పరిస్థితి

13:58 - May 30, 2018

కృష్ణా : జిల్లాలో కిడ్నీవ్యాధుల పరిస్థితిపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు.  ఉండవల్లిలోని తన నివాసంలో అధికారులతో సమీక్ష జరిపిన ముఖ్యమంత్రిమూడు జిల్లాల్లో కిడ్నీ వ్యాధుల నియంత్రణకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్న ఆదేశించారు.  కృష్ణాజిల్లా ఎ.కొండూరు మండలం లోని 19 గ్రామాల్లో పరిస్థితిపై అధికారులతో సమీక్ష జరిపారు. నూజివీడు ఏరియా ఆస్పత్రిలో తక్షణమే డయాలసిస్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని  ఆదేశంచారు. దాంతోపాటు  కిడ్నీ వ్యాధి పీడితులకు ఉచితంగా మందులు, ప్రతినెలా  పింఛన్లు ఇవ్వాలని అధికారులకు సూచించారు.  

 

18:47 - November 12, 2017

ఆదిలాబాద్ : జిల్లాలో పత్తి రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. పంటను పండించడమే అంటే అమ్మడం మరింత కష్టంగా మారింది. రైతులు సీసీఐ అధికారులను, జిన్నింగ్ మిల్లుల యజమానులను బ్రతిమిలాడి అమ్మాల్సిన పరిస్థితి నెలకొంది. పంటను తక్కువ ధరకు కాజేయడానికి దళారులు, జిన్నింగ్‌ మిల్లుల యజమానులు ప్రయత్నిస్తున్నారు. ధరల విషయంలో, తేమ విషయంలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ రైతుల పొట్ట కొడుతున్నారు. 

 

10:26 - September 19, 2017

నాగర్ కర్నూలు : మద్యం మత్తులో కన్న తల్లిపైనే దాడి చేశాడు ఓ కసాయి కొడుకు. నాగర్‌కర్నూలు జిల్లా మద్దిమడుగు గ్రామ పరిధిలోని చెంచుగూడెంలో తల్లి పోతమ్మపై కన్న కొడుకు బాణాలతో దాడి చేశాడు. పోతమ్మ పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌ ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మద్యం మత్తులో భార్యపై సైతం దాడికి యత్నించాడు. తల్లి, భార్య పోలీసులుకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అతన్ని మందలించి వదిలేశారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తారా అంటూ తల్లిపై దాడికి దిగాడు. 

 

20:59 - September 13, 2017

కాళ్లకింద భూమి కదిలిపోతోంది. తలపైన ఆకాశం నిప్పుల వర్షం కురిపిస్తోంది. సంద్రం వైపు ఆశగా చూసే కళ్లను తీరం తిరస్కరిస్తోంది. వెరసి ఎవరికీ చెందని అభాగ్యులయ్యారు. మాతృభూమికి, పరాయిదేశానికి మధ్య బతుకు ప్రశ్నార్ధకంగా మారుతోంది. భూమిపై గీతలు గీసుకున్న సరిహద్దులు, నిబంధనలు పేరుతో నిరాకరించి అపహసిస్తున్న పౌరసత్వాలు.. అణచివేతకు పరాకాష్టగా మారిన పరిస్థితులు.. వెరసి రోహింగ్యాలు ఇప్పుడు లెక్కల్లో లేని మనుషులు.. దేశం లేని పౌరులు.. ఉనికి నిరాకరించబడిన దీనులు..ఆధునిక ప్రపంచంలో అణచివేతకు నిజమైన ఉదాహరణగా కనిపిస్తున్న రోహింగ్యాల పరిస్థితిపై ఈ రోజు వైడాంగిల్ స్టోరీ..
సొతగడ్డకు బరువయ్యారు.. 
సొతగడ్డకు బరువయ్యారు.. చదువుకునే అర్హతలేదు.. ఉద్యోగాలకు అవకాశం లేదు.. అసలు బతికే పరిస్థితే లేదు.. ఏం చేయాలి? ఎటు పారిపోవాలి..? ఎక్కడ తలదాచుకోవాలి? ఇప్పుడది భూమీ ఆకాశాలు ఏకమైన సుదీర్ఘ విలాపం.  చావుకీ బతుక్కీ మధ్య తేడా తెలియని లక్షలాది ప్రజల దీనత్వం.. జాతులపేరుతో, మతాల పేరుతో విద్వేషాలు పెంచుకునే మానవజాతి హీనత్వం.. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

20:24 - September 5, 2017

ఏస్ ముమ్మాటికి తెలంగాణల దళితుల పరిస్థితి ఆగమున్నది.. ప్రభుత్వం దళితుల జీవితాలతోని ఆటాడుకుంటున్నది.. ఇది నేను గమనించి చెప్తున్న ముచ్చట.. మంథని మధుకర్ కాడికెళ్లి.. నిన్న మానకొండూరు ఆత్మహత్యాయత్నాల దాక.. దళితుని హక్కులను బొందవెట్టింది తెలంగాణ ప్రభుత్వం.. ఈ దేశానికి స్వాతంత్ర్యం వచ్చినంక.. దళితులను ఈ తరీఖల మోసం జేశిన ప్రభుత్వం ఈ టీఆర్ఎస్ ప్రభుత్వమేగావొచ్చు..

అవునయ్యా తెలంగాణ రాష్ట్రం వచ్చి మూడేండ్లై.. నాల్గో యాడాది నడుస్తున్నది.. ఇన్నిరోజులళ్ల.. ఎన్నడన్న పువ్వుగుర్తోళ్లు సెప్టంబర్ 17 ను అధికారికంగ నిర్వహించాలే అని యాత్రలు జేశిండ్రా..? ఏదో పార్టీ ఆఫీసుల ప్రెస్ మీటింగు వెట్టి.. తూతూ మంత్రం తుమ్మకాయ మంత్రం సద్విపోయిండ్రు.. ఇగ ఏమంట తెలంగాణల ఎన్నికలు దగ్గరవడ్తున్నయో.. ఇగ సెప్టంబర్ 17 మీద చిన్నగావురం గారుస్తున్నరా..? సూడుండ్రి..

గాలొచ్చినప్పుడే తూర్పాల వట్టుకోవాలె.. అధికారం ఉన్నప్పుడే నాల్గు రాళ్లు ఎన్కేసు కోవాలె..? అంతేనా..? అధికార పార్టీ ఎంపీ అయి ఉండి గూడ.. ఏం సంపాయించుకోకపోతె.. ఏడ గుంటెడు భూమి కబ్జా వెట్టుకోకపోతె నల్గురు ఎక్కిరియ్యరా..? ఏహే తెల్వి తక్వ ఎంపీ తెల్వితక్వ ఎంపీ అంటే.. ఎంత నామూషుంటది..? అందుకే ఆ మాట నాకు రావొద్దని బీబీ పాటిల్ సారు ఎంత తాపత్రయపడ్డడో సూడుండ్రి..

మామూల్గ ప్రభుత్వ సభలు సమావేశాలకు.. అప్పట్ల మందిని తోల్కొస్తుండే.. ఇప్పుడు గొర్లను గొట్కొస్తున్నరు.. ఎందుకంటె గొర్ల మీదనే సభ గావట్టి అవ్వి తెస్తున్నట్టున్నరు.. అయితే కండియం శ్రీహరి సారు చిన్నప్పుడు ఈ జీవాలు గూడ గాశిండో ఏమో..? అవ్విటిని సూశి ముర్శిపోతున్నడు.. మందులేస్తున్నడు.? సూడుండ్రి సారు ముచ్చట ముర్పెం..

తెలంగాణ ప్రజలారా..? మీకు రోగమొచ్చినా నొప్పొచ్చినా..? ప్రైవేటు దావఖాండ్ల పొంట వోకుండ్రి.. సర్కారు దావఖాండ్లను వాడుకోండ్రి... పుణ్యానికే వైద్యం జేపిచ్చుకోండ్రి అని పిల్పునిస్తున్నడు మంత్రి.. మంత్రంటే వైద్యారోగ్యశాఖా మంత్రిగాదు.. నీటి పారుదల శాఖామంత్రి హరీష్ రావుగారూ.. శాఖలు వేరైతేంది.. సారం ఒక్కటేగదా..? ఏమంటరు..?

అమెరికా అధ్యక్షునితోని పంచాది వెట్టుకున్నా నడుస్తదిగని.. ఊర్లె సాప్ సపాయోళ్లతోని వెట్టుకుంటె ఎట్లుంటదో తెల్సా..? పోకిరి సీన్మల బ్రహ్మానందానికి ఏ గతి వడ్తది..? అగో అదే గతి వడ్తది ఎవ్వలికైనా..? కాకపోతె క్యారెక్టర్లు మాత్రమే మార్తయ్..? సాఫ్ సఫాయోళ్ల తెర్వువొయ్యిన ఒకాయిన ఇంటి మీద ఎసొంటి దండ యాత్ర జేశిండ్రో సూడుండ్రి..

ఆ ముఖ్యమంత్రి కేసీఆర్ గారూ.. మా ఖమ్మం పట్నానికొచ్చినప్పుడు ఐదువేల డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తున్నమన్నడు.. ఇద్వర్ దాక ఒక్కటి గూడ ఇయ్యలేదంటే..? అప్పుడు కార్పొరేషన్ ఎన్నికలున్నయ్ గావట్టి అన్నడేమో.? ఇప్పుడేమున్నయ్.. అయినా ఏ నాయకుడైనా.. ఏ పార్టైనా..? మేము ఇస్తమనే అంటది గని.. ఇయ్యమంటదా..? న్యూ డెమోక్రసీ అన్నలు..?

అయ్యో పాడుగాను.. చివరి సూపు కన్న నోచుకోకపోతిమి.. ఎంతపనైపాయెనుల్లా.. శీన్మలు జూశెటోళ్లకు ఏ కష్టం రాకుంట కాపాడుతుండే.. నిన్న ఆత్మహత్య జేస్కోని సచ్చిపోయిందట.. పాపం మొగదిక్కు లేక ఆంధ్రా ఆడిబిడ్డెలు పాడె మోశిండ్రు తలగోరి వట్టిండ్రు.. డప్పుల సప్పుళ్లు లేక సైలెంటుగ పీన్గె వోతుంటే.. సూశినోళ్లంత నవ్విండ్రు.. అగో ఏడ్వాలేగని.. నవ్విండ్రేందంటరా..? సూడుండ్రి తెలుస్తది..

 

07:24 - July 24, 2017

శివసేన బీజేపీకి సహజ మిత్రపక్షామని, అన్నిరాష్ట్రాల్లో బీజేపీ ఎదోవిధంగా అధికారం చేజెక్కించుకోవాలని చూస్తుందని, నోట్ల రద్దు తర్వాత ఆర్థిక పరిస్థితి దిగజరిందని, ఇది దేశాన్ని ఆందోళన కలిగించే విషయామని, కాగ్ నివేదికలో కూడా భారత రక్షణ వ్యవస్థ బాగాలేదని తెలిపిందని, ప్రణబ్ ముఖర్జీ అర్డినెన్స్ పదే పదే చేయడం మంచి కాదని చెప్పడాని ప్రముఖ విశ్లేషకులు ప్రణబ్ ముఖర్జీ అన్నారు. శివసేన మహారాష్ట్రలో బీజేపీ అధికారంలో ఉంది, మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలప్పుడు విడిగా పోటీ చేసి బీజేపీ మెజార్టీ సీట్లు గెలించిందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు రఘునాథ్ అన్నారు. రైతులకు రుణా మాఫీ చేశామని టీడీపీ నేత దుర్గాప్రసాద్ అన్నారు. నోట్ల రద్దు వల్ల దేశ ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్న మాట వాస్తవం అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రామశర్మ అన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

20:04 - June 27, 2017

పశ్చిమ గోదావరి : గరగపర్రులో ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ కారెం శివాజీ పర్యటించి.. నిజనిజాలు తెలుసుకున్నారు. సాంఘిక బహిష్కరణపై తప్పుడు సమాచారమిచ్చిన అధికారులను సస్పెండ్‌ చేసినట్లు తెలిపారు. గరగపర్రులో దళితుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. సమస్యకు కారణమైన వారిని 24 గంటల్లోగా అరెస్ట్‌ చేయాలని ఆదేశించామని ఆయన తెలిపారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి. 

16:11 - June 1, 2017

ఢిల్లీ : గత మూడేళ్లలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుకుందని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ తెలిపారు. ఎన్డీయే ప్రభుత్వం మూడేళ్ల పాలన పనితీరుకు సంబంధించిన రిపోర్టును జైట్లీ విడుదల చేశారు. మూడేళ్ల ముందు ప్రపంచంలోనే మన ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దిగజారిపోయిందన్నారు. మూడేళ్ల ఎన్డీయే పాలనలో రెండేళ్లు వాతావరణ పరిస్థితులు అనుకూలించలేదని....ఇలాంటి విషమ పరిస్థితుల్లో సైతం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల భారత ఆర్థికవ్యవస్థ మెరుగుపడిందని ఆర్థికమంత్రి చెప్పారు. విదేశీ పెట్టుబడులు కీలక పాత్ర పోషించాయని జైట్లీ తెలిపారు. జిఎస్‌టి అమలులోకి వస్తే ఎంతో లాభదాయకంగా ఉంటుందని పేర్కొన్నారు.

18:54 - May 30, 2017

హైదరాబాద్ : దర్శకరత్న దాసరి నారాయణరావు ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న దాసరి నారాయణరావుకు తాజాగా ఇన్‌ఫెక్షన్‌ సోకింది. దీంతో దాసరిని హుటాహుటిన కిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. దాసరికి గ్యాస్ట్రిక్‌ బెలూన్‌ సర్జరీని కిమ్స్‌ వైద్యులు నిర్వహించారు. అయితే ఉదయం నుంచి దాసరికి బీపీ, హెచ్చుతగ్గులు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న దాసరి ఈ ఏడాది జనవరి 19న తీవ్ర అనారోగ్యంతో..కిమ్స్‌లో తొలిసారిగా చేరారు. కొంతకాలం ఆసుపత్రిలో ఉన్న తర్వాత మార్చి 19న దాసరిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేశారు. మళ్లీ ఆరోగ్యం కుదుటపడకపోవడంతో వారం రోజుల క్రితం తిరిగి దాసరి కిమ్స్‌ ఆస్పత్రిలో చేరారు. ఉదయం నుంచి బీపీ హెచ్చు తగ్గులు ఉన్నట్లు గుర్తించిన వైద్యులు దానికి ట్రీట్‌మెంట్‌ నిర్వహిస్తున్నారు. దాసరి ఆరోగ్యంపై కిమ్స్‌ వైద్యులు కాసేపట్లో హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేయనున్నారు. 

11:48 - May 20, 2017

ప్రకాశం : జంట హత్యలతో ప్రకాశం జిల్లా బల్లికురువ మండలం వేమవరం గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గొట్టిపాటి రవికుమార్‌ కరణం బలరాం వర్గీయుల మధ్య రాత్రి జరిగిన వర్గ విబేధాలు దాడిలో ఇద్దరు మృతిచెందడంపై సీఎం చంద్రబాబు సీరియస్‌ అయ్యారు. కె.రాజుపాలెంలో ఓ వివాహానికి హాజరై ద్విచక్ర వాహనాలపై వస్తున్న కరణం వర్గీయులపై..గొట్టిపాటి వర్గీయులు కర్రలు, కత్తులతో మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో అంజయ్య, రామ కోటేశ్వరరావులు ఇద్దరు తీవ్రగాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. దాడిలో తీవ్రంగా గాయపడిన పేరయ్య, వెంకటేశ్వర్లు, ముత్యాలు, రాఘవులు చిలకలూరి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పాతకక్షల నేపథ్యంలో కరణం బలరాం వర్గీయులపై..గొట్టిపాటి వర్గీయులు దాడి చేసినట్లు తెలుస్తోంది. బాధితులను ఎమ్మెల్సీ కరణం బలరాం పరామర్శించారు. జంట హత్యల నేపథ్యంలో బల్లికురువ మండలంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో రంగంలోకి దిగిన ఎస్పీ త్రివిక్రమ్‌..భారీ ఎత్తున పోలీసులను మోహరించి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. తన వర్గీయులపై దాడి నేపథ్యంలో స్పందించిన కరణం..గొట్టిపాటి రవికుమార్‌ను పార్టీలో చేర్చుకొని తప్పుచేశారని సీఎం చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జరిగిన దాడిపై చంద్రబాబు ఏం సమాధానం చెప్తారో చూస్తామన్నారు.


 

Pages

Don't Miss

Subscribe to RSS - పరిస్థితి