పితృస్వామ్యం

14:50 - February 12, 2018

విజ్ఞానాభివృద్ధి వల్ల మానవ భౌతికస్థితి గతులు మెరుగవుతాయని ఇప్పటికే ఎన్నో పరిశోధనలు నిరూపించాయి. ఈ నేపథ్యంలో సైన్స్...సాంకేతిక రంగాల్లో మహిళల పాత్ర ఏ మాత్రం తక్కువ కాదని కొంతమంది మహిళా శాస్త్రవేత్తలు నిరూపించారు. మరి వారి గురించి పెద్దగా తెలియదు. సాధారణంగా శాస్త్రవేత్తలంటే అందరికీ న్యూటన్..ఐన్ స్టీన్...ఇతరులు గుర్తుకొస్తారు. మరి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మహిళా శాస్త్రవేత్తల గురించి తెలుసా ? చరిత్ర గతిని మార్చేవేసిన కొంతమంది మహిళా శాస్త్రవేత్తల కథనాలతో మానవి 'స్పూర్తి' ప్రత్యేక కార్యక్రమం. పూర్తి విశ్లేషణకు వీడియో క్లిక్ చేయండి. 

20:40 - March 7, 2017

స్వాతంత్ర ఫలాలు అందుకున్నామని సంబరాలు చేసుకోవడం మొదలు పెట్టి ఏడు దశాబ్దాలు గడుస్తున్నాయి. మహిళల కోసం అనేక చట్టాలు చేశామని ప్రభుత్వాలు పదే పదే వల్లె వేస్తున్నాయి. మహిళా సంక్షేమమే తమ ఎజెండా అని ప్రతి పార్టీ నినదిస్తోంది. కానీ ఆచరణలో మాత్రం ఆ నిబద్ధత శూన్యం అని పదే పదే రుజువు అవుతోంది. మహిళల హక్కులే మానవ హక్కులని తీర్మానాలు నినదిస్తున్నాయ్. మహిళలు, పిల్లల మీద జరుగుతున్న హింసను ప్రతిఘటిద్దామంటోంది ఐక్యరాజ్య సమితి. అన్ని రంగాల్లో సమభాగస్వామ్యం మహిళల హక్కూ అని ఘోషిస్తున్నాయి అంతర్జాతీయ సదస్సులు. పితృస్వామ్య కుటుంబాలు కూల్చండి... ప్రజాస్వామ్య కుటుంబాలు నిర్మించండి అని డిక్లరేషన్లు చేశారు. కానీ వాస్తవంలో ఏం జరుగుతోంది? మహిళల సమానత్వం సిద్ధించేదెప్పుడు? ఇదే అంశంపై నేటి వైడాంగిల్ విశ్లేషణ. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి.

16:11 - March 27, 2016

హైదరాబాద్ : పితృస్వామ్య భావజాలం నరనరాల్లోనూ జీర్ణించుకున్న వారికి ఆడపిల్ల అంటే చిన్న చూపే. ఆమె పుట్టుకకు, ఎదుగుదలకు, అభివృద్దికి అన్నీ అవరోధాలే. ఆమె, అమ్మ కడుపులో ఉండగానే ఈ వివక్షతకు లోనవుతోంది. తాజాగా ఓ భర్త తనకు వారసుడు కావాలంటూ భార్యను హింసిస్తున్నాడు. హింసలకు తాళలేక ఆమె పోరాటం చేస్తోంది. తనకు న్యాయం చేయాలంటూ ధర్నాకు దిగింది. ఈ ఘటన సరూర్ నగర్ లో చోటు చేసుకుంది. వారసుడు కావాలంటూ తన భర్త నిత్యం వేధిస్తున్నాడని, రోకలబండతో బాదుతున్నాడని లావణ్య వాపోయింది. భర్త అత్తామామలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. భర్త ఇంటి ఎదుట లావణ్య ఆందోళనకు దిగింది. ఈమెకు పలు మహిళా సంఘాలు మద్దతు తెలిపాయి. సరూర్ నగర్లో పీఎస్ లో కేసు నమోదు చేసినా న్యాయం జరగలేదని ఆరోపిస్తోంది. మరి ఈమెకు న్యాయం జరుగుతుందా ? లేదా ? అన్నది చూడాలి. 

Don't Miss

Subscribe to RSS - పితృస్వామ్యం