పర్యటన

12:42 - October 17, 2018

శ్రీకాకుళం : జనసేనాని అధినేత పవన్ కళ్యాణ్ నేటి నుంచి శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. తిత్లీ తుపాను బాధితులను పవన్ పరామర్శించనున్నారు. అరకు ఎమ్మెల్యే కిడారి, సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరు సోమ హత్యలపై పవన్ చేసిన వ్యాఖ్యాలు వివాదాస్పదంగా మారాయి. పవన్ వ్యాఖ్యలపై తీవ్ర ఆందోళన నెలకొంది. అయితే పవన్ ఉత్తరాంధ్ర పర్యటనకు ముందే ప్రకంపనలు రేగాయి. 

 

09:59 - October 15, 2018

గుంటూరు : ఏపీ మంత్రి నారా లోకేశ్‌ అమెరికా పర్యటన రద్దు అయ్యింది. ఈనెల 17, 18, 19 తేదీల్లో వరల్డ్‌ ఫుడ్‌ ప్రైజ్‌ కార్యక్రమంలో లోకేశ్‌ పాల్గొనాల్సి ఉంది. వ్యవసాయ రంగంలో విశిష్ట సేవలు అందించిన వారికి ఇచ్చే అత్యున్నత పురస్కారం 'వరల్డ్‌ ఫుడ్‌ ప్రైజ్‌' కార్యక్రమంలో 'భారతదేశ వ్యవసాయ రంగం-టెక్నాలజీ అనుసంధానంతో దేశ వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులపై' కీనోట్‌ ప్రసంగం ఇవ్వాలని లోకేశ్‌కు ఆహ్వానం అందింది. అయితే.. తిత్లీ తుపాన్‌ ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా అతలాకుతలమైంది. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో తుపాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో లోకేశ్‌ పర్యటిస్తుండడంతో అమెరికా పర్యటన వాయిదా వేసుకున్నారు. శ్రీకాకుళంలో పరిస్థితులు మెరుగుపడే వరకు లోకేశ్‌ అక్కడే ఉండి పర్యవేక్షించనున్నట్లు తెలుస్తోంది. 

 

18:31 - October 14, 2018

హైదరాబాద్ : తెలంగాణలో ఏఐసీసీ జాతీయ అధ్యక్షులు రాహుల్‌గాంధీ పర్యటన ఖరారు అయింది. ఈనెల 20న రాష్ట్రంలో రాహుల్ సుడిగాలి పర్యటన చేయనున్నారు. హైదరాబాద్, ఆదిలాబాద్, కామారెడ్డి జిల్లాల్లో నిర్వహించనున్న కాంగ్రెస్ బహిరంగ సభలలో రాహుల్‌గాంధీ పాల్గొనన్నారు.

ఈనెల 20న ఉయదం 11 గంటలకు చార్మినార్‌లో, మధ్యాహ్నం 12.45 నిమిషాలకు ఆదిలాబాద్ జిల్లా బైంసాలో, సాయంత్రం 4.45 గంటలకు కామారెడ్డిలలో నిర్వహించే బహిరంగ సభల్లో రాహుల్ పాల్గొని, ప్రసంగించనున్నారు. రేపు సభా ఏర్పాట్లను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కుంతియా పరిశీలించనున్నారు. 

 

21:27 - October 12, 2018

శ్రీకాకుళం : తిత్లీ తుపాన్ ప్రబావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటించారు. జిల్లాలోని వజ్రపుకొత్తూరు పరిసర ప్రాంతాలను చంద్రబాబు పరిశీలించారు. తుపానుతో నష్టపోయిన రైతులందర్నీ ఆదుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు. తుపాను ప్రభావిత ప్రాంత వాసులకు 50 కిలోల బియ్యాన్ని అందజేస్తామన్నారు. విద్యుత్‌ పునరుద్ధరణ పనులు వేగవంతం చేస్తామని తెలిపారు. 194 గ్రామాల్లో సహాయకచర్యలను ముమ్మరం చేశామని.. పలాసలోనే ఉండి యుద్ధప్రాతిపదికన పనులు జరిగేలా చూస్తానని పేర్కొన్నారు. 

పలాసను మంచి టౌన్‌గా డెవలప్‌మెంట్ చేస్తామని చెప్పారు. పలాసను టౌన్‌గా మాడలైజ్ చేస్తామని, అధునికమైన టౌన్‌గా తయారు చేస్తామన్నారు. మంచిగా పని చేసిన వారికి అవార్డులు ఇస్తామని పేర్కొన్నారు. 

08:42 - October 10, 2018
హైదరాబాద్ : తెలంగాణలో గెలుపే లక్ష్యంగా బీజేపి పావులు కదుపుతోంది. ఎన్నికల ప్రచార బరిలోకి పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా దిగారు. నేడు కరీంనగర్లో జరిగే బహిరంగ సభలో పాల్గొనున్న ఆయన.. అటు టీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ తీరును ఎండగట్టనున్నారు. మరోవైపు అమిత్ షా పర్యటన తరువాత అభ్యర్ధుల జాబితా విడుదల చేసేందుకు బీజేపి కసరత్తు ముమ్మరం చేసింది. 
భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడు అమిత్ షా ఇవాళ తెలంగాణలో పర్యటించనున్నారు. ఉదయం 11గంటలకు హైదరాబాద్ చేరుకోనున్న షా.. ముందుగా బంజారాహిల్స్ లోని అగ్రశ్రేన్ మహారాజ్ జయంతి కార్యక్రమంలో పాల్గొంటారు. తరువాత కాచీగూడలోని శ్యాంబాబా మందిర్ లో సాధువులతో భేటీ అవుతారు. మధ్యాహ్నం 12గంటల 30నిమిషాలకు ఎగ్బిబిషన్ గ్రౌండ్ లో సికింద్రాబాద్, హైదరాబాద్, చేవేళ్ల, మల్కాజ్ గిరి పార్లమెంట్ పరిధిలోని పోలింగ్ కేంద్ర స్థాయి నాయకులను కలుస్తారు. మధ్యాహ్నం భోజన విరామం తరువాత ప్రత్యేక హెలీకాఫ్టర్లో కరీంనగర్ బయల్దేరతారు. బీజేపి తలపెట్టిన సమరభేరీ సభలో పాల్గొంటారు. 
 
అమిత్ షా పర్యటన తరువాత తమ అభ్యర్థులను ప్రకటించనున్నట్లు బీజేపి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు వెల్లడించారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రావడానికి టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆరే కారణమని విమర్శించారు. ప్రజల తీర్పును వృథా చేయడానికి ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే టీఆర్ఎస్ పార్టీకి వేసినట్లేనన్నారు.
 
అమిత్‌షా పర్యటనతో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలకు దడపుడుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కే లక్ష్మణ్‌ అన్నారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు, మోడీ ప్రభుత్వం అమలు చేసిన పథకాల గురించి ఈ సభ ద్వారా ప్రజలకు తెలియజేస్తామన్నారు. ముందుస్తు ఎన్నికలకు సీఎం కేసీఆర్‌ ఎందుకు వెళ్తున్నారో చెప్పాలని డిమాండ్ చేస్తామన్న లక్ష్మణ్.. కాంగ్రెస్ నేతలు.. తెలంగాణ ద్రోహులతో జత కట్టి మహాకూటమిగా ఏర్పడ్డారని మండిపడ్డారు.
08:03 - October 10, 2018

విశాఖపట్నం : మన్యంలో మరోసారి ఉద్విగ్న వాతావరణం నెలకొంది. డిప్యూటీ సీఎం చినరాజప్పతోపాటు మంత్రి నారా లోకేష్‌ నేడు విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. మరోవైపు గిరిజన ప్రజాప్రతినిధులు వ్యాపారులు ఏజెన్సీని వదిలి వెళ్లాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇదే సమయంలో మావోయిస్టు పార్టీ సెంట్రల్‌ కమిటీ పేరుతో ఓ లేఖ విడుదలైంది. దీంతో ఒక్కసారిగా మన్యంలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది.విశాఖ మన్యంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోన్న టెన్షన్‌ నెలకొంది. నేడు ఏపీ హోంమంత్రి చినరాజప్ప, ఐటీమంత్రి నారా లోకేష్‌ ఇవాళ మావోయిస్టుల చేతిలో హతమైన కిడారి సర్వేశ్వరరావు, సోమ కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. ఉదయం 9 గంటలకు  రోడ్డు మార్గంలో పాడేరులోని కిడారి సర్వేశ్వరరావు ఇంటికి చేరుకుని వారి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.  అనంతరం అక్కడి నుంచి అరకు వెళ్లి సివేరి సోమా కుటుంబ సభ్యులనూ వారు పరామర్శించనున్నారు.  ఈ నేపథ్యంలో పోలీసులు భద్రత మరింత కట్టుదిట్టం చేశారు. నారా లోకేష్‌ పర్యటనకు ఒక రోజు ముందు మన్యంలో మావోయిస్టులు విడుదల చేసిన లేఖ  కలకలం రేపుతోంది.  టీడీపీకి చెందిన కిడారి  సర్వేశ్వరరావు, సోమ హత్యలకు గల కారణాలను ఆ లేఖలో వెల్లడించారు. గిరిజనులకు   ద్రోహం చేస్తున్నందునే ప్రజాకోర్టులో వారికి శిక్ష విధించామని లేఖలో పేర్కొన్నారు.  బాక్సైట్‌ తవ్వకాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, గూడ క్వారీ విషయంలో ఎన్నోసార్లు వారిని హెచ్చరించినా పద్దతి మార్చుకోలేదన్నారు.  అందుకే అతడికి ప్రజాకోర్టులో శిక్ష విధించామని స్పష్టం చేశారు.  బాక్సైట్‌ తవ్వకాలకు ఎవరు అనుకూలంగా ఉన్నా వదిలేది లేదని లేఖలో హెచ్చరించారు.  ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అధికార పార్టీకి 20 కోట్లకు అమ్ముడుపోయారని అందులో ఆరోపించారు.  బాక్సైట్‌ తవ్వకాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని, పద్దతి మార్చుకోకపోతే కిడారి, సోమలకు పట్టిన గతే ఆమెకు పడుతుందని హెచ్చరించారు.   ఈ నేపథ్యంలో ఇవాళ నారా లోకేష్‌ కిడారి, సోమ కుటుంబాల పరామర్శకు వస్తున్నారు. దీంతో ఏం జరుగుతుందన్న ఆందోళన గిరిజనుల్లో వ్యక్తమవుతోంది.

21:20 - September 28, 2018

పశ్చిమగోదావరి : కొల్లేరు సరస్సు సమస్యపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. సాంప్రదాయ మత్స్యకారులు కాకుండా బయటి వారు రావడం వల్ల సమస్య వచ్చిందన్నారు. జిల్లాలోని కొల్లేరు సరస్సు ప్రాంతంలో ఆయన పర్యటించి, పరిశీలించారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. 2004 నుంచి కొల్లేరు సరస్సు సమస్య తనకు తెలుసునని అన్నారు. రాజశేఖర్‌రెడ్డి హయాంలో కొల్లేరును బద్దలు కొట్టినట్లు తన దృష్టిలో ఉందన్నారు. కొల్లేరు సమస్యను అర్థం చేసుకోవాలంటే చరిత్రను అర్థం చేసుకోవాలని పేర్కొన్నారు. ఇక్కడి మూలవాసులు ఎవరు ? ఇక్కడే ఎందుకున్నారు? అనే అంశాలను తెలుసకోవాలని చె్ప్పారు. లంగ గ్రామాల నుంచి ఇక్కడికి వలస వచ్చిన ప్రజలు చేపల వేట మీద జీవనాధారం సాగించారని తెలిపారు. ఆ తర్వాత చిత్తడి భూముల్లో కొద్దిపాటి వ్యవసాయం చేయడానికి ప్రయత్నించి..అది కూడా సరిగ్గా చేయలేకపోయారని చెప్పారు. పంటలు బాగా పండక.. పండిన పంటను కాస్త అమ్మితే ఆ డబ్బులను బ్యాంకులు తీసుకెళ్తే.. సంపాదించిన ధాన్యాన్ని తిరిగి వాళ్లే దొంగతనం చేసే స్థితి దాపురించిందని వివరించారు. ప్రజలు ఆ స్థతిలో ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి జలగలం వెంగళ్‌రావు 1970లో ఎకరం, ఎకరన్నర ఎకరాల్లో చేపల చెరువులు వేయించారని.. వాటన్నింటికి పట్టాలు ఇచ్చారని గుర్తు చేశారు. అయితే సాంప్రదాయ మత్స్యకారులు కాకుండా బయటి వారు రావడం వల్ల సమస్య వచ్చిందన్నారు. ’మనల్ని ఒకరు మీటింగ్ పెట్టనివ్వడం లేదంటే దానర్థం మనం బలపడుతున్నాం, మనల్ని చూసి వారు భయపడుతున్నారు’ అని అన్నారు.  

 

20:57 - September 28, 2018

పశ్చిమగోదావరి : జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన ఉత్కంఠగా మారింది. కొల్లేరులో పవన్ పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులు తొలగించారు. గ్రామస్థులు పవన్ కళ్యాణ్ సభకు హాజరైతే ఒక్కొక్కరికి రూ.50 వేలు జరిమానా విధిస్తామని గ్రామ పెద్దలు హెచ్చరించినట్లు తెలుస్తోంది. పవన్ మీటింగ్‌కు వెళ్లినా..ఆయనతో మాట్లాడినా జరిమానా తప్పదని చెప్పినట్లు తెలుస్తోంది. చింతమనేని తమ హీరో అని అక్కడ ఆయన అనుచరులు చెబుతున్నారు. దీంతో పవన్‌కళ్యాణ్ గుడివాకలంక సభను నిర్వహకులు రద్దు చేశారు. 

 

07:52 - September 28, 2018

పశ్చిమగోదావరి : జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌పై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ నిప్పులు చెరిగారు. తనపై చేసిన ఆరోపణలపై ఎన్ని కమిటీలు అయినా వేసుకొని నిరూపించాలని సవాల్‌ చేశారు.  పవన్‌ కల్యాణ్‌ ఓ గల్లీ నాయకుడి స్థాయికి దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తాను రాజ్యాంగయేతర శక్తిగా ఎదుగుతున్నానని చేసిన ఆరోపణలు నిరూపించాలని డిమాండ్‌ చేశారు. తానను రౌడీ షీటర్‌ అని పవన్‌ చెప్పాల్సిన అవసరం లేదని, తానేంటో దెందులూరు ప్రజలకు తెలుసన్నారు. నాణానికి ఒక వైపే చూస్తున్నారని రెండో వైపు​ చూస్తే పవన్‌ తట్టుకోలేరని హెచ్చరించారు.
నియోజక వర్గం అభివృద్ధిపై ఒక్క కామెంట్‌ చేయలేకనే వ్యక్తిగతంగా విషయాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. తాను కూడా వ్యక్తిగత విషయాలు మాట్లాడితే పవన్‌ కల్యాణ్‌ మూడు రోజుల అన్నం తినడం మానేస్తాడని ఎద్దేవా చేశారు. పవన్‌కు దమ్ముంటే దెందులూరులో తనపై పోటీ చేసి గెలవాలి సవాల్‌ చేశారు. తనపై పవన్‌ గెలిస్తే ఆయనకు సన్మానం చేసి ఆయనతో నడుస్తానన్నారు. ఓడిపోతే షేక్‌ హ్యాండ్‌ ఇచ్చి వెళ్లిపోవాలని పేర్కొన్నారు. పార్లమెంట్‌ లో ఎమ్మెల్యేలు ఉంటారంటూ అవగాహన లేని మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 18 ఏళ్ల వాడిని పోటీకి నిలబెడతాను అంటున్నారు. ఆ వయసులో అసెంబ్లీలో పోటీ చేసే​అవకాశం లేదని కూడా పవన్‌కు తెలియదని ఎద్దేవా చేశారు. రాజకీయ జ్ఞానం కోసం పవన్‌ తనతో ట్యూషన్‌ పెట్టించుకోవాలని ఎద్దేవా చేశారు. కాగా బుధవారం దెందులూరులో పర్యటించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్... ఎమ్మెల్యే చింతమనేనిపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. చింతమనేనిపై చాలా కేసులున్నా .. రాష్ట్ర ప్రభుత్వ పట్టించుకోవడం లేదని పవన్ ఆరోపించారు. విదేశాల్లో అయితే పర్యవసనాలు తీవ్రంగా ఉండేవని వ్యాఖ్యానించారు.

 

07:31 - September 28, 2018

పశ్చిమగోదావరి : చంద్రబాబు పాలనలో ఆఫ్టరాల్‌ ఒక ఆకురౌడీ, వీధిరౌడీ,  పోలీసులను, హమాలీలను. మహిళా అధికారులపై దౌర్జన్యాలకు పాల్పడతు చేయి చేసుకుంటున్నాడనీ ఎస్‌ఐ చొక్కా పట్టుకుంటున్నాడని  పవన్‌ టీడీపీ ఎమ్మెల్యే చింతమనేనిపై తీవ్ర విమర్శలు చేశారు. ‘ముఖ్యమంత్రిగారిలా చేతులు కట్టుకుని కూర్చోవడానికి మేం సిద్ధంగా లేమన్నారు. 36 కేసులు పెండింగ్‌లో ఉన్న ఒక వ్యక్తిని ప్రభుత్వ విప్‌గా నియమించి ప్రజలకు ఏ సంకేతాలు ఇస్తున్నారు..?’ అని ప్రశ్నించారు. చింతమనేని ప్రభాకర్‌ ఏలూరు పరిసరాల్లోకి వచ్చి రౌడీయిజం చేస్తే కాళ్లు విరగ్గొట్టి కూర్చోపెడతామని హెచ్చరించారు. క్రిమినల్‌ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకపోతే జాతీయ మానవహక్కుల సంఘానికి, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు, అలాగే గవర్నర్‌కు, డీజీపీ, చీఫ్‌ సెక్రటరీకి ఫిర్యాదు చేస్తామని పవన్ కళ్యాణ్ తెలిపారు.

 

Pages

Don't Miss

Subscribe to RSS - పర్యటన