పవర్ స్టార్

06:43 - May 14, 2018

చిత్తూరు : జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ తిరుమ‌ల వెంక‌న్న స‌న్నిధిలో భ‌క్తి పార‌వ‌శ్యంలో మునిగిపోయారు. శనివారం రాత్రి కాలిన‌డ‌క‌న తిరుమల కొండ ఎక్కిన ప‌వ‌న్‌.. సాధాసీదాగా సామాన్య భ‌క్తుడిగా న‌డుచుకుంటూ వెళ్లారు. ఓ పార్టీకి అధినేతై ఉండి.. ఇలా సాధాసీదాగా వెంక‌న్నను ద‌ర్శించుకోవ‌డంపై ప‌వ‌న్ అభిమానులు సంతోష‌ం వ్యక్తం చేస్తున్నారు. మ‌రో రెండు రోజుల పాటు తిరుమ‌ల కొండ‌పైనే గడపనున్నారు ప‌వన్‌ కల్యాణ్‌.
జ‌న‌సేన అధీనేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ శ‌నివారం రాత్రి కాలిన‌డ‌క‌న తిరుమల కొండ‌పైకి చేరుకున్నారు. ఆదివారం ఆయ‌న శ్రీవారిని ద‌ర్శికున్నారు. ప‌వ‌న్ సాదాసీదాగా తిరుమ‌ల కొండ‌పైకి వెళ్లడంతో.. అభిమానులు ప‌వ‌న్‌ను క‌లిసి అభివాదం చేశారు. దర్శనం అనంతరం పవన్ ఆలయం వెలుపలకి రాగానే అక్కడికి అభిమానులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. దీంతో వారిని వారించడం భద్రతా సిబ్బందికి ఇబ్బందికరంగా మారింది. అభిమానుల తోపులాటల మధ్యే పవన్ కాన్వాయ్ వద్దకు చేరుకున్నారు. స్వామి వారి ఆశీస్సుల కోసం వచ్చానని రాజకీయాలు మాట్లాడనని పవన్‌ అన్నారు. తనకు అన్నప్రాశన, నామకరణ౦ శ్రీవారి ఆలయంలోని యోగా నరసింహా స్వామి సన్నిధిలోనే జరిగిందని పవన్ కళ్యాణ్ తెలిపారు. కాగా పవన్ బస్సు యాత్ర ప్రారంభించే ముందు స్వామి వారి ఆశీస్సులు పొందేందుకు శ్రీవారి సన్నిధికి వచ్చారు.

కాలిన‌డ‌క మార్గం గుండా ప‌వ‌న్ నడుచుకుంటూ వెళ్తుండగా.. ప‌లువురు సామాన్య భ‌క్తులు ఆయ‌న‌తో ఫోటోలు తీసుకునేందుకు పోటీప‌డ్డారు. తిరుమ‌లకు వ‌చ్చే వీ.ఐ.పీ భ‌క్తుల‌కు ప్రత్యేక ద‌ర్శన సౌక‌ర్యం ఉన్నా.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాత్రం 300 రూపాయాల ప్రత్యేక ద‌ర్శన టికెట్ కొనుగోలు చేసి స్వామీ వారిని ద‌ర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు పవన్‌ను ఆశీర్వదించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేసారు. కొండ‌పై మరో రెండు రోజులు బస చేయనున్న పవన్‌కల్యాణ్ మ‌రికొన్ని పుణ్యక్షేత్రాల‌ను ద‌ర్శించుకోనున్నారు. 

20:19 - January 12, 2018

మనకు ఏడనన్న అన్యాయం అయితే.. కోర్టుకు వోతం.. ఆడగూడ న్యాయంగాకపోతె..ఫలితాలు రాకముందుకే ఓటమి పాలైంది టీఆర్ఎస్ పార్టీ కరెంటి ముచ్చట్ల..చెర్వుమీద కొంగ అల్గితె.. చెర్వుదెండుతదా.?? కొంగదెండుతదా..? ఆ నాగం జనార్థన్ రెడ్డి గారు గూడ.. బీజేపీ కమలానికి కాటు వెడ్తున్నట్టే ఉన్నడుగదా? ఏయ్ మా కేటీఆర్ను తిడ్తరా మీరు..? కబడ్దార్ కాంగ్రెస్ నేతల్లారా అని టీఆర్ఎస్ పార్టోళ్లు..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. కత్తి స్టార్ కత్తి మహేష్.. ఇద్దరి పంచాదిలకు ఉస్మానియా యూనివర్సిటీ ఎంటరైపోయింది...తెలంగాణల గొర్ల పంపిణీ పత్కం తెర్లైంది అనెతందుకు మళ్లొక ముచ్చటొచ్చింది.. ఈ తెలంగాణ రాష్ట్రంల ప్రజలది గాని సంపద ఏదున్నా అది ప్రభుత్వానిదే అంతేనా..? భూములైనా.?మన్సులను వోలిన మన్సులు ఏడ్గురుంటరంటరు.. ఆ ఏడుగుర్ని ఎవ్వడు సూడవొయ్యిండో ఏమో నాకు తెల్వదిగని.. గీ ముచ్చట్లు జూడాలంటే వీడియో క్లిక్ చేయండి. 

19:51 - January 11, 2018

హైదరాబాద్ : సినీ పరిశ్రమలో సినీ క్రిటిక్ కత్తి మహేష్...సినీ నటుడు పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య విమర్శల యుద్ధానికి ముగింపు పలకాల్సి ఉందని ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ పేర్కొన్నారు. సాగదీస్తే ఎంతదూరమైనా సాగే అవకాశం ఉందని టెన్ టివి ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఇద్దరూ సంయమనం పాటించాలని, విమర్శలు కొనసాగిస్తే ఎంతదూరమైనా పోవచ్చన్నారు. 

06:29 - December 9, 2017

విజయవాడ : కులాలకీ, మతాలకీ అతీతంగా రాజకీయాలు ఉండాలని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. మనిషికి జరిగే అన్యాయాన్ని ప్రశ్నిస్తానన్న ఆయన.. విభజించు పాలించు సిద్ధాంతానికి జనసేన వ్యతిరేకమని చెప్పారు. 3వ రోజు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పర్యటించిన పవన్‌ను.. ఫాతిమా కాలేజీ విద్యార్థులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, పెన్షన‌ర్లు కలిసి తమ గోడు చెప్పుకున్నారు. స‌మ‌స్యల ప‌రిష్కారానికి తన వంతు కృషి చేస్తానని వారికి పవన్‌ హామీ ఇచ్చారు. అనంతరం అమ‌రావ‌తిలో నిర్మించబోయే జనసేన పార్టీ కార్యాల‌య ప్రాంతాన్ని పవన్‌ సంద‌ర్శించారు.

మూడో రోజు ప‌వ‌న్ క‌ల్యాణ్‌ పర్యటన విజ‌య‌వాడ, అమరావతిలో బిజీ బిజీగా కొనసాగింది. విజ‌య‌వాడ‌ ధ‌ర్నాచౌక్‌, ముర‌ళి పార్ఛూన్‌ వద్ద ఆందోళ‌న నిర్వహిస్తున్న ఫాతిమా విద్యార్థులు, విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగులు, పెన్షన‌ర్లు, ఏపీ స్పేస్ కాంట్రాక్ట్ ఉద్యోగుల స‌మ‌స్యలను పవన్‌ అడిగి తెలుసుకున్నారు. ముందుగా ఫాతిమా మెడిక‌ల్ కాలేజీ విద్యార్థులతో పవన్‌ భేటీ అయ్యారు. రెండేళ్లుగా అందరి చుట్టూ తిరుగుతున్నా.. తమకు న్యాయం జరగలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల స‌మ‌స్య విన్న పవన్‌ స‌మ‌స్య ప‌రిష్కారానికి కృషిచేస్తానని హామీ ఇచ్చారు.

అనంతరం కాంట్రాక్ట్ విద్యుత్ ఉద్యోగులు పవన్‌ను కలిసి తమ సమస్యలు వివరించారు. 24వేల కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరించే ప‌రిష్కారం చేయాల‌ని కోరారు. గ‌తంలో ఉన్న ముఖ్యమంత్రులను క‌లిసినా ఫ‌లితం లేద‌న్నారు. ఆ త‌ర్వాత కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీంపై తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఉద్యోగులు పవన్‌కి వివరించారు. సీపీఎస్‌ విధానం వల్ల తమకు తక్కువ మొత్తంలో పెన్షన్‌ వస్తుందని పవన్‌కు చెప్పారు. తమ సమస్యపై ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. సీపీఎస్‌ విధానం రద్దుకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు.

అనంతరం ఏపీ స్పేస్ అప్లికేష‌న్ సెంట‌ర్ కాంట్రాక్ట్ ఉద్యోగులు ప‌వ‌న్‌ను క‌లిసారు. ఐఎఫ్‌ఎస్ అధికారి గుప్తా వ‌ల్ల త‌మ‌కు అన్యాయం జ‌రిగింద‌ని ప‌వ‌న్‌కు తెలిపారు. 15 నెల‌లుగా విజ‌య‌వాడ ధ‌ర్నా చౌక్ లో నిర‌స‌న తెలుపుతున్నా ప్రభుత్వం ప‌ట్టించుకోలేద‌న్నారు. స‌మ‌స్య విన్న ప‌వ‌న్ పైస్థాయి అధికారుల‌తో మాట్లాడ‌తాన‌ని హామీ ఇచ్చారు.

స‌మ‌స్యలు తెలుసుకుంటూనే ప్రతిప‌క్ష నేత జ‌గ‌న్ పై ప‌వ‌న్ క‌ల్యాన్ మ‌రోసారి విమ‌ర్శలు గుప్పించారు. ఏపీలో ఇన్ని స‌మ‌స్యలు ఉంటే అసెంబ్లీలో పోరాడాల్సిందిపోయి, టీవీల ముందు మాట్లాడితే ఏమొస్తుంద‌న్నారు. ప్రజ‌ల త‌రుపున పోరాడే అదృష్టం ప్రతిప‌క్షానిద‌న్నారు. కానీ అది ఏపీలో జ‌ర‌గ‌డంలేద‌న్నారు. జ‌గ‌న్ ముఖ్యమంత్రని చెప్పుకోవ‌డం విని విని చిరాకొచ్చింద‌న్నారు. ముర‌ళి ఫార్చూన్‌లో స‌మ‌స్యలు విన్న అనంత‌రం పవన్‌ కల్యాణ్‌ గుంటూరు జిల్లా పెద‌కాకానిలో జనసేన తాత్కాలిక పార్టీ కార్యాలయ స్థలాన్ని పరిశీలించారు. ప‌రిశీల‌న అనంత‌రం మంగ‌ళ‌గిరిలో పార్టీ కార్యక‌ర్తలు, అభిమానుల‌తో స‌మావేశం ఏర్పాటు చేసారు. కమ్యూనిస్టులు ప్రజల కోసం పోరాటం చేస్తారని.. తానూ అదే బాటలో పయనిస్తానని పవన్‌ కల్యాణ్‌ అన్నారు.

అనంతరం విజ‌య‌వాడ‌ స్టెల్లా కాలేజ్ లో పార్టీ కార్యక‌ర్తలు, నాయ‌కుల‌తో పవన్‌ స‌మావేశమయ్యారు. కులాలకీ, మతాలకీ అతీతంగా రాజకీయాలు ఉండాలని పవన్‌ అన్నారు. కుల అనుకూల‌ విధానాల‌కు జ‌న‌సేన వ్యతిరేక‌మ‌న్నారు. సమాజం ముందుకు వెళ్లాలంటే అంబేద్కర్ ఆశయాలు అవ‌స‌ర‌మన్న ప‌వ‌న్... వంగవీటి రంగాని చంపడం తప్పని, ఆయ‌న తప్పు చేసి ఉంటే చట్టాలు ఉన్నాయ‌న్నారు. రంగాను చంప‌డం ద్వారా సంబంధంలేని కుటుంబాలు ఆ సమయంలో ఇబ్బంది పడ్డాయ‌న్నారు. విజయవాడలో ఇంకా కులాల వ్యవస్థ మారలేదన్నారు.

అంత‌కు ముందు తనకు ప‌రిటాల ర‌వి గుండు కొట్టించారనేది ప్రచారం మాత్రమేనని పవన్‌ తెలిపారు. ఆ ప్రచారం చేయించింది టీడీపీ వాళ్లేన‌ని.. అవ‌న్నీ మ‌న‌సులో పెట్టుకోకుండా ప్రజ‌ల కోస‌మే టీడీపీకి స‌పోర్ట్ చేసిన‌ట్లు ప‌వ‌న్ తెలిపారు. అన్ని చేసిన టీడీపీకి ఎందుకు మద్దతు ఇచ్చానంటే కులాల మధ్య ఐక్యత కోసమేనని పవన్‌ తెలిపారు. కులాల మధ్య ఐక్యత సాధిస్తే అమరావతి అద్భుతమైన రాజధాని అవుతుందన్నారు. అభియోగాలు లేకుండా ఉంటే జగన్ కు మద్దతు తెలపడానికి ఎటువంటి అభ్యoతరాలు లేవని పవన్‌ అన్నారు. మొత్తానికి 3వ రోజు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ప‌వ‌న్ టూర్‌ స‌క్సెస్‌ ఫుల్‌గా ముగిసింది. ఏపీలో విద్యార్థులు, ఉద్యోగులు, పెన్షన‌ర్ల స‌మ‌స్యల‌ు తెలుసుకున్నప‌వ‌న్‌ ప‌రిష్కారానికి కృషి చేస్తామ‌ని హామీ ఇచ్చారు. 

10:33 - September 29, 2017

పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' తాజా చిత్రం న్యూ లుక్..టీజర్..ఇతర విశేషాలు తెలుస్తాయని అభిమానులు ఆశించారు. దసరా పండుగ సందర్భంగా సినిమాకు సంబంధించిన పోస్టర్ విడుదల చేస్తారని అభిమానులు ఆశించారు. కానీ వారి ఆశలు నెరవేరడం లేదు. ఇటీవలే అనురుధ్ స్వరపరిచిన పాట టీజర్ ను మాత్రమే ఇటీవలే విడుదల చేశారు. మాటల మాంత్రికుడు 'త్రివిక్రమ శ్రీనివాస్' దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. హారిక హాసిని సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా 'పవన్' సరసన 'క్తీరి సురేష్', 'అనూ ఇమ్మాన్యుయేల్' హీరోయిన్స్ గా నటిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ కొనసాగుతోంది.

ఇటీవలే విదేశాల్లో షూటింగ్ జరుపుకున్న అనంతరం 'దసరా' పండుగ సందర్భంగా షూటింగ్ కు చ్రిత బృందం కొంత విరామం తీసుకున్నట్లు టాక్. అక్టోబర్ మొదటి వారంలో మళ్లీ షూటింగ్ మొదలు పెడుతారని తెలుస్తోంది. దసరా పండుగ సందర్భంగా పవన్ న్యూ లుక్..పోస్టర్ విడుదల చేస్తారని టాక్ వినిపించింది. కానీ అవన్నీ వట్టివేనని తేలిపోయాయి. దీపావళికి టీజర్..ఫస్ట్ లుక్ విడుదలవుతుందని ప్రచారం జరుగుతోంది. మరి ఇది నిజమా ? కాదా ? అనేది తెలియాలంటే వెయిట్ అండ్ సీ..

14:59 - September 25, 2017

స్టైలిష్ ఫిల్మ్ మేకర్ సుకుమార్ దర్శకత్వంలో హీరో రామ్ చరణ్ నటిస్తున్న కొత్త సినిమా రంగస్థలం 1985. చరణ్ ఇందులో పల్లెటూరి కుర్రాడుగా కనిపించబోతున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సినిమాని రిలీజ్ చేయాలనుకున్నారు. అయితే దసరా కానుకగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయడానికి రెడీ అవుతోంది రంగస్థలం టీమ్. ఈ లుక్ ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతులమీదగా రిలీజ్ చేయబోతున్నారు. పవన్ కళ్యాణ్ కూడా అబ్బాయ్ చరణ్ కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. చాలా రోజుల తర్వాత బాబాయ్ అబ్బాయ్ లను ఒకే వేదికపై మెగా అభిమానులు చూడబోతున్నారు.

10:10 - July 21, 2017

పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' తన తాజా చిత్రం కోసం కష్టపడుతున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ‘పవన్' ఈ సినిమాలో ఇంజినీర్ గా కనిపించనున్నాడని టాక్. సినిమాకు సంబంధించిన టైటిల్ మాత్రం ఇంకా ఫిక్స్ చేయలేదు.

సినిమాను త్వరగా కంప్లీట్ చేయాలనే భావనతో 'పవన్' ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ సినిమా నిన్న‌టి వ‌ర‌కు హైద‌రాబాద్ లో వేసిన భారీ సెట్ లో చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంది. తాజాగా టీం బ‌ల్గేరియా షిఫ్ట్ అయింది. 20 రోజ‌లు పాటు అక్క‌డే చిత్రీక‌ర‌ణ జ‌రుపుకోనున్న‌ట్టు స‌మాచారం. షూటింగ్ లో పాల్గొనేందుకు 'పవన్' బల్గేరియా వెళ్లారు. పవన్ వెళుతున్న ఓ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

పవన్ సరసన కీర్తి సురేష్..అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. బల్గేరియాలో వీరిద్దరిపై పాటలు షూట్ చేయనున్నారని తెలుస్తోంది. ఈ మ‌ధ్య‌ ‘రోబో 2.0’, 'వివేగం' మూవీ టీం కూడా బల్గేరియాలో కొన్ని సన్నివేశాలతో పాటు సాంగ్స్ చిత్రీకరించిన సంగతి తెలిసిందే. తాజాగా 'ప‌వ‌న్' సినిమా కూడా అక్క‌డికే బ‌య‌లుదేర‌డం విశేషం. దసరా కానుకగా ఈ సినిమాని రిలీజ్ చేయాల‌నే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది.

11:00 - April 22, 2017

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయా ? 2019లో ఎన్నికలు జరగాల్సి ఉన్న సంగతి తెలిసిందే. కానీ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికలపై చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఎన్నికలకు టిడిపి పార్టీ నేతలంతా సిద్ధంగా ఉండాలని..ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశాలున్నాయని వ్యాఖ్యానించడంతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కిపోయింది. తాము సిద్ధంగానే ఉన్నట్లు పలు పార్టీలు ప్రకటించేశాయి కూడా. ఎప్పుడు ఎన్నికలు వస్తే తాము సిద్ధంగా ఉన్నట్లు వైసీపీ ఇప్పటికే ప్రకటించింది. తాజాగా 'జనసేన' అధినేత 'పవన్ కళ్యాణ్' కూడా స్పందించారు. ఆయన ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు. ‘ఎన్నికల యుద్ధం ఒక వేళ ముందస్తుగా వస్తే జన'సేన' సిద్ధమే'. అంటూ ట్వీట్ చేశారు. నిమిషాల వ్యవధిలోనే ఇది వైరల్ అయిపోయింది. ఇప్పటికే తన రాజకీయ కార్యాచరణనను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకు తగిన జనసేన సేనికులను ఎంపిక చేస్తోంది. అనంతపురంలో ఇప్పటికే రాత పరీక్షలు నిర్వహిస్తున్నారు.

08:30 - April 22, 2017

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇక సెలబ్రెటీల సంగతి చెప్పనక్కర్లేదు. వివిధ సినిమా షూటింగ్ లు సైతం ఎండల వేడిమికి షెడ్యూల్ ను మార్చి వేసుకుంటున్నాయంట. కానీ పవర్ స్టార్ ‘పవన్ కళ్యాణ్’ మాత్రం తన తాజా చిత్ర షూటింగ్ లో మాత్రం పాల్గొంటున్నారని టాక్. తన షూటింగ్ ను ఎట్టి పరిస్థితుల్లో వాయిదా వేయకుండా తన పని తాను కానిచ్చేస్తున్నాడు. 'పవన్' - 'త్రివిక్రమ్' కాంబినేషన్ లో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే పూజా కార్యాక్రమాలను ప్రారంభించుకున్న సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకొంటోంది. ఈ సినిమాలో 'పవన్’ ఇంజినీర్ గా కనిపిస్తాడని తెలుస్తోంది. సాధ్యమైనంత త్వరగా షూటింగ్ ను పూర్తి చేసి నెక్ట్స్ సినిమాపై దృష్టి సారించాలని ‘పవన్’ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. నేసన్ దర్శకత్వంలో తదుపరి సినిమాను 'పవన్' మొదలెట్టనున్నట్లు తెలుస్తోంది. అందుకే ఎండను సైతం లెక్క చేయకుండా షూటింగ్ లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది.

11:39 - April 12, 2017

పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' తన తాజా చిత్రం కోసం బిజీ బిజీగా గడుపుతున్నారు. టాలీవుడ్ మాటల మాంత్రికుడు 'త్రివిక్రమ్' దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘పవన్' హీరోగా నటిస్తున్న ఈ చిత్ర పూజా కార్యక్రమాలు జరుపుకుంది. అంతేగాకుండా షూటింగ్ ను కూడా మొదలు పెట్టేశారు. ఈ సినిమాలో 'పవన్' సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా కనిపించనున్నాడని టాక్. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో కీలక పాత్రను 'ఖుష్బూ' నటిస్తోంది. చాలా రోజుల తరువాత టాలీవుడ్ లో ఆమె రీ ఎంట్రీ ఇస్తుందని చెప్పవచ్చు. ‘అత్తారింటికి దారేది' చిత్రంలో 'నదియా' పాత్ర ఎంత బలమైందో తెలిసిందే. అలాంటి బలమైన పాత్ర కోసం 'ఖుష్బూ'ని ఎంపిక చేశారని తెలుస్తోంది. తొలి రోజున షూటింగ్ కు వెళ్లినప్పుడు స్కూల్ కి వెళ్లినట్లుగా అనిపించిందని, తన పాత్ర కీలకం కావడంతోనే తాను ఒప్పుకోవడం జరిగిందని 'ఖుష్బూ' వెల్లడించింది. పవన్' సరసన 'ఇమ్మాన్యూయెల్', 'కీర్తి సురేష్'లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు తమిళ యువ సంగీత దర్శకుడు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో 'ఖుష్బూ’ పాత్ర ఏమిటో తెలియాలంటే చిత్రం విడుదలయ్యే వరకు వేచి చూడాల్సిందే.

 

Pages

Don't Miss

Subscribe to RSS - పవర్ స్టార్