పరిశ్రమలు

16:47 - July 11, 2018

ఢిల్లీ : తాజ్‌మహల్‌ సంరక్షణ విషయంలో సుప్రీంకోర్టు కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజ్‌మహల్‌ను రక్షించండి... లేదా మూసేయండి... లేదా ధ్వంసం చేయండని కోర్టు వ్యాఖ్యానించింది. తాజ్‌మహల్‌ను కాపాడుకోవాలన్న పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కేంద్రం, ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వం తాజ్‌ మహల్‌ బాగోగులను పట్టించుకుంటాయన్న ఆశ కనిపించడం లేదని కోర్టు పేర్కొంది. పారిస్‌లోని ఈఫిల్‌ టవర్‌ కన్నా తాజ్‌మహల్‌ ఎంతో అందమైనదని.. దీన్ని సంరక్షిస్తే భారత్‌కున్న విదేశీ కరెన్సీ లోటు భర్తీ చేయొచ్చని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. దేశ సమస్యను పరిష్కరించే సత్తా ఉన్న ఏకైక కట్టడం తాజ్‌మహల్‌... అలాంటి తాజ్‌ను మీరు పట్టించుకోవడం లేదని కోర్టు వ్యాఖ్యానించింది. తాజ్‌ ట్రాపెజియమ్‌ జోన్‌ పరిధిలోని పరిశ్రమలను ఎందుకు మూయించడం లేదని టిటిజెడ్‌ ఛైర్మన్‌ను ప్రశ్నించింది. టిటిజెడ్‌ పరిధిలో కొత్త ఫ్యాక్టరీలకు అనుమతించమని ఛైర్మన్‌ కోర్టుకు హామీ ఇచ్చారు.

12:25 - July 9, 2018

సంగారెడ్డి : కాలుష్య కారక పరిశ్రమలను హైదరాబాద్ నుండి తరలిస్తామని తెలంగాణ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. పటన్ చెరువు మండలం పాశమైలారం వ్యర్థ జలాల శుద్ధి కేంద్రానికి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ...రామచంద్రాపురం, బాలానగర్, జీడిమెట్ల, పాశమైలారం, పటన్ చెరువు ప్రాంతాల్లో ఉన్న పరిశ్రమలను తరలించేందుకు కార్యచరణ రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే దాదాపు 300 కంపెనీల సీఈఓలతో మాట్లాడడం జరిగిందన్నారు. ఇప్పటికే కాలుష్యనాఇ్న వెదజల్లే 16 పరిశ్రమలను మూసివేయించడం జరిగిందని, మిగతా వాటిని ఔటర్ రింగ్ రోడ్డు అవతలకు తరలిస్తామన్నారు. 

12:26 - June 25, 2018

కడప : ఉక్కు పరిశ్రమ కోసం దీక్షలు చేస్తున్నా కేంద్రం దిగొస్తలేదని ఏపీ మంత్రి జవహార్ పేర్కొన్నారు. పరిశ్రమ ఏర్పాటు కోసం ఎంపీ సీఎం రమేశ్, ఎమ్మెల్సీ బీటెక్ రవిలు ఆమరణ నిరహార దీక్ష చేపడుతున్న సంగతి తెలిసిందే. ఆరో రోజు సోమవారం మంత్రి జవహార్ ఇతరులు సంఘీభావాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఈడీ అటాచ్ మెంట్స్ చూస్తే ఎవరు దొంగ దీక్షలు చేస్తున్నారు..ఎవరు దివిటి దొంగలు తయారు చేశారనేది ప్రజలకు తెలుసన్నారు. జగన్ లో కడప పౌరుషం లేదని..గనులు..ఏ విధంగా దోపిడి చేయాలనేది తెలుసుకున్నాడన్నారు. జగన్ కు బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. ఉక్కు పరిశ్రమ కోసం చేస్తున్న దీక్షకు ప్రభుత్వం సంఘీభావం తెలియచేస్తుందని, వీరి చేస్తున్న దీక్షలతో కేంద్రం దిగొస్తుందని అనుకున్నానన్నారు. ఈ దీక్షలతో కేంద్రం దిగొస్తుందని అనుకున్నానని..కానీ కేంద్రానికి చలనం లేదన్నారు. 

07:01 - June 8, 2018

సంగారెడ్డి : రసాయన పరిశ్రమల కాలుష్యంతో సంగారెడ్డి జిల్లాలో సగం జనాభా అతలాకుతలం అవుతోంది. పరిశ్రమలు వెదజల్లే జాల వాయువు కాలుష్యంతో ప్రజలు రోగాల భారిన పడుతున్నారు. వీటికి తోడు మరో పరిశ్రమ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దీనిపై సంగారెడ్డి జిల్లా ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సంగారెడ్డి జిల్లాలో ఇప్పటికే మూడు పరిశ్రమలు వచ్చిపడ్డాయి. వీటి వల్ల ఉపాధి అవకాశాలు మెరుగుయ్యాయా అంటే పెద్దగా ఏమీ ఒరగలేదు. పైగా ఈ పరిశ్రమలు వెదజల్లే కాలుష్యంతో ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. పరిశ్రమలకు అనుమతులు ఇచ్చిన అధికారులు మాత్రం చేతులు దులుపేసుకుంటున్నారు. కనీసం నిఘా లేక పోవడంతో పరిశ్రమ యాజమాన్యం అడిందే ఆటాగా పాడిందే పాటగా కొండాపూర్ మండలం మాల్కాపూర్ లో పాత టైర్ల కంపెనీలు వెదజల్లే కాలుష్యంతో ప్రజల పరిస్థితి దుర్భరంగా మారింది. పంటలు కూడ పండని పరిస్థితి ఏర్పండి. ఇప్పుడు వీటికి తోడు పక్కనే ఉన్న సదాశివపేట మండలం మద్ధికుంటలో AVR రసాయన పరిశ్రమ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతుండటంతో ఇక్కడ ప్రజలు హడలిపోతున్నారు.

ఈ పరిశ్రమ ఏర్పాటుకు మార్చి 28న ప్రజాభిప్రాయ సేకరణకు పూనుకున్నారు. అయితే అనివార్యకారనలతో వాయిదా పడింది. ఈ నెల 8న కలెక్టర్ అధ్యక్షతన ప్రజాభిప్రాయ సేకరణకు సిద్ధమౌతున్నారు అధికారులు. రూ.250 కోట్ల వ్యయంతో 112 ఎకరాల్లో AVR రసాయన పరిశ్రమ ఏర్పాటు చేయనున్నారు. ఈ రసాయన పరిశ్రమ వార్షిక ఉత్పత్తి లక్ష్యం 1528 మెట్రిక్ టన్నులు. ఈ ఫార్మా కంపెనీలను ఒకచోటు నెలకొల్పేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లను చేస్తుంటే... ఈ కంపెనీ యాజమానులు పట్టుబట్టి ఇక్కడే ఎందుకు నెలకొల్పుతున్నారు? అన్నది ఇక్కడి ప్రజల ప్రశ్న. ఎట్టి పరిస్థితిల్లో ఇక్కడ కంపెనీ ఏర్పాటుకు ఒప్పుకోబోమని స్థానికులు తేల్చి బెబుతున్నారు. పరిశ్రమల ఏర్పాటు, ఉపాధి అవకాశాలు మెరుగువ్వాలనే ఎవరైనా కోరుకుంటారు...కానీ కాలుష్యం వెదజల్లే పరిశ్రమలు వద్దంటే వద్దంటున్నారు సంగారెడ్డి జిల్లా ప్రజలు. ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకుంటామని స్పష్టం చేప్తున్నారు.

17:29 - February 20, 2018
18:22 - November 7, 2017
09:43 - June 27, 2017

కరీంనగర్ : రోడ్లు వేస్తామంటారు... పరిశ్రమలు తీసుకొస్తామంటారు... అభివృద్ధి చేసేస్తామంటూ హామీలు గుప్పిస్తారు.  రోజులు... నెలలు గడిచినా అవి అమలకు మాత్రం నోచుకోవడం లేదు.  పాలకుల్లో చిత్తశుద్ధి కరువవడంతో.. ప్రజలకు నిరాశ తప్ప మరేం మిగలడం లేదు.
జిల్లాకు దూరమవుతున్న పరిశ్రమలు
అభివృద్ధి మాటేమోగాని... కరీంనగర్‌ జిల్లాకు మంజూరైన పరిశ్రమలు  దూరవుతున్నాయి. అది చేస్తాం... ఇది చేస్తామని వాగ్దానాలు చేస్తున్న పాలకుల హామీలు మాటలకే పరిమితమవుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సెంటిమెంట్‌ జిల్లాగా చెప్పుకునే కరీంనగర్‌ జిల్లాపై ప్రభుత్వం సవతి తల్లి ప్రేమను చూపిస్తోందని ప్రజలు అంటున్నారు. ఐటీ రంగంలో జిల్లాను అభివృద్ధి చేస్తామని.. అనుమతులు మంజూరు చేస్తే యుద్ధప్రాతిపదికన ఐటీ నిర్మాణాలు చేపడతామని మంత్రి కేటీఆర్‌ హామీ ఇచ్చారు. నెలలు గడుస్తున్నా ఆ ఊసే లేకపోగా... జిల్లాకు మంజూరైన పరిశ్రమలు సైతం తరలిపోతున్నాయి.   
ఐటీ పార్క్‌ ఏర్పాటు చేస్తామని కేటీఆర్‌ హామీ
ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి కేటీఆర్‌  జిల్లాలో ఐటీ పార్క్ ఏర్పాటు చేస్తామని ఏడాదిన్నర కిందట కేటీఆర్‌ హామీ ఇచ్చారు. అంతేకాకుండా ఐటీ పార్క్‌ నిర్మాణం కోసం పది ఎకరాల  మార్క్‌ఫెడ్‌ స్థలాన్ని కేటాయిస్తు నిర్ణయం తీసుకున్నారు. 
ఐటీ పార్క్‌కు ఏర్పాటుకు పడని అడుగులు
కేటీఆర్‌ హామీతో ఐటీ పనులు చకాచకా సాగిపోతాయని అందరూ అనుకున్నారు. అయితే అనుకున్న దానికంటే భిన్నంగా పరిస్థితులు మారాయి.  ఐటీ పార్క్‌ ఏర్పాటుకు ఇంత వరకు అడుగులు పడకపోగా... గతంలో జిల్లాకు మంజూరైన లెదర్ ఫ్యాక్టరీ, సైనిక్ స్కూల్, టెక్స్ టైల్ జోన్‌, హర్టికల్చర్ యూనివర్సిటీలు కూడా మరొక చోటికి తరలిపోతున్నాయి. దీంతో జిల్లా ప్రజలు నిరాశ చెందుతున్నారు. విపక్షాలు కూడా ప్రభుత్వ తీరుపై మడిపడుతున్నాయి. 
హైదరాబాద్‌, బెంగళూర్‌ నగరాలకు తరలి వెళ్తున్న ఇంజినీర్లు
జిల్లాలో శాతవాహన యూనివర్సిటీతో పాటు 10 ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలు ఉండడంతో ఏటా ఆరు వేల మంది ఇంజనీర్లు పట్టాలు పుచ్చుకుని హైదరాబాద్, బెంగుళూర్‌కు తరలి వెళ్తున్నారు. ఇక్కడ ఐటీ రంగం అభివృద్ధి చెందితే... ఇక్కడే వారందరికీ ఉద్యోగాలు లభిస్తాయని జిల్లా ప్రజలు ఆశపడ్డారు. కానీ మంజూరైన పరిశ్రమలే తరలిపోవడంతో.. అందరూ నిరాశ చెందుతున్నారు. ఇప్పటికైనా పాలకులు ఇచ్చిన హామీలను అమలు చేయాలని జిల్లా ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. 

12:04 - June 1, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ టీ వ్యాలెట్ ను ఆవిష్కరించారు. అనంతరం ఐటీ శాఖకు సంబంధించిన 2016-17 వార్షిక నివేదికను కేటీఆర్ విడుదల చేశారు. తెలుగు..ఇంగ్లీష్..ఉర్దూ భాషల్లో ఈ వ్యాలెట్ ను రూపొందించారు. గురువారం తాజ్ దెక్కన్ లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ...టీ వ్యాలెట్ లో లావాదేవీలకు ఛార్జీలు ఉండవని, రాష్ట్ర ఐటీ, ఐటీ ఎగుమతుల వృద్ధి 13.85 శాతం..జాతీయవృద్ధి 10 శాతం నమోదైందని తెలిపారు. మీసేవ ఇ- లావావేదీలలో దేశంలోనే తెలంగాణది నెంబర్ 1 స్థానంలో ఉందన్నారు. ప్రతి వెయ్యి మందికి 12వేల ఇ లావాదేవీలతో తెలంగాణ రాష్ట్రం తొలి స్థానంలో నిలిచిందన్నారు. ఏడాదికాలంలో 3.62 కట్ల మందికి ఎలక్ట్రానిక్ సేవలు అందిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

19:08 - May 29, 2017

నిజామాబాద్ : స్మార్ట్‌ ఆగ్రో ఇండస్ట్రీస్‌ సంస్థ ఆధ్వర్యంలో నిజామాబాద్‌ జిల్లా... లక్కంపల్లిలో సెజ్‌ చేపట్టిన నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. పనులు అనుకున్న స్థాయిలో వేగంగా సాగడం లేదు. 2015 నవంబర్ 15న కేంద్రమంత్రులు హర్షిమ్రత్ కౌర్ బాదల్, సాద్వి నిరంజన్లు మెగా ఫుడ్‌ పార్క్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ నిర్మాణం ఈ ఏడాది డిసెంబర్‌ కల్లా పూర్తి కావాలి. కానీ ప్రస్తుతం కొనసాగుతున్న రెండు గోదాములు.. ఒక శీతల గిడ్డంగి పనులు సాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో గడువులోపు పనులు పూర్తి కావడం అన్నది సాధ్యం కాదు.

108 కోట్లతో
సుమారు 108 కోట్లతో వ్యయ అంచనాతో ప్రారంభించిన మెగా ఫుడ్‌పార్క్ పనులు ఏడాదిన్నర గడచినా ప్రాథమిక దశలోనే ఉన్నాయి. ప్రస్తుతం అక్కడ జరుగుతున్న.. గిడ్డంగి నిర్మాణ పనులు పునాది స్థాయిలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో నిర్మాణాల పూర్తయ్యే సరికి సంవత్సరానికి పైగా సమయం పట్టే అవకాశం ఉంది. ఇదే సమయంలో మెగాఫుడ్‌ పార్క్ అవసరాలకు కావాల్సిన నీటిని గోదావరి నుంచి తరలించాల్సి ఉంది. అయితే నీటి కేటాయింపులు ఇప్పటికి కొలిక్కి రాలేదు. ఈ తంతు ముగిసి నీటి తరలింపు పనులు మొదలు పెట్టడంపై కూడా సందిగ్థత నెలకొంది. నిర్మాణ పనులు మందకొడిగా సాగుతుండడంతో ఏడాది క్రితం అప్పటి పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే పనులు వేగవంతం చేయాలని నిజామాబాద్ ఎంపీ కవిత, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి స్మార్ట్ ఆగ్రో ఇండస్ర్టీస్ యాజమాన్యానికి సూచించినా ఎలాంటి స్పందన లేదు. అలాగే స్థానికులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు కూడా దీనిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. త్వరితగతిన పూర్తి చేసి.. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలను కల్పించాలని కోరుతున్నారు. నిర్ధిష్ట గడువులోగా మెగా ఫుడ్‌ పార్క్‌ అందుబాటులోకి వస్తేనే...పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గుచూపే అవకాశం ఉంది. పెట్టుబడులు పెట్టకుంటే కోట్లాది రూపాయలు వృథా అవుతాయి. ఇప్పటికైనా... ఈ పనులు వేగంగా పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.  

10:35 - March 9, 2017

పరిశ్రమలకు వ్యతిరేకంగా కాదు..కానీ కలుషితమైన పరిశ్రమలు పెట్టొద్దని వక్తలు అన్నారు. 'ఆక్వాఫుడ్ పార్కు నిర్మాణం' అనే అంశంపై నిర్వహించిన ఇవాళ్టి న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో టీడీపీ నేత విజయ్ కుమార్, కాంగ్రెస్ నేత రాంశర్మ, సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యులు నేత సీహెచ్ బాబురావు పాల్గొని, మాట్లాడారు. జనం చేసే ఆందోళనకు మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత అందరికీ ఉందని చెప్పారు. ప్రజలకు ఇష్టం లేకున్న ఆక్వాఫుడ్ పార్కు నిర్మాణం చేపట్టం సరికాదని పేర్కొన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

Pages

Don't Miss

Subscribe to RSS - పరిశ్రమలు