పథకాలు

10:32 - January 2, 2018
21:25 - November 30, 2017

హైదరాబాద్ : ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక ఆడపిల్లల విద్య కోసం ప్రత్యేక పథకాలు ఏవీ రూపొందించలేదన్నారు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి. మోడల్ స్కూల్స్‌ స్కీమ్‌ను కూడా ఎత్తివేశారని ఆరోపించారు. ఇప్పటికే ఇస్తున్న నిధులలోనూ కేంద్రం కోత విధించిందని కడియం శ్రీహరి అన్నారు. హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లో జరిగిన మోడల్ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్‌ ప్రతినిధులతో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మోడల్‌ స్కూల్స్‌ను కాపాడుకోవాలనే ఉద్దేశంలో రాష్ట్ర ప్రభుత్వమే సంవత్సరానికి 200 కోట్ల రూపాయలు భరిస్తోందని కడియం శ్రీహరి చెప్పారు.  

06:34 - November 8, 2017

గుంటూరు : దేశానికే ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్‌ పథకాలున్నాయని మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. ఆచార్య ఎన్‌. జీ రంగా 117వ జయంతి సందర్భంగా గుంటూరు జిల్లా, పొన్నూరు పట్టణంలో జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పెన్షన్‌, రుణమాఫీ అనేది ఇప్పుడు అందరికీ ఆదర్శంగా ఉందన్నారు. వీటిపై ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు ఇక్కడికి వచ్చి అధ్యయనం చేపడుతున్నట్లుట్లు ప్రత్తిపాటి తెలిపారు. 

12:16 - October 12, 2017

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వరాలు ఎందుకు ప్రకటించేస్తున్నారు. మూడేండ్ల అనంతరం ఇప్పుడే ఎందుకు వరుసగా సంక్షేమ పథకాల అమలు చేస్తున్నారు ? రాష్ట్ర వ్యాప్తంగా వివాదాస్పదంగా ఉన్న భూములను ఎందుకు రెగ్యులరైజ్ చేస్తున్నారు ? మధ్యతరగతి ప్రజల కోసం కొత్త పథకం తెస్తున్నారా ? కొత్త కొత్త పథకాలు..వరాలు దేని కోసం? అనే చర్చ జరుగుతోంది.      బాబు ప్రస్తుతం దూకుడు పెంచేశారు..వరుసగా పథకాలు..సంక్షేమ పథకాలు ప్రకటించేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో భాగంగా బాబు ఇప్పటి నుండే వ్యూహాలు రచిస్తున్నారని పొలిటికల్ అనలిస్టుల టాక్. 2018-2019 లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తాము సిద్ధమేనని బాబు ఇదివరకే ప్రకటించేసిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఆయన ప్రజలపై వరాల జల్లు కురిపిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.

ఇటీలవలే నంద్యా..కాకినాడలో జరిగిన ఎన్నికల్లో టిడిపి ఘన విజయం సాధించడంతో బాబు మరింత దూకుడు ప్రదర్శిస్తున్నారు. మరోసారి మెజార్టీ సాధించాలని బాబు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఎన్నికల్లో గెలిచే విధంగా ఇప్పటి నుండే ప్రయత్నాలు చేయాలని కింది కార్యకర్తలకు దిశా..నిర్దేశం చేస్తున్నారు. అందులో భాగంగా పార్టీ నేతలు..కార్యకర్తలతో అప్పుడప్పుడు భేటీ అవుతూ పలు సూచనలు..సలహాలు అందచేస్తున్నారు. ప్రభుత్వం అందచేస్తున్న సంక్షేమ పథకాలు..ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని బాబు పేర్కొంటున్నారు. ఇంటింటికి టిడిపి పేరిట ఓ కార్యక్రమాన్ని రూపొందించి ప్రజల మధ్యలోకి వెళుతున్నారు.

అన్ని శాఖలపై రివ్యూ నిర్వహించిన బాబు ప్రస్తుతం..పోలవరం..అమరావతిపై ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. ఎలాగైనా 2019 ఎన్నికల్లో వీటిని పూర్తి చేయాలని..రాష్ట్రంలోని 28 ప్రాజెక్టులను ఓ కొలిక్కి తీసుకరావాలని బాబు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పెన్షన్లు..ఇంటి నిర్మాణాలు..చంద్రన్న పెళ్లికానుక..ఎన్టీఆర్ సృజల స్రవంతి..తదితర పథకాలను ముందుకు తీసుకొస్తున్నారు. ఇటీవలే నూతన గృహ ప్రవేశాల కార్యక్రమం నిర్వహించిన సంగతి తెలిసిందే. చంద్రన్న బీమా కింద ప్రమాదవశాత్తు కింద ఎవరైనా మరణిస్తే రూ. 5లక్షలు ఇచ్చే వారు. ఇప్పుడు సహజ మరణానికి రూ. 2లక్షలు అందిస్తున్నారని తెలుస్తోంది. ఇక ఇదిలా ఉంటే ప్రత్యర్థి అయిన వైసీపీని కూడా టార్గెట్ చేశారు. ఆ పార్టీలో ఉన్న కొంతమందిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది. బలహీనపరిచేలా ప్లాన్స్ రూపొందిస్తున్నట్లు, రాయలసీమలో పార్టీ బలహీనంగా ఉందనే కారణంతో రెడ్డీ సామాజిక వర్గానికి చెందిన కీలకనేతలను పార్టీలో చేర్చుకొనేందుకు వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం.

కానీ ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక సమస్యలపై బాబు దృష్టి సారించడం లేదనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలోని రైతులు..ఇతరులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఎన్నికల్లో బాబు ఇచ్చిన హామీలు ఏమాత్రం అమలు చేయలేదని విమర్శలు ఎదుర్కొంటున్నారు. కేవలం ఎన్నికల కోసమే బాబు పలు స్కీంలు ప్రవేశ పెడుతున్నారని ఆరోపణలున్నాయి. మరి బాబు చేస్తున్న ప్లాన్స్ వర్కవుట్ అవుతాయా ? లేదా ? అనేది చూడాలి. 

18:19 - July 26, 2017

విశాఖపట్టణం : పేదలకు సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు ఎన్నో అమలు చేస్తున్నామని..ఇవన్నీ మామూలే అని మరిచిపోతారా ? అంటూ సీఎం చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. జిల్లాలో రెండో విడత పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఫించన్..రాగానే అయిపోయింది..అనుకుంటారు..రేషన్ కరెక్టు వస్తుంది కదా అనుకుంటుంటారు. చనిపోయితే రూ. 5 లక్షలు ఇస్తున్నా..ఏముందు మాములే కదా అనుకుంటుంటారని..కరెంటు ఆడబిడ్డలు టివి చూడాలంటే..నీళ్లు పట్టుకోవాలంటే..ఎండకాలంలో కరెంటు కోసం అష్టకష్టాలు పడ్డారని..అదే మూడు సంవత్సరాలుగా కరెంటు కొరత ఉందో చెప్పాలని సీఎం చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. అన్ని ఇచ్చిన తరువాత మరిచిపోతారా ? అని పేర్కొన్నారు. అన్నా క్యాంటీన్లు త్వరలో వస్తున్నాయని, తొందరలోనే నిరుద్యోగ భృతి తీసుకొస్తామన్నారు. 

06:38 - April 15, 2017

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలు రాజకీయ వర్గాల్లో చర్చోపచర్చలకు తావిస్తున్నాయి. అన్ని వర్గాలను ఆకట్టుకునేందుకు సీఎం ప్రకటిస్తున్న వరాలు దేనికి సంకేతమన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసెంబ్లీ ముందస్తు ఎన్నికలకు వెళ్లేదిలేదని గులాబీ బాస్‌ చెబుతున్నా... ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న నిర్ణయాలు అంతుచిక్కడంలేదన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. ఇంతకీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంతరంగం ఏంటి ? రాజకీయ ఎత్తుగడల్లోని ఆంతర్యం ఏంటి ? అన్న ప్రశ్నలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ 2019 ఎన్నికల కోసం టీఆర్‌ఎస్‌ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు సమాజంలోని వివిధ వర్గాలకు వరాల వర్షం కురిపిస్తున్నారు. ఉద్యోగుల్లో తక్కువ వేతనాలు పొందుతున్న వారికి జీతభత్యాలు పెంచుతున్నారు. అత్యంత వెనుకబడిన వర్గాలకు వెయ్యి కోట్లతో ప్రత్యేక ఆర్థిక సహాయ సంస్థ ఏర్పాటు, అంగన్‌వాడీలు, వీఆర్‌ఏలకు వేతనాల పెంపు, వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి రైతులకు ఉచితంగా ఎరువుల పంపిణీ వంటి కీలక నిర్ణయాలు ప్రతిపక్షాల నేతల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి.

ముస్లిం రిజర్వేషన్ల పెంపుకు చర్యలు..
అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల నాటి నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్ని విషయాల్లో వ్యూహాత్మకంగా అడుగులు వేవస్తున్నారు. ప్రగతి భవన్‌కు ఒక్కో వర్గాన్ని పిలిపించుకుని మాట్లాడుతూ, వారి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేలా ఆదేశాలు జారీ చేస్తున్నారు. విధానపరంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఎన్నికల్లో హామీల్లో కీలకమైన ముస్లిం రిజర్వేషన్ల పెంపుకు చర్యలు చేపట్టారు. మొత్తం రిజర్వేషన్ల ప్రక్రియను సమీక్షించి, జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు పెంచేందుకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశారు.

యాదవులకు గొర్రెలు, మేకల పంపిణీ పథకం..
రైతులకు చివరి విడత రుణమాఫీ నిధులను విడుదల చేసిన ప్రభుత్వం... వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి వీరికి ఉచితంగా ఎరువులు అందించాలని నిర్ణయించింది. ఎవరి ఊహకు అందని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకుంటున్న నిర్ణయాల ఆంతర్యం టీఆర్ఎస్‌ నేతలకే అంతుచిక్కడంలేదు. అలాగే రాష్ట్రంలో మాసం ఉత్పత్తిని పెంచడంతోపాటు, యాదవులకు ఆదాయాన్ని పెంచేందుకు గొర్రెలు, మేకల పంపిణీ, చేనేత కార్మికుల ఆర్థిక కోసం ప్రత్యేక పథకాన్ని ప్రకటించారు. అలాగే ప్రమాదాల్లో మరణించే కల్లుగీత కార్మికులకు బీమా పెంపు వంటి కార్యక్రమాలు దేనికి సంకేతం అన్న ప్రశ్నకు తావిస్తోంది. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఉద్దేశం లేదంటూ కేసీఆర్‌ స్పష్టం చేసినా ఈ విషయంలో స్వపక్ష, విపక్ష నేతల్లో అనుమానాలు లేకపోలేదు. రాజకీయ ఎత్తుగడల్లో దిట్టగా పేరు పొందిన కేసీఆర్‌ ఏ నిర్ణయం తీసుకున్నా ఆశ్చర్య పోవాల్సిన పనిలేదని టీఆర్‌ఎస్‌తోపాటు, ఇతర పార్టీల నేతలు చర్చించుకుంటున్నారు. భవిష్యత్‌ రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.

11:45 - April 8, 2017
07:07 - August 1, 2016

మధ్యాహ్న భోజనం పథకాన్ని అమెరికా లాంటి దేశాల్లో సైతం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నారు. మన దేశ పిల్లలను పోషకాహారం సమస్య వెన్నాడుతున్నట్టే అమెరికా పిల్లలను ఊబకాయం కలవరపెడుతోంది. ఊబకాయాన్ని నివారించే విధంగా అమెరికన్ స్కూళ్లలో మెనూ రూపొందిస్తున్నారు. కానీ, మన దగ్గర మధ్యాహ్న భోజనం పథకాన్ని నిర్వీర్యం చేసి, క్రమంగా ఎత్తేసే చర్యలు చేపడుతున్నారు. స్కూల్స్ లో డ్రాపవుట్స్ సంఖ్యను తగ్గించడం, బడి ఈడు పిల్లలను బడికి వచ్చేలా ప్రోత్సహించడం, స్కూల్ పిల్లలకు నాణ్యమైన పోషకాహారాన్ని అందించడం అనే ఉదాత్త ఆశయాలతో ప్రారంభించిందే మధ్యాహ్న భోజన పథకం. 1995లో కొన్ని స్కూళ్లల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభమైన ఈ పథకం దేశ వ్యాప్తంగా విస్తరించింది. మన దేశంలో దాదాపు 13 కోట్ల మంది విద్యార్థులకు ఇది వర ప్రసాదంగా మారింది. కరువు ప్రాంతాల్లో, వేసవి సెలవుల్లోనూ ఈ పథకాన్ని అమలు చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించడంతో దీని ప్రాధాన్యతను చాటుతోంది. ఈ పథకం ప్రారంభమైన తర్వాత మధ్యలోనే బడిమానేసివారి సంఖ్య తగ్గినట్టు అనేక అధ్యయనాల్లో వెల్లడయ్యింది.

పోషకాహార లోపం..
ఈ పథకానికి కేంద్రం 75శాతం, రాష్ట్రం 25 శాతం నిధులు సమకూరుస్తున్నాయి. ఈ పథకాన్ని మరింత సమర్ధవంతంగా నిర్వహించడం ద్వారా స్కూల్ స్టూడెంట్స్ లో పోషకాహార లోపాన్ని నివారించే వీలుంది. ఇప్పటికే 40శాతం మందికి పైగా పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతున్న నేపథ్యంలో ఇలాంటి పథకాల ప్రాధాన్యత మరింత పెరుగుతోంది. సంపన్న దేశం అమెరికాలో సైతం మధ్యాహ్న భోజనం పథకాన్ని నిర్వహిస్తుండడం విశేషం. అమెరికాలోని స్కూల్ స్టూడెంట్స్ లో ఊబకాయం సమస్య తీవ్రంగా వుండడంతో దానిని దృష్టిలో వుంచుకుని మధ్యాహ్న భోజనం మెనూ విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొవ్వు పదార్థాలు తక్కువగానూ, ఐరన్, కాల్షియం, విటమిన్లు తగు మోతాదులో వుండే విధంగానూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు ఎక్కువగా వుండేలా మెనూ రూపొందిస్తున్నారు.

ఆందోళన కలిగిస్తున్న ప్రభుత్వాల తీరు..
అయితే, మన దేశంలో మధ్యాహ్న భోజనం పథకాన్ని మొక్కుబడి తంతులాగా అమలు చేస్తున్నారన్న విమర్శలున్నాయి. నాణ్యతా ప్రమాణాలను గాలికొదిలేస్తున్నాయి. పిల్లలకు ఏవో నాలుగు మెతుకులు పెడితే చాలన్నట్టుగా మన ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. సగానికిపైగా స్కూళ్లలో మధ్యాహ్న భోజనం వండడానికి, నిల్వ చేయడానికి, వడ్డించడానికి అవసరమైన సదుపాయాలే కల్పించని దుస్థితి. మరోవైపు మధ్యాహ్న భోజనం వర్కర్లకు, నిర్వాహకులకు నెలనెలా జీతాలు చెల్లించకుండా మూడు నాలుగు నెలలకొకసారి బిల్లులు మంజూరు చేస్తుండడం ఈ పథకం నిర్వహణపైనే ప్రభావం చూపిస్తోంది. ఇప్పటికే గుర్తించిన లోపాలను సరిదిద్దాల్సిన ప్రభుత్వం ఆ పని చేయకపోగా, ప్రయివేట్ ఏజెన్సీలకు అప్పగించే ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ప్రయివేట్ ఏజెన్సీలు లాభాపేక్షతో పనిచేస్తాయన్నది జగమెరిగిన సత్యం. దీంతో పిల్లలకు సరఫరా చేసే ఆహారంలో క్వాలిటీ పడిపోతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అదే జరిగితే పథకం స్పూర్తే దెబ్బతింటుంది. 

21:28 - July 20, 2016

విజయవాడ : రెండేళ్ల పాలనా కాలంలో టీడీపీ ప్రభుత్వ ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లలేక పోయామని ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జీలదేనని ఆయన స్పష్టం చేశారు. విజయవాడ సీఎం క్యాంప్‌ కార్యాలయంలో బాబు టీడీపీ సమీక్షా కమిటీతో భేటీ అయిన ఆయన ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలా ప్రతిఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌ఛార్జీలదేనని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. కేవలం 25 మంది ఎమ్మెల్యేలు మాత్రమే పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారని తెలిపారు. ఇక నుంచి ప్రతిఒక్కరు ప్రభుత్వానికి మంచిపేరు వచ్చేలా కృషి చేయాలని సూచించారు. నేతలు నిరంతరం ప్రజలతో మమేకం కావాలని దిశానిర్దేశం చేశారు.

500 మందికి శిక్షణ..
ఇటీవల నిర్వహించిన సర్వేలో మంచి ర్యాంకులు సాధించిన తొలి 25 మంది ఎమ్మెల్యేలు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు... గ్రామస్థాయి నాయకులతో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని బాబు ఆదేశించారు. పార్టీకి చెందిన సుమారు 500 మందికి శిక్షణ ఇవ్వాలని సూచించారు. శిక్షణ పొందిన వారే ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సి ఉంటుందని తెలిపారు. దీని కోసం అవసరమైతే టెక్నాలజీని వినియోగించాలని సూచించారు. క్రీయాశీలకంగా పనిచేసిన ఎమ్మెల్యేలకు ప్రజల్లో ఆదరణ పెరిగిందని, మిగతావారు కూడా ఆ ఎమ్మెల్యేలను అనుసరించాలని చంద్రబాబు సూచించారు.
ఒక నియోజకవర్గంలో 80 శాతం మంది ప్రజలు ప్రభుత్వంపై సంతృప్తిగా ఉంటే.. మరికొన్ని నియోజకవర్గాల్లో 15 నుంచి 20 శాతం మాత్రమే సంతృప్తిగా ఉండటానికి కారణాలు తెలుసుకోవాలని సీఎం సమీక్షా కమిటీని ఆదేశించారు. ఇక నుంచి పార్టీ.. ప్రభుత్వం సమన్వయంతో ముందుకెళ్లి మంచి పేరు తెచ్చుకునేలా ప్రయత్నించాలని బాబు పార్టీ నేతలకు ఆదేశించారు.

14:05 - July 15, 2016

హైదరాబాద్ : బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ పక్ష పత్రిక 'జనసందేశ్‌'ను కేంద్రమంత్రి రాధామోహన్‌సింగ్‌ ఆవిష్కరించారు. వ్యవసాయరంగానికి మోదీ సర్కార్‌ పెద్ద పీట వేస్తుందని ఎమ్మెల్యే లక్ష్మణ్‌ అన్నారు. దేశంలో రైతుల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు చేపట్టినట్లు కేంద్రమంత్రి రాధామోహన్‌సింగ్‌ తెలిపారు. 

 

Pages

Don't Miss

Subscribe to RSS - పథకాలు