పినరయి

07:00 - June 21, 2017

విశాఖపట్టణం : ఆదివాసీలపై నేటికీ వివక్ష కొనసాగుతూనే ఉందని ఆదివాసీ అధికార్‌ రాష్ట్రీయ మంచ్‌ ఆందోళన వ్యక్తం చేసింది. ఛత్తీస్‌గఢ్‌లో ఆదివాసీలపై పోలీసు, భద్రతా దళాల దాడులకు ఆక్షేపణ తెలిపింది. విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ప్రారంభమైన సంస్థ మూడవ జాతీయ మహాసభలు..ఆదివాసీల హక్కుల సాధన, పరిరక్షణ కోసం ఉద్యమ రూపకల్పన చేసే దిశగా సాగుతున్నాయి. విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్‌ 3వ జాతీయ మహసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ మహాసభల ప్రారంభోత్సవానికి కేరళ ముఖ్యమంత్రి పినరాయివిజయన్‌, సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యురాలు, ఆదివాసీ అధికార్‌ రాష్ట్రీయ మంచ్‌ ఉపాధ్యక్షురాలు బృందా కరత్‌ హాజరయ్యారు. కేరళ సీఎం పినరాయి విజయన్‌కు విశాఖ ఎయిర్‌పోర్టులో ఘనస్వాగతం పలికిన సీపీఎం శ్రేణులు.. భారీ ర్యాలీగా స్టీల్ ప్లాంట్‌కు చేరుకున్నారు.

తోడుగా ఆదివాసి అధికార్‌ మంచ్‌..
మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరైన కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్‌ మాట్లాడుతూ..దేశంలో ఆదివాసిలపై నేటికీ వివక్ష కొనసాగుతోందన్నారు. ఎస్సీ, ఎస్టీలకు సామాజిక, ఆర్థిక న్యాయం అందడం లేదన్నారు. ఆదివాసి హక్కుల కోసం 2010లో జాతీయస్థాయిలో ఆదివాసి అధికార్‌ రాష్ట్రీయ మంచ్‌ పోరాటం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఛత్తీస్‌గఢ్‌లో ఆదివాసిలపై రమణ్‌సింగ్‌ ప్రభుత్వం పోలీసులు, భద్రతా దళాలతో దాడులు చేయిస్తోందని ఆదివాసీ అధికార్‌ రాష్ట్రీయ మంచ్‌ ఉపాధ్యక్షురాలు, సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యురాలు బృందాకరత్‌ ఆరోపించారు. రమణ్‌ సర్కారు, మహిళల పట్ల అరాచకంగా వ్యవహరిస్తోందని, వారికి మద్దతునిచ్చే వారిపై అక్రమ కేసులు బనాయిస్తోందని మండిపడ్డారు. భద్రతా దళాలు ఆదివాసీ మహిళలపై అత్యాచారాలు చేస్తున్నా..రమణ్‌సింగ్‌ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. బాధిత మహిళలకు ఆదివాసి అధికార్‌ మంచ్‌ తోడుగా ఉంటుందన్నారు.

బుధ..గురువారాల్లో..
మంగళవారం ప్రారంభమైన ఆదివాసీ అధికార్‌ రాష్ట్రీయ మంచ్‌ జాతీయ మహాసభలు బుధ, గురువారాల్లో కూడా జరగనున్నాయి. ఈ మహాసభలకు దేశంలోని 17 రాష్ట్రాలకు చెందిన 500 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఆదివాసీ అధికార్‌ రాష్ట్రీయ మంచ్‌ దేశంలోని 16 రాష్ట్రాల్లో గిరిజనుల సమస్యలపై పోరాడుతోంది. ప్రధానంగా గిరిజనుల కోసం తెచ్చిన అటవీ హక్కుల చట్టం, ఆహార భద్రత చట్టం, విద్యా హక్కు చట్టాలు అమలయ్యేలా మహాసభలలో చర్చించనున్నారు. గిరిజన ప్రాంతాల్లో నేటికి తాగడానికి మంచినీళ్లు, విద్యుత్తు, రోడ్ల లాంటి మౌలిక సదుపాయాలు కూడా లేకపోవడంపై చర్చించి, సమస్యల పరిష్కారం దిశగా పోరాటాలు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించారు.

21:30 - June 19, 2017

కర్నూలు : కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై విశాల ఐక్య ఉద్యమాలు నిర్వహించాలని కేరళ సీఎం పినరయి విజయన్‌ పిలుపునిచ్చారు. మోదీ సర్కార్‌ వ్యవసాయరంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టిందన్నారు. రైతులు వలస కూలీలుగా మారుతున్నా పట్టించుకోకుండా... కార్పొరేట్లకు వంతపాడుతున్నారని ఆరోపించారు. కేంద్రం తీసుకొచ్చిన భూసేకరణ చట్టం రైతుల భూములను లాక్కొనేందుకే ఉపయోగపడుతోందని విమర్శించారు. కర్నూలులో ఏపీ వ్యవసాయ కార్మికసంఘం 27వ రాష్ట్ర మహాసభల సందర్భంగా నిర్వహించిన బహిరంగసభలో ఆయన పాల్గొన్నారు. కర్నూలులో ఎర్రదండు కదం తొక్కింది. ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం 27వ రాష్ట్ర మహాసభల సందర్భంగా కర్నూలు ఎరుపెక్కింది. రైతులు, వ్యవసాయ కార్మికులు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కర్నూలులో ప్రధాన రహదారులగుండా సాగిన ర్యాలీ..ఎస్‌టీబీసీ కళాశాల గ్రౌండ్‌కు చేరింది. అక్కడ జరిగిన బహిరంగ సభకు రైతులు, వ్యవసాయ కార్మికులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. బహిరంగ సభలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. వ్యవసాయ రంగాన్ని కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా సంక్షోభంలోకి నెడుతోందంటూ నిప్పులు చెరిగారు. దేశంలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయని, వ్యవసాయ రంగానికి కేంద్ర బడ్జెట్‌లో కేటాయింపులు తగ్గాయన్నారు. మోదీ సర్కార్‌ రైతులను వదిలి కార్పొరేటర్లకు ఎర్రతివాచీ పరుచుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేట్లకు లక్షలకోట్లు సబ్సిడీ ఇస్తోన్న మోదీ... దేశానికి అన్నంపెట్టే అన్నదాతకు మొండిచేయి చూపుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వ రైతు , కార్మిక వ్యతిరేక విధానాలను ప్రజలంతా ఐక్యంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కేంద్ర వినాశకర విధానాలకు చరమగీతం పాడేందుకు అంతా విశాలవేదికపైకి రావాలన్నారు. కుల,మత, ప్రాంతాలకు అతీతంగా ప్రజలంతా వామపక్ష ప్రత్యామ్నాయాన్ని బలపర్చాలన్నారు.

గఫూర్ మండిపాటు..
చంద్రబాబు ప్రభుత్వంపై సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.ఏ. గఫూర్‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వం రైతుల నుంచి భూములను బలవంతంగా లాక్కొంటోందని ఆరోపించారు. రైతులను కొల్లగొట్టి పెట్టుబడిదారులకు చంద్రబాబు వంతపాడుతున్నారన్నారు. సంపన్నుల అభివృద్ధినే రాష్ట్రాభివృద్దిగా చెబుతున్నారని విమర్శించారు. రాయలసీమలో వలసల నివారణకు చంద్రబాబు ఏనాడైనా చర్యలు తీసుకున్నారా అంటూ ఆయన ప్రశ్నించారు. ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం నిర్వహించే ఉద్యమాలకు సంపూర్ణ సహకారం ఉంటుందని తెలంగాణ వ్యయసాయ కార్మికసంఘం నేత బి. వెంకట్‌ అన్నారు. ఇద్దరు చంద్రులు కలిసి రైతులను, వ్యవసాయకార్మికులను దగా చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కర్నూలో ప్రదర్శన సందర్భంగా కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. వ్యవసాయ కార్మిక సంఘం మహాసభలు మంగళవారం ప్రతినిధుల సభ ప్రారంభమవుతుంది. బుధవారం మహాసభలు ముగుస్తాయి. ఈ మహాసభల్లో పలు తీర్మానాలను ఆమోదించనున్నారు. బుధవారం వ్యవసాయ కార్మికసంఘం రాష్ట్రనూతన కమిటీని ప్రతినిధులు ఎన్నుకుంటారు.

21:26 - June 19, 2017

కర్నూలు : మోదీ ప్రభుత్వం గిరిజనుల హక్కులను కాలరాసేలా వ్యవహరిస్తోందని ఆదివాసీ అధికార్‌ రాష్ట్రీయ మంచ్‌ ఉపాధ్యక్షురాలు బృందా కరత్‌ అన్నారు. అడవిపై గిరిజనులకు హక్కులేకుండా చేయాలని చూస్తే సహించేది లేదన్నారు. విశాఖ జిల్లా అరకులో జరిగిన ఆదివాసీ అధికార్‌ రాష్ట్రీయ మంచ్‌ సభలో పాల్గొన్న బృందాకారత్‌.. గిరిజనుల సమస్యలు- చట్టాలపై ప్రసంగించారు. మరోవైపు రేపటి నుంచి విశాఖలో ఆదివాసీ అధికార్‌ రాష్ట్రీయ మంచ్‌ జాతీయ మహాసభలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేరళ సీఎం పినరయి విజయన్‌ హాజరుకానున్నారు. ఆదివాసీ అధికార్‌ రాష్ట్రీయ మంచ్‌ జాతీయ మహాసభల నేపథ్యంలో అరకులో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఇందులో ఆదీవాసీ అధికార్‌ రాష్ట్రీయ మంచ్‌ జాతీయ ఉపాధ్యక్షులు బృందాకరత్‌ పాల్గొన్నారు. దేశ వ్యాప్తంగా గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలు, చట్టాలను ఆమె ప్రస్తావించారు. దేశంలో మోదీ ప్రభుత్వం, రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్‌ గిరిజనుల హక్కులను కాలరాసేలా వ్యవహరిస్తున్నారని బృందా కారత్‌ ఆరోపించారు. అడవిపై గిరిజనులకు హక్కులేకుండా చేయాలని చూస్తే సహించేది లేదని ఆమె హెచ్చరించారు. మంగళవారం నుంచి మూడు రోజుల పాటు విశాఖపట్నంలో ఆదివాసీ అధికార్‌ రాష్ట్రీయ మంచ్‌ జాతీయ మహాసభలు జరగనున్నాయి.

17 రాష్ట్రాల ప్రతినిధులు..
మహాసభలను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ప్రారంభించనున్నారు. దేశంలోని 17 రాష్ట్రాలకు చెందిన 500 మంది ప్రతినిధులు ఈ మహాసభల్లో పాల్గొననున్నారు. ఆదివాసీ అధికార్‌ రాష్ట్రీయ మంచ్‌ దేశంలోని 16 రాష్ట్రాల్లో గిరిజనుల సమస్యలపై పోరాటాలు నిర్వహిస్తోంది. ప్రధానంగా గిరిజనుల కోసం ప్రవేశపెట్టిన అటవీ హక్కుల చట్టం, ఆహార భద్రత చట్టం, విద్యా హక్కు చట్టాలు అమలయ్యేలా మహాసభలలో చర్చించనున్నారు. గిరిజన ప్రాంతాల్లో నేటికి తాగడానికి మంచినీళ్లు, విద్యుత్తు, రోడ్ల లాంటి మౌలిక సదుపాయాలు కూడా లేవని, వాటి సాధన కోసం పోరాటాలు నిర్వహించేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు.

 

18:56 - June 19, 2017

కర్నూలు : పనులు దొరక్క వీధుల్లో అడ్డుకుంటూ..వలసలకు వెళుతూ వ్యవసాయ రైతులు..కూలీలు తీవ్ర అవస్థలు పడుతుంటే అభివృద్ధి గురించి ఏం మాట్లాడుతారని ఏపీ సీపీఎం నేత గఫూర్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ప్రశ్నించారు. ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం 27వ రాష్ట్ర మహాసభలు కర్నూలు జిల్లాలో ప్రారంభమయ్యాయి. ఏస్ టీబీసీ కళాశాల గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన ఆవేశపూరిత ప్రసంగం చేశారు. అభివృద్ధి గురించి ఉపన్యాసం చెబుతారా ? రక్తం ఉడుకుతుందంటూ పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో బతకడం కోసం అక్క..చెల్లెళ్లను వ్యభిచార గృహాలకు అమ్మివేయబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాయలసీమలో ఉద్యోగాలు..లేక..వలసలు పోతుంటే అభివృద్ధి గురించి చెబుతారా అంటూ నిలదీశారు. మరి గఫూర్ ప్రసంగం వినాలంటే వీడియో క్లిక్ చేయండి.

09:21 - March 20, 2017

సీపీఎం నిర్వహించిన మహాజన పాదయాత్ర చరిత్రాత్మక పాదయాత్ర అని, 150 రోజులకు పైబడి సాగిన ఈ యాత్ర చరిత్ర సృష్టించిందని కేరళ సీఎం పినరయి విజయన్ తెలిపారు. పాదయాత్ర ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పాల్గొనేందుకు ఆయన హైదరాబాద్ కు ఆదివారం వచ్చారు. ఈసందర్భంగా టెన్ టివి అసోసియేట్ ఎడిటర్ శ్రీధర్ ఆయనతో ముచ్చటించారు. అన్ని వర్గాల ప్రజలు పాదయాత్ర నినాదాలపై ఆసక్తిని కనబరిచి వారు మద్దతిచ్చారని తెలిపారు. కిలోమీటర్ల కొద్ది పాదయాత్రతో కలిసి సాగారని, ఏది ఏమైనా ఇది ఘనవిజమన్నారు. కేరళ రాష్ట్రంలో పేదలు లబ్దిపొందేలా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. పేదలు చాలా సమస్యల్లో ఉన్నారని, సామాజిక న్యాయం అన్నది తమ దృష్టిలో ప్రధానాంశమన్నారు. అభివృద్ధి సామాజిక న్యాయంపైనే ఆధారపడిందని, ఈ దిశగా తాము నాలుగు మిషన్లను అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వీటి ద్వారా తాము నవ కేరళలను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సీఎం పినరయి స్పష్టం చేస్తున్నారు.

08:02 - March 3, 2017

సీఎం పినరయి విజయన్ పై ఆర్ఎస్ఎస్ నేత చంద్రకాంత్ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. పినరయి తల తెస్తే కోటి రూపాయలు ఇస్తానని బహిరంగంగా వ్యాఖ్యానించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని, వెంటనే అతడిని అరెస్టు చేయాలని డిమాండ్స్ వినిపిస్తున్నాయి. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో వీరయ్య (నవ తెలంగాణ ఎడిటర్), శ్రీనివాస్ యాదవ్ (టి.కాంగ్రెస్) పాల్గొన్నారు. ఆలస్యంగా బీజేపీ నేత రాకేష్ రెడ్డి పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. వారు ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేశారో వీడియో క్లిక్ చేయండి.

 

21:32 - March 2, 2017

మధ్యప్రదేశ్ : మతతత్వ శక్తులకు మతి భ్రమించింది. మధ్యప్రదేశ్‌లో ఓ ఆర్‌ఎస్‌ఎస్‌ నేత ఉగ్రవాదిలా రెచ్చిపోయాడు. ఏకంగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ తలకే వెల కట్టాడు. కేరళ సిఎంను చంపిన వారికి కోటి రూపాయల బహుమానం ఇస్తానని ప్రకటించాడు. ఆర్‌ఎస్‌ఎస్‌ నేత కుందన్‌ వ్యాఖ్యలను సిపిఎం తీవ్రంగా ఖండించింది. మధ్యప్రదేశ్‌ ఉజ్జయినిలో ఓ ఆర్‌ఎస్‌ఎస్‌ నేత ఉగ్రవాదిలా రెచ్చిపోయాడు. ఏకంగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ తలకే వెల కట్టాడు. కేరళ సిఎంను చంపిన వారికి కోటి రూపాయల బహుమానం ఇస్తామని ఓ వేదికపై ఆర్‌ఎస్‌ఎస్‌ నేత కుందన్‌ చంద్రవత్ ప్రకటించాడు. ఎవరైతే ఈ పనిచేస్తారో వారికి తనవద్ద ఉన్న కోటి రూపాయలకు పైగా ఉన్న ఆస్తిని ఇచ్చివేస్తానని హూంకరించాడు. కేరళలో 3 వందల మంది ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తల హత్యలకు విజయనే కారణమని కుందన్‌ చంద్రవత్ ఆరోపించాడు. హిందువుల రక్తంలో పౌరుషం ఉందని శివాజీ తమకు స్పూర్థి అని దీనిపై ప్రతీకారం తీసుకుంటామని కుందన్‌ పేర్కొన్నాడు. గోద్రాలో 50 మంది ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు చనిపోతే హిందూ సమాజం 2 వేల మందిని స్మశానానికి పంపిందని ఆవేశ పూరిత ప్రసంగం చేశాడు. ఈ వేదికపై బిజెపి ఎమ్మెల్యే, ఓ ఎంపి కూడా ఉండడం గమనార్హం.

ఖండించిన సీపీఎం పొలిట్ బ్యూరో..
చంద్రావత్ వ్యాఖ్యలను సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఖండించారు. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆర్‌ఎస్‌ఎస్‌ బెదిరించడం దారుణమని ట్వీట్‌ చేశారు. ఆర్ఎస్ఎస్ నేత చంద్రావత్‌ వ్యాఖ్యలపై కేరళ సీఎం విజయన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ఇప్పటికే ఎంతో మంది తలలను తీసుకుందని పేర్కొన్నారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు హెచ్చరించడాన్ని సిపిఎం పొలిట్‌ బ్యూరో తీవ్రంగా ఖండించింది. గత కొన్ని నెలలుగా కేరళలో ఆర్‌ఎస్‌ఎస్‌ హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నట్లు మరోసారి రుజువైందని సిపిఎం పేర్కొంది. ఆర్‌ఎస్‌ఎస్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్‌ చేసింది. ఆర్‌ఎస్‌ఎస్‌తో పాటు హిందుత్వ శక్తులు దేశాన్ని విభజించేందుకు కుట్ర పన్నుతున్నాయని గతవారం కేరళ సిఎం విజయన్‌ అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ హిట్లర్‌, ముస్సోలిని విధానాలను అనుసరిస్తోందని ఆయన దుయ్యబట్టారు. మహాత్మాగాంధీని చంపిన నాథూరాం గోడ్సే ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందినవాడని గుర్తు చేశారు. ముస్లింలు, క్రైస్తవులు, కమ్యూనిస్టులను శత్రువులుగా భావిస్తోందని విజయన్‌ వ్యాఖ్యానించారు.

19:30 - March 2, 2017

ఢిల్లీ : ఆర్ఎస్ఎస్ నేత చేసిన వ్యాఖ్యలపై సీఎం పినరయి చిరునవ్వుతో స్పందించారు. తనను ఎవరూ ఆపలేరని, విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని పేర్కొన్నారు. సీఎం పినరయి తలకు ఆర్ఎస్ఎస్ నేత చంద్రావత్ వెల కట్టిన సంగతి తెలిసిందే. ఓ కార్యక్రమంలో సీఎం పినరయి తల తెస్తే రూ. కోటి ఇస్తానని బహిరంగంగా ప్రకటించారు. ఈ వ్యాఖ్యలపై జాతీయ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రజాస్వామ్యయుతంగా సీఎంగా ఎన్నికైన వ్యక్తిపై ఆర్ఎస్ఎస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వామపక్షాలు..ఇతర పార్టీలు తీవ్రంగా పరిగణిస్తున్నాయి. ఇటీవలే అధికారంలోకి వచ్చిన అనంతరం పినరయి విజయోత్సవ ర్యాలీపై బాంబు దాడి చేయగా ఒకరు మృతి చెందిన సంగతి తెలిసిందే. పినరయి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఆరుగురు సీపీఎం కార్యకర్తలు మృతి చెందారు. దళితులకు మతతత్వ శక్తులకు మధ్య ఘర్షణలు చెలరేగుతున్నాయి. సంక్షేమ పథకాలు..ఇతర పథకాలు చేస్తుండడంపై బీజేపీ, ఆర్ఎస్ఎస్ జీర్ణించుకోవడం లేదని తెలుస్తోంది.

16:43 - March 2, 2017

కేరళ : రాష్ట్ర సీఎం పినరయి విజయన్ పై ఆర్ఎస్ఎస్ నేత చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏకంగా సీఎంను చంపి తలను తీసుకొస్తే రూ. కోటి ఇస్తానని ఆర్ఎస్ఎస్ నేత డాక్టర్ చంద్రావత్ వ్యాఖ్యానించారు. దీనిపై రాజకీయంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్కడి ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్స్ వినిపిస్తున్నాయి. వివాదాస్పద వ్యాఖ్యలపై టెన్ టివి ఇన్ పుట్ ఎడిటర్ కృష్ణసాయిరాం విశ్లేషణ అందించారు. కేరళ రాష్ట్రంలో ఎల్డీఎఫ్ సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటైంది. పినరయ్ ఆధ్వర్యంలో మే నెలలో బాధ్యతలు స్వీకరించింది. కమ్యూనిల్ ఏజెండాతో మతపరమైన భావనలు రెచ్చగొడుతున్న వారిని విజయవంతం అడ్డుకోవడం..హింసాత్మ ఘటనలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. తమకు అడ్డుగా ఉన్నారని ఆర్ఎస్ఎస్ భావిస్తోంది. జమ్మూ కాశ్మీర్ తరువాత ముస్లిం మైనార్టీలు వైవిధ్యభరిత ప్రాంతంగా కేరళ చెప్పుకోవచ్చు. తమ ఆగడాలు కొనసాగడం లేదని భావించి ఇలాంటి వివాదస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు.

15:32 - March 2, 2017

ఢిల్లీ : మతతత్వ శక్తులకు మతి భ్రమించింది. ఆర్ఎస్ఎస్ నేతలు రెచ్చిపోతున్నారు. ఇష్టం వచ్చిన విధంగా పదజాలం వాడుతూ..దాడులకు తెగబడుతున్నారు. తాజాగా ఓ ఆర్ఎస్ఎస్ నేత నోటికి పని చెప్పాడు. ఏకంగా సీఎం తలకు వెల కట్టాడాడు. ఆయన తలకు రూ. కోటి వెల ప్రకటించారు. ఉజ్జయినిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ నేత డాక్టర్ చంద్రావత్ పాల్గొన్నారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి తల తీసుకొస్తే తన యావదాస్తిని అమ్మేస్తానని, కోటి ఇస్తాననిప్రకటించారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు హత్యకు సీఎం పినరయి విజయన్ బాధ్యుడని ఆరోపిస్తూ ఈ ప్రకటన చేశారు. ఈ ప్రకటన చేసే సమయంలో వేదికపై బీజేపీ ఎమ్మెల్యే, ఓ ఎంపీ కూడా ఉండడం గమనార్హం.

Don't Miss

Subscribe to RSS - పినరయి