పలు అభివృద్ధి కార్యక్రమాలు

22:05 - November 18, 2017

వరంగల్ : భారతదేశంలోనే రెండున్నర లక్షల ఒంటరి మహిళలకు పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. వరంగల్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న మంత్రి హన్మకొండ కాకతీయ కళాశాల మైదానంలో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. నాలుగున్నర లక్షల మంది బీడీ కార్మికులకు వెయ్యి రూపాయల భృతి ఇస్తున్నట్లు గుర్తు చేశారు. హైదరాబాద్‌-వరంగల్‌ ఇండస్ట్రియల్‌ కారిడార్‌ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలో త్వరలోనే మామునూరు ఎయిర్‌పోర్టును పునరుద్దరించనున్నట్లు మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. 

 

13:58 - November 6, 2017

తూ.గో : జిల్లాలోని రాజమహేంద్రవరంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను  ప్రారంభించారు. ఎన్టీఆర్ కన్వెన్షన్ సెంటర్‌ను ప్రారంభించి.. బొటానికల్ గార్డెన్‌కు శంకుస్థాపన చేశారు. యూనివర్సిటీలో ఎమనిటీస్ సెంటర్‌ను గవర్నర్ నరసింహన్ ప్రారంభించారు. యూనివర్సిటీ ప్రాంగణంలో ఆర్ట్స్ కళాశాల నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. మొత్తం 45 కోట్ల 25లక్షల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని .. రాష్ట్రానికే తలమానికంగా నన్నయ్య యూనివర్సిటీ ఉండబోతుందన్నారు చంద్రబాబు. 

 

21:43 - October 12, 2017

సూర్యపేట : సమైక్య పాలనలో, కాంగ్రెస్ నేతల హయాంలో దక్షిణ తెలంగాణ దగాపడిందన్నారు సీఎం కేసీఆర్. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణంలోనూ ఆనాడు కాంగ్రెస్ నేతలే దగా చేశారని కేసీఆర్ ఆరోపించారు. సూర్యాపేటలో పర్యటించిన కేసీఆర్.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 

సూర్యాపేటలో పర్యటింటిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్... పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. జిల్లాలోని చివ్వెంల మండలం కుడకుడలో నూతన కలెక్టరేట్ భవన సముదాయం, ఎస్పీ కార్యాలయ భవన నిర్మాణాలకు భూమిపూజ నిర్వహించారు. తరువాత కేసీఆర్ 1600కోట్ల రూపాయలతో నిర్మించిన 400 కెవి సబ్‌స్టేషన్‌ను.. ప్రారంభించారు. తరువాత స్థానికంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం పాల్గొన్నారు. తమ ప్రభుత్వం ప్రాజెక్టులు కడుతుంటే కాంగ్రెస్ నేతలు అడుగడుగునా అడ్డుపడుతున్నారని కేసీఆర్ విమర్శించారు. ఈరోజు నష్టపరిహారం గురించి మాట్లాడుతున్న  ఉత్తమ్ కుమార్ రెడ్డి.. తన నియోజకవర్గంలో భూములు మునిగితే ఎంత నష్టపరిహారం ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. లక్ష ఉత్తమ్ కుమార్‌ రెడ్డిలు అడ్డుకున్నా సరే కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. 

నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో ఆనాటి సమైక్యవాదులైన కాంగ్రెస్ నేతలు దగా చేశారని ఆరోపించారు సీఎం కేసీఆర్. ఏలేశ్వరం దగ్గర ప్రాజెక్టు నిర్మాణం జరిగి ఉంటే నల్లగొండ జిల్లాలో లక్షల ఎకరాల్లో నీరు పారేదని అన్నారు. అప్పుడు, ఇప్పుడు నల్లగొండ జిల్లా ప్రయోజనాలను కాపాడేందుకు తెలంగాణ కాంగ్రెస్ చేసిందేమీ లేదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధి టీఆర్ఎస్‌తోనే సాధ్యమన్నారు. 

20:39 - October 11, 2017

సిరిసిల్ల : బతుకమ్మ చీరలపై ప్రతిపక్షాలు అనవసరమైన రాద్ధాంతం చేసాయన్నారు సీఎం కేసీఆర్. అలాంటి చిల్లర రాజకీయాలు చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోవద్దని చెంప ఛెళ్లుమనిపించాలని సూచించారు. సిరిసిల్లలో సీఎం కేసీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రైవేటు డాక్టర్లు అవసరం లేకపోయినా ఆపరేషన్లు చేసి గర్భసంచులు తీసి ఇబ్బంది పాలు చేస్తున్నారని కేసీఆర్ ఆరోపించారు. ఓవైపు కేసీఆర్ ప్రసంగం సాగుతుండగా.. మధ్యలో 5 నిముషాల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సిరిసిల్లలో తప్ప రాష్ట్రంలో ఎక్కడా కరెంట్ కోత లేదు.. ఇక్కడంతా సన్నాసులున్నట్లున్నారే.. అంటూ కేసీఆర్ చమత్కరించారు. 

 

Don't Miss

Subscribe to RSS - పలు అభివృద్ధి కార్యక్రమాలు