పూరి జగన్నాథ్

18:58 - May 11, 2018
14:42 - September 3, 2017

టాలీవుడ్ లో అగ్ర కథానాయకుల సినిమాలు రిలీజ్ అవుతుంటే వారి అభిమాను సందడి అంతా ఇంత ఉండదు. థియేటర్ లను అందంగా ముస్తాబు చేస్తారు..ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. కటౌట్లకు పాలాభిషేకాలు..పూలదండలు వేస్తుంటారు. 'బాలకృష్ణ' నటించిన 'పైసా వసూల్' సినిమా ఇటీవలే విడుదలైంది.

విడుదలైన రోజున థియేటర్ల వద్ద ఫ్యాన్స్ హడావుడి విపరీతంగా ఉంది. మంజు థియేటర్ వద్ద 'పైసా వసూల్' పోస్టర్ ని రూ. 500, రూ.2000 నోట్లతో ముస్తాబు చేశారు. ఈ విషయాన్ని ఓ అభిమాని ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. దీనిపై ఛార్మీ స్పందించారు. ఆ పోస్టర్‌ను రీట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. 

08:52 - August 17, 2017

ప్రముఖ నటుడు 'నందమూరి బాలకృష్ణ' నేడు ఖమ్మంకు రానున్నారు. ఆయన నటించిన తాజా చిత్రం 'పైసా వసూల్' చిత్ర ఆడియో వేడుక జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం సాయంత్రం హీరో బాలకృష్ణతో పాటు నటి శ్రియ, దర్శకుడు పూరి జగన్నాథ్, నిర్మాత వెనిగండ్ల ఆనంద్ ప్రసాద్ లు హాజరు కానున్నారు. సర్ధార్ పటేల్ స్టేడియంలో ఈ ఆడియో వేడుక అట్టహాసంగా జరుగనుంది.

బాలకృష్ణ వందో చిత్రం 'గౌతమి పుత్ర శాతకర్ణి' ఘన విజయం అనంతరం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'పైసా వసూల్' చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమాకు సంబంధించిన పోస్టర్స్..టీజర్స్ అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సినిమా ప్రారంభోత్సవం రోజునే విడుదల తేదీ ప్రకటిస్తూ కొత్త నాందికి తెరతీశారు. కానీ ప్రకటించిన తేదీ కంటే నెల ముందుగానే సినిమా విడుదల చేస్తుండడం గమనార్హం. సెప్టెంబ‌ర్ 1న రిలీజ్ డేట్ గా ప్ర‌కటించారు. ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్‌–హాలీవుడ్‌ నటుడు కబీర్‌ బేడి ప్రత్యేక పాత్ర పోషించారు. అనూప్ రూబెన్స్ సంగీత దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలోని పాటలు అభిమానుల్ని ఏ మేరకు అలరిస్తాయో చూడాలి.

09:40 - August 10, 2017

మాస్ చిత్రాలకు కేరాఫ్ 'వినాయక్'. యాక్షన్ మూవీస్ ను తెరకెక్కించడంలో తనదైన బాణీ పలికిస్తున్నారు. మాస్ మసాలాలు దట్టించడంలో ఇతను మేటి. క‌థ‌కు క‌మ‌ర్శియ‌ల్ అంశాలు జోడించాల‌న్నా..ప‌దునైనా సంభాష‌ణ‌ల‌తో ప్ర‌త్య‌ర్ధుల‌పై పంచ్ లు వేయాల‌న్నా మాస్ డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్ కే చెల్లింది. మెగాస్టార్ చిరంజీవి 'ఖైదీ నెంబర్ 150' సినిమా అనంతరం మరో సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.

మెగా కుటుంబం నుండి వచ్చిన 'సాయి ధరమ్ తేజ్' తో వినాయక్ ఓ సినిమాను రూపొందిస్తున్నారు. సి. కల్యాణ్ నిర్మాతగా వినాయక్ దర్శకత్వంలో 'సాయి ధరమ్ తేజ్' హీరోగా వస్తున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలను బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన చిరంజీవి దర్శక నిర్మాతలకి శుభాకాంక్షలు తెలియజేశారు. హీరో సాయిధరమ్ తేజ్ కి ఆశీస్సులు అందజేశారు. ఈ సినిమాకు సంబంధించిన వివరాలు త్వరలో తెలియనున్నాయి. 

12:52 - July 27, 2017

టాలీవుడ్..హాలీవుడ్..కోలీవుడ్..ఇలా ఏ వుడ్ లోనైనా సరే చిత్రానికి సంబంధించిన విశేషాలు అభిమానులకు తెలియచేసేందుకు చిత్ర బృందం వినూత్న పంథాను ఎంచుకుంటుంది. అందులో భాగమే టీజర్..ట్రైలర్..మోషన్ పిక్చర్స్. తమ చిత్రాలను ఒక్కో విధంగా విడుదల చేస్తూ చిత్రాలపై అంచనాలను మరింత పెంచుతుంటారు. ఇందులో ప్రముఖ హీరోల చిత్రాల కోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తుంటారు. ఆయా సినిమాల పోస్టర్స్, టీజర్స్..ట్రైలర్స్ చూస్తూ అభిమానులు సంతోష పడుతుంటారు. ఆడియో వేడుకలు లేకుండా ఏకంగా యూ ట్యూబ్ లో సాంగ్స్ విడుదల చేయడం ప్రారంభించారు. ఇలాంటి ట్రెండ్ ను క్రియేట్ చేసింది మెగా ఫ్యామిలీ. అనంతరం ప్రీ రిలీజ్ ఫంక్షన్ పేరిట ఓ వేడుకను నిర్వహిస్తున్నారు.

తాజాగా కొత్త ట్రెండ్ ముందుకొచ్చింది. దర్శకడు పూరి జగన్నాథ్ మరో కొత్త పేరును తెరపైకి తీసుకొచ్చారు. ఆయన దర్శకత్వంలో 'బాలకృష్ణ' హీరోగా 'పైసా వసూల్' సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించి 'స్టంపర్' ను విడుదల చేస్తున్నట్లు పూరీ వెల్లడించారు. టీజర్ క బాప్..గా ఉంటుందని వెల్లడించడం చిత్రంపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. ఈనెల 28న ఈ చిత్రం 'స్టంపర్‌'ను విడుదల చేస్తున్నారు. ఇది టీజర్‌, ట్రైలర్‌కు భిన్నంగా ఉంటుందని చిత్రబృందం చెబుతుంది. నందమూరి అభిమానులు కోరుకొనే అంశాలన్నీ ఇందులో పుష్కలంగా ఉంటాయని, డైలాగ్స్, సాంగ్స్ అదిరిపోయే లెవెల్‌లో ఉంటాయని పూరి పేర్కొంటున్నారు. 

15:27 - July 26, 2017

డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొని సిట్ ఎదుట విచారణకు హాజరై సినీ సెలబ్రిటీలందరూ డ్రస్ కోడ్ పాటించడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. మొదటి రోజు పూరి జగన్నాథ్. ఆతర్వాత సుబ్బరాజు, మొన్న తరుణ్, నిన్న నవదీప్ వీళ్లంతా వైట్ షర్ట్‌లతోనే విచారణకు హాజరయ్యారు. డ్రగ్స్ విచారణను ఎదుర్కొంటున్న వారంతా డ్రెస్ కోడ్ వాడుతున్నారా..? లేక డ్రగ్స్ కోడ్ వాడుతున్నారా అనేది ఇప్పుడు ప్రజల్లో మొదలైన అనుమానం. వాస్తవానికి వైట్ షర్ట్ అంటే శాంతికి చిహ్నం. అదే బ్లాక్ షర్ట్‌లు వేసుకుంటే... నిరసన తెలిపినట్లు అర్థం. ప్రస్తుత పరిస్థితులు చూస్తే... తమపై వచ్చిన ఆరో్పణలపై... నటులంతా నిరసన వ్యక్తం చేయాలి. అంటే నల్ల చొక్కాలు దరించి విచారణకు హాజరుకావాలి. తాజాగా నవదీప్ కూడా వైట్ షర్ట్ వేసుకుని విచారణకు రావడంతో.. సోషల్ మీడియాలో ఇప్పుడు ఇవే గుసగుసలు మొదలయ్యాయి.

ఒక్క శ్యాంకే నాయుడు తప్ప...

ఇప్పటి వరకూ విచారణకు హాజరైన ఐదుగురు సినీ ప్రముఖుల్లో ఒక్క శ్యాంకే నాయుడు మాత్రమే వైట్ షర్ట్ ధరించలేదు. అయితే ఆయన ఒక్కడినే అతి తక్కువ సేపు విచారించిన వదిలేశారు. వైట్ షర్ట్‌లు ధరించి విచారణకు హాజరైన మిగిలినవారంతా... సుమారు 12 గంటల నుంచి 13 గంటలు వరకూ సిట్ విచారణ ఎదుర్కొన్నారు. వీరి వద్దనుంచే శాంపిల్స్ సైతం సేకరించారు. అంటే ఈ డ్రగ్స్ కోడ్ లోనే శ్యాంకే నాయుడు లేరా... లేక డ్రగ్స్ కేసుతోనే శ్యాంకే నాయుడుకి సంబంధం లేదా..? డ్రగ్స్ విచారణకు... డ్రెస్ కోడ్‌గా వైట్ షర్ట్‌లతో హాజరుకావడం... యాదృచ్చికంగానే జరిగిందా..? కావాలే జరుగుతుందా..? ఇప్పుడు ఇదే అంశం తేలాల్సి ఉంది. ఏది ఏమైనా... డ్రగ్స్ విచారణకు నటులంతా ఒక డ్రెస్ కోడ్‌లో రావడం మాత్రం ఆశ్చర్యం కలిగిస్తున్న అంశం.

21:21 - July 19, 2017
15:18 - June 26, 2017

టాలీవుడ్ లో వైవిధ్యమైన కథా చిత్రాలు..రీమెక్ చిత్రాల్లో నటించడంలో 'వెంకటేష్' ముందున్నారు. ఆయన నటించిన పలు సినిమాలు రీమెక్ చిత్రాలే కావడం తెలిసిందే. ఇటీవలే ఆయన 'గురు' గా ప్రేక్షకులు ముందుకొచ్చారు. చిత్ర రిలీజ్ తరువాత ఆయన ఎలాంటి సినిమాలు ఒప్పుకోలేదు. దీనితో ఆయన ఎవరి దర్శకత్వంలో నటిస్తారు ? ఆ చిత్రం ఎలా ఉంటుందా ? అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. వేసవికాలంలో సెలవులు తీసుకోవడం జరుగుతోందని ఆయన ఇటీవలే పేర్కొన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వేసవి సెలవులు పూర్తి కావడంతో ఆయన చిత్రంపై వార్తలు వెలువడుతున్నాయి. సెలవలను ఆస్వాదించిన 'వెంకీ' పలువురి దర్శకుల కథలను విన్నట్లు టాక్. అందులో పూరి జగన్నాథ్, క్రిష్ తదితర దర్శకులున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆయన కొత్త సినిమా గురించి ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ప్రస్తుతం పూరి జగన్నాథ్..బాలకృష్ణ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అనంతరం 'వెంకీ'..’పూరీ' చిత్రం ఉంటుందని టాలీవుడ్ టాక్. మరి ఆయన తాజా చిత్రం గురించి మరిన్ని వివరాలు రానున్న రోజుల్లో తెలువనున్నాయి.

11:05 - June 8, 2017

నందమూరి బాలకృష్ణ జోరు మీదున్నాడు. 100వ చిత్రం 'గౌతమి పుత్ర శాతకర్ణి' ఘన విజయం అనంతరం 101 సినిమాపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. తన తదుపరి చిత్రాలపై కూడా 'బాలయ్య' ఇప్పటినుండే ఫోకస్ పెట్టాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 101 సినిమా తెరకెక్కుతోంది. ఇందులో 'శ్రియ' హీరోయిన్ గా మరోసారి కనిపించబోతోంది. ప్రస్తుతం పోర్చుగల్ లో సినిమా షూటింగ్ జరుపుకొంటోంది. ‘బాలకృష్ణ'కు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన టైటిళ్ల విషయంలో చిత్ర యూనిట్ తర్జనభర్జనలు పడుతున్నట్లు టాక్. ఈనెల 10వ తేదీన 'బాలకృష్ణ' పుట్టిన రోజు కావడంతో ఆ రోజున ఫస్ట్ లుక్ విడుదల చేయాలని, టైటిల్ లేకుండా ఫస్ట్ లుక్ విడుదల చేస్తే బాగుండదని చిత్ర యూనిట్ యోచిస్తున్నట్లు సమాచారం. ‘జై బాలయ్య'...’ఉస్తాద్'..’తేడా సింగ్'..’పైసా వసూల్'..ఇలా నాలుగు టైటిళ్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. టైటిల్ తో పాటుగా ఫస్ట్ లుక్ విడుదల చేయాలా ? లేదంటై టైటిల్ కోసం మరికొన్ని రోజులు ఆగాలా ? అని చిత్ర బృందం ఆలోచిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఆయన మొదటి లుక్ ఎలా ఉంటుంది ? చిత్ర టైటిల్ ఏంటీ అనేది తెలుసుకోవాలంటే ఈనెల 10వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.

11:27 - June 4, 2017

నందమూరి బాలకృష్ణ 'గౌతమిపుత్ర శాతకర్ణి' ఘన విజయం అనంతరం నెక్ట్స్ సినిమాపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఆయన 101వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్య సరసన మరోసారి 'శ్రియ' ఆడి పాడనుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ లుక్ సోషల్ మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. యాక్షన్ డ్రామాగా ఈ సినిమా ఉండదనుందని తెలుస్తోంది. ఇటీవలే పోర్చుగల్ లో చిత్ర షూటింగ్ జరిగింది. ఇక 'బాలయ్య' ఈ సినిమాలో రెండు పాత్రల్లో కనిపించనున్నాడని టాక్. మాఫియా డాన్ గా పవర్ పుల్ రోల్ పాత్ర ఒకటి..ట్యాక్సీ డ్రైవర్ గా మరో పాత్రలో కనిపించనున్నాడని ప్రచారం జరుగుతోంది. తాజాగా రిలీజైన ఫొటో చూస్తే ఇది నిజమనిపిస్తోంది. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని భవ్య క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది.

Pages

Don't Miss

Subscribe to RSS - పూరి జగన్నాథ్