పండుగ

06:56 - March 18, 2018

హైదరాబాద్ : రాజ్‌భవన్‌లో ఉగాది సంబరాలు అంబరాన్ని అంటాయి. గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు ప్రారంభించిన శ్రీవిళంబి నామ సంవత్సర ఉగాది వేడుకలకు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సీఎం కేసీఆర్‌తో పలువురు ప్రముఖులు హాజరయ్యారు. షడ్రుచులను ఆస్వాదించినట్లే జీవితంలో జరగబోయే పరిణామాలను ఎదుర్కోవాలని సూచించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన అనేక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ వేడుకలను గవర్నర్ నరసింహన్ దంపతులు ప్రారంభించారు. ఈ వేడుకలకు సీఎం కేసీఆర్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి, అసెంబ్లీ స్పీక‌ర్ మ‌ధుసూద‌నాచారి, మండ‌లి చైర్మన్‌ స్వామిగౌడ్‌, జీహెచ్ఎంసీ మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌, ప్రజాప్రతినిధుల, అధికారులు హాజ‌ర‌య్యారు.

ఉగాది పచ్చడిలాగే మన జీవితంలోనూ షడ్రుచులు ఉంటాయన్నారు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు. షడ్రుచులను ఆస్వాదించినట్లే జీవితంలో జరగబోయే పరిణామాలను ఎదుర్కోవాలన్నారు. రాజ్‌భవన్‌లో జరిగిన శ్రీవిళంబినామ సంవత్సర ఉగాది వేడుకలకు హాజరైన వెంకయ్యనాయుడు తెలుగు రాష్ర్టాల ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. మన జీవితం, పండుగలు అంతా ప్రకృతితో ముడిపడి ఉన్నాయన్నారు. ప్రకృతితో మమేకమై జీవించడం భారతీయ సంస్కృతిలో భాగమన్నారు. మన సంస్కృతి, సాంప్రదాయాలు భవిష్యత్‌ తరానికి అందించాల్సిన అవసరముందన్నారు.

శ్రీవిళంబినామ సంవత్సరంలో అంతా మంచే జరుగుతుందని ఆశిస్తున్నానన్నారు గవర్నర్‌ నరసింహన్‌. ఈ సంవత్సరాన్ని గవర్నర్‌ మానవత్వ సంవత్సరంగా అభివర్ణించారు. ఈ ఏడాది ప్రజలంతా సౌభాగ్యం, సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.

ఉగాది పండుగ సందర్బంగా రాష్ట్ర ప్రజల తరపున సీఎం కేసీఆర్‌ ఉప రాష్ట్రపతి, గవర్నర్‌లకు శుభాకాంక్షలు తెలిపారు. ఏదో ఒక సంవత్సరమే కాకుండా ప్రతి ఏడాది నిష్టతో చాలాచక్కగా గవర్నర్‌ ఉగాది వేడుకలు నిర్వహిస్తున్నందుకు అభినందనలు తెలియజేశారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా నరసింహన్‌ గవర్నర్‌గా వచ్చిన తర్వాత కొత్త సంప్రదాయానికి తెరదీశారన్నారు. ప్రజలంతా శ్రీవిళంబి నామ సంవత్సరంలో సుఖశాంతులతో వర్ధిల్లాలని కేసీఆర్‌ ఆకాంక్షించారు. ఈ సందర్బంగా నిర్వహించిన ఒగ్గుడోలు విన్యాసాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. దేవనార్‌ బ్లైండ్‌ స్కూల్‌ విద్యార్థుల సీతా స్వయంవరం ఆకట్టుకుంది. 

11:12 - February 13, 2018
17:39 - January 26, 2018
16:09 - January 15, 2018

విజయవాడ : చట్టాలు పనిచేయలేదు...కోడి గెలిచింది..ఉభయ గోదావరి జిల్లాలో ఎక్కడ చూసినా పందాలు జరుగుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఎవరి చేతిలో చూసినా ఒక కోడి..జేబుల్లో లక్షల రూపాయలు...తిరునాళ్లు తలపిస్తున్నట్లుగా ఆయా ప్రాంతాలు కనబడుతున్నాయి. ఉభయ గోదావరి జిల్లాలో సంక్రాంతి సందర్భం నిర్వహించే కోళ్ల పందాలు జోరుగా సాగుతున్నాయి. సుప్రీంకోర్టు నిబందనలు పట్టించుకోకుండా కోళ్లకు కాళ్లకు కత్తులు కట్టి మరీ పందేలు నిర్వహిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో 300 బరులు..తూర్పుగోదావరి జిల్లాలో 200కి పైగా బరుల్లో పందాలు జరుగుతున్నాయి. రెండు రోజుల్లోనే రూ. 600 కోట్ల రూపాయలు చేతులు మారినట్లు అనిధికారికంగా తెలుస్తోంది. ఒక్కో కోడి పందెంలో లక్ష రూపాయల నుండి రెండు లక్షల రూపాయల ధర పలుకుతుండగా పందాలు వీక్షించడానికి వచ్చిన వారు కూడా పందాలు కాస్తుండడంతో ఆ ధర కాస్తా ఇంకా పెరిగిపోతోంది. కనుమ రోజు పోలీసులు దాడులు చేసి పందాలను ఆపుతారని తెలుసుకున్న నిర్వాహకులు భోగి..సంక్రాంతి రోజు ఉదయం..పగలు నిర్వహించడమే కాకుండా రాత్రుల్లో ఫ్లడ్ లైట్లు వెలుతురుల్లో పందాలు నిర్వహిస్తుండడం గమనార్హం. 

20:56 - January 14, 2018

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి అంబరాన్నంటుతోంది. మొదటిరోజు భోగి పండుగను ప్రజలు ఆనందోత్సాల నడుమ జరుపుకున్నారు. పల్లెలు, పట్టణాలు, నగరాలన్న తేడాలేకుండా ఉదయమే భోగిమంటలు వేశారు. చిన్నాపెద్దా అందరూ భోగిమంటల చూట్టూచేరి సందడి చేశారు. నగరాల్లో ఉంటున్నవారు పండుగకు స్వగ్రామాలకు చేరుకోవడంతో పల్లెలు పండుగశోభను సంతరించుకున్నాయి. హరిదాసుల కీర్తనలు, డూడూ బసవన్నల విన్యాసాలు, గాలి పటాలతో పండుగ పసందుగా సాగుతోంది.

ఇంటి ముంగిట ముత్యాల ముగ్గులు, ఆ ముగ్గుల్లో గొబ్బెమ్మలు... తెలతెలవారుతుండగా భోగిమంటలు... ఉదయాన్నే లోగిళ్లలో గంగిరెద్దుల విన్యాసాలు.. హరిదాసుల సంకీర్తనలు..... నోరూరించే పిండివంటలు.. గాలి పటాలు.. చిన్నారుల సందడులు.. ఇవన్నీ కలిపితేనే సంక్రాంతి పండుగ. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి శోభ ఉట్టిపడుతోంది. సంక్రాంతి పండుగలో మొదటిరోజైన భోగి ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. దీంతో భోగ భాగ్యాల భోగీ వేడుకలు అంబరాన్నంటాయి.

ఏపీ సీఎం చంద్రబాబు తన స్వగ్రామమైన నారావారిపల్లెలో భోగిపండుగను ఘనంగా జరుపుకున్నారు. నందమూరి, నారా కుటుంబ సభ్యులు భోగిమంటలు వేశారు. ఆ తర్వాత చంద్రబాబు తన కుటుంబ సభ్యులు, నందమూరి బాలకృష్ణ ఫ్యామిలీతో కలిసి తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో , సుభిక్షంగా ఉండాలని శ్రీవారి ప్రార్థించినట్టు చంద్రబాబు తెలిపారు. వైసీపీ ఎమ్మెల్యే రోజా నగరి మండలంలోని పుల్లయ్యగారి పల్లెలో భోగిని ఘనంగా జరుపుకున్నారు. తిరుపతిలోని తన ఇంటిముందు భోగిమంటలు వేసి దానిచుట్టూరా తిరుగుతూ ఆడిపాడారు. అందరి జీవితాల్లో భోగిపండుగ భోగ భాగ్యాలను తేవాలని ఆకాంక్షించారు.ఏపీ రాజధాని అమరావతి, విజయవాడలో భోగి సెలబ్రేషన్స్‌ ఘనంగా జరిగాయి. తెల్లవారుజామునే ప్రజలంతా వీధుల్లోకి వచ్చి భోగి మంటలు వేశారు. దాని చుట్టూరా చేరి సందడి చేశారు. పలుచోట్ల ప్రజాప్రతినిధులు భోగిమంటల్లో పాల్గొన్నారు.

పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా భోగి వేడుకలు అంబరాన్నంటాయి. చిన్నాపెద్దా అన్న తేడాలేకుండా భోగిమంటలు వేసి ఆడిపాడారు. యలమంచిలి మండలంలో జరిగిన భోగి వేడుకల్లో నరసాపురం మాజీ ఎమ్మెల్యే ప్రసాదురాజు పాల్గొన్నారు. ఇరుగుపొరుగు కలిసి పండుగ జరుపుకోవడమే ఆసలైన ఆనందమని తెలిపారు. పొలం గట్లలో యువతుల ఆటపాటలు అందరినీ ఆకట్టుకున్నాయి....

తూర్పు గోదావరి జిల్లా ప్రజలు భోగి పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. కాకినాడ, రాజమహేంద్రవరంతోపాటు జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో భోగి సెలబ్రేషన్స్‌ జోష్‌గా సాగాయి. చిన్నాపెద్దా కలిసి భోగి వేడుకల్లో పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా భోగి వేడుకలు అంబరాన్నంటాయి. వాడవాడలా ప్రజలు భోగిమంటలు వెలిగించారు. ఒంగోలులో లయన్స్‌క్లబ్‌, వాసవీక్లబ్‌, ఉమెన్‌ సీనియర్‌ సిటిజెన్స్‌ ఆధ్వర్యంలో జరిగిన భోగి సంబరాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కోలాట ఆటలు, గంగిరెద్దుల విన్యాసాలు, సాంస్కృతిక నృత్యాలు, పొంగళ్లతో బోగి సంబరాలు కన్నుల విందుగా సాగాయి. ఈ వేడుకల్లో మంత్రి శిద్దారాఘవరావు, ఎంపీ వైసీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా భోగి పండగ సందడిగా సాగింది. తెల్లవారుజామునే ప్రజలు భోగిమంటలు వేసి దానిచుట్టూరా నృత్యాలు చేస్తూ సందడి చేశారు. విశాఖ ఉడా చిల్డ్రన్‌ థియేటర్‌లో ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు ఆకట్టుకున్నాయి. కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌, ఎమ్మెల్సీ మాధవ్‌ కళాకారులతో కలిసి ఆడిపాడారు. యలమంచిలి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు... కోలాటం, చెక్కభజన వారితో కలిసి స్టెప్పులేశారు

అనంతపురం జిల్లాలోనూ భోగి ఉత్సవాలు ఉత్సాహంగా సాగాయి. అనంతపురం, తాడిపత్రి, హిందూపురం, పుట్టపర్తితోపాటు అన్ని ప్రాంతాల్లోనూ ప్రజలు భోగిమంటలు వేశారు. లోగిళ్లలో గొబ్బెమ్మలను పెట్టి పండుగ జరుపుకున్నారు. అనంతపురంలో వాసమీక్లబ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన భోగి వేడుకలో చిన్నాపెద్దా కలిసి గాలిపటాలను ఎగురవేశారు.

తెలంగాణలోనూ ప్రజలు భోగి పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. హైదరాబాద్‌లోని ఐడీ కారిడార్‌లో భోగి వేడుకలు గ్రాండ్‌గా జరిగాయి. అపార్ట్‌మెంట్‌ వాసులు, కాలనీవాసులు భోగిమంటలు వేసి దానిచుట్టూ చేరి సందడి చేశారు. అక్కడే వంటలు చేసుకుని ఆరగించారు. మల్కాజ్‌గిరిలోని శారదానగర్‌లో భోగి పండుగ ఉత్సాహంగా జరాగింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భోగిమంటలు, పాలపొంగులు, గంగిరెద్దులు, హరిదాసుల పాటలతో పండుగను సంతోషంగా జరుపుకున్నారు. 

11:14 - January 14, 2018

విజయనగరం : జిల్లాలో భోగి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా భోగి మంటలు వేశారు. తమ కష్టాలు తొలగిపోయి.. సుఖ సంతోషాలు రావాలని ఆకాంక్షించారు. భోగి సంబరాలపై మరిన్ని వివరాలు వీడియోలో చూద్దాం.. 

18:16 - January 12, 2018

హైదరాబాద్ : సంక్రాంతి పండుగ వచ్చేస్తోంది..వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు..మరికొంత మంది షాపింగ్ చేయాలని..ఇతరత్రా పనుల కోసం ప్రణాళికలు వేసుకుంటున్నారు..కానీ ఇవన్నీ అమలు కావాలంటే 'డబ్బు' కావాల్సిందే. అదే 'డబ్బు' దొరకడం లేదు. నగరంలోని చాలా ప్రాంతాల్లో ఉన్న ఏటీఎంలలో డబ్బు కొరత వేధిస్తోంది. గతంలో నోట్ల రద్దు అనంతరం నెలకొన్న పరిస్థితులు పునారావృతం అవుతుండడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు. తాము దాచుకున్న డబ్బు తీసుకోవడానికి బిచ్చమడగాలా అని ప్రశ్నిస్తున్నారు. తార్నాకాలో నెలకొన్న పరిస్థితుల కోసం వీడియో క్లిక్ చేయండి. 

14:46 - October 20, 2017

భారతదేశంలో పండుగలు చాలా ప్రాచీనమైనవి. ప్రతి పండుగకు పూజలుంటూ కార్యక్రమాలుంటాయి. కానీ వీటిని గమనిస్తే సామాజిక అంశాలుంటాయి. సామాజిక అంశాలతో పాటు వినోదం కలుగు చేసే పండుగ దీపావళి అని చెప్పుకోవచ్చు. ఐదు రోజుల పాటు దీపావళి పండుగ జరుపుకుంటుంటారు. దీనిపై మానవి ప్రత్యేక కథనం. మరింత వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

18:46 - October 3, 2017

నెల్లూరు : నెల్లూరులో రొట్టెల పండుగ మూడో రోజుకు చేరింది. బారాషాహీద్ దర్గాలో రాత్రి గంధ మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. కోటమిట్టలోని అమినీయా మసీదులో 12 మంది మత పెద్దలు 12 బిందెల్లో గంధాన్ని కలిపారు. ఆ తర్వాత మేళతాళాల మధ్య గంధం బిందెలను బారాషాహీద్‌ దర్గాకు తెచ్చారు. కడప పీఠాధిపతి మొదటి బిందె గంధాన్ని 12 సమాధులకు లేపనం చేసి, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ గంధమహోత్సవంలో మంత్రి నారాయణ, నెల్లూరు నగర మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ పాల్గొన్నారు. 

11:09 - October 2, 2017

నెల్లూరు : బారా షాహీద్ దర్గా దగ్గర రొట్టెల పండుగ రెండో రోజుకు చేరుకుంది. దర్గాకు భారీ ఎత్తున భక్తులు పోటెత్తారు. స్వర్ణాల చెరువులో స్నానమాచరించడానికి వచ్చిన భక్తులతో కిటకిటలాడుతోంది. స్నానం ఆచరించిన అనంతరం రొట్టెలు పంచుకున్నారు. ఉద్యోగ..సంతానం..చదువు..పెళ్లి..సంపాదన..పేరిట రొట్టెలను పంపిణీ చేస్తున్నారు. కానీ కొంతమందికి రొట్టెల కొరత ఏర్పడడంతో ఇక్కట్లకు గురవుతున్నారు. పూర్తి సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

Pages

Don't Miss

Subscribe to RSS - పండుగ