పవన్ కళ్యాణ్

16:14 - February 22, 2018

హైదరాబాద్ : ఓ సమావేశంలో సినీ నటుడు శివాజీపై దాడులు చేయడం సరికాదని సినీ నటుడు, జనసేన అధినేత పవన్, సీపీఐ నేత రామకృష్ణలు పేర్కొన్నారు. నగరంలోని జనసేన కార్యాలయంలో పవన్ తో రామకృష్ణ భేటీ అయ్యారు. అనంతరం వేర్వేరుగా మీడియాతో వారు మాట్లాడారు.

బిజెపి దాడి చేయడం ఖండిస్తున్నట్లు, విద్యుత్ కార్మికుల సమ్మెపై సీఎం చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకుని సమస్య పరిష్కారమయ్యే విధంగా చూడాలని సీపీఐ నేత రామకృష్ణ కోరారు. అగ్రిగోల్డ్ ఆస్తులను విక్రయించి బాధితులను ఆదుకోవాలన్నారు. మార్చి 1వ తేదీన గుంటూరులో నిర్వహించే రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరు కావాలని తాను పవన్ కోరడం జరిగిందన్నారు.

పార్లమెంట్ పాస్ చేసిన బిల్లు వివరాలు తెలుసుకోవడానికి ప్రజలు ఉత్సాహం చూపుతారని, దాడులు చేయడం మంచిది కాదని పవన్ తెలిపారు. విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల సమస్యలు తెలుసుకుని వారికి మద్దతు తెలపడం జరిగిందని, ఈ సమస్య పరిష్కారానికై చర్యలు తీసుకోవాలన్నారు. మార్చి 1న నిర్వహించే సమావేశానికి హాజరయ్యేది రెండు రోజుల్లో చెబుతానన్నారు. 

21:01 - February 20, 2018
20:50 - February 16, 2018

హైదరాబాద్ : రాష్ట్ర విభజన అశాస్త్రీయంగా జరిగిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. నగరంలో ఏర్పాటు చేసిన జేఎఫ్ సీ సమావేశంలో ఆయన మాట్లాడారు. పాలకులు చేసిన తప్పులకు ప్రజలను శిక్షించారని అన్నారు. రాజకీయ నాయకులు బాగానే ఉన్నారని తెలిపారు. న్యాయం జరగనప్పుడే ప్రభుత్వంపై ప్రజలకు కోపం వస్తుందన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడకపోతే ప్రజల్లో అసహనం పెరుగుతుందని...తమను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తున్నారన్న భావన కలుగుతుందన్నారు. 

 

20:38 - February 16, 2018

హైదరాబాద్ : ప్రజా సమస్యలు పరిష్కరించకపోతే దేశ సమగ్రతకు భంగం కల్గుతుందని జనసేనాని అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రత్యేకహోదా, విభజన చట్టంలోని అంశాలపై ఏర్పాటు చేసిన జేఎఫ్ సీ మీటింగ్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఇది మనుషుల సమస్య అని అన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో జరిగిన అన్యాయంపైనే జేఎఫ్ సీ ఏర్పాటు అయిందని తెలిపారు. తనకు చలించే హృదయం ఉందన్నారు. పాలకులు చేసిన తప్పుకు పేద ప్రజలు బాధలు అనుభవిస్తున్నారని వాపోయారు. ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే 'నా దేశంలో నేను ద్వితీయ శ్రేణి పౌరుడినా' అన్న భావన కలుగుతుందన్నారు. దేశ సమగ్రతకు భంగం కలిగే ప్రమాదం ఉందని తెలిపారు. సమస్యలను పరిష్కరించకపోతే వేర్పాటు వాదానికి బలమైన వాతావరణం ఏర్పడుతుందని పేర్కొన్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోనప్పుడు చట్టాలను ఎందుకు గౌరవించాలనే ధోరణి పౌరుల్లో వస్తుందన్నారు. 

 

13:33 - February 16, 2018

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో ఎలాంటి హామీలిచ్చింది. ఎంతవరకు హామీలు అమలయ్యాయి ? ఇంకా ఎలాంటి హామీలు నెరవేరాలి ? కేంద్రం ఎంత నిధులిచ్చింది ? రాష్ట్రం ఎంత ఖర్చు పెట్టింది తదితర నిజాలు నిగ్గు తేల్చేందుకు పవన్ 'జేఎఫ్ సీ' కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ తొలి సమావేశం హోటల్ దస్ పల్లాలో జరిగింది. ఈ సమావేశానికి వివిధ రాజకీయ వేత్తలు హాజరయ్యారు.

కమిటీలో ఉన్న కీలక వ్యక్తులు మాట్లాడారు. ఏపీ విభజన చట్టం 2014 చేశారని కమిటీలోని వ్యక్తి తెలిపారు. ఐదో సెక్షన్ లో హైదరాబాద్ 10 ఏళ్ల కాలం రాజధాని నడుపొచ్చుచనని పేర్కొనడం జరిగిందన్నారు. ఇక ఆరో సెక్షన్ లో ఏపీ రాజధాని కోసం భూమిని గుర్తించాలని..ఇందుకు రిపోర్టు చేయాలని పేర్కొనడం జరిగిందన్నారు. అనంతరం దీనిపై నియమించబడిన శివరామకృష్ణన్ కమిటీ విజయవాడ ..గుంటూరు జిల్లాలో మధ్యలో రాజధాని ఏర్పాటుపై నిర్ణయం వెలువరించిందన్నారు.

విభజన జరిగి నాలుగేళ్ల సమయం అయిపోయిందని..ఎలాంటి అభివృద్ధి జరిగిందనే దానిపై ఆలోచించాలని తెలిపారు. ఇక్కడ 93, 94 సెక్షన్స్ ముఖ్యమైనవని, ఇందులో ఏపీకి, తెలంగాణ రాష్ట్రాలకు ఎడ్యుకేషన్, యూనివర్సిటీలు ఏర్పాటు చేయాలనే దానిపై 13 వ షెడ్యూల్ లో కేంద్రం పేర్కొనడం జరిగిందన్నారు. ఐఐటి, ఎన్ఐటి, ఐఐఎం, సెంటర్, పెట్రోల్, అగ్రిలక్చర్ ఇలాంటి ఎడ్యుకేషన్ సెంటర్స్ ఇవ్వాల్సి ఉందన్నారు. ఎయిమ్స్ సూపర్ స్పెషాల్టీ, టీచింగ్ ఇనిస్టిట్యూట్...తెలంగాణకు ట్రైబల్, అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాల్సినవసరం ఉందన్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

12:16 - February 16, 2018

హైదరాబాద్ : ఏపీ విభజన హామీలు..ప్రత్యేక హోదా తదితర వివరాలు..కేంద్రం నుండది ఏపీకి వచ్చి నిధులపై నిగ్గు తేల్చేందుకు సినీ నటుడు, జనసేన అధినేత 'పవన్' సిద్ధమయ్యారు. అందులో భాగంగా ఏర్పాటు చేసిన 'జేఎఫ్ సీ' తొలి సమావేశం నేడు జరుగబోతోంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు రావాల్సిందిగా ఇప్పటికే పలువురు నేతలకు, రాజకీయ వేత్తలు, నిపుణులకు, ఇతరులకు పవన్ ఆహ్వానం పలికిన సంగతి తెలిసిందే.

జేఎఫ్ సీ తొలి సమావేశం నగరంలోని దస్ పల్లా హోటల్ లో జరుగనుంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు పవన్ హోటల్ కు చేరుకున్నారు. అంతకంటే ముందు ట్యాంక్ బండ్ పైనున్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సమావేశంలో పాల్గొనేందుకు చలసాని, ఉండవల్లి, వామపక్ష నేతలు మధు, వైవి, రామకృష్ణ, కొణతాల తదితరులు చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులుగా మాజీ ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజు, ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి జంగా గౌతమ్ లు హాజరయ్యారు.

ఇక్కడకు చేరుకున్న నేతలకు స్వయంగా 'పవన్' స్వాగతం పలికారు. విడివిడిగా బృందాలతో ఆయన సమావేశమవుతూ విభజన వివరాలు తెలుసుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. మధ్యాహ్నాం రెండు గంటలకు అందరి అభిప్రాయాలను తెలుసుకోనున్నారు. మొదటి రోజు కేవలం అందరీ అభిప్రాయాలు..వాస్తవాలు తెలుసుకొనేందుకు ప్రయత్నిస్తారని, రెండో రోజు జేఎఫ్ సీ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారని తెలుస్తోంది. 

10:22 - February 16, 2018

తన ఫామిలీ హీరోలకి కాకుండా తనను నిజంగా అభిమానించే నటుడికి మంచి సపోర్ట్ ఇస్తున్నాడు ఈ స్టార్ హీరో. ఆ స్టార్ హీరోతో పాటు స్టార్ డైరెక్టర్ కూడా తన సపోర్ట్ ని అనౌన్స్ చేశాడు. లవర్ బాయ్ గా తన కెరీర్ ని స్టార్ట్ చేసి ఇప్పుడు స్టార్ హీరో ఇమేజ్ తెచ్చుకున్నాడు హీరో 'నితిన్'. యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకోవడంలో 'నితిన్' ముందు ఉంటాడు. 'లై' లాంటి సినిమాలతో పాటు ఫామిలీ స్టోరీస్ కూడా టచ్ చేసిన 'నితిన్' తన ప్రీవియస్ సినిమా 'లై' లో ఇంటరెస్టింగ్ రోల్ తో ఆడియన్స్ ని ఆకట్టుకోవాలని ట్రై చేశాడు. 'లై' సినిమాలో 'నితిన్' నటనకు మంచి మార్కులే పడ్డాయి.

'నితిన్' ని లవర్ బాయ్ గా యాక్సెప్ట్ చేసిన ఆడియన్స్ ఫామిలీ హీరోగా నటించిన 'అ ఆ' సినిమాని కూడా హిట్ చేశారు. 'త్రివిక్రమ్ శ్రీనివాస్' డైరెక్షన్ లో వచ్చిన 'అ ఆ' సినిమా ఆడియన్స్ ని రీచ్ అయింది. 'నితిన్' స్వతహాగా 'పవన్ కళ్యాణ్' అభిమాని. పవన్ కళ్యాణ్ కూడా ఇపుడు 'నితిన్' సినిమాకి సపోర్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఏప్రియల్ 5న విడుదలయ్యే ఈ సినిమా తాలూకు ఫస్ట్ లుక్ ను ఫిబ్రవరి 12న రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకి డైరెక్టర్ కృష్ణ చైతన్య. పవన్ కళ్యాణ్ తో పాటు నితిన్ తో 'అ ఆ' సినిమా తీసిన త్రివిక్రమ్ కూడా 'నితిన్' కి సపోర్ట్ ఇస్తున్నాడు.

ఫీల్ గుడ్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో 'మేఘా ఆకాశ్' క‌థానాయిక‌గా నటిస్తోంది. 'ప‌వ‌న్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్', 'శ్రేష్ట్ మూవీస్' సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి కథ అందించగా, మూవీకి 'గుర్తుందా శీతాకాలం' అనే టైటిల్ ని పరిశీలిస్తున్న‌ట్టు తెలుస్తుంది. 

09:13 - February 16, 2018

హైదరాబాద్ : నగరంలోని దసపల్లా హోటల్ పై అందరి చూపు నెలకొంది. సినీ నటుడు, జనసేన అధినేత 'పవన్ కళ్యాణ్' ఏర్పాటు చేసిన జేఎఫ్ సీ తొలి సమావేశం ఆ హోటల్ లో జరుగనుంది. ఇందుకు తగిన ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. రెండు రోజుల పాటు ఈ సమావేశాలు జరుగనున్నాయి. కేంద్రం నుండి ఏపీకి వచ్చిన నిధులు..ఏపీ ప్రభుత్వం ఖర్చు చేసిన నిధులపై నిగ్గు తేల్చేందుకు 'పవన్' జేఎఫ్ సీ కమిటీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. జేఎఫ్ సీలో లోక్ సత్తా నేత జయ ప్రకాష్ నారాయణ, రాజకీయ వేత్త ఉండవల్లి అరుణ్ కుమార్ లున్నారు.

శుక్రవారం..శనివారం రోజుల్లో జరిగే సమేశాలకు హాజరు కావాలని పవన్ పలువురిని ఆహ్వనం పలికారు. కొణతాల రామకృష్ణ, వామపక్ష నేతలు మధు, రామకృష్ణలతో పాటు ఇతర విద్యావేత్తలు, న్యాయకోవిదులు, వివిధ రంగాలకు చెందిన నిపుణులు సమావేశంలో పాల్గొననున్నారు. ఇదిలా ఉంటే శుక్రవారం ఉదయం ట్యాంక్ బండ్ కు పవన్ చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు భారీ ఎత్తున అక్కడకు చేరుకున్నారు. అక్కడున్న అంబేద్కర్ విగ్రహానికి పవన్ నివాళులర్పించి మీడియాతో ఏమీ మాట్లాడకుండానే అభిమానులకు అభివాదం చేస్తూ వెళ్లిపోయారు. ఈ సమావేశంలో పవన్ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్..జేఎఫ్ సీకి ఓయూ విద్యార్థి సంఘం నేతలు మద్దతు పలికారు. 

08:27 - February 16, 2018
13:15 - February 15, 2018

విజయవాడ : ఏపీ టిడిపి సమన్వయ కమిటీ భేటీ ద్వారా పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పలు లీకులు పంపుతున్నారు. గురువారం ఉదయం జరుగుతున్న ఈ భేటీ కొనసాగుతోంది. విభజన హామీలు..ప్రత్యేక హోదా..తదితర అంశాలు..ప్రతిపక్ష నేత జగన్ వ్యాఖ్యలు..పవన్ జేఎఫ్ సీ ఏర్పాటుపై చర్చించారు. ఈ సందర్భంగా బాబు పలు వ్యాఖ్యలు చేశారు.

పవన్ పోరాటంలో అర్థం ఉందని, రాష్ట్రానికి మేలు జరగాలనే కాంక్షతో తోచిన విధంగా పవన్ వెళుతున్నారని, తమ ఉద్దేశ్యమూ రాష్ట్రానికి మేలు జరగాలనే అని వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. శ్వేతపత్రాలు అడిగితే సున్నిత పద్ధతిలో సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ లెక్కలు ఏది అడిగినా ఇచ్చేందుకు అభ్యంతరం లేదని, కేంద్రం ఏం చేసిందనే దానిపై బిజెపి శ్వేతపత్రం విడుదల చేయాలని పేర్కొన్నారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - పవన్ కళ్యాణ్