పార్లమెంట్

16:47 - October 10, 2018

హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్ నేత, ఏఐసీసీ అధికార ప్రతినిధి, కేంద్ర మాజీ మంత్రి అయిన జైపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు చేయడం పార్టీలో చర్చానీయాంశమయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరుగునున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీలో జైపాల్ రెడ్డి విలేకరులతో మాట్లడారు. తాను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనని, పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తానని వెల్లడించారు. రాఫెల్ యుద్ధ విమానాల స్కామ్‌లో రక్షణ శాఖ ఒత్తిళ్లు, ప్రలోభాలకు గురి చేసిందని తెలిపారు.
మహబూబ్‌నగర్‌ అసెంబ్లీ స్థానం నుంచి జైపాల్ రెడ్డి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. అసెంబ్లీకి పోటీ చేసే ఉద్దేశమే తనకు లేదని, ఊహాగానాలను నమ్మొద్దని గతంలో జైపాల్ రెడ్డి పేర్కొన్న సంగతి తెలిసిందే. వచ్చే లోకసభ ఎన్నికల్లో తాను మహబూబ్‌నగర్‌ పార్లమెంటు స్థానం నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు.

11:45 - October 5, 2018

విజయవాడ : త్వరలో ఏపీ రాష్ట్రంలో ఎన్నికలు జరుగనున్నాయి. మరి ప్రజల నాడి ఎలా ఉంది ? అధికారంలోకి ఏ పార్టీ వస్తుంది ? తదితర వాటిపై ప్రముఖ జాతీయ ఛానెల్ రిపబ్లిక్ టివీ సీ ఓటర్ సంయుక్తంగా పార్లమెంట్ స్థానాలపై సర్వే నిర్వహించింది. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అనేది వెల్లడించింది. దీనికి సంబంధించిన వార్తలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. 

అధికారంలోకి వచ్చేందుకు పలు పార్టీలు ఇప్పటి నుండే వ్యూహాలు రచిస్తున్నాయి. జనాలను ఆకర్షించేందుకు నేతలు ప్రయత్నాలు మొదలుపెట్టేశారు. గతంలో జరిగిన ఎన్నికల్లో కొద్ది తేడాతో అధికారంలోకి రాలేకపోయిన వైసీపీ గట్టి ప్రయత్నాలే చేస్తోంది. ఆ పార్టీ నేత జగన్ గత కొన్ని రోజుల నుండి పాదయాత్ర చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యలో జనసేన అధినేత పవన్ కూడా వచ్చేశారు. ఆయన పోరాట యాత్ర పేరిట జనాల్లోకి వెళుతున్నారు. వామపక్షాలతో కలిసి ఆయన కార్యచారణను రూపొందిస్తున్నారు. మరి ప్రజల నాడి ఎలా ఉంది ? ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు ? 

పార్లమెంట్ స్థానాలకు జరిగే ఎన్నికల్లో మొత్తం 25 సీట్లకు గాను వైసీపీ ఏకంగా 21 సీట్లు నెగ్గుతుందని పేర్కొంది. మిగతా నాలుగు సీట్లు టీడీపీ గెలుస్తుందని సర్వేలో వెల్లడైందని తెలిపింది. అంతేగాకుండా వైసీపీ 41.9..టిడిపి 31.4 ఓట్ల శాతం ఉంటుందని వెల్లడించింది. బీజేపీ ఏ సీటు గెలవదని కానీ 12.5 ఓట్ల శాతం ఉంటుందని అంచనా వేసింది. కాంగ్రెస్ ది కూడా అదే పరిస్థితి ఉంటుందని కేవలం 7.2 ఓట్ల శాతం..సీపీఎం, సీపీఐ, జనసేన పార్టీలకు 8.9 ఓట్ల శాతం ఉంటుందని అంచనా వేసింది. మరి ఇది నిజమా ? కాదా ? అనేది తెలియాలంటే ఎన్నికలు వచ్చే వరకు ఆగాల్సిందే. 

12:27 - August 17, 2018
20:27 - August 10, 2018
16:31 - August 10, 2018

ఢిల్లీ : ట్రిపుల్ తలాక్ ((ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ) బిల్లు ఆగిపోయింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశ పెట్టడం లేదు. శుక్రవారం రాజ్యసభలో ప్రవేశ పెట్టాలని కేంద్రం పలు ప్రయత్నాలు చేసింది. కానీ పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. దీనితో ఈ బిల్లును ప్రవేశ పెట్టడం లేదని రాజ్యసభ ఛైర్మన్ ఎం.వెంకయ్య నాయుడు ప్రకటించారు. బిల్లులో సవరణలకు ప్రతిపక్షాలు పట్టుబట్టినప్పటికీ కేంద్రం అందుకు అంగీకరించకుండానే లోక్‌సభలో బిల్లును పాస్ చేసిన సంగతి తెలిసిందే. ఈ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం కీలక సవరణలు చేసింది.

ట్రిపుల్ తలాక్ ముసాయిదా బిల్లు 2017గా ప్రభుత్వం పేర్కొంది. ఈ బిల్లు ప్రకారం భార్యకు మాటల ద్వారా కానీ, రాత పూర్వకంగా కానీ, ఎలక్ట్రానిక్ మాధ్యమం ద్వారా కానీ ట్రిపుల్ తలాక్ చెప్పడం నేరం అవుతుందని పేర్కొంది. అందులో భాగంగా మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా విధించవచ్చు. దీనిపై ముస్లిం సంఘాల నుండి వ్యతిరేకత వ్యక్తమైంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలను సోమవారం వరకు పొడిగించేందుకు కాంగ్రెస్, టీఎంసీ అంగీకరించలేదని సమాచారం.  

12:57 - August 10, 2018

ఢిల్లీ : కేంద్రానికి వ్యతిరేకంగా పార్లమెంటులో గాంధీ విగ్రహం ఎదుట టీడీపీ ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేకహోదా, విభజన చట్టం అమలు చేయాలంటూ నినాదాలు చేశారు. చిత్తూరు ఎంపీ డాక్టర్‌ శివప్రసాద్‌.. హిజ్రా వేషధారణలో శివప్రసాద్‌ నిరసన వ్యక్తం చేశారు. మోదీబాబా ప్రత్యేక హోదా ఇవ్వకుంటే నీ అంతం ఆరంభం అంటూ.. హాస్య గీతం ఆలపించారు. మాటలెన్నో చెప్పావో.. చేతల్లో ఏమీ చూపలేదంటూ ఛలోక్తులు విసిరారు. 
 

15:56 - August 7, 2018

ఢిల్లీ : ఏపీకి ప్రత్యేక హోదా, విభజన చట్టాలను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ టీడీపీ నేతలందరూ ఢిల్లీ చేరుకున్నారు. రాష్ట్రానికి ఇచ్చిన హామీలన్నింటినీ కేంద్రం నెరవేర్చాలని ఎంపీ రామ్మోహన్‌ నాయుడు డిమాండ్‌ చేస్తున్నారు. వెనుకబడిన జిల్లాలకు రావాల్సిన డబ్బులను అకౌంట్‌లో వేసి తిరిగి తీసుకోవడంపై ఎంపీ రామ్మోహన్‌ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేసారు.ఈ నేపథ్యంలో ఈరోజు కేంద్ర రైల్వే మంత్రిని టీడీపీ ఎంపీలు కలవనున్నారు. విశాఖ రైల్వే జోన్‌ కోరుతూ కేంద్ర మంత్రి పియూశ్‌ గోయల్‌కు విజ్ఞప్తి చేయనున్నారు. అలాగే వెనుకబడిన జిల్లాలకు రావాల్సిన నిధులపై ఆర్థిక శాఖ కార్యదర్శిని కలవనున్నామని ఎంపీ రామ్మోహన్ నాయుడు తెలిపారు. 

12:20 - August 6, 2018

విజయవాడ : ఈ వారం రోజులు పోరాటంలో కీలకమని సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఆయన సోమవారం పార్టీ ఎంపీలతో టెలీకాన్పరెన్స్ నిర్వహించారు. పార్లమెంట్ లో పోరాటం..ఆందోళనలు గురించి ఆయన చర్చించారు. పోరాటాన్ని మరింత ముమ్మరం చేయాలని ఆయన దిశా నిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇదే స్పూర్తిని మున్ముందుకు తీసుకెళ్లాలని, విశాఖ రైల్వే జోన్ పై ఉత్తరాంధ్రపై ఎంపీలు పోరాటం ఉధృతం చేయాలని సూచించారు. 

12:10 - August 6, 2018

ఢిల్లీ : పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమై రెండు వారాలు గడుస్తున్నాయి. అప్పటి నుండి టిడిపి ఎంపీల ఆందోళన కొనసాగుతోంది. విభజన హామీలు..ప్రత్యేక హోదా తదితర వాటిపై ఆందోళన..నిరసనలు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. పార్లమెంట్ గాంధీ విగ్రహం వద్ద వర్షంలో ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తున్నారు. రోజుకో వినూత్న వేషధారణలో పార్లమెంట్‌ సమావేశాలకు హాజరవుతున్న ఎంపీ శివప్రసాద్‌ ఈరోజు... శ్రీరాముడి వేషధారణలో వచ్చారు. శ్రీరాముడు ఒకే మాట, ఒకే బాణం అన్న ధర్మాన్ని పాటించగా... శ్రీరాముడే దేవుడిగా భావించే బీజేపీ మాత్రం ఆడిన మాట తప్పుతుందని శివప్రసాద్‌ ఆరోపించారు. 

11:08 - August 2, 2018

ఢిల్లీ : విభజన హామీలు..ప్రత్యేక హోదా..రైల్వే జోన్..ఉక్కు ఫ్యాక్టరీపై కేంద్రం నిర్లక్ష్యం వహింస్తుండడంపై పార్లమెంట్ లో టిడిపి ఎంపీలు ఆందోళన కొనసాగిస్తున్నారు. పార్లమెంట్ సమావేశాల ప్రారంభం నుండి వారు పలు విధాలుగా ఆందోళన చేపడుతున్నారు. టిడిపి ఎంపీ శివప్రసాద్ రోజుకో వేషధారణ ధరిస్తూ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. గురువారం 'మాయల ఫకీరు' వేషంలో వచ్చిన శివప్రసాద్ కేంద్రంపై పలు విమర్శలు గుప్పించారు. 'తన కన్నా పెద్ద మాయల ఫకీరు పార్లమెంట్ లో ఉన్నారు' అంటూ ప్రధాన మంత్రి మోడీపై సెటైర్లు వేశారు.

ఇదిలా ఉంటే టిడిపి ఎంపీలు..కడప జిల్లా ప్రతినిధులు బుధవారం రాష్ట్రపతితో భేటీ అయిన సంగతి తెలిసిందే. గురువారం ఉదయం ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడితో భేటీ అయ్యారు. కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు కేంద్రం చర్యలు తీసుకొనేలా చొరవ తీసుకోవాలని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడిని కోరారు. కడప స్టీల్ ప్లాంట్ పై ఉప రాష్ట్రపతికి వినతిపత్రం అందచేశారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - పార్లమెంట్