పిడుగు

17:41 - April 2, 2018

అనంతపురం : జిల్లాలో విషాదం నెలకొంది. పిడుగుపాటుకు ఇద్దరు మహిళలు మృతి చెందారు. నల్లమడ మండలం పేమలకుంటపల్లిలో పొలం పనులకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా భారీ వర్షం పడింది. దీంతో చింతచెట్టుకిందకు వెళ్లారు. పిడుగుపడడంతో ఇద్దరు మహిళలు దుర్మరణం చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. 

09:48 - July 30, 2017

విశాఖ : హెచ్‌పీసీఎల్‌పై పిడుగుపాటుతో విశాఖనగరం ఉలిక్కిపడింది. క్రూడ్‌ఆయ్‌ట్యాంకుపై పిడుగు పడ్డంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి.  అధికారులు, ఫైర్‌సిబ్బంది తక్షణ స్పందించడంతో  భారీగా ఆస్తినష్టం లేకుండా నివారించగలిగారు. ప్రస్తుతం ఆస్తనష్టం ఎంతమేరకు ఉందో అధికారులు అంచనా వేస్తున్నారు. 
హెచ్‌పీసీఎల్ పై పడిన పిడుగు 
వివాఖలో పిడుగులు బీభత్సం సృష్టించాయి. హెచ్‌పీసీఎల్ రిఫైనరీలో పడిగుపాటుతో మంటలు చెలరేడంతో ఉద్యోగులు భయంతో పరుగులు తీశారు. భారీగా క్రూడాయిల్ నిల్వ ఉన్న జీరో 1-డీ ట్యాంకుపై పిడుగుపడింది. దీంతో ఆయిల్‌కు మంటలు అంటుకుని పెద్ద ఎత్తున అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. ప్రమాదాన్ని గుర్తించిన హెచ్‌పీసీఎల్‌ అధికారులు మంటలు ఇరత మిషనరీకి విస్తరించకుండా చర్యలు చేపట్టారు. రిఫైనరీ ప్రాంతంలో విద్యుత్‌ సరఫరాను పూర్తిగా ఆపేశారు. అటు సమాచారం తెలుసుకున్న  అగ్నిమాపక సిబ్బంది  తక్షణం స్పందించారు. హుటాహుటిన  ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు మంటలు చెలరేగిన వెంటనే అప్రమత్తంగా వ్యవహరించి  ఆస్తినష్టం భారీగా లేకుండా నివారించామని అధికారులు అంటున్నారు. మంటలను పూర్తిగా ఆర్పేసిన అధికారులు ఆస్తినష్టం ఏమేరకు ఉందో అంచానా వేస్తున్నారు. 

06:59 - June 28, 2017

జీఎస్టీ పన్ను తో బీడీ పరిశ్రమ మరింత దిగజారిపొతుందని, ఇప్పటికే బీడీ పరిశ్రమ సంక్షోభంలో ఉందని, బీడీ పరిశ్రమ పై ప్రత్యేక్షంగా, పరోక్షంగా 3 కోట్ల మంది ఆధారపడ్డరని, తెలంగాణలో బీడి పరిశ్రమ 1901లో మొదలైందని, తెలంగాణలో బీడీ పరిశ్రమతో 10 లక్షల మంది ఉపాధి పొందుతున్నారని తెలంగాణ బీడి కార్మిక యూనియన్ నాయకులు సిద్ది రాములు గారు తెలిపారు. యూపీఎ ప్రభుత్వం బీడీ కట్టల పై పుర్రె గుర్తు తీసుకోస్తే పోరాటం చేసి దాన్ని తొలగించేల చేశామని వారుత అన్నారు. ఇప్పడు బీజేపీ ప్రభుత్వం బీడీ పరిశ్రమను నిర్విర్యం చేయాడానికి ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.  

21:23 - June 18, 2017
15:00 - May 28, 2017

ఖమ్మం : జీఎస్టీ..! వస్తు సేవల పన్ను..! ఈ పదాలు వింటే చాలు.. గ్రానైట్‌ పరిశ్రమ ఉలిక్కిపడుతోంది. అసలే పుట్టెడు కష్టాల్లో ఉన్న పరిశ్రమను ఇప్పుడు జీఎస్టీ మరింతగా బెదరగొడుతోంది. గ్రానైట్‌ పరిశ్రమకు, గూడ్స్‌ సర్వీస్‌ ట్యాక్స్‌.. GST, మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా మారింది. జులై ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్న జీఎస్టీ చట్టం.. గ్రానైట్‌ పరిశ్రమను మూసివేత దిశగా పురికొల్పుతోంది. ఇప్పటివరకూ, పరిశ్రమకు విధించే పన్ను కేవలం రెండు శాతం ఉండేది. అయితే జీఎస్టీ అమల్లోకి వస్తే.. పన్ను 2 నుంచి ఏకంగా 28 శాతానికి పెరగనుంది. ఇప్పటి వరకూ పదివేల రూపాయల వ్యాపారం చేస్తే.. రెండు వందల రూపాయలు పన్ను చెల్లించాల్సి వచ్చేది. ఇకపై, జీఎస్టీ అమల్లోకి వస్తే.. పదివేల వ్యాపారానికి మూడు వేల రూపాయల పన్ను చెల్లించాల్సి వస్తుంది. దీంతో, గ్రానైట్‌ పరిశ్రమ నిర్వాహకులు బెంబేలెత్తిపోతున్నారు. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో గ్రానైట్‌ రంగంలో కొనసాగుతున్న వారు.. పరిశ్రమలను మూసివేయడమే మంచిదన్న నిర్ణయానికి వస్తున్నారు. గ్రానైట్‌ పరిశ్రమనే నమ్ముకున్న ఆధారిత పరిశ్రమలూ మూసివేత దిశగా సాగుతున్నాయి. పెనుబల్లి, ఏన్కూరు, తల్లాడ, మధిర, బోనకల్‌ తదితర ప్రాంతాల్లో గ్రానైట్‌, దాని ఆధారిత పరిశ్రమలు ఉన్నాయి. జిల్లాలో 500 వరకూ గ్రానైట్ పరిశ్రమలు ఉన్నాయి. పరిశ్రమలు బాగా నడిచిన సమయంలో.. జిల్లా నుంచి నలుపు, తెలుపు, ఎరుపు, ఆకుపచ్చ, గోధుమ రంగు, పింక్‌ రాళ్లను ఎగుమతి చేసేవారు. ఏడాదికి సుమారు 1000 కోట్ల వ్యాపారం జరిగేది. ఇక్కడ ప్రత్యక్షంగా 20 వేల మంది, పరోక్షంగా మరో 80 వేల మంది ఉపాధి పొందేవారు. జిల్లా పరిశ్రమల నుంచి శ్రీలంక, మలేషియా, బ్రిటన్‌, టర్కీ, కొరియా, సౌదీ, చైనా ఇలా 15 దేశాలకు ఎగుమతి జరిగేది. ప్రభుత్వ తీరు వల్ల చిన్న పరిశ్రమలు.. నష్టపోయే ప్రమాదముందని గ్రానైట్ అసోసియేషన్‌ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అధ్వానంగా గ్రానైట్‌ ఇండస్ట్రీ
ఇప్పుడు వివిధ కారణాల వల్ల గ్రానైట్‌ ఇండస్ట్రీ పరిస్థితి అధ్వానంగా తయారైంది. విద్యుత్‌ బిల్లుల భారం, పెరిగిన డీజిల్ రేట్లు, రవాణా చార్జీలు విపరీతంగా పెరగడం లాంటి కారణాల వల్ల.. పరిశ్రమలను నడపలేమని యజమానులు చేతులెత్తేస్తున్నారు. వీటికి తోడు రాష్ట్ర ప్రభుత్వానికి క్యూబిక్ మీటరుకు 1925 రూపాయల సెస్ చెల్లించాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో ఇప్పటికే జిల్లాలోని ఐదు వందల పరిశ్రమల్లో 200 మూతబడ్డాయి. మరో 150 పరిశ్రమలు.. తీవ్ర నష్టాల కారణంగా మూతపడే దశలో ఉన్నాయి. ప్రభుత్వ విధానాల వల్ల చిన్న పరిశ్రమలే మూత పడతాయని.. గ్రానైట్ అసోసియేషన్‌ సభ్యులు మండిపడుతున్నారు.

ఒక్క ఖమ్మం జిల్లాలోనే
జీఎస్టీ అమలు వల్ల.. గ్రానైట్‌ ఇండస్ట్రీలో ఉద్యోగాలూ ఊడే పరిస్థితి తలెత్తింది. ఒక్క ఖమ్మం జిల్లాలోనే.. లక్ష మందికి పైగా ఉపాధిని కోల్పోతారని అంచనా. ఇప్పుడు వీరందరి పరిస్థితీ అయోమయంగా తయారైంది. గ్రానైట్ పరిశ్రమలో 50 శాతం మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి పని చేసేవారు. పరిశ్రమలు మూతపడడంతో.. కార్మికులు దుర్భర జీవితం గడుపుతున్నారు. తమిళనాడు, ఒరిస్సా, బంగ్లాదేశ్‌, పంజాబ్‌, ఛత్తీస్‌గఢ్‌, బీహార్‌, కర్ణాటక, మహారాష్ట్ర, తదితర రాష్ట్రాల నుంచి వచ్చి గ్రానైట్‌ పరిశ్రమల్లో పని చేసిన కూలీలు.. తిరిగి వారి ప్రాంతాలకు వెళ్లిపోయారు. రాజస్థాన్‌, గుజరాత్‌, మహారాష్ట్ర, పంజాబ్‌, కేరళ, పాండిచ్చేరి, గోవా తదితర రాష్ట్రాల నుంచి గ్రానైట్‌ వ్యాపారులు వచ్చి గ్రానైట్‌ రాళ్లను కొనుగోలు చేసేవారు. విదేశాలకు ఎగుమతులు చేసిన వ్యాపారులు కూడా వారి ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఇలా ఒక పక్క కార్మికులు, మరోపక్క వ్యాపారులు ఉపాధిని కోల్పోయారు.

నిర్మాణ రంగం కుప్పకూలిపోయే ప్రమాదం
గ్రానైట్ పరిశ్రమలు కుదేలైపోవడానికి దేశీయంగా, అంతర్జాతీయంగా.. నిర్మాణ రంగం కుప్పకూలిపోవడమే కారణమని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. రెండు వేల మందితో ప్రారంభమైన గ్రానైట్ పరిశ్రమ.. ఇవాళ లక్ష మందికి పైగా ఉపాధి కల్పించేలా అభివృద్ధి చెందింది. వివిధ కారణాల వల్ల... అసలే ఇబ్బందులు పడుతోన్న గ్రానైట్‌ పరిశ్రమను.. జీఎస్టీ చట్టంతో మరింత కుదేలు చేయడం భావ్యం కాదని గ్రానైట్‌ యజమానులు, కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం.. ఇండస్ట్రీపై ఆధారపడ్డవారిని దృష్టిలో ఉంచుకొని, జీఎస్టీ వడ్డన భారాన్ని తగ్గించాలని కోరుతున్నారు. ప్రభుత్వం స్పందించకుంటే, జీఎస్టీ అమల్లోకి వచ్చే జులై ఒకటో తేదీన.. బ్లాక్‌ డే పాటించాలని గ్రానైట్‌ పరిశ్రమ వర్గాలు నిర్ణయించాయి. 

20:34 - May 18, 2017

హైదరాబాద్ : పిడుగు పడుద్ది..కానీ అంతకు ముందే మొబైల్ మోగుద్ది. అవును మరి పిడుగు ఆకాశాన్ని చీల్చుకుని రాకముందే అలర్ట్ బీ కేర్ ఫుల్ అంటోంది. జాగ్రత్తలు తీసుకుంటున్నారని గుర్తుచేస్తుంది. ఇప్పటి వరకు ప్రమాద వశాత్తూ ఎన్నో ప్రాణాలు పిడుగుల పాలిట పడ్డాయి. కానీ ఇక ముందు ఆ పరిస్థితి రాదు. ఏపీలో ప్రవేశ పెట్టిన టెక్నాలజీతో ఇపుడు సీన్ మారనుంది. మేఘాలు పిడుగుకు సై అనకముందే ఇక్కడ సేఫ్ ప్లేస్ లో సర్దుకునే అవకాశం వస్తోంది. ఇదే అంశం పై నేటి వైడాంగిల్ స్టోరి. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

21:26 - May 14, 2017
18:52 - May 14, 2017

అనంతపురం : పిడుగు ఐదుగురు ప్రాణాలు తీసింది. జిల్లాలోని గుమ్మగట్ట మండలం కలుగోడులో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురవడంతో పలువురు గొర్రెల కాపరులు పాతబడిన బంగ్లాలో తలదాచుకున్నారు. అకస్మాత్తుగా బంగ్లాపై పిడుగు పడడంతో ఐదుగురు అక్కడికక్కడనే మృతి చెందారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతి చెందిన కుటుంబీకులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కరీమ్, ఓబన్న, జయన్న, శివన్న, గిరిరెడ్డిలుగా గుర్తించారు.

10:11 - June 24, 2016

హైదరాబాద్ : మద్దెల చెరువు సూరి హత్యకేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్... సరికొత్త దందా బయటపడింది.. యురేనియం పేరుతో మోసానికి పాల్పడి వందల కోట్ల రూపాయలు కుచ్చుటోపీ పెట్టినట్లు వెలుగులోకొచ్చింది...ఇందులో వీఐపీలు.. సినీతారలు కూడా ఉన్నట్లు వస్తున్న వార్తలపై సీఐడీ లోతుగా శోధిస్తుంది...

సూరి మర్డర్ కేసులో నిందితుడు భానుకిరణ్‌ ...
మహానగరంలో మరో ఘరానా మోసం...బురిడీ బాబా శివానంద మోసం వెలుగుచూసిన కొన్ని రోజుల్లోనే మరో మహా మోసాన్ని సీఐడీ పోలీసులు వెలుగులోకి తీసుకువచ్చారు.. .లైఫ్‌స్టైల్‌ భవన యజమాని మధుసూధన్‌రెడ్డిని కోటి రూపాయలు ముంచేసిన శివానంద మరెందరి వద్దో మొత్తం మీద రెండుమూడు కోట్లు కొట్టేస్తే యురేనియం పేరుతో మాత్రం వందల కోట్ల దందా నడిచింది...నమ్మకాన్ని క్యాష్ చేసుకున్న భారీ మోసం వెలుగుచూసింది..దీనిపై సీఐడీ పోలీసులు లోతుగా శోధిస్తున్నారు...ఇందుకు ప్రధాన కారణం కూడా ఎవరో కాదు..

సూరి మర్డర్ కేసులో నిందితుడు భానుకిరణ్‌ ...
పిడుగు పడినప్పుడు తమ వద్ద ఉన్న పాత్రలో చుట్టుప్రక్కల ఉన్న యురేనియం అంతా చేరుతుందని ప్రచారం చేశారు. యురేనియానికి వెలకట్టలేని ధర పలుకుతుందని ప్రచారం చేశారు...ఇలా బురిడీ కొట్టించే 18 మంది ఉన్న ముఠాకు సూత్రధారి భానుకిరణ్‌గా పోలీసులు అనుమానిస్తున్నారు.

బాధితుల్లో వీఐపీలు..సినీతారలు....
యురేనియం పేరుతో నడుస్తున్న దందాకు గంగాధర్‌రెడ్డి, శ్రీనివాస్‌ రెడ్డి అనే ఇద్దరు ముఠాను నిర్వహిస్తున్నారు...ఇక వీరితో పాటు బెంగుళూరులో కోహ్లీ అనే వ్యక్తి ఈ వ్యవహారం నడుపుతున్నాడు...ఒక అక్షయలాంటి పాత్ర ఉందని, పిడుగు పడినప్రదేశంలో ఆ పాత్ర ఉంచితే చుట్టుప్రక్కల ఉన్న యురేనియాన్ని ఆ పాత్ర ఆకర్షిత్తుందని, దానిని అమ్ముకుంటే కోట్లు వస్తాయని చెప్పి వారు ప్రచారం చేస్తున్నారని, వీరి వలలో చాలా మంది వీఐపీలు పడినట్లుగా తెలుస్తోంది....

భాను చెప్పిన అకౌంట్ కు రూ. 150 కోట్లు బదిలీ....
సరిగ్గా 15 రోజుల క్రితం యురేనియం పేరుతో జరిగిన లావాదేవీల్లో మోసపోయిన ఓ ప్రవాసభారతీయుడు డీజీపి దృష్టికి తీసుకురావడంతో సీఐడీ అధికారులకు అప్పగించారు..గంగాధర్ రెడ్డి, శ్రీనివాసరెడ్డిలను అదుపులోకి తీసుకుని వివరాలు సేకరించిన పోలీసులు బెంగళూరులో కోహ్లీని అదుపులోకి తీసుకున్నారు...దాదాపు యురేనియం పేరుతో 300 కోట్ల మేర వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన తరుణంలో కోహ్లి ఉచ్చులో చాలా మంది వీఐపీలు సినీతారలు చిక్కుకున్నారు...భాను చెప్పిన అకౌంట్ కు రూ. 150 కోట్లు బదిలీ చేసినట్లు తెలుస్తోంది...

Don't Miss

Subscribe to RSS - పిడుగు