పరవళ్లు

21:45 - October 12, 2017
15:58 - June 20, 2017
13:02 - June 20, 2017

మహబూబ్ నగర్ : తెలుగు రాష్టాల్లో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఎగువన ఉన్న కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలతో..జూరాల ప్రాజెక్టుకు భారీగా వరదనీరు పోటెత్తుతొంది. కృష్ణా బేసిన్‌లోని ఆల్మట్టి రిజర్వాయర్‌కు 1,875 క్యూసెక్కులు, నారాయణపూర్‌కు 2,031 క్యూసెక్కులు, జూరాలకు 6,365 క్యూసెక్కుల ఇన్‌ఫ్లోగా ఉంది. అలాగే తుంగభద్ర జలాశయానికి 227 క్యూసెక్కులు, నాగార్జున సాగర్‌కు 400 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టులో 19.65 టీఎంసీలు నీరు ఉండగా.. నాగార్జున సాగర్‌లో 118.17 టీఎంసీల నీరుంది.  

15:27 - August 5, 2016

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో కృష్ణమ్మ, గోదారమ్మ పరవళ్లు తొక్కుతున్నాయి. కొన్నాళ్లుగా వర్షాలు లేక వెలవెలబోయిన నదులు ఎగువన కురిసిన భారీ వర్షాలతో మళ్లీ పొంగిపోర్లుతున్నాయి. కృష్ణా పుష్కరాల వేళ కృష్ణమ్మ పోటెత్తుతుండటంతో భక్త జనం పరవశించిపోతున్నారు.  వరద తాకిడితో జూరాల, శ్రీశైలం జలాశయాలు నిండు కుండలను తలపిస్తున్నాయి.   
మళ్లీ జలకళ 
మొన్నటి వరకు ఎడారులను తలపించిన కృష్ణా, గోదావరి నదీ పరివాహక ప్రాంతాలు మళ్లీ జలకళ సంతరించుకుంది. ఎగువన ఉన్న కర్ణాటక, మహారాష్ట్రల్లో కురిసిన భారీ వర్షాలకు జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులకు వరద తాకిడి పెరిగింది. ఇప్పటికే భారీ వర్షాలతో ఆల్మట్టి జలాశయం నిండింది. ప్రాజెక్టు 23 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. నారాయణపూర్‌ నుంచి 25 గేట్లను ఎత్తి... దిగువకు రెండు లక్షల 54 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. దీంతో జూరాల ప్రాజెక్టుకు భారీ వరద తాకింది. ఎత్తిపోతల పథకాలకు నీటిని వదులుతున్నారు. 13 గేట్ల నుంచి 1.34 లక్షల క్యూసెక్కులు నదిలోకి వదులుతున్నారు.
శ్రీశైలంలోకి 40వేలకు పైగా క్యూసెక్కుల నీరు 
ఇప్పటివరకు శ్రీశైలంలోకి 40వేలకు పైగా క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. 24 గంటల్లో 1.25 లక్షల క్యూసెక్కుల వరద వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. శ్రీశైలం డ్యాం నీటి మట్టం క్రమేపీ పెరుగుతూ క్రస్ట్‌గేట్లను తాకింది. శ్రీశైలం కుడిగట్టు విద్యుత్‌ కేంద్రంలో 89.3 మోగావాట్ల సామర్థ్యంతో నాలుగు యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి చేస్తున్నారు. ఎడమగట్టు విద్యుత్‌ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేయడం లేదు. ఆల్‌ మట్టి నుంచి 2.64 లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఒకరోజంతా కొనసాగితే శ్రీశైలానికి దాదాపు 23 టీఎంసీలు వస్తుంది. అదే ప్రవాహం వారంపాటు కొనసాగితే రిజర్వాయర్ నిండుతుంది. 
గోదావరి నీటి మట్టం 9 అడుగులు
మరోవైపు గోదావరి పరవళ్లు తొక్కుతోంది. పరివాహక ప్రాంతంలో వర్షాల వల్ల వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. కాటన్‌ బ్యారేజ్‌ నుంచి నీటిని విడుదల చేస్తూ ధవళేశ్వరం వద్ద గోదావరి బేసిన్‌ను ఖాళీ చేస్తున్నారు. కాటన్‌ బ్యారేజ్‌ మొత్తం గేట్లను ఒక మీటర్‌ మేర పైకి ఎత్తి ప్రవాహాన్ని దిగువకు విడుదల చేస్తుండటంతో గోదావరి నీటి మట్టం 9 అడుగులుగా నమోదైంది. ఎగువన భద్రాచలం వద్ద 48 గంటల్లో 12 అడుగుల మేర పెరిగిన నీటి మట్టం 33 అడుగుల వరకు చేరుకుని నిలకడగా కొనసాగుతోంది. వ్యవసాయ అవసరాల నిమిత్తం తూర్పు డెల్టాకు, మధ్య డెల్టాకు, పశ్చిమ డెల్టాకు నీటిని విడుదల చేస్తున్నారు. కృష్ణా, గోదావరి నదులకు వరద తాకిడి పెరుగుతుండటంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

 

10:32 - July 12, 2016

పశ్చిమగోదావరి : గోదావరి పరవళ్లు తొక్కుతోంది. గోదావరి ఉధృతంగా ప్రవహించడంతో పశ్చిమగోదావరి జిల్లాలోని పోలవరం ఏజెన్సీ గ్రామాలు బిక్కుబిక్కుమంటున్నాయి. వరద ఉధృతి పెరగడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరిలో వరద వల్ల ఏజెన్సీ గ్రామాల్లో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. పోలవరం ప్రాజెక్టు కడుతున్న ప్రాంతంలో భారీగా వరదనీరు చేరింది. కొత్తూరు కాజ్ వేపై భారీగా వరదనీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరదనీరు రావడంతో పోలవరం ఏజెన్సీలో 40 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఏజెన్సీ గ్రామాల్లో ఉన్న వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 30 అడుగుల వరకు నీరు పెరిగిపోవడంతో అధికారులకు ఏం చేయాలో అర్థం కావడం లేదని తెలుస్తోంది. ఖమ్మం భద్రాచలం వద్ద 175 గేట్లను ఎత్తివేయడంతో నిన్నటి నుండి 10 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. ధవళేశ్వరం ప్రాజెక్టు కిందనున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

Don't Miss

Subscribe to RSS - పరవళ్లు