పంజాబ్

09:59 - October 6, 2018

పంజాబ్ : ఐటీ దాడులు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఐటీ దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ఏపీలో మాత్రం ఐటీ దాడులు కొనసాగడం ప్రకంపనలు సృష్టిస్తోంది. దీని వెనుక బీజేపీ హస్తం ఉందని టీడీపీ ఆరోపిస్తోంది. కానీ పంజాబ్ లో మాత్రం ఐటీ దాడులు జరగడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే ఒక పకోడా దుకాణంపై ఐటీ దాడులు జరగడం చర్చనీయాంశమైంది. 

పకోడాలపై ప్రధాన మంత్రి ఎలాంటి వ్యాఖ్యలు చేశారో అందరికీ తెలిసిందే. పకోడాలు అమ్ముకోవడం ఒక ఉద్యోగం లాంటిదే అంటూ వ్యాఖ్యలు చేయడం విమర్శలకు తావిచ్చింది. పకోడాలు వేస్తూ కాంగ్రెస్ నిరసనలు తెలిపాయి. పంజాబ్ లోని లూథియానాలో గిల్ రోడ్డులోని ‘పన్నా సింగ్ పకోరే వాలా’ దుకాణంపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. అసలు ఈ దుకాణంపై ఐటీ ఎందుకు దాడులు జరిపిందనే దానిపై చర్చ జరుగుతోంది. పన్నా సింగ్ ఫ్యామిలీ 1952లో ఈ షాపును ప్రారంభించింది. పకోడాతో పాటు ఇతర తినుబండారాలు విక్రియిస్తున్నాుడు. ఈ షాపుకు చాలామంది రాజకీయ నాయకులు, పోలీసులు, ఇతర ఉన్నతాధికారులు వస్తారని తెలుస్తోంది. 

ఈ నేపథ్యంలో అతను ఆదాయాన్ని తక్కువగా చేసి చూపినట్లు ఐటీ అధికారులకు పక్కా సమాచారం అందిందని, ఈ నేపథ్యంలోనే దాడులు నిర్వహించినట్లు సమాచారం. మిల్లర్ గంజ్ ప్రాంతంలో ఉన్న పన్నా సింగ్ షాపుల్లో తనిఖీలు చేపట్టారు. కానీ ఈ విషయంపై పన్నా కుటుంబం..ఐటీ అధికారులు స్పందించడం లేదని సమాచారం. కానీ పన్నా సింగ్ కుటుంబం ఐటీ అధికారులకు రూ. 60 లక్షలు అందచేసిందని టాక్. 

16:06 - September 21, 2018

పంజాబ్‌ : పంజాబ్‌లోని లూథియానాలో పుట్టింటి.పట్టుదలతో మేటి అనిపించుకుంది.చిన్న వయసులోనే రుమటాయిడ్‌ ఆర్థ్రరయిటిస్‌ శరీరాన్ని కుంగదీస్తున్నా..సంకల్పంతో అసాధ్యాన్ని సుసాధ్యం చేసి ఔరా అనిపించుకుంది. చిన్న చిన్న సమస్యలకు నిండు జీవితాన్ని అంతం చేసుకునే ఆలోచన వున్నవారి ఈమెను చూస్తే ఖచ్చితంగా స్ఫూర్తి పొందుతారు.ఆమే పర్వీందర్‌ చావ్లా
నడవలేదు..కానీ చక్రాల కుర్చీపై 23 దేశాలు పర్యటించిందామె. చిన్న వయసులోనే  రుమటాయిడ్‌ ఆర్థ్రరయిటిస్‌కి గురైంది. 
కనీసం తిండికూడా తనంతట తాను తినలేని అశక్తతతో ఉండే పర్వీకి తల్లే అన్నీ చేసేది. ఆ పరిస్థితితో మంచానికే పరిమితం కానీ పర్వీ డిగ్రీ చేసింది. అనంతరం ఉద్యోగంలో చేరింది. అలా నాలుగుగోడలమధ్యే ఉండిపోకుండా బయటి ప్రపంచాన్ని చూడాలనే కోరికను ఎలాగైనా నెరవేర్చుకోవాలనుకుని నిశ్చయించుకుంది. దీంతో కాల్‌సెంటర్‌లో చిన్నపాటి ఉద్యోగం చేస్తునే ఓ కేటరింగ్‌ సర్వీస్‌ను ప్రారంభించి తానే నిర్వహించేది. తరువాత తన స్నేహితులతో కలిసి వెళ్లడానికి సిద్ధమై ప్రయాణంలో అన్ని ఖర్చులను తానే సంపాదించుకుంది. 
స్నేహితులతో గుల్మార్గ్‌, జమ్ము కాశ్మీర్‌ వంటి ప్రాంతాలన్నింటినీ చుట్టి వచ్చింది. అలా వెళ్తున్నప్పుడు తోటి స్నేహితులు తనవల్ల ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఓ ఆటోమేటిక్‌ వీల్‌ఛెయిర్‌ను ఏర్పాటు చేసుకుంది. తరువాత ప్రపంచాన్నీ చుట్టిరావాలనే ఆలోచనను కలిగించింది. కనీ ఈసారి ఒంటరిగానే వెళ్లాలనుకుంది.  ట్రావెల్స్‌ సంస్థలు ఆమె పరిస్థిని  చూసి ఒప్పుకోలేదు. అయినా ఆమె మానలేదు. ఒంటరిగా ప్రయాణించేందుకే సిద్ధమయ్యింది.
అలా కొన్ని ప్రత్యేక ఏర్పాట్లతో యూరప్‌ దేశాలన్నింటినీ రెండు ,మూడుసార్లు చుట్టి వచ్చిందామె. అలాగే చైనా, రోమ్‌, ఆస్ట్రేలియా, దుబాయ్‌ వంటి 23 దేశాలు పర్యటించింది పర్వీ. అయితే అది చెప్పినంత సులువు కాదు.ఈ నేపథ్యంలో పలు శారీరక సమస్యలను కూడా ఎదుర్కొంది. కానీ దివ్యాంగురాలై కూడా తనకంటూ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడమే కాకుండా, తనలాంటి   వారిలో స్ఫూర్తిని కలిగించిందీ పర్వీ అనటంలో ఏమాత్రం సందేహం లేదు.

 

21:50 - July 17, 2018

పంజాబ్ : మద్యం మత్తులో ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఖాకీచకునికి తగినరీతిలో సత్కారం జరిగింది. పంజాబ్‌లోని ఫరీద్‌కోట్‌లో పీకల దాకా మద్యం సేవించిన ఓ పోలీసు మహిళపై అత్యాచారం చేసేందుకు యత్నించాడు. దీన్ని ప్రతిఘటించిన ఆ మహిళ పోలీసును చెట్టుకు కట్టేసి కొట్టింది. స్థానికుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న పోలీసు ఉన్నతాధికారులు ఆ గ్రామానికి చేరుకున్నారు. మహిళ పట్ల నీచంగా ప్రవర్తించిన పోలీసు అధికారిని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన  పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

 

16:46 - May 4, 2018

ప్రేమ పెళ్లిళ్లు అంటే చాలామంది ఇష్టపడరు. దానికోసం ఎంతకైనా తెగిస్తారు. ఆఖరికి స్వంత బిడ్డలను చంపుకునేందుకు కూడా వెనుకాడరు. అది వారి పరువుకు సంబంధించిన విషయంగా భావిస్తారు. లేదా అంతస్థులకు సంబంధించిన విషయంగా భావిస్తారు. కానీ ఓ ఊరు ప్రేమ వివాహాలను నిషేదించేలా నిర్ణయం తీసుకుంది. మరి దానికి కారణమేంటి. అటువంటి పరిస్థితులు ఎందుకొచ్చాయి? అనే విషయాలను తెలుసుకుందాం..

ప్రేమ పెళ్లిళ్లు నిషేధిస్తున్న గ్రామం..
ప్రేమ పెళ్లిళ్లు చేసుకునే వారిని గ్రామం నుంచి బహిష్కరించేందుకు పంజాబ్‌లోని లుథియానా జిల్లా చాంకోయిన్‌ ఖుర్ద్‌ అనే గ్రామంలో పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. ప్రేమ వివాహం చేసుకున్న జంటలపై సామాజిక బహిష్కరణ వేటు వేస్తామని, అలాగే వారితో ఎవరూ మాట్లాడకూడదని పంచాయతీ సభ్యుడు ప్రకటన చేశాడు. దీనికి ఊరు మొత్తం కట్టుబడి ఉండాలని నిర్ణయించుకుంది.

ప్రేమ వివాహాల నిషేదానికి కారణమేమిటి?
ఊరిలోని వారు ఈ నిర్ణయం తీసుకోవడానికి ఓ బలమైన కారణం ఉంది. గత నెల 29న ఓ జంట కులాంతర వివాహం చేసుకోవడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా ప్రేమ వివాహాలు, కులాంతర వివాహాలు చేసుకుంటోన్న ఘటనలపై గ్రామ పంచాయతీలో చర్చించి ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

నిషేధిస్తే చర్యలంటున్న అధికారులు..
ఈ ఘటనపై స్పందించిన అధికారులు ఇటువంటి చర్యలు సరైనవి కావని, ఒక వేళ ప్రేమించి పెళ్లి చేసుకున్న వారిని బహిష్కరిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. గతంలోనూ పలు గ్రామాల్లో పంచాయతి పెద్దలు ఇటువంటి నిర్ణయాలు తీసుకున్న ఘటనలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇటువంటి నిర్ణయాలు, తీర్పులు చట్టబద్ధంగా చెల్లవని అధికారులు చెబుతున్నారు.

06:42 - April 28, 2018

ఢిల్లీ : వరుస ఓటములతో తల్లడిల్లుతున్న ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. చాలా రోజుల తర్వాత ఘన విజయం సాధించింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టుపై 55 పరుగుల తేడాతో విక్టరీ సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. ఢిల్లీ జట్టు కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ 93 పరుగులు చేయగా.. పృథ్వీ షా 62 రన్స్‌తో చెలరేగాడు. 220 రన్స్‌ టార్గెట్‌తో బరిలోకి దిగిన కోల్‌కతా ఆటగాళ్లు ఘోరంగా విఫలమయ్యారు. 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 164 పరుగులు మాత్రమే చేయగలిగారు. 

08:53 - April 27, 2018

పంజాబ్‌పై సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అద్భుత విజయం సాధించింది. 13 పరుగుల తేడాతో పంజాబ్‌పై విక్టరీ కొట్టింది. మొదట టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌... నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది. మనీష్‌పాండే హాఫ్‌ సెంచరీ చేశాడు. అనంతరం 133 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన పంజాబ్‌కు ఓపెనర్లు రాహుల్‌, గేల్‌ శుభారంభం ఇచ్చారు. కానీ హైదరాబాద్‌ బౌలర్లు విజృంభించడంతో... పంజాబ్‌ 119 పరుగులకే ఆలౌట్‌ అయ్యింది. దీంతో హైదరాబాద్‌ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

13:33 - April 16, 2018

జలం ప్రాణాధారం, జలం జీవాధానం, జలమే జీవం, జలమే ప్రాణం. జలం లేకుంటే ప్రాణికోటి సమస్తం అంతం!! ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునేంత వరకూ నీటితోనే పని. అది లేకుంటే అన్ని పనులు బంద్! అసలు మానవ మనుగడే బంద్!! మనిషి బతకాలన్నా, పంట పండాలన్నా, జీవకోటి మనుగడ సాగించాలన్నా నీరే ఆధారం! అది లేకుంటే ? అసలు ఆ మాట తలచుకునేందుకే ధైర్యం చాలదు కదూ? నీటి కోసం గ్రామాలకు గ్రామాలు, జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలు కొట్టుకుంటున్నాయంటే కారణం మనుగడ, బ్రతికేందుకు ఆధారం? జీవాధానం. నీటి యుద్ధాలతో దేశాలకు దేశాలకు కొట్టుకున్న దాఖలాలు కూడా లేకపోలేదు. సాధారణంగా నీటికొరత అనేది చాలా ప్రాంతాలలో వుంది. అదీ వేసవి వచ్చిందంటే ఇక చెప్పేదేముంది. స్నేహితులుగా వుండే ఇరుగు పొరుగు వారు కూడా శతృవుల్లా మారిపోతారు. కారణం నీరు.

ప్రాణి మనుగడకు నీరు..
భూమిమీద వృక్షాలు, జంతువులు, మానవాళి మనుగడకు, వాటి పెరుగుదలకు గాలి తరువాత ముఖ్యమైనది నీరు. గ్రామాల్లో, పట్టణాల్లో నివసించే కోట్లాది ప్రజలకు త్రాగునీరు సరఫరా చేయడం ఎన్నో ప్రపంచదేశాలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య. వివిధ పంటల సాగుబడికి నీటి-పారుదల సౌకర్యాలు అత్యంత అవసరమైనవి. ఏ పరిశ్రమ కూడా తగినంత నీటి సరఫరా లేకపోతే స్థాపించడంగాని, నడపడంగాని సాధ్యపడదు. ఇది ప్రకృతి సమస్త జీవులకు ప్రసాదించిన ఒక అపరూపమైన పదార్థము: నీరు ప్రకృతిలో ఉన్న సమస్త జీవులకు ప్రాణాధారము. ప్రప్రథమ జీవి పుట్టుక నీటినోనె జరిగింది. నీరు ఈ భూమండలంపే 71 శాతానికి పైగా ఆవరించి యున్నది. ఈ భూమి పై నీరు మూడు రూపములలో ఉంది. ఘన రూపము. అనగా మంచు గడ్డల రూపంలోను, ద్రవ రూపం వాయు రూపంలో అటే మేఘాలు, ఆవిరి రూపాలలో అన్నమాట. మరి నీరు ప్రాణి మనుగడను సాసిస్తోంది. 

నీటికోసం మైళ్ల దూరం కాలినడక..
నీటికోసం మైళ్లకొద్దీ దూరాలు వెళ్లి తెచ్చుకునే దుస్థితి నేటి కంప్యూటర్ యుగంలో కూడా వుంది అంటే పరిస్థితులు ఎంతటి దారుణంగా వున్నాయో ఊహించుకోవచ్చు..హలో అంటే పొలో మంటు ఇంటి ముంగిట్లో వచ్చి పడిపోయే పదార్ధాలు, వస్తువులు. కానీ వేసవి వచ్చిందంటే మాత్రం లీటరు నీరు రూ.100లు పెట్టి కొనుకునే పరిస్థితులు. బీటలు వారిని నేలమ్మ తల్లి. గంగమ్మ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. పంటే వేసిన రైతన్న వరుణుడి కోసం ఎదురు చూస్తున్నట్లు..దాహార్తితో కటకటలాడిపోతున్న నేలమ్మను అభిషేకించేందుకు వానమ్మ కానరాని దుర్భర పరిస్థితులు.

వేసవి రాకముందే దేశవ్యాప్తంగా 140 జిల్లాల్లో తీవ్ర కరువు పరిస్థితులు..
నడి వేసవి రాకముందే దేశవ్యాప్తంగా 140 జిల్లాల్లో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయి. మంచి నీటి కోసం అలమటించే పరిస్థితి ఏర్పడింది. వాతావరణ శాఖ తాజా గణాంకాల ప్రకారం... 404 జిల్లాల్లో గతేడాది అక్టోబర్ తర్వాత వర్షాల్లేకపోవడంతో కరువు పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇందులో 140 జిల్లాల్లో మాత్రం పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. మరో 109 జిల్లాల్లో ఓ మోస్తరు కరువు ఉంది.

156 జిల్లాల్లో మాత్రం స్వల్ప స్థాయిలో కరువు..
156 జిల్లాల్లో మాత్రం స్వల్ప స్థాయిలో కరువు ఉంది. నిజానికి ఏటా చాలా జిల్లాల్లో ఈ పరిస్థితులు వేసవిలో కనిపిస్తూనే ఉంటాయి. కాకపోతే ఈ ఏడాది శీతా కాలంలో అసలు వర్షాలే లేకపోవడంతో పరిస్థితి మరింత తీవ్రరూపం దాల్చింది. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో దేశవ్యాప్తంగా 63 శాతం వర్షాభావం ఉంది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే రిజర్వాయర్లలో తక్కువ నీటి లభ్యత కలిగిన రాష్ట్రాల్లో తెలంగాణ, పంజాబ్, జార్ఖండ్, ఒడిశా, గుజరాత్, ఉత్తరప్రదేశ్, చత్తీస్ గఢ్ ఉన్నాయి.

07:34 - April 3, 2018

ఢిల్లీ : ఇరాక్‌లోని మోసుల్‌ నగరంలో ఐసిస్‌ ఉగ్రవాదుల కిరాతకానికి బలైపోయిన 38 మంది భారతీయుల మృత దేహాలు భారత్‌కు చేరుకున్నాయి. పార్థివ అవశేషాలను తీసుకొచ్చేందుకు కేంద్ర మంత్రి వికె సింగ్‌ ప్రత్యేక ఆర్మీ విమానంలో ఇరాక్‌ వెళ్లారు. 38 మంది మృత దేహాలను బాగ్దాద్‌ నుంచి అమృత్‌సర్‌కు తరలించారు. మృతుల్లో 27 మంది పంజాబ్‌కు చెందిన వారే. మొత్తం 39 మంది మరణించగా...మరో మృత దేహానికి డిఎన్‌ఏ పరీక్షలు పూర్తి కాలేదు. నాలుగేళ్ల క్రితం పొట్టకూటికోసం ఇరాక్‌కు వెళ్లిన 40 మంది భారతీయులు ఐసిస్‌కు బందీలుగా చిక్కారు. వీరిలో ఒకరు తప్పించుకోగా...39 మందిని ఉగ్రవాదులు కిరాతకంగా చంపారు. పంజాబ్‌ ప్రభుత్వం మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున పరిహారం, ఓ ఉద్యోగం ఇస్తామని ప్రకటించింది.

18:15 - March 30, 2018

పంజాబ్ : మాజీ క్రికెటర్‌, పంజాబ్‌ పర్యాటక శాఖ మంత్రి నవజ్యోత్‌ సింగ్‌ సిద్దూకు ఆదాయ పన్ను శాఖ వలలో చిక్కుకున్నారు. ట్యాక్స్‌ రిటర్న్స్‌కు సంబంధించి సరైన ఆధారాలు సమర్పించని కారణంగా సిద్ధూకు చెందిన రెండు బ్యాంక్‌ అకౌంట్లను అధికారులు సీజ్‌ చేశారు.  2014-15లో సిద్దూ దుస్తుల కోసం 28 లక్షలు, పర్యటన కోసం 38 లక్షలు, సిబ్బంది జీతాలకు 47 లక్షలు, పెట్రోల్‌,డీజిల్‌ కోసం 18 లక్షలు ఖర్చుపెట్టినట్లు ఐటీ రిటర్న్స్‌లో పేర్కొన్నారు. అయితే ఆయా ఖర్చులకు సంబంధించిన బిల్లులను  సమర్పించడంలో సిద్ధూ విఫలమయ్యారు. ఈ అంశంలో సిద్ధూకు ఐటీ శాఖ మూడుసార్లు నోటీసులు జారీ చేసింది. బిల్లులను సమర్పించండి లేదా పన్ను కట్టండని ఆదాయపు పన్నుశాఖ స్పష్టం చేసింది.

 

19:34 - March 16, 2018

పంజాబ్ : మనుషుల అక్రమ రవాణా కేసులో ప్రఖ్యాత పాప్‌ సింగర్ దలేర్‌ మెహందీకి శిక్ష పడింది. పంజాబ్‌లోని  పటియాలా కోర్టు దలేర్‌ మెహందీని దోషిగా తేలుస్తూ రెండేళ్ల జైలుశిక్ష విధించింది. దలేర్‌ సోదరుడు షంషేర్‌ సింగ్‌ని కూడా కోర్టు దోషిగా తేల్చింది. ప్రస్తుతం దలేర్‌ మెహందీ పంజాబ్‌ పోలీసుల కస్టడీలో ఉన్నారు. తన మ్యూజిక్‌ టీమ్‌లో భాగస్వామిగా చేర్చుకుని కొంతమందిని అక్రమంగా విదేశాలకు తరలించాడని దలేర్‌ మెహందీపై ఆరోపణలున్నాయి. దలేర్‌ సోదరులు క్రూ మెంబర్‌ పేరిట విదేశాలకు తీసుకెళ్లేవారు. ఇందుకోసం వాళ్ల దగ్గర డబ్బు వసూలు చేసేవారు. ఇద్దరు సోదరులు కలిసి 1998-99లో 10 మందిని అమెరికాకు తరలించారు. బఖ్షీష్‌ సింగ్‌ ఫిర్యాదు మేరకు 2003లో దలేర్‌పై మనుషుల అక్రమ రవాణా కేసు నమోదైంది.

 

Pages

Don't Miss

Subscribe to RSS - పంజాబ్