పార్టీలు

10:40 - September 1, 2018

హైదరాబాద్‌ : పాతబస్తీలో ముజ్ర పార్టీ కలకలం నెలకొంది. జూపార్క్‌ సమీపంలోని ఓ లాడ్జీలో యువకులు ముజ్ర పార్టీ నిర్వహిస్తున్నారని తెలిసి.. పోలీసులు దాడులు నిర్వహించారు. అమ్మాయిలతో అశ్లీల ప్రదర్శనలు, అర్దనగ్న ప్రదర్శనలు చేస్తున్న అమ్మాయిలు, యువకలును అదుపులోకి తీసుకున్నారు. ఓ యువతిపై అత్యాచారం చేసిన ఖుద్దూస్‌ అనే యువకుడినపై నిర్బయ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 

08:36 - August 12, 2018

ఏపీలో ఎన్నికల వాతావరణం నెలకొంది. రాజకీయాలు వేడుకుతున్నాయి. అన్ని పార్టీలు 2019 ఎన్నికలకు సిద్ధమవుతన్నాయి. టీడీపీ, జనసేన, వైసీపీ పార్టీలు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో వైసీపీ నేత మండలం హనుమంతురావు, బీజేపీ నేత ఉమామహేశ్వరరాజు, టీడీపీ నేత గొట్టిముక్కల రామకృష్ణప్రసాద్ పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

21:45 - July 19, 2018

ఢిల్లీ : శుక్రవారం లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై జరిగే చర్చకు పార్టీల వారీగా సమయం కేటాయించారు. లోక్‌సభలో ఆయా పార్టీలకు ఉన్న సంఖ్యాబాలన్ని బట్టి లోక్‌సభ స్పీకర్‌ కార్యాలయం సమయ నిర్దేశం చేసింది. టీడీపీ అవిశ్వాస తీర్మానం నోటీసుపై చర్చకు అనుమతించిన లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌... ఆ పార్టీకి చాలా తక్కువ సమయం ఇచ్చారు. అధికార బీజేపీకి అత్యధికంగా 3.33 గంటలు కేటాయించారు. ప్రతిపక్ష కాంగ్రెస్‌కు 38 నిమిషాలు, అన్నా డీఎంకే పార్టీకి 29 నిమిషాలు ఇచ్చారు. టీఎంసీకి 27 నిమిషాలు, బీజేడీకి 15 నిమిషాల సమయం కేటాయించారు. శివసేనకు 14 నిమిషాలు, టీడీపీకి 13 నిమిషాలు, టీఆర్‌ఎస్‌కు 9 నిమిషాల సమయం ఇచ్చారు.  
 

20:25 - April 12, 2018

ఇప్పటికే చేశిన పనికి శిగ్గుపడకుంట.. ఇంక నేను అట్ల జేయలేదు ఇట్ల జేయలేదు.. అగో ఫలానోళ్లు డ్యాన్సు జేస్తె తప్పులేదు నేను జేస్తె తప్పా..? అంటున్నడు హయత్ నగర్ కార్పొరేటర్ తిర్మల్ రెడ్డి.. నిన్న ప్రెస్ మీటింగు వెట్టి.. నా అంత ప్రతివత లేదని ముచ్చట్లు జెప్తున్నడు సారు.. అయ్యా తిర్మల్ రెడ్డి ఈ తీట ముచ్చట్లు జెప్పుడు కంటె జర్ర నిన్ను నువ్వు అదుపుల వెట్టుకుంటె సమాజానికి మంచిగుంటది..

ఆ జనంల తిర్గుబాటు సుర్వైనట్టే ఉందిగదా..? టీఆర్ఎస్ పార్టీ మీద.. మొన్న మెదక్ నియోజకవర్గంల పద్మాదేవేందర్ రెడ్డి పనితనం మీద.. నిన్న మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మీద.. గాయాళ్ల పెద్దపల్లి ఎమ్మెల్యేను గెద్మిండ్రు.. ఇప్పుడు తుంగతుర్తి ఎమ్మెల్యే పనిజేశిండ్రు పబ్లీకు.. నడి చౌరస్తాల నిలవెట్టి ఏందయ్యా నువ్వు జేశింది అని తిడ్తున్నరు..

సూడుండ్రి సర్కారు తమాష ఎట్లున్నదో.. టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగ ఎవ్వలు మాట్లాడినా వాళ్లను సోషల్ మీడియా తిట్టుడు అడ్డగోలు మాటలనుడు.. ఇట్ల సర్కారోళ్లే కొంతమందికి జీతాలిచ్చి రాపిస్తున్నరన్న సంగతి జనానికి తెల్సిందేగని.. అయితే ఆడోళ్లను గూడ ఇష్టమొచ్చినట్టు తిట్టుడు మంచిదేనా.?? ఇగో గీమె తెలంగాణ జన సమితి పార్టీ నాయకురాలు ఆమెను ఎట్ల తిట్టిండ్రో సూడుండ్రి..

ఇప్పుడు వెయ్యిరూపాలిస్తె.. పదిరోజులళ్ల.. పద్నాలుగు వందల రూపాలిస్తాంటె.. ఎవ్వలికైనా ఆశ ఉంటదిగదా..? పదిరోజులకే నాల్గువందల రూపాల మిత్తిరావట్టే అని.. అయితె ఇట్ల కోట్ల రూపాలు జమజేశిన ఒక బాబాగాడు జనాన్ని నిండముంచి అవుతల వడ్డడు..మొత్తం మీద నెల్లూరు పోలీసోళ్లు వాన్ని దొర్కిచ్చుకున్నరు.. తెచ్చి మీడియాకు జూపెట్టిండ్రు..

21:46 - March 19, 2018

హైదరాబాద్ : తెలంగాణలో బహుజనలు, వామపక్షాలతో కలిసి ఏర్పాటైన బీఎల్‌ఎఫ్‌ మాదిరిగానే దేశంలో ఇలాంటి ఫ్రంట్‌ అవసరమని సామాజిక ఉద్యమ నాయకుడు, గుజరాత్‌ ఎమ్మెల్యే జిగ్నేష్‌ మెవాని అన్నారు. బహుజనులు, లెఫ్ట్‌ పార్టీలతో ఏర్పాటైన ఫ్రంట్‌లతోనే... సంఘ్‌ పరివార్‌ ఫాసిస్టు శక్తులను దేశం నుంచి తరిమివేయవచ్చన్నారు. హైదరాబాద్‌లోని గోల్కొండ క్రాస్‌ రోడ్‌లో బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ నూతన కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మెవాని.. తెలంగాణలో బహుజనుల అభివృద్ధి కోసం బీఎల్‌ఎఫ్‌ ఏ కార్యక్రమం చేపట్టినా తన మద్దతు ఉంటుందన్నారు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు.. తెలంగాణలో బహుజనులకు రాజ్యాధికారం కట్టబెట్టేందుకే బీఎల్‌ఎఫ్‌ ఆవిర్భవించిందన్నారు. 2019లో బీఎల్‌ఎఫ్‌ రాజ్యాధికారం సాధిస్తుందని అన్నారు. 

 బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌, సంఘ్‌పరివార్‌ నియంతృత్వ పోకడలు: జిగ్నేష్ 
దేశంలో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌, సంఘ్‌పరివార్‌ నియంతృత్వ పోకడలు రోజురోజుకు అధికమవుతున్నాయని సామాజిక ఉద్యమ నాయకుడు, గుజరాత్‌ ఎమ్మెల్యే జిగ్నేష్‌ మెవాని అన్నారు. వీరి పోకడలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దళిత , బహుజనులు ఏకమైతేనే ఇది సాధ్యమని స్పష్టం చేశారు. హైదరాబాద్‌ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో.. మహాజన పాదయాత్ర వార్షికోత్సవ సభ జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన జిగ్నేష్‌ మెవాని... తెలంగాణలో బహుజన సంఘాలు, లెఫ్ట్‌ పార్టీలు ఏకతాటిపైకి రావడం శుభసూచకమన్నారు. ఇదే సభలో పాల్గొన్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం... కేసీఆర్‌ చెప్తోన్న ఫెడరల్‌ ఫ్రంట్‌తో ఒరిగేదీ లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌తో బీఎల్‌ఎఫ్‌ పొత్తుపెట్టుకోబోదన్నారు. 119 స్థానాల్లోనూ బీఎల్‌ఎఫ్‌ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. 

21:37 - August 16, 2017

హోరెత్తే ప్రచారం.. ఘాటైన విమర్శలు..పదునైన కామెంట్లు.. దుమ్మురేపుతున్న రోడ్ షోలు.. మీటింగ్ లు..వెరసి గెలుపుకోసం ఆరాటం.. నంద్యాల ఉపఎన్నికను సెమీఫైనల్ గా భావించవచ్చా? నంద్యాలలో గెలుపెవరిదో.. వాళ్లదే వచ్చే ఎన్నికల్లో కూడా పైచేయి అనుకోవచ్చా? ఇరు పార్టీల నేతలంతా ఒక్కదగ్గర పోగై సాగిస్తున్న సమరం ఏ దిశగా తేలనుంది? ఇదే ఈ రోజు వైడాంగిల్ స్టోరీ.. నంద్యాల ఉప ఎన్నిక పోరు ఓ రేంజ్ లో కాక పుట్టిస్తోంది. చంద్రబాబు సర్కారుకు మూడేళ్లు పూర్తయిన సందర్బంగా.. ఈ ఎన్నిక ఫలితం ప్రజలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అసలు ఒక ఉప ఎన్నిక ఫలితంతో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీల జాతకాలు మారిపోతాయా..? నేతల నాయకత్వాలపై ప్రజలు ఓ అభిప్రాయానికి వచ్చేస్తారా..? ఇప్పుడివే ప్రశ్నలు ఏపీ పొలిటిక్స్‌లో చర్చనీయాంశంగా మారుతున్నాయి...!! మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

07:19 - June 24, 2017

హైదరాబాద్ : రుణమాఫీ విషయంలో రైతుల్ని అడ్డంగా పెట్టుకుని కొన్ని పార్టీలు రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నాయన్నారు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి. ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్‌తో పాటు జరిగిన బ్యాంకర్ల సమావేశంలో మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. కరీఫ్‌లో రైతులు ఇబ్బందులు పడకుండా ఎరువులు, విత్తనాలు సిద్ధం చేశామని పోచారం అన్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి. 

20:08 - June 2, 2017

హైదరాబాద్ : హైదరాబాద్‌ గన్‌పార్క్‌ దగ్గర పలు పార్టీల నాయకులు, ప్రజాసంఘాల నేతలు అమరవీరులకు నివాళులు అర్పించారు.. పోరాడి తెలంగాణ సాధించుకున్నామని గుర్తుచేసుకున్నారు.. టీఆర్‌ఎస్‌ పాలనపై విమర్శలు గుప్పించారు.

 

11:36 - April 14, 2017
20:19 - March 29, 2017

ఏ పూటకు ఆ పాట వాడుడు మనం రాజకీయనాయకుల దగ్గరనే జూశ్నం ఇన్నొద్దులు గని.. ఆఖరికి పంచాంగం జెప్పె అయ్యగార్లు గూడ అట్లనే తయ్యారైండ్రు.. వాళ్లు గూడ ఏ ఎండకు ఆ గొడ్గు వడ్తున్నరు.. పంచాంగం అనేది ఒక్కటే తీర్గ ఉండాలేగని పార్టీ ఆఫీసులు మారినప్పుడల్ల పంచాంగం మారుతదా..? కని మారుతున్నది మన అయ్యాగార్ల పుణ్యాన..సూడండి ఎలానో..

Pages

Don't Miss

Subscribe to RSS - పార్టీలు