పుట్టినరోజు

21:57 - December 21, 2017
16:07 - September 2, 2017

పశ్చిమగోదావరి : జనసేన అధినేత పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో చిరు, పవన్ యూత్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. మత్తు పదార్ధాలు వాడకండి.. వాడనీయకండి అనే నినాదంతో భారీ ర్యాలీ తీశారు. రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. మహిళలకు కుట్టుమిషన్లు.. పేదలకు దుప్పట్లు పంచారు. 

12:45 - June 10, 2017

ఢిల్లీ : టాలీవుడ్‌ హీరో, ఎమ్మెల్యే బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో బాలకృష్ణ అభిమానులు, టీడీపీ నేతలు కేక్‌ కట్‌ చేశారు. అనంతరం అనేక స్వచ్చంద కార్యక్రమాల్లో అభిమానులు పాల్గొన్నారు. 

 

20:07 - April 20, 2017

హైదరాబాద్: గొర్రులు మేకల నడుమ బాబుగారి జయంతి...అంగరంగ వైభవంగా అన్న పుట్టినరోజు, కోతకు రాని పంట కోసిన హరీష్ రావు...ఇట్లమ్మినా మద్దతు ధర కూడా రావు, హిందూపురంలో విపరీతమైన నీళ్ల పంచాయతీ...బాలికాక మీద కాక మీదున్న జనాలు, పక్కపొంటే ప్రాజెక్టు ఉన్నా తాగునీళ్లకు కరువు..నిజామాబాద్ దిక్కు పోతున్నది సర్కార్ పొరువు, అర్థకి పావుసేరు ధరకొచ్చిన మిర్చి పంట..పట్టించుకోని ప్రభుత్వాల మీద రైతన్నల మంట, చెరువు కింద బయటపడ్డ మరొక చెరువు..ఇప్పటికన్నా తీరాలే ఏలూరు కరువు ఇలాంటి అంశాలతో ఈ రోజు మల్లన్న 'మల్లన్న ముచ్చట్లు' కార్యక్రమంలో మన ముందుకు వచ్చాడు. పూర్తి వివరాలు చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

11:57 - February 17, 2017

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్దమ్మతల్లి దీవెనలతో కేసీఆర్‌ నిండు నూరేళ్లు జీవించాలని తలసాని అన్నారు.

17:53 - January 6, 2017
13:46 - November 4, 2016

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌ 70వ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. రాజ్‌ భవన్‌కు చేరుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్‌.. గవర్నర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. నరసింహన్‌కు శాలువా కప్పి కేక్‌ తినిపించారు. కేసీఆర్‌తో పాటు మంత్రులు హరీష్‌ రావు, కేటీఆర్‌ గవర్నర్‌ జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. 

 

21:43 - April 24, 2016

ఢిల్లీ : క్రికెట్ దేవుడు మాస్టర్ సచిన్ టెండుల్కర్ ఈరోజు 43వ పుట్టినరోజు జరుపుకొంటున్నాడు. భారత క్రికెట్ కు 22 దశాబ్దాలపాటు అసాధారణ సేవలు అందించిన సచిన్ ప్రస్తుతం రిటైర్మెంట్ జీవితాన్ని కుటుంబానికే అంకితం చేశాడు. క్రికెటేతర క్రీడలు ఫుట్ బాల్, బ్యాడ్మింటన్, జిమ్నాస్టిక్స్ లాంటి క్రీడలను ప్రోత్సహిస్తూ..రాజ్యసభ్యుడిగా కూడా విధులు నిర్వర్తిస్తున్నాడు. రెండుదశాబ్దాల తన అంతర్జాతీయ క్రికెట్ జీవితంలో సచిన్ డజనకు పైగా ప్రపంచ రికార్డులు నెలకొల్పాడు. క్రికెట్ చరిత్రలోనే గతంలో ఎన్నడూ లేనంతగా 200 టెస్టులు ఆడి ..51 సెంచరీలతో పాటు 15 వేల 921 పరుగులతో అరుదైన రికార్డులు నెలకొల్పాడు. ఇక..వన్డే క్రికెట్లో అత్యధికంగా  463 మ్యాచ్ లు ఆడి 49 సెంచరీలతో పాటు 18 వేల 426 పరుగులు నమోదు చేసి తనకు తానే సాటిగా నిలిచాడు.
వన్డే క్రికెట్లో పదిహేను, ఓవరాల్ గా 62సార్లు మ్యాన్ ఆఫ్ దిమ్యాచ్ అవార్డులు అందుకొన్న ఒకే ఒక్క క్రికెటర్ మాస్టర్ సచిన్ మాత్రమే. అభినవ బ్రాడ్మన్ సచిన్ కు..ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులతో పాటు...10 టీవీ సైతం జన్మదినశుభాకాంక్షలు చెబుతోంది...

 

07:07 - February 17, 2016

హైదరాబాద్ : దశాబ్దాల తెలంగాణ ఉద్యమ స్వరూప స్వభావాలు మార్చిన పోరాట యోథుడాయన. మాటలను తూటాలుగా మార్చి వదలగలరు.. అవే మాటలతో జనాలను మంత్రముగ్ధులను చేయగలరు.. ఆయన ఆశయం బంగారు తెలంగాణ. లక్ష్యం ప్రత్యర్థుల నిర్మూలన. ఏ విషయంపైనైనా అలవోకగా మాట్లాడగలిగే ఆ ధీశాలి ఎవరో ఇప్పటికే మీ మదిలో మెదిలే ఉంటుంది. అవును మీరు ఊహించుకుంటున్న ఆ రాజకీయ పండితుని జన్మదినం ఈ రోజు. ఆ మహా మేధావి బర్త్‌డే సందర్భంగా టెన్‌ టివి అందిస్తున్న ప్రత్యేక కథనం. వాచిట్..

చింతమడకలో 1954 ఫిబ్రవరి 17 ....

కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. కెసిఆర్‌గా అందరికీ తెలిసిన వ్యక్తి. మెదక్ జిల్లా సిద్దిపేట నియోజకవర్గం చింతమడకలో 1954 ఫిబ్రవరి 17న జన్మించారు. వెంకటమ్మ, రాఘవరావు తల్లిదండ్రులు. కేసీఆర్‌కు ఒక అన్న, తొమ్మిది మంది అక్కాచెల్లెళ్లు. కుమారుడు కేటీఆర్ రాష్ట్ర కేబినెట్‌లో మంత్రిగా... కూతురు కవిత నిజామాబాద్ ఎంపీగా పనిచేన్నారు. ఇక మేనల్లుడు హరీష్‌రావు కూడా కేబినెట్‌లో మంత్రిగా ఉన్నారు. చదువుల్లో చురుగ్గా ఉండే కేసీఆర్ ప్రాథమిక విద్యను చింతమడకలో... ఇంటర్‌ను సిద్దిపేటలో పూర్తిచేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో తెలుగు లిటరేచర్‌లో పీజీ చేశారు.

కాంగ్రెస్ నుంచే కేసీఆర్ రాజకీయ ప్రస్థానం...

కేసీఆర్ రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ నుంచే మొదలైంది. మెదక్ జిల్లాలో చురుకైన నాయకుడుగా పనిచేశారు. అప్పట్లోనే... అంటే 1970లోనే సంజయ్ గాంధీ అనుచరుడుగా పేరొందారు. 1983లో టీడీపీలో చేరారు. అదే సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో సిద్దిపేట నుంచి ఓటమి చవిచూసినా.. ఆ తర్వాత జరిగిన ఎన్నో ఎన్నికల్లో విజయబావుటా ఎగరేశారు. 1985 నుంచి ఇప్పటివరకు ఓటమి అనే పదాన్నే వినలేదు. ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్‌గా ఎన్నో పదవులు చేపట్టి అపార అనుభవం సాధించారు. 2000వ సంవత్సరంలో అసెంబ్లీ డిప్యూటి స్పీకర్‌గా కూడా పనిచేశారు. ప్రత్యేక తెలంగాణ సాధన కోసం టీడీపీని వీడి 2001లో తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించారు.

1969 ఉద్యమ స్ఫూర్తితో ....

1969 ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణ కోసం పోరాడారు. నీళ్లు, నిధులు, నియామకాల్లో తెలంగాణ దగా పడుతోందని అభివృద్ధిలో ఆమడ దూరంలో నిలుస్తోందని ఉద్యమాలు జరిపారు. ప్రత్యేక తెలంగాణ నినాదంతో మలిదశ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగసిపడేలా చేశారు. 14 ఏళ్ల తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో అనేక ఆటుపోట్లు.. ఎత్తుపల్లాలు చవిచూశారు. తెలంగాణ వ్యాప్తంగా అనేక సభలు, సమావేశాలు నిర్వహించి రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను ప్రజలకు వివరించగలిగారు.

ఉద్యమాలు చేస్తూనే తెలంగాణ రాష్ట్ర సమితి....

ఉద్యమాలు చేస్తూనే తెలంగాణ రాష్ట్ర సమితిని ఎన్నికల బరిలో దించారు. గెలుపోటములను లెక్కచేయకుండా ఉద్యమ నాయకుడిగా కొనసాగారు. 2004 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేశారు. కాంగ్రెస్‌తో విడిపోయి 2006లో ఆ పార్టీ నేత ఎం.సత్యనారాయణరావు విసిరిన సవాలుకు ఆయనపైనే కరీంనగర్ పార్లమెంట్ ఉపఎన్నికలో పోటీ చేసి అఖండ మెజార్టీ సాధించారు. అదే తెలంగాణలో టీఆర్ఎస్ బలోపేతానికి కారణమైంది. ఆ తర్వాత 2008లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపిలు రాజీనామాలు చేయగా అపుడు జరిగిన ఉపఎన్నికల్లో మాత్రం కేసీఆర్ వ్యూహం బెడిసికొట్టింది. అనుకున్న స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థలు విజయం సాధించలేదు. ఇలా అనేక ఆటుపోట్లు ఎదుర్కొంటూ వచ్చినా ఉద్యమాన్ని మాత్రం వీడలేదు.

కెసిఆర్‌ పలుమార్లు ఎన్నికలకు వెళ్లిన చరిత్ర....

రాజకీయంగా ప్రత్యర్థులతో ఢీకొట్టడమే కాదు.. తనను తాను నిరూపించుకునేందుకు కెసిఆర్‌ పలుమార్లు ఎన్నికలకు వెళ్లిన చరిత్ర ఉంది. జయాపజయాలతో పనిలేకుండా ఉద్యమాన్ని ఎప్పటికప్పుడు వేడెక్కిస్తూ ముందుకు నడిపించేవారు. అనూహ్యంగా కేంద్రంలోని కాంగ్రెస్‌ తెలంగాణను ప్రకటించడంలో ప్రముఖ పాత్ర పోషించారు. అదే హస్తం పార్టీని కోలుకోలేని దెబ్బకొడుతూ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ ఒరవడి కొనసాగిస్తూ ప్రత్యర్థి పార్టీలకు షాకులిస్తూనే ఉన్నారు.

టిఆర్ఎస్‌.. పేరులోనే తెలంగాణ పదాన్ని జోడించి....

టిఆర్ఎస్‌.. పేరులోనే తెలంగాణ పదాన్ని జోడించుకుని తెలంగాణ ఉద్యమానికి ఊపిరులూది రాష్ట్రాన్ని సాధించుకున్న ఏకైక పార్టీ. ఉద్యమ పార్టీగా టిఆర్‌ఎస్‌కు మొదట్లో మంచి పేరే ఉన్నా ఎన్నికల బరిలో అపజయాలు కూడా చవిచూసింది. అయినా అత్యంత తెలివిగా వ్యవహరిస్తూ కెసిఆర్ ప్రజల్లోకి చొచ్చుకుపోయేవారు.

2009లో వచ్చిన సార్వత్రిక ఎన్నికల్లో....

ఉద్యమం కొనసాగిస్తుండగానే 2009లో వచ్చిన సార్వత్రిక ఎన్నికల్లో కెసిఆర్ మహాకూటమితో కలిసి పోటీ చేశారు. అయితే ఆశించిన ఫలితాలు రాలేదు. అపుడే 14 ఎఫ్‌ను తొలగించాలంటూ సిద్దిపేటలో దీక్షకు సిద్ధమయ్యారు. కరీంనగర్ నుంచి సిద్దిపేటకు వెళ్తుండగా మార్గమధ్యంలోనే గులాబీబాస్ కేసీఆర్‌ను పోలీసులు అరెస్ట్ చేసి ఖమ్మంకు తరలించారు. అయితే నిరాహార దీక్షను మాత్రం వీడలేదు. బలవంతాన నిమ్స్‌కు తరలించారు. అప్పటినుంచి తెలంగాణ ఉద్యమం తీవ్రమైంది. ఓయూ రాజుకుంది. విద్యార్థిలోకం కేసీఆర్ పక్షాన చేరింది. కేంద్రంపై ఒత్తిడి మరింత పెరిగింది. ఫలితంగా 2009 డిసెంబరు 9న కేంద్రం తెలంగాణ ప్రకటన చేసింది.

తెలంగాణ ప్రకటన చేసిన కేంద్రం ....

తెలంగాణ ప్రకటన చేసిన కేంద్రం హఠాత్తుగా తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది. దీంతో అన్ని పార్టీలతో కలిపి రాజకీయ జేఏసీని ఏర్పాటుచేసి కెసిఆర్ కేంద్రంపై పోరాటం ప్రారంభించారు. సహాయ నిరాకరణ, మిలియన్ మార్చ్, సాగరహారం... ఇలా అనేక ఉద్యమాలకు పిలుపునిచ్చారు కేసీఆర్. అలా కేంద్రంపై ఒత్తిడి పెంచుతూనే మరోవైపు జాతీయ స్థాయిలో వివిధ పార్టీల మద్దతు కూడగట్టగలిగారు. తెలంగాణ మాండలికం, తెలంగాణ యాసతో సామెతలు, పిట్టకథలతో విపక్షాలపై పదునైన దూషణలు చేయడంలో కెసిఆర్ ముందుండేవారు. చివరకు 2014లో కోట్లాది ప్రజల ఆకాంక్షైన తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. ఎన్నికల బరిలో దిగిన కెసిఆర్ కాంగ్రెస్ అంచనాలను చిత్తు చేస్తూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయ్యారు.

యజ్ఞయాగాదులు, దైవం, వాస్తును ఎక్కువగా .....

యజ్ఞయాగాదులు, దైవం, వాస్తును ఎక్కువగా నమ్ముతారు కేసీఆర్. చండీయాగం మొదలు ఆయుత చండీ యాగం వరకు అనేక యజ్ఞాలు నిర్వహించారు. వాస్తును ఎక్కువగా నమ్మే కేసీఆర్ సిఎం అయ్యాక క్యాంపు కార్యాలయానికి వాస్తు దోషాలు సరిచేయించారు. ఆ తర్వాతే అందులోకి అడుగు పెట్టారు. దేవుళ్లు, వాస్తే కాదు సంఖ్యాశాస్త్రాన్ని కూడా బాగా నమ్ముతారు. ఆయన లక్కీ నెంబరు 6. అదే సంఖ్య వచ్చేలా వాహనం నెంబరు ఉంటుంది. 2014లో సార్వత్రిక ఎన్నికలకు పార్టీ అభ్యర్థుల జాబితా ప్రకటనలోనూ 69 మందితో ఫస్ట్ లిస్ట్‌ ప్రకటించారు.

వ్యవసాయంపై కూడా ప్రత్యేక శ్రద్ధ....

కెసిఆర్‌ రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా వ్యవసాయంపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెడుతుంటారు. ఫాంహౌజ్‌లో ఉన్న సమయంలో విపక్షాలు ఆరోపణలు చేసిన వాటిని పట్టించుకునేవారు కాదు. ఇక ఆధునాతన పద్ధతులతో వ్యవసాయాన్ని చేసేందుకు ఇంట్రెస్ట్‌ చూపుతుంటారు.

14 ఏళ్ల పాటు ఉద్యమం....

మొక్కవోని ధైర్యంతో 14 ఏళ్ల పాటు ఉద్యమం చేయడమే కాదు.. తన చిరకాల స్వప్నం, లక్ష్యం అయిన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు కేసీఆర్. ప్రస్తుతం బంగారు తెలంగాణ సాధించి చూపుతానంటూ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. సాధారణ ఎన్నికల్లో మాదిరే వరంగల్ లోక్‌ సభ ఉపఎన్నిక, గ్రేటర్ హైదరాబాద్‌ ఎన్నికలు, సొంత జిల్లాలోని నారాయణ్ ఖేడ్ ఉపఎన్నికలో పార్టీ తిరుగులేని విజయాన్ని సాధించేలా చేశారు. ఒకవైపు నుంచి ప్రత్యర్థి పార్టీలు విమర్శలు చేస్తున్నా వాటికి తనదైన రీతిలో తిప్పికొడుతూ పాలన కొనసాగిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీల నుంచి నేతలను పార్టీలో చేరేందుకు కృషి చేస్తూ తెలంగాణలో బలమైన పార్టీగా ఎదిగేలా వ్యూహాలు రచిస్తున్నారు. ఎత్తులకు పై ఎత్తుల వేయడంలోనే కాదు అనుకున్నది సాధించడంలోనూ ఈ రాజకీయ దురంధురుడు ఎప్పుడూ ముందుంటారు. ఇలాంటి జనం మెచ్చిన నేత 62వ పడిలో అడుగుపెట్టినత సందర్భంగా టెన్ టివి ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతోంది. 

 

13:37 - December 8, 2015

ధర్మేంద్ర.. రొమాంటిక్‌ హీరోగా, యాక్షన్‌ కింగ్‌గా, హీ మ్యాన్‌గా బాలీవుడ్‌లో చెరగని ముద్ర వేసిన ఆల్‌రౌండర్‌. అగ్రస్థానంలో ఉన్న అమితాబ్‌ బచ్చన్‌కి సైతం గట్టి పోటీ ఇస్తూ దాదాపు మూడు దశబ్దాల పాటు బాలీవుడ్‌లో తిరుగులేని కథానాయకుడిగా నిలిచారు. హావభావాలతో తనదైన నటన, అద్భుతమైన డైలాగ్‌ డెలివరీతో ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్న బాలీవుడ్‌ లెజెండరీ హీరో ధర్మేంద్ర పుట్టిన రోజు నేడు (మంగళవారం). ఈ సందర్భంగా ధర్మేంద్ర గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు చూద్దాం..

- పంజాబ్‌ రాష్ట్రంలోని లుథియానా జిల్లాకు చెందిన నాస్రాలి గ్రామంలో జన్మించిన ధర్మేంద్ర అసలు పేరు ధరమ్‌ సింగ్‌ డియోల్‌.

-ఇంటర్మీడియట్‌ వరకు సొంత ఊరులోనే చదువుకున్నారు. సినిమాలపై ఆసక్తితో ఇండిస్టీకి వచ్చారు. హ్యాండ్‌సమ్‌ మ్యాన్‌గా ఫిల్మ్‌ఫేర్‌ మ్యాగజైన్‌ కవర్‌పేజీకి ఫోజులిచ్చి పలు అవార్డులందుకున్నారు.

-1960లో తొలిసారి 'దిల్‌ భీó తేరా హమ్‌ భీó తేరా' చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు.

కెరీర్‌ మొదట్లో రొమాంటిక్‌ పాత్రలకు కేరాఫ్‌గా నిలిచారు. 1960 నుంచి 67 వరకు 'సూరత్‌ ఔర్‌ సీరత్‌', 'బందిని', 'దిల్‌ నే ఫిర్‌ యాద్‌ కియా', 'దుల్హన్‌ ఏక్‌ రాత్‌ కి', 'అన్‌పధ్‌', 'పూజా కే ఫూల్‌', 'బహ్రెన్‌ ఫిర్‌ భీ ఆయేంగీ', 'ఆయీ మిలన్‌ కి బేలా', 'మై భీ లడకీ హూ', 'కాజల్‌', 'ఫూల్‌ ఔర్‌ పత్తర్‌' వంటి చిత్రాల్లో నటించి బాలీవుడ్‌లో రొమాంటిక్‌ హీరోగా పేరు తెచ్చుకున్నారు.

-1975లో విడుదలైన సంచలన 'షోలే' చిత్రంతో బాలీవుడ్‌లో తిరుగులేని నటుడిగా ఎదిగారు. ఈ చిత్రంతోనే ఆయన బాలీవుడ్‌ లో యాక్షన్‌ హీరోగా పేరు తెచ్చుకున్నారు. కెరీర్‌లో సక్సెస్‌ఫుల్‌ చిత్రాలు: 'ఆంఖే', 'మేరా గాన్‌ మేరా దేష్‌', 'జుగ్ను', 'కహాని కిస్మత్‌ కి', 'యాదోమ్‌ కి బరాత్‌', 'షోలే', 'చుప్కే చుప్కే', 'నయా జమానా', 'రాజా జాని', 'సీత ఔర్‌ గీత', 'దోస్త్‌', 'ఆగ్‌ హి ఆగ్‌', 'హుకుమత్‌', 'గులామి', 'యతీమ్‌', 'బట్వారా', 'హత్యార్‌', 'క్షత్రియ', 'జానీ గద్దర్‌', 'అప్నే', 'లైఫ్‌ ఇన్‌ మెట్రో' వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించి ఆల్‌రౌండర్‌గా నిలిచారు.

-హీరోయిన్లలో అత్యధికంగా హేమామాలినితో కలిసి 27 చిత్రాల్లో నటించారు. అప్పట్లో వీరికి మోస్ట్‌ సక్సెస్‌ఫుల్‌ పెయిర్‌ ఇన్‌ బాలీవుడ్‌ అనే ముద్ర పడింది. ఆ తర్వాత మీనా కుమారితో ఎక్కువ చిత్రాల్లో నటించారు.

-బిమల్‌ రాయ్ , మోహన్‌ కుమార్‌ దర్శకత్వంలో డ్రామా చిత్రాలు, యష్‌చోప్రా, రఘునాథ్‌ జలానీ దర్శకత్వంలో ఎక్కువగా రొమాంటిక్‌ చిత్రాలు, రాజ్‌ కోస్లా, రమేష్‌ సిిప్పి, అర్జున్‌ హింగోరని, అనిల్‌ శర్మ, రాజ్‌కుమార్‌ సంతోష్‌ వంటి దర్శకులతో ఎక్కువగా యాక్షన్‌ చిత్రాలు చేశారు. అలాగే హృషికేష్‌ ముఖర్జీ, బసు చటర్జీ, రాజ్‌కుమార్‌ కొహ్లీ దర్శకత్వంలో కామెడీ చిత్రాలు చేశారు. ఇలా అన్ని రకాలు చిత్రాల్లోనూ నటించి ఆకట్టుకున్నారు.

1975లోనే నిర్మాతగా మారి 'ప్రతిగ్యా', 'ఘాయల్‌', 'బర్సాత్‌', 'ఇండియన్‌', '23 మార్చ్‌ 1931: షహీద్‌', 'సొచ నా తా', 'అప్నే', 'యమ్లా పాగ్లా దీవానా 2', 'ఘాయల్‌ వన్స్‌ ఎగైన్‌' వంటి చిత్రాలను నిర్మించారు.

-హీరోగా హవా సాగిస్తున్న సమయంలోనే ప్రపంచంలోనే అత్యంత అందమైన ఏడుగురు హీరోల్లో ధర్మేంద్ర ఒకరిగా నిలిచారు.

- ధర్మేంద్రకు ఇద్దరు భార్యలు ప్రకాష్‌ కౌర్‌, హేమా మాలిని ఉన్నారు. అలాగే కుమారులు సన్నీ డియోల్‌, బాబీ డియోల్‌, కుమార్తెలు విజేత డియోల్‌, అజీత డియోల్‌, ఇషా డియోల్‌, అహానా డియోల్‌ ఉన్నారు.

-హేమామాలినితోపాటు సన్నీడియోల్‌, బాబీ డియోల్‌, ఇషా డియోల్‌, అహానా డియోల్‌ తదితరులంతా బాలీవుడ్‌లో తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకోవడం విశేషం.

నచ్చిన నటి: హేమా మాలిని, ఇష్టమైన నటులు: దాదా సాహెబ్‌ ఫాల్కే, సురైయా, ఫేవరేట్‌ గేమ్‌: క్రికెట్‌, పంజాబీ ఫుడ్‌ అంటే ఇష్టం. ఖాళీ సమయంలో కవిత్వాలు రాస్తుంటారు.

ఓ వైపు నటుడిగా రాణిస్తూనే మరోవైపు రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్నారు. 2004 నుంచి 2009 వరకు బిజెపి పార్టీ తరఫున లోక్‌ సభ సభ్యుడిగా పనిచేశారు.

55ఏళ్ళ సినీ కెరీర్‌లో బాలీవుడ్‌, పంజాబీలో కలిపి దాదాపు 250కిపైగా చిత్రాల్లో నటించి మెప్పించిన ధర్మేంద్రను భారతీయ ప్రభుత్వం 2012లో పద్మ భూషణ్‌ అవార్డుతో సముచితంగా గౌరవించింది. అలాగే నిర్మాతగా తెరకెక్కించిన 'ఘాయల్‌' చిత్రానికి జాతీయ అవార్డునందు కున్నారు. దీంతోపాటు ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండిస్టీ (ఫిక్కీ) ద్వారా 'లివింగ్‌ లెజెండ్‌'తోపాటు 'లైఫ్‌ టైం అఛీవ్‌మెంట్‌ అవార్డు', దాదా సాహెబ్‌ ఫాల్కే రత్నా అవార్డులను పొందారు. నేటితో 80 ఏండ్లు పూర్తి చేసుకుంటున్న ధర్మేంద్ర ఇప్పటికీ పలు చిత్రాల్లో శక్తివంతమైన పాత్రల్లో నటిస్తుండటం విశేషం.

Pages

Don't Miss

Subscribe to RSS - పుట్టినరోజు