పుదుచ్చేరి

15:56 - December 6, 2018

పుదుచ్చేరి : మన ఇంటిలోకి పాము వచ్చిందంటే కొట్టి చంపేస్తాం. అటవీశాఖ అధికారులకు ఫోన్ చేస్తాం. అంతే తప్ప ఏకంగా ముఖ్యమంత్రిగారికి ఫోన్ చేసి రక్షించండి అని అడగం కదా? ఏం ఎందుకు సీఎంను అడగకూడదు అనుకున్నాడో పాము బాధితుడు. పాము నుండి రక్షించండి సీఎంగారూ అంటు ఏకంగా ఫోన్ కొట్టాడు. 
పుదుచ్చేరి రాష్ట్రం, అరియాంకుప్పవలో రాజా అనే వ్యాపారి ఇంట్లోకి ఓ త్రాచుపాము వచ్చింది. భయపడిన రాజా ఫారెస్ట్ అధికారులకు ఫోన్ చేశాడు. స్పందించకపోవటంతో టెలిఫోన్ డైరెక్టరీ తీసుకుని ఏకంగా పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామికి ఫోన్ కొట్టాడు. ‘సార్.. మా ఇంట్లో పాము దూరింది. అధికారులకు ఫోన్ చేస్తే ఎవ్వరూ ఎత్తడం లేదు. దయచేసి సాయం చేయండి’ అని విజ్ఞప్తి చేశాడు. అర్ధరాత్రి ఫోన్ వచ్చినా విసుక్కోకుండా సీఎం నారాయణ స్వామి ఆయన అడ్రస్ తెలుసుకోవటమే కాకుండా రాజాకు ధైర్యం చెప్పారు. 
అంతేకాదు వ్యాపారి రాజా ఇంటికి వెంటనే వెళ్లాల్సిందిగా అధికారులను ఆదేశించి రాజా అడ్రస్ ను అటవీశాఖా అధికారులను తెలిపారు సీఎం నారాయణ స్వామి. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో డిసెంబర్ 5వ తేదీన రాత్రి జరిగింది. సీఎంగారి ఆదేశాలతో రాజా ఇంటికి వెళ్లిన వారు పామును పట్టుకోవడంతో రాజా కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. సీఎం స్పందించిన తీరుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. 
 

08:20 - October 27, 2018

చండీగఢ్ : సీబీఐలో నెలకొన్న ఇద్దరు డైరెక్టర్ల  ఆదిపత్యం పోరుతో వీధిన పడిన అధికారుల అవినీతి భాగోతంతో దేశం యావత్తు ఉలిక్కి పడింది. దీంతో ఆ ఇద్దరు డైరెక్టర్ల రాకేశ్ ఆస్థానా, అలోక్ వర్మలను విధులనుండి తాత్కాలికంగా కేంద్ర తొలగించింది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ అలోక్ వర్మను విధుల నుండి తొలగించటంపై కాంగ్రెస్ దేశవ్యాప్తంగా సీబీఐ కార్యాలయాల ముట్టడికి పిలుపునిచ్చింది. 

Obsession of CBI offices across the countryపంజాబ్, హర్యానాలకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు అక్కడికి చేరుకుని నినాదాలతో హోరెత్తించారు. దీంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. కార్యాలయం వైపునకు దూసుకువస్తున్న కార్యకర్తల్ని పోలీసులు అడ్డుకోవడంతో ఘర్షణ తలెత్తింది. చండీగఢ్‌లోని సీబీఐ కార్యాలయం ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. వాటర్ కేనన్‌లతో నిరసనకారుల్ని పోలీసులు చెదరగొట్టారు. ఈ సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి పవన్‌కుమార్ బన్సల్ మాట్లాడుతూ.. సీబీఐని కేంద్రం పంజరంలో బంధించిందంటూ విమర్శలు గుప్పించారు. పాట్నాలో సేవ్ సీబీఐ.. సేవ్ డెమోక్రసీ అని రాసి ఉన్న ప్లకార్డులు పట్టుకుని సీబీఐ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ఆందోళనకారులు యత్నించారు. 

Image result for cbi office alok vermaభువనేశ్వర్‌లో నల్లరంగు టీ షర్టులు ధరించిన యువకులు సీబీఐ కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో భద్రతాసిబ్బంది వారిని అడ్డుకుని చెదరగొట్టారు. గుజరాత్ రాజధాని గాంధీనగర్, ముంబై, బెంగళూరు, భువనేశ్వర్, హైదరాబాద్, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, జమ్మూ, రాంచీ, విజయవాడ, గౌహతి, ధన్‌బాద్‌లలో ఆందోళనలు చేపట్టారు. సీపీఐ, లోక్‌తాంత్రిక్ జనతాదళ్, తృణమూల్ కాంగ్రెస్, టీడీపీ ఆయా రాష్ర్టాల్లో కాంగ్రెస్‌తోపాటు నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నాయి. ఈ నిరసన కార్యక్రమాలలో ఆయా రాష్ర్టాల్లో కాంగ్రెస్‌కు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు నిరసన ప్రదర్శనల్లో పాల్గొనట విశేషం. 

13:40 - May 20, 2018

విజయవాడ : ఏపీలో జలరవాణా పనులు ముందుకు సాగడం లేదు. సాగరమాల ప్రాజెక్టు కింద కాకినాడ నుంచి పుదుచ్చేరి వరకు అంతర్గత జలరవాణా మార్గం ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంకల్పించాయి. కానీ.. ఆంధ్రప్రదేశ్‌లో ఈ ప్రాజెక్టు పురోగతి ప్రశ్నార్థకంగా మారింది.

నత్తనడకను తలపిస్తున్న జలరవాణా ప్రాజెక్టు..
జలరవాణా అందుబాటులోకి వస్తే.. రవాణా సౌకర్యాలు మెరుగవడంతోపాటు.. రవాణా వ్యయం కూడా తగ్గుతుందంటూ కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ప్రచారం చేశాయి. కానీ జలరవాణా ప్రాజెక్టు పనులు ఒక్క అడుగు కూడా ముందుకు సాగడంలేదు. ఏపీలో జలరవాణా పనుల వేగవంతానికి నాలుగేళ్ల క్రితం విజయవాడలో ఇన్ ల్యాండ్ వాటర్ వేస్ మార్గాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కృష్ణానదిలో జలరవాణా కోసం తొలిదశలో నూటా యాభై కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది.. ఈ నిధులతో నావిగేషన్ ఛానెల్, కార్గో, ప్యాసింజర్ టెర్మినల్స్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంది. కాగా.. ఈ పనుల్లో పురోగతి మాత్రం నత్తనడకను తలపిస్తోంది..

కేంద్ర నిధులతో 82 కి.మీ. ఛానల్స్ ఏర్పాటు చేయాలి..
కేంద్రం మంజూరు చేసిన నిధులతో కృష్ణానదిలో సుమారు ఎనభై రెండు కిలోమీటర్ల మేర జలరవాణాకు ఛానల్స్ ఏర్పాటు చేయాలి. హరిచంద్రపురం నుంచి ముక్త్యాల వరకు నావిగేషన్ ఛానెల్ ఏర్పాటు చేయాలి. ఈ పనుల్ని కోస్టల్ కన్సాలిడేటెడ్, స్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు, ఇంటర్నేషనల్ మెరైన్ సర్వీసెస్ లిమిటెడ్‌కు అప్పగించారు. కానీ.. ఇప్పటి వరకూ చానెల్స్ నిర్మాణ పనులే పూర్తి కాలేదు. ఇవికాకుండా నలభై మూడు కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో ముక్త్యాల, ఇబ్రహీంపట్నం, హరిశ్చంద్రపురంలో కార్గో టెర్మినల్స్ ను, విజయవాడలోని దుర్గాఘాట్, భవానీద్వీపం, వేదాద్రి, గుంటూరు జిల్లా అమరావతిలో పాసింజర్ టెర్మినల్స్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంది.

కోటి రూపాయలతో రాష్ర్ట ప్రభుత్వం సర్వే..
రెండో దశలో కాకినాడ నుంచి విజయవాడ వరకూ కాకినాడ, ఏలూరు కాల్వల జలరవాణా పనులు చేపట్టాలని నిర్ణయించారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయలు వెచ్చించి సర్వే కూడా చేయించింది. పదిహేడు వందలా ముప్పై తొమ్మిది ఎకరాల భూమిని సేకరించి... రెండు వేల మూడు వందల పందొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనాలు సిద్ధం చేశారు. ఈ నిధులను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. కాగా ఇప్పటికే విడుదలైన నూటా యాభై కోట్ల రూపాయల నిధులను ఖర్చు చేసిన లెక్కలతోపాటు రెండో దశలో చేపట్టబోయే పనులపై సమగ్ర ప్రణాళికా నివేదికను ఇవ్వాలని కేంద్రం ఆదేశించింది. వీటిలో కేంద్ర ప్రభుత్వ వాటాతోపాటు... రాష్ట్ర ప్రభుత్వ వాటా వివరాలను సమగ్రంగా అందించాలని సూచించింది. జలరవాణా ప్రాజెక్టుకు అయ్యే ఖర్చులో.. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా భరించే స్థితిలో లేకపోవడంతో ఈ ప్రాజెక్టు పరిస్థితి అయోమయంగా మారిందన్న వాదన వినిపిస్తోంది.

17:42 - July 27, 2017

నెల్లూరు : జిల్లాలోని సంగం నుండి తమిళనాడుకు బయలుదేరిన యాత్రికుల బస్సు అదుపు తప్పి బోల్తా కొట్టింది. బస్సులో 45 మంది ఉన్నారు. పుదుచ్చేరి వద్ద జరిగిన ఈ ఘటనలో 30 మంది ప్రయాణీకులకు గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించారు. గాయాలైన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. నెల్లూరు జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి క్షతగాత్రులను వారి వారి స్వగ్రామాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. తమిళనాడులోని ఓ దర్గాను దర్శించుకొనేందుకు వీరంతా వెళుతున్నట్లు తెలుస్తోంది.

 

17:36 - July 1, 2016

రజనీకాంత్ సినిమా వస్తోందంటే అభిమానుల సంతోషానికి హద్దు ఉండదు. ఆయన సినిమా చూడటానికి ఎగబడుతుంటారు. తాజాగా ఆయన నటించిన 'కబాలి' పై ఎన్నో ఆశలు ఉన్నాయి. ఈ చిత్రం ఆయనకు ఉన్న ఈ క్రేజ్ ని వాడుకోవడానికి పలు ప్రయత్నాలు జరుగుతున్నాయి. 'కబాలి' మూవీ ప్రమోషన్ ను.. ఎయిర్ ఏషియా విమానయాన సంస్థ తమదైన స్టైల్లో చేస్తోంది. సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ పెయింటింగ్‌తో తమ విమానాలను రిడిజైన్ చేసింది. ఇదిలా ఉంటే పుదుచ్చేరి ప్రభుత్వం ఓ మంచి పనికి వాడుకునే ప్లాన్ చేసింది. 'సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కబాలి టికెట్స్ ఉచితంగా పొందాలంటే మీ ఇంట్లో టాయిలెట్స్ నిర్మించుకోండి' అని ప్రచారం చేస్తోంది.
772నివాసాలలో 447 ఇండ్లకు మరుగుదొడ్లు లేవని గుర్తించిందట. వారిచే టాయిలెట్ లు నిర్మించ చేయాలని భావించి ఈ ప్లాన్ చేసిందంట. మరి ఎంత మంది టాయిలెట్ లు నిర్మించుకుని టికెట్లు ఫ్రీగా పొందుతారో వేచి చూడాలి.

10:22 - July 1, 2016

పాండిచ్చేరి : పదవుల్లో కూర్చున్నాక లీడర్లకు ...ప్రొటోకాల్‌ సమస్య వచ్చిపడుతుంది. అప్పటిదాకా  ప్రజలతో ఉన్న ప్రత్యక్షసంబంధం దూరంఅవుతుంది. జనంతో సరదా కబుర్లకు బ్రేక్‌పడుతుంది.  కాని.. ఆమె రూటే సెపరేట్‌...అధికారిగా ఉన్నా... రాజకీయాల్లో ఉన్నా.. చివరికి రాజ్యాంగపదవుల్లో ఉన్నా... ఒకటే తీరు. ప్రజలతో కలిసిపోవడానికి హోదాలు అడ్డంకావని నిరూపిస్తున్నారు పుదుచ్చేరి గవర్నర్‌. 
పుదుచ్చేరీ గవర్నర్‌గా జోష్‌లో కిరణ్‌బేడీ
కిరణ్‌బేడీ... ఇపుడు పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌.  కేజ్రీవాల్‌ పార్టీకి గుడ్‌బైచెప్పిన తర్వాత.. బీజేపీలో చేరిన ఈ మాజీ ఐపీఎస్‌ అధికారిణి.. ఇపుడు పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా వచ్చారు. అయితే.. అందరి గవర్నర్లలాగా సెక్యూరిటీ, ప్రొటోకాల్‌ సమస్యలు  ఏవీ  ఈమెకు లేవు.. ప్రజాఉద్యమాల్లో ఉన్నా... రాజకీయల్లో ఉన్నా... ఇపుడు రాజ్యాంగ పదవుల్లో ఉన్నా.. ప్రజలతో ప్రత్యక్షసంబంధాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. 
ప్రభుత్వ ఉద్యోగులకు ఫ్రీగా కబాలి చూపిస్తామన్న కిరణ్‌బేడీ 
తాజాగా పుదుచ్చేరీకి స్వచ్ఛభారత్‌  ప్రచారకర్తగా ఉండాలని సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ను ఆహ్వానిస్తూ టీట్టర్లో మెసేజ్‌ పెట్టారు కిరణ్‌బేడీ. ఇది ఇపుడు తమిళనాడు, పుదచ్చేరిల్లో హాట్‌టాపిక్‌గ్గా మారింది. ఇదే సమయంలో పాండిచేరి కలెక్టర్‌ మరో అడుగు ముందుకేశారు.  కబాలి చిత్రం  ప్రివ్యూటిక్కెట్లను ఫ్రీగా  ఇస్తామని ప్రభుత్వ ఉద్యోగులకు ఆఫర్ ఇచ్చారు. దీనిపై స్పిందించిన లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌బేడీ ... కబాలి చిత్రం చూసిన తర్వాత ఉత్సాహంగా పనిచేస్తారా.. అని ఉద్యోగులను అడిగి మరింత ఉత్సాహపరిచారు. పుదుచ్చేరిని ప్రధాని మోడీ ఆశించినట్టుగా అభివృద్ధి పథంలో నడిపిస్తానంటూ.. పదవిచేపట్టిన మొదట్లో చెప్పుకున్న కిరణబేడీ... అదే జోష్‌ను కొనసాగిస్తున్నారు. 
 

19:58 - June 6, 2016

పుదుచ్చేరి : ఎఐసిసి ప్రధాన కార్యదర్శి వి.నారాయణస్వామి పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. గాంధీ థిడల్‌లో జరిగిన కార్యక్రమంలో ఐదుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు నమశ్శివాయమ్, మల్లాది కృష్ణారావు, షా జహాన్, కందసామి, కమలాకన్నన్ మంత్రులుగా ప్రమాణం చేశారు. లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ కిరణ్‌బేడి వారితో ప్రమాణస్వీకారం చేయించారు. నలుగురు మంత్రులు తమిళంలో ప్రమాణం చేయగా మల్లాది కృష్ణారావు తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ఎఐసిసి ప్రధాన కార్యదర్శులు ముకుల్‌ వాస్నిక్, చిన్నారెడ్డి, డిఎంకె తరపున స్టాలిన్‌ తదితరులు హాజరయ్యారు. కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో మొత్తం 30 అసెంబ్లీ స్థానాలున్నాయి. తాజాగా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ 15 స్థానాల్లో గెలుపొందింది. ఇద్దరు డిఎంకె ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు మద్దతిస్తున్నారు. 

19:55 - June 6, 2016

పుదుచ్చేరి : కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ పాలనలో తన మార్క్ చూపుతున్నారు. వీఐపీల కార్లకు, వారి ఎస్కార్ట్, పైలట్ వాహనాలకు సైరన్లు వాడకంపై నిషేధం విధించారు. వీఐపీల వాహనాలకు ఎలాంటి మినహాయింపు ఇవ్వరాదంటూ ట్రాఫిక్ పోలీసులకు కిరణ్ బేడీ ఆదేశాలు జారీ చేశారు. వీఐపీల కోసం ట్రాఫిక్ను ఆపరాదని, ప్రజలకు అసౌకర్యం కలిగించరాదని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాల్సిందేనని మాజీ ఐపిఎస్‌ ఆదేశించారు. అయితే సైరన్లు వాడకం విషయంలో అంబులెన్స్లు, ఫైర్ సర్వీసులు వంటి అత్యవసర సర్వీసులకు మినహాయింపునిచ్చారు. రౌడీయిజం చేస్తే తాట తీస్తానంటూ  కిరణ్‌ బేటి ఇటీవల వార్నింగ్ ఇచ్చారు. 

 

12:01 - June 6, 2016

పుదుచ్చేరి : ముఖ్యమంత్రిగా వి.నారాయణస్వామి ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యహ్నం 12.10 గంటలకు బీచ్‌ రోడ్‌లో జరిగే కార్యక్రమంలో పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌ బేడీ ప్రమాణం చేయిస్తారు. నారాయణస్వామితోపాటు ఐదుగురు మంత్రులు ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది. మాజీ ముఖ్యమంత్రి నమశివాయం, కండస్వామి, షాజహాన్‌, రామకృష్ణన్‌, యానం ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావులకు చాన్స్‌ లభిస్తుందని భావిస్తున్నారు. పుదుచ్చేరి అసెంబ్లీకి గత నెల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌, డీఎంకే కూటమి విజయం సాధించింది. డీఎంకే అధినేత కరుణానిధి ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది. 

13:42 - June 2, 2016

పుదుచ్చేరి : 'రౌడీయిజం చేస్తే తాట తీస్తా.. అవినీతి అంతు చూస్తా.. అశాంతికి చోటివ్వను .. రాజకీయ జోక్యం అస్సలే ఒప్పుకోను... అన్నింటికి వన్‌ జీరో త్రీ వన్‌ ఒక్కటే పరిష్కారం'. ఇవి పుదుచ్చేరి కొత్త లెఫ్ట్ నెంట్ గవర్నర్ కిరణ్ బేడీ హెచ్చరికలు. పదవి చేపట్టిన ఒక్కరోజులోనే కిరణ్ బేడీ తనదైన స్టైల్‌లో హల్ చల్ చేశారు. 
పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ గా కిరణ్‌బేడి
పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌బేడీ.. పదవిని చేపట్టిన తొలిరోజే.. హడలెత్తించారు. అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. సీనియర్ అధికారి అయినా.. రాజకీయ నేతలైనా.. ఆఖరికి మంత్రులైనా సరే.. అవినీతికి, అరాచకాలకూ పాల్పడితే.. తాటతీస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు.  అంతటితో ఆగకుండా.. క్రైం కంట్రోల్ కోసం (వన్‌ జీరో త్రీ వన్‌) 1031 అనే టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు. ఎవరికి ఎక్కడ తప్పు కనిపించినా.. ఎక్కడ అన్యాయం జరిగినా.. ఒక్క కాల్ చేయండి దుమ్ముదులుపుతానని వార్నింగ్‌ ఇచ్చారు.. కిరణ్ బేడి.
ఎర్రలైట్ ఒకే ఒక్క వాహనంపై ఉండాలి
ఎర్రలైట్  ఒకే ఒక్క వాహనంపై ఉండాలని... రాజకీయ నేతలు ఎవ్వరు ఎర్రలైట్ ఉపయోగించవద్దని...  ఇక మీదట ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని.. ట్రాఫిక్ రూల్స్‌లో ఎవరికీ ప్రత్యేక హక్కులు ఉండవంటూ తేల్చి చెప్పారు కిరణ్‌బేడి. ప్రమాణస్వీకారానంతరం... ఆమె పుదుచ్చేరి ప్రజలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా.. తన శైలి ఎలా ఉండబోతోందో విస్పష్టంగానే వెల్లడించారు. ప్రజా సమస్యలపై రోజూ ప్రజలతో సమావేశమవుతాననీ చెప్పారామె. ఫుట్ పాత్ లపై దుకాణాలను వారంలోగా తొలగించాలని హుకుం జారీ చేశారు.  ఆదేశాలను బేఖాతరు చేస్తే.. తక్షణ చర్యలు .. జరిమానాలు తప్పవని హెచ్చరించారు. కిరణ్‌బేడీ ప్రసంగం ప్రజల్లో ఉత్సాహాన్ని నింపితే.. అక్కడి పాలకులను హడలెత్తించాయి. స్థానిక కాంగ్రెస్‌ ఏలికలను ఇప్పుడు కిరణ్‌బేడి ఫీవర్‌ వేధిస్తోంది. బీజేపీకి చెందిన కిరణ్‌బేడికి.. పుదుచ్చేరిలో కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధాలు ఎలా ఉండబోతున్నాయోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. 

Pages

Don't Miss

Subscribe to RSS - పుదుచ్చేరి