పర్యాటకులు

14:45 - October 11, 2018

శాంట్రోనీ : జంతు ప్రేమికుల పోరాటం చివరకు ఊబకాయులకు పెద్ద కష్టాన్నే మిగిల్చింది. గత కొన్నేళ్లుగా గాడిదలను టూరిస్టులు వినియోగించడం వల్ల వాటి వెన్నుముక దెబ్బతిని అనారోగ్యం పాలైతున్నాయని జంతు ప్రేమికులు గ్రీకు దేశంలోని శాంట్రోనీ దీవిలో ఆందోళన చేపట్టారు. ఇది కాస్తా అంతర్జాతీయ మీడియా దృష్టికి రావండంతో ఆ దీవిలో ప్రస్తుతం ఆంక్షలు విధించారు. దీవికి వచ్చే పర్యాటకులు 220 పౌండ్లు అంటే 99 కిలోల బరువు కంటే ఎక్కువ ఉంటే స్థానిక గాడిదల మీద ఎక్కించరాదని అక్కడి ప్రభుత్వం హూకూం జారీచేసింది. 

“The holiday season on islands is now a lot longer than it used to be, meaning that the donkeys are pretty much working the whole year round."నిత్యం వందల సంఖ్యలో ఊబకాయ పర్యాటకులు ప్రఖ్యాత క్రూయిజ్ ఓడను ఎక్కేందుకు ఎత్తైన కొండలు ఎక్కి వెళ్లడానికి నడవడం ఇష్టం లేక గాడిదలను ఆశ్రయిస్తున్నారు.

Over 1,000 tourists a day flood Santorini during the peak vacation season between May and October.ఈ నేపథ్యంలో జంతు ప్రేమికులు ఈ ఏడాది జులైలో గాడిదలను అధిరోహించే పర్యాటకులకు వారి బరువుపై ఆంక్షలు విధించాలని ఆందోళన చేపట్టారు. అధికబరువు ఉన్న ఊబకాయులను మోయడం ద్వారా గాడిదల వెన్నుముక విరిగి గాయాలపాలవుతున్నాయని ఆందోళన చేశారు. 
హాలిడే సీజన్ కారణంగా అధిక సంఖ్యలో పర్యాటకులు దీవికి చేరుకోవడం దీనికితోడు ఏ కాలంలోనైనా పర్యాటకులను వారి గమ్యస్థానాలు చేర్చటంలో గాడిదలు ప్రముఖంగా ఉపయోగపడటంతో వీటి సంఖ్య గణనీయంగా పెరిగింది.  కాబట్టి ఇకపై గ్రీకు దీవులకు వెళ్లే పర్యాటకులు తమ బరువు ఒకసారి చెక్ చేసుకొని ప్రయాణానికి సిధ్దం కావల్సిఉంటుందన్నమాట..!

09:03 - September 9, 2018

నల్గొండ : నాగార్జున సాగర్ ను చూసేందుకు వెళ్తున్నారా ? అయితే మీరు కొత్త అనుభూతిని పొందుతారు. నాగార్జున సాగర్ కు వెళ్లే పర్యాటకులు కొత్త అనుభూతి పొందేలా...తెలంగాణ పర్యాటక శాఖ లాంచీ ప్రయాణాన్ని ప్రారంభించింది. ప్రతి ఒక్కరి జీవితంలో మధురానుభూతి కలిగించేలా ఈ లాంచీ ప్రయాణం ఉండనుంది. పర్యాటకానికి తోడు శ్రీశైలం మల్లికార్జునుడిని దర్శించుకునేలా ప్రత్యేక ప్యాకేజీని రూపొందించింది.

నాగార్జున సాగర్ పర్యాటకులు కొత్త అనుభూతి ఆస్వాదించేలా తెలంగాణ పర్యాటక శాఖ లాంచీ ప్రయాణానికి శ్రీకారం చుట్టింది. నాగార్జున సాగర్ నుంచి అధ్యాత్మిక కేంద్రమైన శ్రీశైలంకు లాంచీని ప్రారంభించింది. రెండు తెలుగు రాష్ట్రాలు, ఐదు జిల్లాల మీదుగా 110 కిలోమీటర్ల పాటు లాంచీ ప్రయాణం సాగనుంది. నల్లమల కొండల మధ్య సాగే లాంచీ ప్రయాణం....పర్యాటకులకు కొత్త అనుభూతి కలగనుంది. 

నాగార్జున సాగర్ ప్రాజెక్టు....నల్లమల జలాశయం అటవీ ప్రాంతం మధ్యలో విస్తరించి ఉంది. ప్రాజెక్ట్ నీటి మట్టం 570 అడుగులు దాటితేనే....శ్రీశైలంకు లాంచీ ప్రయాణానికి అణువుగా ఉంటుందన్న లక్ష్యంతో ముందు ట్రయల్ రన్ నిర్వహించారు. ఆ తర్వాత పర్యాటకుల డిమాండ్ దృష్టిలో పెట్టుకొని మూడు ప్యాకేజీలను నిర్ణయించారు. ప్రస్తుతం ప్రాజెక్ట్  నీటి మట్టం 585 అడుగుల మార్కు దాటడంతో...ట్రయల్ రన్ లేకుండానే తెలంగాణ పర్యాటక శాఖ యాత్రకు శ్రీకారం చుట్టింది. కృష్ణా నదిలో ఆరు గంటల పాటు సాగే యాత్రలో...అలలతో పోటీ పడుతూ లాంచీ యాత్ర సాగుతుంది. లాంచీయాత్ర మొత్తం నల్లమల అటవీ ప్రాంతంలోనే సాగడంతో...పర్యాటకులు ప్రకృతి అందాలను తిలకించేలా తెలంగాణ పర్యాటక శాఖ ఏర్పాట్లు చేసింది. 

06:44 - December 9, 2017

విశాఖపట్టణం : ఇంతటి అద్భుతమైన ప్రదేశాన్ని చూసిన పర్యాటకుల ఆనందానికి అవధులే ఉండవు. అయితే.. ఇక్కడే స్టే చేసి ప్రకృతి అందాలను మరింత ఆస్వాదించాలనుకున్న పర్యాటకులకు.. ఇక్కడి పరిస్థితులు నిరాశ పరుస్తున్నాయి. ఉండేందుకు సరైన వసతులు లేకపోవడంతో పర్యాటకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడి వెదర్‌ను పర్యాటకులు ఎంతగానో ఎంజాయ్‌ చేస్తుంటారు. ఇలాంటి ప్రాంతం మన రాష్ట్రంలో ఉండడం మన అదృష్టం అంటున్నారు పర్యాటకులు. ఇక్కడే పుట్టి పెరిగినా... ఇంతవరకు ఇలాంటి అందాలను ఆస్వాదించకపోవడం బాధాకరంగా ఉందంటున్నారు పలువురు పర్యాటకులు. అయితే.. ఇంత చక్కని ప్రదేశంలో సరైన వసతులు లేవంటున్నారు పర్యాటకులు. ప్రభుత్వం వసతులు కల్పిస్తే లంబసింగి వచ్చే పర్యాటకుల సంఖ్య ఇంకా పెరుగుతుందంటున్నారు. తొలి సారి విచ్చేసి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్న పర్యాటకుల అనుభూతి అనిర్వచనీయం. ఇక్కడ సరైన వసతులు లేకపోయినప్పటికీ... పర్యాటకులంతా రాత్రి సమయాల్లో టెంట్లు వేసుకుని ఎంజాయ్‌ చేస్తున్నారు. ముఖ్యంగా వీకెండ్‌ డేస్‌ను ఇక్కడ సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు.

మంచు సోయగాలతో పాటు... వలస పూల సుగంధ పరిమళాలు టూరిస్ట్‌లను అబ్బురపరుస్తున్నాయి. ప్రతి ఒక్కరూ ఈ అందాలను చూసి తీరాల్సిందేనని పర్యాటకలంటున్నారు. ఇప్పుడిప్పుడే ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. టూరిస్ట్‌లకు కోసం ఓ రిసార్ట్‌ను నిర్మించింది. మరికొన్ని రిసార్ట్స్‌లను ప్రైవేట్‌-ప్రభుత్వ భాగస్వామ్యంతో నిర్మిస్తున్నారు. ఇక్కడకు వచ్చే పర్యాటకులు తనివి తీరా ప్రకృతి అందాలను ఆస్వాదించే విధంగా ఏర్పాట్లు చేస్తోంది. అయితే... ఈ పనులు త్వరగా పూర్తి చేస్తే ఆంధ్రా కాశ్మీరం అందాలను ఆస్వాదించే పర్యాటకుల సంఖ్య ఇంకా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. 

15:45 - November 15, 2017

విశాఖపట్టణం : అధికారుల మధ్య సమన్వయ లోపంతో విశాఖ జిల్లా అరకులో జరుగుతున్న హాట్‌ ఎయిర్‌ బెలూన్‌ ఫెస్టివల్‌ ఫ్లాప్‌ షోగా మిగిలిపోతోంది. భారీ స్థాయిలో నిర్వహిస్తున్న ఈ ఉత్సవానికి ప్రచారం లేమితో సందర్శకులు లేక వెలవెలపోతోంది. నిర్వహణ లోపాలతో 13 దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బెలూన్లు ఎగురవేసే వారు మాత్రమే వీటిలో రైడ్‌ చేస్తున్నారు. బెలూన్లలో రైడ్‌ చేయాలని ఆశతో వచ్చిన కొందరు పర్యాటకులు, స్థానికులకు నిరాశే మిగిలింది. కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్వహిస్తున్న ఈ ఫెస్టివల్‌కు ప్రచారం లోపించింది. దీంతో వారివీరి ద్వారా సమాచారం తెలుసుకున్న కొద్ది మంది మాత్రమే ఈ ఉత్సవాలను చూసేందుకు వచ్చారు.

ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కొన్ని బెలూన్లు గాల్లోకి ఎగరలేదు. పరికరాలు సరిగా లేకపోవడంతో మరికొన్ని బెలూన్లకు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. దీంతో బెలూన్‌ విన్యాసాలు చూద్దామనుకున్న వారు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఫెస్టివల్‌లో పాల్గొంటున్న విదేశీ ప్రతినిధులు కూడా నిరుత్సాహం చెందారు. బెలూన్లు ఎగురవేసేందుకు సరైన సౌకర్యాలు లేకపోవడంతో విదేశీ ప్రతినిధులు ఫెస్టివల్‌ నిర్వహణపై విదేశీ ప్రతినిధులు పెదవి విరిచారు. మిగిలివున్న రెండు రోజులైనా సరిగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని కోరారు.

09:34 - January 9, 2017

ఢిల్లీ: ఉత్తర భారతం భారీ హిమపాతంతో అలరిస్తోంది. ఎక్కడ చూసినా పేరుకపోయిన మంచుగడ్డలు దర్శనమిస్తూ మనసుకు ఆహ్లాదిస్తున్నాయి. ప్రముఖ పర్యాటక ప్రాంతాలన్ని మంచు వానతో స్వాగతం పలుకుతున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో పర్యాటకుల తాకిడి ఎక్కువైంది.

వివిధ ప్రాంతాలకు తెగిన సంబంధాలు....

హిమాచల్ ప్రదేశ్‌లో భారీ హిమపాతం కారణంగా సిమ్లా, మనాలి, డల్హౌసీ తదితర ప్రాంతాలకు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. సిమ్లా, కిన్నార్ రీజియన్లలో ఈ సీజన్‌లో తొలిసారి మంచు కురిసింది. టూరిస్ట్ ప్రాంతాలైన కుఫ్రి, ఫాగు, నర్కండా ప్రాంతాల్లో 45-55 సెంటీమీటర్ల మంచు కురిసింది. మంచు కారణంగా రహదారులపై వాహనాలు జారిపోయే పరిస్థితులు ఉండటంతో కులు-మనాలీకి వెళ్లే నేషనల్ హైవే-21ని మూసివేశారు. దీంతో 20 కిలోమీటర్ల ముందే వాహనాలను నిలిపివేశారు.

కశ్మీర్‌లోయలో రెండు రోజులుగా...

కశ్మీర్‌లోయలో రెండు రోజులుగా భారీ హిమపాతం కురుస్తోంది. కొన్నిచోట్ల మైనస్ 8.4 డిగ్రీల రికార్డు ఉష్ణోగ్రత నమోదైంది. మంచుదుప్పటి కప్పేయడంతో శ్రీనగర్-జమ్ము జాతీయ రహదారిని వరుసగా రెండోరోజూ మూసివేశారు. ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్, మసూరీ, కుమోన్, గర్హాల్ తదితర ప్రాంతాల్లో భారీ హిమపాతం కురిసిందని వాతావరణ అధికారులు పేర్కొన్నారు. ముస్సోరీ ప్రాంతంలోని చార్‌ధామ్ పర్వత శ్రేణులపై పూర్తిగా మంచు కప్పివేసిందని చెప్పారు. మొత్తమ్మీద భారీ హిమపాతం పర్యాటకులను కట్టిపడేస్తోంది.

20:59 - November 27, 2016

పశ్చిమగోదావరి : పెద్దనోట్ల రద్దు నిర్ణయం అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పర్యాటక ప్రదేశాల్లో ఈ సమస్య మరింత ఎక్కువైంది. పర్యాటకులకు చిల్లర కష్టాలు తప్పడం లేదు. కార్తీక మాసం సందర్భంగా.. సరదాగా కుటుంబం సభ్యులతో కలిసి బీచ్‌కు వచ్చిన పర్యాటకులు చిల్లర దొరక్క తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్‌కు పర్యాటకులు పోటెత్తారు. కార్తీక మాసంలో చివరి ఆదివారం కావడంతో ఈ ఒక్క రోజే దాదాపు లక్షమందికి పైగా పర్యాటకులు బీచ్‌ను సందర్శించినట్లు చెబుతున్నారు. అయితే.. బీచ్‌లో చిల్లర సమస్య ఎక్కువగా కనిపిస్తోందని పర్యాటకులు అంటున్నారు. 

 

09:47 - October 30, 2016

విజయవాడ : చుట్టూ నీరు.. ఆ పక్కనే.. కనుచూపు మేరలో అందమైన కొండలు.. మధ్యలో ఆ దరిని.. ఈ దరినీ కలిపే ఆనకట్ట. వాటితో  పాటు పారాచూట్‌, బనానా బోట్, బెలూన్‌ వాకింగ్‌. ఇప్పుడీ అందాలన్నీ  పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఆహ్లదకరమైన వాతావరణంతో అందరినీ అలరిస్తున్న కృష్ణా నది అందాలపై 10టివి స్పెషల్‌ స్టోరీ...! 
ఆహ్లదపరిచే ఆధునాతన అందాలు...
ఇరువైపులా పరుచుకున్న పచ్చని చెట్లు...హాయిగా...పిల్ల తెమ్మరల సవ్వడిలో సాగిపోయే పడవ ప్రయాణం...మనసును ఆహ్లదపరిచే ఆధునాతన అందాలు...జల వనరులతో కళకళలాడుతున్న కృష్ణా నది అందాలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. రివర్‌ స్పోర్స్ట్ బోటింగ్‌ కోసం ప్రతిరోజు బెజవాడ సమీప ప్రాంతాల ప్రజలు తరలివస్తున్నారు.  పబ్లిక్‌, ప్రైవేటు భాగస్వామ్యంతో టూరిజం అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం చేపట్టిన చర్యలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. 
అమరావతికి సరికొత్త సొబగులు 
నవ్యాంధ్ర రాజధాని అమరావతికి సరికొత్త సొబగులు అద్దుతున్నారు. ఇందులో భాగంగా.. కృష్ణా నదిలో పర్యాటకులను ఆకట్టుకునేందుకు 14 రకాల వాటర్‌ స్పోర్స్ట్ బోట్స్‌ను అందుబాటులో ఉంచింది ఛాంపియన్స్‌ యాచ్‌ క్లబ్‌.  బర్త్‌డే, మ్యారేజ్‌తో పాటు ఇతర నైట్‌ పార్టీలకు కృష్ణా నది వేదికగా మారుతోంది. ఏకంగా 200 మంది వేడుకల్లో పాల్గొనేలా పెద్ద బోట్‌ను సిద్ధం చేయడంతో రోజురోజుకు పర్యాటకుల సంఖ్య పెరుగుతోంది. 
భవానీ ద్వీపం కేంద్రంగా పర్యాటక రంగం అభివృద్ధి 
భవానీ ద్వీపం కేంద్రంగా పర్యాటక రంగాన్ని అభివృద్ధి పరిచేందుకు ప్రభుత్వం ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహిస్తోంది. భవానీ ద్వీపాన్ని ఇప్పటి వరకూ టూరిజం శాఖ మాత్రమే సద్వినియోగం చేసుకుని పర్యాటకులకు అందుబాటులో ఉంచింది. అయితే నెల రోజుల నుంచి ఛాంపియన్స్ యాచ్ క్లబ్ కూడా పర్యాటక రంగ అభివృద్ధి కోసం కృష్ణానదిలో సరికొత్త బోటింగ్ యంత్రాలను అందుబాటులోకి తెచ్చింది.  
బెజవాడకు విచ్చేస్తున్న పర్యాటకులు 
విజయవాడతోపాటు ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి పర్యాటకులు బెజవాడకు విచ్చేస్తున్నారు. కృష్ణానదిలో ఏర్పాటు చేసిన పర్యాటక బోట్స్ లో విహరించి కృష్ణా నది అందాలను ఆస్వాదిస్తున్నారు. పారాషూట్, బనానా బోట్, బెలూన్ల వాకింగ్, స్కూటర్ బోట్ లాంటి సరికొత్త పరికరాలతో కృష్ణానదిలో విహారిస్తూ పర్యాటకులు ఆహ్లదకర వాతావారణాన్ని ఎంజాయ్‌ చేస్తున్నారు.  బెజవాడలో ఏర్పాటు చేసిన వాటర్ స్పోర్ట్స్ పై పర్యాటక ప్రియులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 
విజయవాడలో పర్యాటక రంగం అభివృద్ధి : నిర్వాహకులు 
రానున్న కార్తీక మాసాన్ని దృష్టిలో పెట్టుకుని మరింత పర్యాటక రంగాన్ని విజయవాడలో అభివృద్ధి చేస్తామని నిర్వాహకులు తెలిపారు. ఏపీ ప్రభుత్వం పర్యాటకశాఖ ఆధ్వర్యంలోనూ భవానీ ద్వీపాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ఒకపక్క ప్రభుత్వం, మరోవైపు ప్రైవేట్ సంస్థలు పర్యాటక రంగ అభివృద్ధికి పోటీ పడుతుండటంతో..భవిష్యత్‌లో విజయవాడ  ప్రముఖ పర్యాటక కేంద్రంగా మారనుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

10:24 - October 4, 2016
11:43 - August 14, 2016

గుంటూరు : ప్రకృతి రమణీయతకు అది శాశ్వత చిరునామా. విదేశీ విహంగాలకు అదో చక్కని విడిది. భగభగ మండే ఎండల్లోనూ అక్కడి ప్రకృతి అందాలు తాజాగా ఉంటాయి. ఇక శీతాకాలంలో అయితే సరికొత్త సొబగులు సంతరించుకుంటాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ఆ సహజ అందాలను చూసేందుకు రెండు కళ్లు చాలవు. ఆ సుమధుర దృశ్యాలను వర్ణిచేందుకు ఎన్ని పదాలైనా సరిపోవు. కృష్ణా పుష్కరాలకు వెళ్లే భక్తులు.. సందర్శించిన ప్రాంతాల్లో ముఖ్య ప్రదేశం అది.. ఆ ప్రాంత విశేషాలు తెలుసుకోవాలంటే.. గుంటూరు జిల్లాకు వెళ్లాల్సిందే..!
రంగు రంగుల విదేశీ పక్షులు... 
రంగు రంగుల విదేశీ పక్షులు...  ఒకటి కాదు, రెండు కాదు... వేలసంఖ్యలో విదేశీ పక్షులు.. మనసుకు హాయినిచ్చే పక్షుల కిలకిల రావాలు...విదేశీ విహాంగాల సందడితో మైమరిచిపోతున్న పర్యాటకులు... ఇంతటి సుమనోహర దృశ్యాలు ఎక్కడో పరాయి దేశంలోనివో లేక  హిమాలయాల్లోనివో కావు. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం ఉప్పలపాడు ప్రాంతమిది. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఉప్పలపాడు పక్షుల కేంద్రం పర్యాటకంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. దాదాపు 50 ఏళ్ల నుంచి విదేశీ పక్షులు ఈ ప్రాంతాని వచ్చి.. విడిచి చేస్తాయి. సైబీరియా, ఆస్ట్రేలియాల నుంచి గూడబాతుల గుంపులు, తెల్ల కంకణాలు, ఎర్రకాళ్ల కొంగలు, నత్తకొట్టు కొంగలు, చిత్త ఒక్కలు, చుక్కమూతి బాతులు, నల్ల బోలి కోడి, కలికి పక్షులు ఇలా చెప్పుకుంటూ పోతే.. దాదాపు  70 జాతులకు పైగా పక్షులు ఉప్పలపాడుకు వస్తుండడం విశేషం. 
విదేశీపక్షులు, పర్యాటకులతో నిత్యం సందడి
చెరువు మధ్య, చుట్టూ గుబురుగా ఉన్న చెట్లపై అవాసం ఏర్పాటు చేసుకుని... గూళ్ళు కట్టుకుని... అక్కడే గుడ్లుపెట్టి, పిల్లలను పొదుగుతాయి. పక్షి స్థావరానికి వెళ్లే దారికిరువైపులా పచ్చని చేలు, ఆ చేలపై ఎగురుతున్న మైనగోరలు, కత్తిరిపిట్టలు, అక్కడక్కడ పాలపిట్టలు, కొంగలు... పొలాలను ఆశిస్తున్న మిడతలను, పురుగులను వేటాడుతూ కనువిందు చేస్తాయి. విదేశీ పక్షులతో పాటు పర్యాటకులతో ఈ ప్రాంతం నిత్యం సందడిగా ఉంటుంది. 
30 ఎకరాల విస్తీర్ణంలో చెరువు 
30 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువును ఒకప్పుడు... తాగునీటి అవసరాలకు వినియోగించేవారు. విదేశీ పక్షలు ఎక్కువ సంఖ్యలో వస్తుండడంతో ఈ చెరువును ప్రత్యేకంగా వాటికోసమే కేటాయించారు. ఈ ప్రాంతంలో విద్యార్థులు పరిశోధనలు కూడా చేస్తారు. గుంటూరు నుంచి నందివెలుగు మీదుగా తెనాలికి వెళ్లే మార్గంలో 7 కిలోమీటర్ల దూరంలో ఈ పక్షి కేంద్రం ఉంది. గుంటూరు నుంచి ఆర్టీసీ బస్సులు, ఆటోల ద్వారా ఈ గ్రామాన్ని చేరుకోవచ్చు. చెన్నై-హోరా రైలు మార్గాన ప్రయాణించేవారు తెనాలిలో దిగి నందివెలుగు మీదుగా 18 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామానికి చేరుకోవచ్చు. కృష్ణా పుష్కరాల కోసం గుంటూరు జిల్లాకు వెళ్లే యాత్రికులు తప్పకుండా సందర్శించాల్సిన పర్యాటక కేంద్రల్లో ఉప్పలపాడు పక్షి కేంద్రం ఒకటని చెప్పొచ్చు..! ఈ ప్రాంతం పర్యాటకులను కట్టిపడేస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. 

 

17:23 - December 13, 2015

నెల్లూరు : ప్రశాంత వాతావరణం.. చుట్టూ నీరు... మధ్యలో ద్వీపం.. అందులో పచ్చని చెట్లు, వాటిపై రంగు రంగుల పక్షులు.. అత్యంత సుందరమైన ఈ ప్రదేశం ఏపీలో ఉంది.. పర్యాటకులతో కళ కళలాడిపోతున్న ఈ ప్లేస్‌ను మనమూ చూసొద్దాం పదండి..
నేలపట్టులో పక్షుల ఆవాసానికి అనుకూలం
నెల్లూరు నుంచి 80 కిలోమీటర్ల దూరంలో నేలపట్టు ప్రాంతం ఉంది. చలి కాలం వచ్చిదంటే చాలు.. అక్కడ అందమైన సందడి మొదలవుతుంది.. విదేశాల నుంచి ఎన్నో పక్షులు వచ్చేస్తాయి. సముద్రపు రామచిలుక, పెలికాన్, పెయింటెడ్ స్టార్క్, ఓపెన్ బిల్ స్టార్క్, తెల్ల కంకణాయి, నీటికాకిలాంటి పక్షులు గుడ్లు పెట్టి సంతానోత్పత్తి చేస్తాయి.. ప్రతి ఏడాది అక్టోబర్‌ నుంచి ఏప్రిల్‌వరకూ ఇక్కడే ఉంటాయి. సైబీరియా, ఆస్ట్రేలియా, గుజరాత్‌లోని రాణ్ ఆఫ్‌ కంచ్‌ నుంచి ఈ పక్షులు వేల కిలోమీటర్లు ప్రయాణించి ఇక్కడికి చేరుకుంటాయి. నేలపట్టులో ఈ పక్షుల ఆవాసానికి అనుకూల పరిస్థితులున్నాయి.. చుట్టూ నీరు, మధ్యలోఉన్న చెట్లపై గూడు కట్టుకుంటాయి... ఎన్నోఏళ్లుగా ఈ పక్రియ కొనసాగుతోంది.
పక్షులు, పర్యాటకులతో కళకళలాడుతున్న నేలపట్టు
అక్టోబర్‌ వచ్చిందంటే చాలు ఈ ప్రాంతం పక్షులేకాదు... వాటిని చూసేందుకువచ్చే పర్యాటకులతో కళకళలాడిపోతుంది.. పచ్చని చెట్లమధ్య రంగు రంగుల రెక్కలతో ఆకట్టుకునే ఈ పక్షుల్ని చూసేందుకు చాలామంది ఇక్కడికి వస్తారు... వీరిసంఖ్యను మరింత పెంచేందుకు ప్రయత్నాలు చేస్తోంది పర్యాటకశాఖ.. అటవీ, టూరిజం శాఖలు కలిసి ఈ ప్రదేశాన్ని విహారకేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.. ఇప్పటికే కొన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.. దీంతో సెలవురోజుల్లో దాదాపు 2వేలమందికిపైగా పర్యాటకులు ఇక్కడివచ్చి పక్షుల్ని చూస్తున్నారు.
పక్షుల వచ్చే సమయాన్ని లక్కీ పీరియడ్‌గా భావిస్తున్న స్థానికులు
ఈ పక్షుల వచ్చే సమయాన్ని స్థానికులు లక్కీ పీరియడ్‌గా భావిస్తారు.. ఈ విహంగాల్ని దేవతాపక్షులుగా ఆరాధిస్తారు.. ఇవి వచ్చాకే వ్యవసాయ పనులు ప్రారంభిస్తారు.. ఇక పక్షులు ఏదో ఆశామాషీగా ఇక్కడికి రావు... పరిస్థితులు అన్నీ సక్రమంగా ఉన్నాయని ధృవీకరించుకున్నాకే ప్రయాణం ప్రారంభిస్తాయి.. ముందు కొన్ని పైలట్‌ పక్షులు నేలపట్టుకువచ్చి అన్నీ పరిశీలిస్తాయి.. ఆ తర్వాత మిగతా పక్షుల్ని తెస్తాయి.. దాదాపు 250 ఎకరాల విస్తీర్ణంలో నేలపట్టు చెరువు ఉంటుంది.. ఈ ప్రాంతం ఆసియాలోనే పక్షుల సంతానోత్పత్తి కేంద్రంగా ప్రసిద్ధి చెందింది.
ఆకట్టుకుంటున్న పెలికాన్, ఫ్లెమింగో పక్షులు
ముఖ్యంగా గోదుమరంగులో ఉండే పెలికాన్, ఫ్లెమింగో పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. 12నుంచి 15కిలోలవరకూ బరువుండే ఈ విహంగాలు పులికాట్‌ సరస్సులో చేపల్నిపట్టి తమ పిల్లలకు పెడగాయి.. ఈ దృశ్యం చూసేందుకు ఎంతో అద్భుతంగా ఉంటుంది.. ఫ్లెమింగో పక్షులుమాత్రం పూర్తి శాఖాహారులు.. సరస్సులోని నాచును తిని బతుకుతాయి.
నేలపట్టులో సౌకర్యాల లేమి...
నేలపట్టుకు చూడాలని ఆసక్తిఉన్నా సరైన రోడ్డు, రవాణాసౌకర్యం లేక చాలామంది రాలేకపోతున్నారు. నాయుడుపేట దాటాక దొరవారిసత్రంనుంచి మట్టిరోడ్డు ఉంటుంది.. ఈ రోడ్డును అభివృద్ధి చేస్తామని నేతలు ఇచ్చిన హామీలన్నీ మాటలకే పరిమితమయ్యాయి.. ఇక పక్షులకేంద్రంలోకూడా సరైన వసతులు లేవు.. తాగేందుకు నీరు దొరకదు.. ప్రతి ఏడాది లక్షలు ఖర్చుపెట్టి పక్షుల పండుగను నిర్వహిస్తారు అధికారులు.. ఇక్కడివచ్చే పర్యాటకులకుమాత్రం ఎలాంటి సౌకర్యాలు కల్పించరు.
పులికాట్‌ సరస్సు విషయంలోనూ అధికారుల నిర్లక్ష్యం
అటు పులికాట్‌ సరస్సు విషయంలోనూ అధికారుల నిర్లక్ష్యం చూపుతున్నారు. ముఖద్వారాల పూడిక తీయడాన్ని పెద్దగా పట్టించుకోవడంలేదు.. దీంతో నీటి రాక తగ్గిపోతోంది. ఇది మత్స్యకారులపై కూడా ప్రభావం చూపుతోంది.. చేపలసంఖ్య జీవనభృతి కోల్పోతున్నారు.. నీరు పెద్దగా లేకపోవడంతో టూరిస్టులసంఖ్య తగ్గుతోంది.. మొత్తానికి సమస్యలున్నా కాస్త తీరికచేసుకొని వెళుతున్న ప్రకృతి ప్రేమికులకు మరచిపోలేని అనుభవాన్ని మిగులుస్తోంది నేలపట్టు.

 

Pages

Don't Miss

Subscribe to RSS - పర్యాటకులు