింద్రాబాద్‌ నుంచి ఎంపీగా పోటీ చేస్తానని అజారుద్దీన్‌ ప్రకటించారు. దీంతో గ్రేటర్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. అజారుద్దీన్‌కు వ్యతిరేకంగా కార్యకర్తలు నినాదాలు చేశారు. 

 

21:08 - July 11, 2018

హైదరాబాద్ : పంచాయితీల్లో బీసీ రిజర్వేషన్ల విషయంలో సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. స్థానిక సంస్థల ఎన్నిక‌ల్లో రిజర్వేషన్లు 50 శాతం క‌న్నా మించ‌వ‌ద్దని ఇటీవ‌ల హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మంత్రి జూపల్లి కృష్ణారావు అధ్యక్షతన భేటీ అయిన మంత్రివ‌ర్గ ఉప సంఘం కూలంకుశంగా చ‌ర్చించింది. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ బీసీ రిజ‌ర్వేష‌న్లను 34 శాతం క‌న్నా త‌గ్గకుండా చూడాల‌ని మంత్రుల సబ్ కమిటీ తీర్మానించింది. గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును యాథాతథంగా అమలు చేయాలని కోరేందుకు సిద్ధమవుతున్నారు. ఇక అగస్టు ఒకటితో పంచాయితీల కాలపరిమితి ముగుస్తుండటంతో స్పెషల్ అఫీసర్లను వేసే అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని మంత్రి వర్గఉప సంఘం అభిప్రాయపడింది.

ఎట్టి ప‌రిస్థితుల్లోనూ బీసీ రిజ‌ర్వేష‌న్లను 34 శాతం క‌న్నా త‌గ్గకుండా చూడాల‌ని మంత్రుల సబ్‌ కమిటీ తీర్మానించింది. స్థానిక సంస్థల ఎన్నిక‌ల్లో రిజర్వేషన్లు 50 శాతం క‌న్నా మించ‌వ‌ద్దని ఇటీవ‌ల హైకోర్టు ఇచ్చిన తీర్పుపై పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధ్యక్షతన సెక్రటేరియట్‌లో భేటీ అయిన మంత్రివ‌ర్గ ఉప సంఘం కూలంకుశంగా చ‌ర్చించింది.

ఈ నెలాఖ‌రుతో పాల‌క‌వ‌ర్గాల ప‌ద‌వీకాలం ముగియ‌నున్న నేప‌థ్యంలో ఈలోపు ఎన్నిక‌లు నిర్వహించ‌లేని ప‌రిస్థితుల్లో తీసుకోవాల్సిన చ‌ర్యల‌పై కూడా సబ్‌కమిటీ చ‌ర్చించింది. గ‌త‌ పంచాయ‌తీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా 61 శాతం రిజ‌ర్వేష‌న్లను క‌ల్పించుకునే వెసులుబాటు సుప్రీంకోర్టు ఇచ్చింద‌ని...ఈ సారి కూడా 50 శాతం రిజ‌ర్వేష‌న్లను మించ‌కూడదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లాల‌ని నిర్ణయించిన‌ట్లు మంత్రి ఈటల రాజేంద‌ర్ తెలిపారు. బీసీలకు ఉన్న 34 శాతం రిజర్వేషన్లను రానున్న పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గకుండా చూడ‌టానికి సుప్రీం కోర్టును ఆశ్రయించాల‌ని నిర్ణయించిన‌ట్లు ఈటల తెలిపారు.

జూలై 31 తో సర్పంచ్‌ల పదవీకాలం ముగుస్తుంద‌ని...ఆ తర్వాత స్పెషల్ ఆఫీసర్లకు బాధ్యత‌లు అప్పగించాలా లేక పాల‌క‌వ‌ర్గం పదవీకాలం పొడిగించాలా అన్నదానిపై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామ‌న్నారు. దీనితో పాటు బీసీ గ‌ణ‌న విష‌యంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఎలా ముందుకు వెళ్లాల‌న్నది కూడా కేబినెట్లో చ‌ర్చించి నిర్ణయం తీసుకుంటామ‌ని తెలిపారు. రిజర్వేషన్ అంశంపై రాష్ట్రాలకు అధికారం ఇవ్వాలని ఇప్పటికే కేంద్రాన్ని కోరామ‌ని, దీనిపై మరోసారి కేంద్రానికి విజ్ఞప్తి చేయాల‌ని స‌బ్ క‌మిటీ నిర్ణయించిన‌ట్లు మంత్రి జూప‌ల్లి కృష్ణారావు తెలిపారు.

ఇక బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేసేలా ప్రభుత్వం సుప్రీం కోర్టులో తమ వాదనలు గట్టిగా వినిపించాలని బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్టయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 50 శాతం రిజర్వేషన్లనేవి విద్యా, ఉద్యోగాలపై మాత్రమేనని.. రాజకీయాలకు సంబంధం లేదని ప్రభుత్వం అంటోంది. ఇక తమిళనాడు 69 శాతం ఉన్నపుడు ఒక్కో రాష్ట్రంలో ఒక్కక్క విధంగా ఎందుకు ఉండాలనే వాదనను సుప్రీం కోర్టులో వినిపిస్తామని చేప్తోంది.

17:43 - July 11, 2018

హైదరాబాద్ : పంచాయతీరాజ్ ఎన్నికల నిర్వహణపై టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి చిత్తశుద్ధిలేదని టీపీసీసీ విమర్శించింది. ఎన్నికల నిలుపుదలకు హైకోర్టులో కేసు వేసిన వారిలో టీఆర్‌ఎస్‌ నాయకులు కూడా ఉన్నారని టీపీసీసీ అధికార ప్రతినిధి శ్రవణ్‌ మండిపడ్డారు. నాగర్‌కర్నూల నియోజకవర్గం ఎంపీటీసీ గోపాల్‌రెడ్డి కేసు వేసిన విషయం టీఆర్‌ఎస్‌ నాయకులకు తెలియదా.. అని శ్రవణ్‌ ప్రశ్నించారు. 

06:35 - July 5, 2018

బీసీలను ఏబీసీడీలుగా వర్గీకరించి వారికి బీసీ రిజర్వేషన్లు పంచి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ ఎంబీసీ సంఘం డిమాండ్‌ చేస్తోంది. ఈ అంశాన్ని కోర్టు వరకూ తీసుకెళ్లింది. ఇప్పటికీ స్థానిక సంస్థల్లో అధికారాన్ని అందుకోలేని బీసీ కులాలు చాలా ఉన్నాయని వారికి కూడా అధికారంలో సమాన అవకాశాలు దక్కాలని వారు కోరుతున్నారు. ఇదే డిమాండ్‌తో ఎంబీసీ సంఘం ఆందోళన చేస్తోంది. ఈ అంశంపై టెన్ టివి జనపథంలో తెలంగాణ ఎంబీసీ సంఘం నాయకులు ఆశయ్య విశ్లేషించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

06:45 - May 13, 2018

విజయవాడ : ఎలాంటి ఎన్నికలైనా సరే సై అంటోంది తెలుగుదేశం పార్టీ.. ఇంతవరకూ ఎన్నికలపై ఆచితూచి స్పందించిన టీడీపీ నేతల స్వరం ఇప్పుడు మారింది. వైసీపీ ఎంపీల రాజీనామా నేపథ్యంలో... ఉపఎన్నికలు, సాధారణ ఎన్నికలు ఏవైనా సరే సిద్దంగా ఉండాలంటూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సూచించడంతో.. పార్టీ నేత‌ల్లో స‌మ‌రోత్సాహం క‌నిపిస్తోంది. ఎన్నికలపై టీడీపీ వైఖరిలో మార్పు కనిపిస్తోంది.. ఇంతవరకూ టీడీపీ నేతలు ఎన్నికలపై ఆచితూచి మాట్లాడారు. కానీ.. ఉపఎన్నికలైనా.. సాధారణ ఎన్నికలైనా సరే సిద్ధంగా ఉండాలంటూ చంద్రబాబు పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో సంకేతాలు ఇచ్చారు. నంద్యాల ఉప ఎన్నిక‌, కాకినాడ కార్పోరేష‌న్ ఎన్నిక ఫ‌లితాలతో టీడీపీలో జోష్‌ పెరిగినా.. త‌ర్వాత ఆ స్పీడ్ క‌నిపించ‌లేదు. దీనికి తోడు చంద్రబాబు తీరు కూడా సాధార‌ణ ఎన్నిక‌ల‌కు మాత్రమే సిద్ధం అన్నట్లుగా కనిపించింది. ఉప ఎన్నిక‌ల్లో ఏమాత్రం తేడా జ‌రిగినా ఆ ప్రభావం వ‌చ్చే సాధార‌ణ ఎన్నిక‌లపై ప‌డుతుంద‌న్నది టీడీపీ అంచ‌నా. రాష్ర్టంలో నడుస్తున్న ప్రత్యేక హోదా ఉద్యమం, బీజేపీతో టీడీపీ తెగ‌దెంపులు, జ‌గ‌న్‌, ప‌వ‌న్ కళ్యాణ్‌ టీడీపీనే టార్గెట్‌ చేయడం వంటి పరిణామాలతో.. టీడీపీ ఎన్నిక‌ల‌ విషయంలో డైలమాలో పడ్డట్టు కనిపించింది.

వైసీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదం పొంది.. ఉప ఎన్నిక‌లు వ‌చ్చినా సరే పోటీకీ సిద్ధంగా ఉండాలని చంద్రబాబు పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో చెప్పారు. దీంతో మ‌ళ్ళీ ఉప ఎన్నిక‌లు వ‌స్తాయే మోన‌న్నచర్చ టీడీపీలో మొద‌లైంది. అటు రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం కూడా ఆగ‌స్ట్ 31లోగా పంచాయితీల‌కు ఎన్నిక‌లు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వానికి తెల‌ిపింది. ఈ నేపథ్యంలో అందుకు త‌గ్గట్లుగానే చంద్రబాబు వ్యాఖ్యలు చేశారేమో అని తెలుగు తమ్మళ్ళు భావిస్తున్నారు. ఏదేమైనా ఎన్నిక‌ల ఏడాది కావ‌డంతో.. ఎలాంటి ఎన్నికలొచ్చినా.. రెఢీ అంటున్నాయి టీడీపీ శ్రేణులు.

ఒక వేళ ఉపఎన్నికలు జ‌రిగినా.. మెజార్టీ సీట్లు తామే గెలుస్తామ‌న్న ధీమా టీడీపీలో క‌నిపిస్తోంది. ఆయా స్థానాల్లోని వైసీపీ ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరడం కూడా టీడీపీకి లాభిస్తుందంటున్నారు. అంతేగాక.. పట్టిసీమ ద్వారా రాయలసీమకు నీరివ్వడంతో పార్టీపై ప్రజలకు సానుకూల దృక్పథం ఉందని టీడీపీ చెబుతోంది. దీనికి తోడు చంద్రబాబు నేరుగా మోడీనే టార్గెట్‌ చేస్తూ విమర్శలు చేస్తుండడంతో.. ప్రజల్లో ప్రభుత్వం, పార్టీపట్ల సానుకూల దృక్పథం వచ్చిందని భావిస్తున్నారు. ఇటీవల చేయించిన ఓ సర్వేలో కూడా ఇదే తేలిందన్న గట్టి నమ్మకం టీడీపీలో కనిపిస్తోంది. ఏది ఏమైనా విసృత‌స్దాయి స‌మావేశం ద్వారా ఎన్నిక‌ల‌కు సిద్దం కావాల‌న్న సంకేతాలను చంద్రబాబు పార్టీ నేత‌ల‌కు ఇచ్చారు. మ‌రి ఉప ఎన్నిక‌లు, పంచాయితీ ఎన్నిక‌లు జ‌రుగుతాయా లేదా అన్నది త్వర‌లోనే తేల‌నుంది. 

18:39 - November 6, 2017

పశ్చిమగోదావరి : ఏసీబీ అధికారులకు మరో అవినీతి అధికారి చిక్కాడు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలంటే లంచం అడిగిన అధికారిని ఏసీబీ అదుపులోకి తీసుకుంది. నర్సాపురం పంచాయతీ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా శ్రీనివాసరావు విధులు నిర్వహిస్తున్నాడు. భీమవరం మండలానికి చెందిన 30 మంది కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్ చేయడానికి శ్రీనివాస రావు లంచం అడిగాడు. బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. దీనితో నర్సింహరాజు ఉద్యోగి నుండి లంచం తీసుకుంటుండగా ఏసీబీ దాడి చేసి రెడ్ హ్యాండెండ్ గా పట్టుకుంది. ఈ కేసులో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
ఒక్కో వ్యక్తి నుండి రూ. 1500 డిమాండ్ చేయడంతో..కార్మికులు రూ. 1300 ఒప్పుకున్నారని ఏసీబీ అధికారి పేర్కొన్నారు. ఇలా మొత్తంగా వసూలు చేసిన రూ. 45, 500 తీసుకుంటుండగా తాము దాడి చేసి పట్టుకున్నట్లు పేర్కొన్నారు. 

21:21 - November 3, 2017

హైదరాబాద్ : తెలంగాణలో కొత్త పంచాయితీ రాజ్ చట్టం రాబోతోంది. ఈ మేరకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. వీలైతే అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోపు కొత్త చట్టం తీసుకువచ్చేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. కొత్త పంచాయితీ రాజ్ చట్టం రూపకల్పనపై కేసీఆర్ ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం గ్రామ పంచాయితీలు, స్థానిక సంస్థలు ప్రమాదంలో ఉన్నాయని అభిప్రాయపడ్డ కేసీఆర్... ఇప్పుడున్న విధానం కొనసాగితే ఎటువంటి ప్రయోజనం ఉండబోదన్నారు. ఈ పరిస్థితిలో సమూలంగా మార్పు రావాలన్న కేసీఆర్ అందుకోసం కొత్త చట్టం రావాలన్నారు. ప్రగతి భవన్‌లో జరిగిన సమీక్ష సమావేశంలో..మంత్రులు జూపల్లి కృష్ణారావు, జోగు రామన్న, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి. సింగ్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.

పంచాయతీలు, స్ధానిక సంస్థలు రాను రాను రాజకీయమైపోతున్నాయన్న కేసీఆర్ ఈ పరిస్థితి నుంచి మార్పు రావాలన్నారు. గ్రామ సంచాయతీలు మరింత శక్తివంతం కావాలన్నారు. ప్రతీ కార్యక్రమంలోనూ గ్రామ పంచాయతీలను భాగస్వాములను చేయాలన్నారు. గ్రామ పంచాయతీల విధులు.. వాటికున్న బాధ్యతల విషయంలో పూర్తి స్ధాయిలో స్పష్టతనిస్తూ కొత్త చట్టం తయారు కావాలన్నారు కేసీఆర్. కేవలం విధులు, బాధ్యతలు అప్పగించడమే కాకుండా వచ్చే బడ్జెట్లో గ్రామ పంచాయతీలకు జనాభా ఆధారంగా నిధులు కేటాయిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఒక్కో గ్రామ పంచాయతీకి రూ.10 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు నిధులు సమకూరుస్తామన్నారు. నిధులతో పాటు ప్రజల భాగస్వామ్యం, నిరంతర పర్యవేక్షణ ఉంటే గ్రామ పంచాయతీలు సమర్థవంతంగా పనిచేస్తాయన్న కేసీఆర్.. విధుల నిర్వహణలో వైఫల్యం చెందిన చోట క్రమశిక్షణ చర్యలు తీసుకునే వెసులుబాటు ప్రభుత్వానికి ఉండాలన్నారు. వీటన్నింటికీ అవకాశం కల్పించే విధంగా కొత్త పంచాయితీ రాజ్ చట్టం తయారు కావాలని కేసీఆర్ అధికారులకు సూచించారు. వీలైతే ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లోనే కొత్త చట్టం తీసుకువచ్చేలా చర్యలు చేపట్టాలని సూచించారు. 

18:50 - August 10, 2017

తూర్పూ గోదావరి : కాకినాడ రూరల్ తిమ్మాపురం పంచాయతీ కార్యాలయం రణరంగంగా మారింది. పంచాయతీ చెరువులో నిర్మించిన మండపం కూల్చివేసిన ఘటనపై డివిజనల్ పంచాయతీ అధికారి సమక్షంలో విచారణ జరుగుతోంది. విచారణకు వచ్చిన ఇరువర్గాలు... ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ... బాహాబాహీకి దిగారు. పరిస్థితి అదుపు తప్పడంతో.. గమనించిన అధికారి... విచారణ వాయిదావేస్తూ వెనుదిరిగారు.

15:34 - July 19, 2017

వరంగల్ : గ్రామంలో ఏ సంఘటన జరిగినా ముందుగా గ్రామ పంచాయితీ గుర్తొస్తుంది. గ్రామ పంచాయితీ అధికారులు సమస్యల పరిష్కారానికి చొరవ చూపిస్తారు. కానీ అలాంటి గ్రామ పంచాయితీకి ఓ చోట తాళం పడింది. వరంగల్ రూరల్ జిల్లా, వర్ధన్నపేట మండలంలో గ్రామపంచాయితీకి తాళం పడింది. పంచాయితీ భవన నిర్మాణ నిధులు రాలేదని గ్రామ ఉప సర్పంచ్‌ మరియు వార్డు సభ్యులు కలిసి తాళం వేశారు.

2013 లో ఎన్ఆర్జీఎస్ నిధుల ద్వారా గ్రామ పంచాయితీ భవనం మంజూరైందని గ్రామ ఉప సర్పంచ్‌ తెలిపారు. నిధులు సకాలంలో రాకపోవడంతో గ్రామపంచాయితీకి సంబంధించిన పాలక వర్గ సభ్యులంతా కలిసి.. కొంత మొత్తంలో డబ్బులు జమ చేశారు. భవన నిర్మాణాన్ని పూర్తి చేసి నాలుగు ఏళ్లు గడుస్తున్నాయి. తమకు ఇప్పటికీ ఒక్క రూపాయి కూడా ముట్టలేదని.. అందుకే గ్రామ పంచాయితీకి తాళం వేశామని వార్డు సభ్యులు అంటున్నారు. కేవలం సంబంధిత ఏఈ అధికారి నిర్లక్ష్య వైఖరికి తామంతా బలి కావాల్సి వస్తోందని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు రావాల్సిన గ్రామ పంచాయితీ బిల్లును త్వరగా రప్పించాలని కోరుతున్నారు.

బిల్లులు వచ్చేంత వరకూ భవనాన్ని గ్రామ పంచాయితీ కోసం వాడేది లేదని వీళ్లు తేల్చి చెబుతున్నారు.

Pages

Don't Miss

Subscribe to RSS - పంచాయతీ