పూర్తి

21:11 - June 10, 2018

కర్నూలు : జిల్లాలో రిజర్వాయర్లను పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు పాదయాత్ర పాదయాత్ర చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు పాదయాత్ర చేపట్టారు. రైతులతో టెన్ టివి ఫేస్ టు ఫేస్ నిర్వహించింది. ఆ వివరాలను వీడియోలో చూద్దాం.. 

19:44 - June 7, 2018

హైదరాబాద్ : రైతు బాగుండాలంటే రాష్ట్రంలో ఉన్న పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి కావాలని మంత్రి హరీష్‌రావు అన్నారు. పెండింగ్‌ ప్రాజెక్ట్‌లను పూర్తిచేసి మహబూబ్‌నగర్‌ జిల్లాలో 6లక్షల ఎకరాలకు నీళ్లు అందిస్తున్నామన్నారు. మిషన్‌ కాకతీయ అద్భుతమై విజయం సాధించిందని తెలిపారు. దేశంలో ఎక్కడాలేని కార్యక్రమాలు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిందన్నారు. మనల్ని చూసి మహారాష్ట్రలో కూడా మిషన్‌ కాకతీయ కార్యక్రమం ప్రారంభించారన్నారు. ముప్పై ఏళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న అంతరాష్ట్ర ఒప్పందాలు చేసుకొని అదిలాబాద్‌ జిల్లాకు నీళ్లు అందించామన్నారు. 19 ప్రాజెక్టుల సముహం కాళేశ్వరం ప్రాజెక్టు అని.. రెండుమూడేళ్లోనే ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులకు నీళ్లు అందిస్తామన్నారు.

 

22:02 - May 28, 2018

హైదరాబాద్  : రెడ్‌స్టార్‌ మాదాల రంగారావుకు.. కుటుంబసభ్యులు, అభిమానులు విప్లవాభివందనాలతో.. తుది వీడ్కోలు పలికారు. తుదిశ్వాస వరకూ వామపక్ష భావజాలంతో గడిపిన మాదాల భౌతిక కాయానికి సాంప్రదాయిక పూజాధికాలేవీ లేకుండానే దహనసంస్కారాలు నిర్వహించారు. 

తెలుగు సినీ చరిత్రలో రెడ్‌స్టార్‌గా తనదైన ముద్ర వేసుకున్న.. నటుడు మాదాల రంగారావు భౌతిక కాయానికి అంత్యక్రియలు ముగిశాయి. శ్వాసకోశ సంబంధ వ్యాధికి చికిత్స పొందుతూ మాదాల రంగారావు.. ఆదివారం తెల్లవారుజామున మరణించారు. సోమవారం ఉదయం.. ఆయన ఇంటి నుంచి.. సీపీఐ కార్యాలయం మగ్దుమ్‌ భవన్‌కు  మాదాల రంగారావు భౌతిక కాయాన్ని తరలించారు.

సీపీఐ కార్యాలయంలో.. పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ, తెలంగాణ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, సీపీఎం ఏపీ కార్యదర్శి మధు, డైరెక్టర్‌ పోకూరి బాబూరావు, రమేశ్‌, వందేమాతరం శ్రీనివాస్‌ తదితరులు మాదాల రంగారావు పార్థివ దేహానికి ఘనంగా నివాళులు అర్పించారు. 

సీపీఐ కార్యాలయం నుంచి.. మాదాల రంగారావు పార్థివ దేహాన్ని.. రెడ్‌ షర్ట్‌ కవాతుతో.. ప్రజల సందర్శనార్థం బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం దగ్గరకు తీసుకు వెళ్లారు. అక్కడ సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీరాఘవులు, పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తదితరులు నివాళులు అర్పించారు. 

పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన అభిమానులు, మాదాల రంగారావు పార్థివదేహాన్ని కడసారి దర్శించి నివాళులు అర్పించారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి.. మాదాల రంగారావు పార్థివదేహాన్ని.. ర్యాలీగా మహాప్రస్థానానికి తీసుకు వెళ్లారు. సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు రాఘవులు, సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు. తుదిశ్వాస వరకూ వామపక్ష భావజాలంతో గడిపిన మాదాల రంగారావుకు.. ఎలాంటి పూజలు నిర్వహించకుండానే.. అంత్యక్రియలు జరిపారు. 

17:02 - May 28, 2018

విజయవాడ : పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రాజెక్టులను పూర్తి చేయడం తన జీవిత లక్ష్యమని అన్నారు. టీడీపీ మహానాడులో ఆయన మాట్లాడారు. ప్రతిపక్షాలు ప్రాజెక్టులను అడ్డుకున్నారని..కోర్టుల్లో కేసులో వేస్తున్నారని పేర్కొన్నారు. ప్రాజెక్టుల దగ్గర నిద్రపోయామని.. మనం అనుకున్న ప్రగతిని సాధించామన్నారు. 7 లక్షల పంట కుంటలను రెడీ చేశామని తెలిపారు. చెక్ డ్యామ్ లు కడతామని చెప్పారు. భూగర్భజాలాలు పెంచేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కృష్ణా, పెన్నాలో నీళ్లు రావడం లేదన్నారు. 

 

20:53 - April 17, 2018

హైదరాబాద్ : ఏపీ బీజేపీ అధ్యక్ష పదవికి కసరత్తు పూర్తయింది. నూతన అధ్యక్షుడిని రెండు, మూడు రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఉన్నత పదవి ఇచ్చేందుకే హరిబాబుతో రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేయించినట్లు తెలుస్తోంది. ఇక అధ్యక్ష పదవి మొదటినుంచి పార్టీలో కొనసాగుతున్న వారికే ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ పదవి కోసం కన్నా లక్ష్మీనారాయణ, పురందేశ్వరి పేర్లు వినిపించినప్పటికి.. మాణిక్యాలరావు, సోము వీర్రాజుకే పదవి దక్కే అవకాశం కనిపిస్తోంది. సామాజికవర్గాల ఆధారంగా అధ్యక్షుడిని ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. ఎన్డీయే నుండి టీడీపీ బయటకు వచ్చిన తర్వాత.. ఏపీలో పార్టీ బలోపేతంపై బీజేపీ అధిష్టానం దృష్టి సారిచింది. ఇక అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన హరిబాబుకు కేంద్ర మంత్రి పదవి దక్కే అవకాశం కనిపిస్తోంది. జూన్‌ లేదా జులైలో కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉంది. మొత్తానికి 2019 ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. 

 

19:37 - February 28, 2018

ముంబై : అతిలోకసుందరి శ్రీదేవి అంత్యక్రియలు ముగిశాయి. దుబాయ్‌లో హఠాన్మరణం చెందిన శ్రీదేవి అంతిమ సంస్కారాలు ముంబై విల్లేపార్లేలోని సేవా సమాజ్‌ శ్మశాన వాటికలో ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. దివి నుంచి భువికి దిగి వచ్చి వెండితెరను రాణిలా ఏలిన అందాలనటి మళ్లీ దివికేగింది. మరపురాని పాత్రలతో అర్థ శతాబ్దం పాటు అశేష అభిమానగణాన్ని అలరించి, కోట్లాది హృదయాల్లో శాశ్వత ముద్ర వేసుకున్న ఆమె... మానవా ఇక సెలవ్ అంటూ స్వర్గానికి సాగిపోయింది. శ్రీదేవి అంతిమయాత్రలో బాలీవుడ్‌, టాలీవుడ్‌, కోలీవుడ్, మాలీవుడ్‌, శాండల్‌వుడ్‌ ప్రముఖులు అంతిమ యాత్రలో పాల్గొన్నారు. అశ్రునయనాల మధ్య ఆమెకు తుది వీడ్కోలు పలికారు. 
శ్రీదేవి భౌతికకాయానికి సినీ ప్రముఖుల నివాళులు 
మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన శ్రీదేవి అంతిమ యాత్ర ఏడు కిలోమీటర్ల మేర సాగింది. తమ అభిమాన నటి కడసారి చూపు కోసం అభిమానులు శ్మశానవాటిక వద్దకు పోటెత్తారు. అంతకు ముందు సెలబ్రేషన్స్ క్లబ్ నుంచి విల్లేపార్లే వరకు సాగిన శ్రీదేవి అంతిమయాత్రలో భారీ సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. అలాగే సినీ ప్రముఖులు కూడా భారీ ఎత్తున పాల్గొని.. శ్రీదేవి భౌతికకాయానికి నివాళులర్పించారు. మరోవైపు అంతిమయాత్రకు భారీ ఎత్తున అభిమానులు తరలిరావడంతో ముంబై పరిసరాలు కిక్కిరిసిపోయాయి. 
ఎరుపురంగు చీర కంచిపట్టు చీరతో శ్రీదేవి అలంకరణ 
అంతిమ సంస్కారం సందర్భంగా శ్రీదేవిని ఆమెకు ఎంతో ఇష్టమైన ఎరుపు రంగు చీర కంచిపట్టు చీరతో అలంకరించారు. ఎప్పుడూ అందంగా కనిపించడం ఆమెకు అలవాటు. దీంతో చివరిక్షణాల్లోనూ శ్రీదేవిని అలాగే ముస్తాబు చేశారు. అభిమానుల మనసుల్లో నుంచి ఆ మనోహర రూపం చెదిరిపోకుండా ఉండేలా ఆమె కుటుంబసభ్యులు చర్యలు తీసుకున్నారు. శ్రీదేవి భౌతికకాయాన్ని తరలించిన వాహనాన్ని.. శ్రీదేవికి ఎంతో ఇష్టమైన మల్లెపూలు, లిల్లీపూలతో అలంకరించారు. అంతిమయాత్ర వాహనంలో శ్రీదేవి భౌతికకాయంతో పాటు ఆమె కుటుంబీకులు ఉన్నారు. 
శ్రీదేవి కడసారి చూసేందుకు పోటెత్తిన అభిమానులు 
అనంతలోకాలకు వెళ్లిపోయిన శ్రీదేవి చివరిచూపు కోసం స్నేహితులు, సన్నిహితులు, అభిమానులు పోటెత్తారు. హేమామాలిని, ఐశ్వర్యారాయ్, జయాబచ్చన్, సుస్మితాసేన్, మాధురి దీక్షిత్, అక్షయ్‌ కుమార్, టబు, అజయ్ దేవగన్, కాజోల్, అర్జున్ కపూర్, సంజయ్‌ లీలా బన్సాలి, సారా అలీఖాన్, జాక్వలైన్ ఫెర్నాండెజ్, రీతేష్ దేశ్‌ముఖ్, అర్భాజ్ ఖాన్, ఇషా డియోల్, కరణ్‌ జోహార్, ఫరా ఖాన్, సుభాయ్ ఘాయ్ తదితరులు భౌతికకాయం వద్ద అంజలి ఘటించారు. అలాగే రజనీకాంత్, కమల్‌ హాసన్, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, అర్జున్ సహా పలువురు దక్షిణాది నటులు శ్రీదేవి భౌతికకాయాన్ని వద్ద అశ్రునివాళి అర్పించారు.  
ముగిసిన శ్రీదేవి అంత్యక్రియలు  
ఇక సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో విల్లే పార్లేలోని సేవా సమాజ్‌ శ్మశానవాటికలో శ్రీదేవి అంత్యక్రియలు ముగిశాయి. కడసారి శ్రీదేవిని చూసేందుకు ముంబై తరలివచ్చిన అభిమానులంతా బాధాతప్త హృదయాలతో వెనుదిరిగారు. 
శ్రీదేవి మృతికి సంతాపంగా హోళీ వేడుకలు రద్దు 
ఇక శ్రీదేవి మృతికి సంతాపంగా ఆమె నివసించిన లోఖండ్‌వాలా కాంప్లెక్స్‌లోని గ్రీన్‌ ఏకర్స్‌ సొసైటీ హోళీ వేడుకలను జరుపుకోవద్దని నిర్ణయించింది. తన నటనతో యావత్‌ ప్రపంచాన్ని ఆకట్టుకున్న శ్రీదేవి మృతికి సంతాపంగా హోళీ వేడుకలను రద్దు చేసినట్లు సొసైటీ సభ్యులు తెలిపారు. 

 

07:54 - February 10, 2018

ఢిల్లీ : పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలకు విరామం ప్రకటించారు. మొదటిదశ బడ్జెట్‌ భేటీ పూర్తైంది. ఉభయ సభలు వచ్చే నెల 5 వతేదీకి వాయిదా పడ్డాయి. పార్లమెంటురీ స్థాయీ సంఘాలు బడ్జెట్‌ను అధ్యయనం చేసేందుకు వీలుగా లోక్‌సభ, రాజ్యసభలకు మార్చి 4 వ తేదీ వరకు విరామం ప్రకటించారు. 
ఎన్డీయే విధానాలను ప్రస్తావించిన రాష్ట్రపతి 
గత  నెల 29న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించిన చేసిన ప్రంసంగంతో బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రపతి ప్రసంగంలో ప్రభుత్వ విధానాలను ప్రస్తావించారు. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థికాభివృద్ధి మందగించినా...భారత జీడీపీ వృద్ధి దిశలో కొనసాగుతోందని చెప్పారు. విదేశీమారక ద్రవ్య నిల్వలు 410 బిలియన్‌ డార్లకు చేరుకున్న అంశాన్ని ప్రస్తావించారు. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సాధించిన ఘన కార్యాలను ఉదహరించారు. నోట్ల రద్దుతో నల్లధనాన్ని అరికట్టామని చెప్పిన రాష్ట్రపతి,  జీఎస్‌టీ  అమలు ఆర్థిక సంస్కరణ పథంలో ముందడుగన్న విషయాన్ని ప్రస్తావించారు.  రాష్ట్రపతి ప్రసంగం రోజే  2018-19 ఆర్థిక సర్వేని పార్లమెంటులో ప్రవేశపెట్టారు.  వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఏడు నుంచి ఏడున్నర శాతం మధ్య ఉండే అవకాశం ఉందని అంచనా వేశారు. 
రూ.24 లక్షల కోట్లకు పైగా బడ్జెట్‌ పద్దులు 
ఆ తర్వాత ఈనెల 1న ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ 2018-19 వార్షిక బడ్జెట్‌లో పార్లమెంటులో ప్రవేశపెట్టారు. మొత్తం 24 లక్షల కోట్ల రూపాయలకు పైగా భారీ  పద్దులతో సమర్పించిన బడ్జెట్‌లో రైల్వేలకు 1.48 లక్షల కోట్లు కేటాయించారు. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చారు. బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు మొండిచేయి చూపించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. రైల్వే ప్రాజెక్టులకు తగిన కేటాయింపులు జరపకపోవడంపై నిరసనలు వ్యక్తమయ్యాయి. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం జరిగిందంటూ లోక్‌సభలో టీడీపీ, వైసీపీ ఎంపీలు, రాజ్యసభలో టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్‌ ఎంపీలు ఆందోళన చేశారు. ఐదు రోజుల పాటు నిరసన తెలిపారు. ఏపీ ఎంపీల నిరసన మధ్యే ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో ప్రసంగించారు. పార్లమెంటు తలుపులు మూసి ఏపీ పునర్విభజన బిల్లును  ఆమోదించిన అప్పటి యూపీఏ తీరును  మోదీ ఎండగట్టారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రసంగించిన ఏపీ ఎంపీలు... బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ఏపీ ఎంపీల నిరసనల మధ్య పార్లమెంటు మొదటి దశ బడ్జెట్‌ సమావేశాలు ముగిశాయి.

 

13:45 - December 31, 2017
12:13 - December 27, 2017

అనంతపురం : రాయలసీమలోని పెండింగ్‌ ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేసేందుకు ప్రధాన్యత ఇవ్వాలని  జలవనరుల శాఖ మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. తెలుగుగంగ, గాలేరు-నగరి, హంద్రీ-నీవా ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకొంటున్నామని  నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ చెప్పారు.  అనంతపురం జిల్లాలోని భైరవానితిప్ప ప్రాజెక్టుకు వచ్చే నెలలో శంకుస్థాపన చేసి, 2018 డిసెంబర్‌ చివరినాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించించామన్నారు. పేరూరు ప్రాజెక్టు నుంచి వచ్చే నెలలో నీరు ఇస్తామని దేవినేని చెప్పారు.

 

12:44 - December 12, 2017

హైదరాబాద్ : కమెడియన్ విజయ్‌సాయి మృతదేహానికి పోస్టు మార్టం పూర్తైంది. ఉస్మానియా ఆసుపత్రిలో వైద్యులు పోస్టుమార్టం పూర్తి చేశారు. అనంతరం విజయ్‌సాయి మృతదేహాన్ని యూసఫ్‌గూడలోని ఇంటికి తరలించారు. సాయంత్రం విజయ్‌సాయి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - పూర్తి