పశ్చిమగోదావరి

09:21 - August 31, 2018

పశ్చిమగోదావరి : జిల్లాలో ఓ వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. తీవ్ర గాయాలపాలైన ఆ వ్యక్తి ప్రస్తుతం ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ ఘటన తంగెళ్లమూడి కబాడిగూడెంలో చోటు చేసుకుంది. సతీష్ అనే వ్యక్తిపై గురువారం రాత్రి విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. నలుగురు దాడి చేసి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. తీవ్రగాయాలపాలైన సతీష్ ను ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

12:21 - August 26, 2018

పశ్చిమగోదావరి : జిల్లా ఏలూరులో ఎక్కడ చూసినా రాఖీ పండుగ సందడి కనిపిస్తోంది. జింగిల్‌ బెల్స్‌ స్కూల్లో ఆనందోత్సాలతో రాఖీ వేడకులు జరిగాయి. బాలబాలికలు ఉత్సాహంగా రాఖీ పండుగ జరుపుకున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం.. 

08:05 - August 26, 2018

ప.గో : ఏలూరులోరాఖీల సందడి కొనసాగుతునే ఉంది. రకరకాలుగా ఆకర్షిస్తున్న రాఖీలను.. రేట్లతో సంబంధం లేకుండా అన్నయ్యల కోసం కొనుగోలు చేస్తున్నారు చెల్లెలు. అన్నదమ్ములు ఆనంద పడేలా రాఖీలను కొనుగోలు చేస్తున్నామని సోదరిమణులు చెబుతున్నారు. రాఖీల సందడికి సంబంధించిన మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం... 

 

15:43 - August 23, 2018

పశ్చిమగోదావరి : భీమవరంలో జివిఎన్‌ కాలువకు గండి పడింది. యనమదుర్రు డ్రైవ్‌ నుంచి వరద నీరు జివిఎన్‌ పం టకా లు వలోకి ప్రవహించడంతో భారీ గండి పడింది. దీంతో పంటకాలువకు సమీపంలోని సుమారు 200 ఎకరాలు నీటమునిగాయి. ప్రస్తుతం వరద నీరు భీమవరంలోని బ్యాంక్‌ కాలనీవైపు రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గండి పడ్డ ప్రాంతాన్ని పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత గ్రంధి శ్రీనివాస్‌ సహాయక చర్యలుచేపట్టాలని కోరారు. 

13:44 - August 23, 2018

పశ్చిమగోదావరి : జిల్లాలోని నిడదవోలును ఇంకా వరద ముంపు వదల్లేదు. అనేక గ్రామాలు వరద నీటిలోనే ఉన్నాయి. రెండు రోజులుగా నిడదవోలు.. తాడెపల్లి గూడెం రహదారిని పూర్తిగా మూసివేశారు. నిడదవోలు రోడ్‌ కమ్‌ రైల్వే బ్రిడ్జ్‌ నీట మునగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వేల ఎకరాల్లో పంట నీట మునగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....  

 

21:29 - August 22, 2018

అమరావతి : పశ్చిమగోదావరి జిల్లాలో వరద ఉధృతి అంతకంతకూ పెరుగుతోంది. ఎర్రకాలువ ఉధృతంగా ప్రవహించడంతో నిడదవోలులోని అనేక ప్రాంతాలు నీటమునిగాయి. తిమ్మరాజుపాలెంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కోటసత్తెమ్మ ఆలయం పూర్తిగా నీట మునిగింది. గర్భగుడిలోకి నీరు చేరడంతో ఆలయాన్ని మూసివేశారు. నిడదవోలులోని రోడ్‌ కమ్‌ రైల్వే బ్రిడ్స్‌పై నీరు ప్రవహించడంతో రైల్వే గేటుతో పాటు నిడదవోలు-తాడేపల్లి గూడెం రహదారిని మూసివేశారు. ఈ మార్గంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. 

13:09 - August 22, 2018

పశ్చిమగోదావరి : జిల్లాలో వరద ఉధృతితో చోడవరం గ్రామం మునిగిపోయింది.. రెండు రోజులుగా గ్రామస్తులు వరద నీటిలోనే ఉంటున్నారు. ప్రస్తుతం చోడవరంలో ఉన్న పరిస్థితిపై మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం.. 

 

08:34 - August 22, 2018

పశ్చిమ గోదావరి : జిల్లాలోని ఏలూరులో దారుణం చోటుచేసుకుంది. ఓ కీచక టీచర్‌ను బాధితురాలి బంధువులు నడిరోడ్డుపై నగ్నంగా నడిపించారు. ఏలూరు శర్వాణీ స్కూల్లో చదువుతున్న పదవ తరగతి విద్యార్థినిని రాంబాబు అనే టీచర్‌ శారీరకంగా లోబరుచుకున్నాడు. విద్యార్థిని గర్భవతి కావటంతో విషయం వెలుగులోకి వచ్చింది. విద్యార్థినికి అబార్షన్‌ కావటానికి టాబ్లెట్స్‌ ఇవ్వటంతో ఆమె ఆరోగ్యం క్షీణించింది. విషయం తెలుసుకున్న విద్యార్థిని బంధువులు కీచక టీచర్‌ రాంబాబును నడిరోడ్డుపై నగ్నంగా నడిపించుకుంటూ కొట్టుకుంటూ తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న పోలీసులు రాంబాబును అరెస్ట్‌ చేసి స్టేషన్‌కు తరలించారు. 

 

20:16 - August 21, 2018

పశ్చిమగోదావరి : గోదవరి జిల్లాలో భారీ వర్షాలకు ఎర్రకాలువ పొంగి పొర్లుతోంది. దీంతో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు, వారికి భరోసానిచ్చేందుకు మంత్రులు వరద ప్రాంతాలలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక నేతలు మంత్రులకు ఓ ట్రాక్టర్ ను ఏర్పాటు చేశారు. దీనిపై ప్రయాణిస్తుండగా ట్రాక్టర్ ఓ పక్కకి ఒరిగిపోయింది. దీంతో మంత్రులు పై నుండి మోకాలు లోతులో వున్న వరద నీటిలో పడ్డారు. నల్లజర్ల మండలం చోడవరం లోని ముంపు ప్రాంతాలోని వరద నీటిలోనే మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, జవహర్ తమ పర్యటనను కొనసాగించారు. అనంతరం స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇళ్లు కోల్పోయిన వారికి ఇళ్లు కట్టిస్తామని..వరదనీటికి పాడైపోయిన పంటలకు నష్టపరిహారం ఇస్తామని మంత్రులు హామీ ఇచ్చారు.

16:40 - August 21, 2018

పశ్చిమగోదావరి : జిల్లాలో వరదలు పోటెత్తాయి. జల్లేరు, ఎర్రకాలువ పొంగటంతో.. నల్లజర్ల మండలం చోడవరం గ్రామం పూర్తిగా నీట మునిగిపోయింది. అర్ధరాత్రి ఒక్కసారిగా వరద నీరు రావడంతో.. గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్పందించిన జిల్లాపరిషత్‌ ఛైర్మన్‌ ముళ్ళపూడి బాపిరాజు రాత్రిసమయంలోనే సహాయక చర్యలు చేపట్టారు. సుమారు ఐదువేల మంది నిరాశ్రయులయ్యారు. చోడవరం గ్రామంలోని ముంపు ప్రాంతాలను ఎంపీ మురళీమోహన్‌ పరిశీలించారు. బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందని ఎంపీ తెలిపారు. కేవలం చూసి వెళ్తున్నారు తప్ప ఎలాంటి సాయం చేయడం లేదని గ్రామస్థులు ఎంపీ, ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - పశ్చిమగోదావరి