పెద్ద నోట్ల రద్దు

16:38 - March 9, 2017

హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రజలు ఎన్నో కష్టాలు పడ్డారు. డబ్బుల కోసం అనేక అవస్థలు ఎదుర్కొన్నారు. దాదాపు 100 రోజుల తర్వాత ఆ కష్టాలు నెమ్మదిగా తగ్గినా.. ఆ తర్వాత చాలా ఏటీఎంలలో నో క్యాష్‌ బోర్డులే దర్శనమిస్తున్నాయి. అయితే.. ఈ మధ్య మళ్లీ ఆ పరిస్థితులు మరింత ఎక్కువయ్యాయి.

రద్దు చేసిన స్థానంలో కొత్త నోట్లు వచ్చినా..

ఏటీఎంలలో డబ్బులు లేకపోవడంతో ప్రజలకు మళ్లీ కష్టాలు తప్పడం లేదు. పెద్ద నోట్లు రద్దు చేసిన స్థానంలో కొత్త నోట్లు వచ్చినా.. అవి ఇంకా బ్యాంకులకు చేరకపోవడంతో ఈ కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు ఆర్బీఐ నుంచి క్యాష్‌ అందకపోవడంతో ఏటీఎంలలో నో క్యాష్‌ బోర్డులు దర్శనమిస్తున్నాయని బ్యాంక్‌ అధికారులంటున్నారు. మరోవైపు ఎస్‌బీఐ కొత్త నిబంధనలు విధిస్తున్నాయని వార్తలు రావడంతో.. కస్టమర్లు తమ ఖాతాల నుంచి క్యాష్‌ విత్‌డ్రా చేసుకుంటున్నారు. దీంతో ఏటీఎంలలో క్యాష్‌ వెంట వెంటనే అయిపోవడం కూడా దీనికి కారణమంటున్నారు.

ప్రధాన నగరాలకే కాకుండా అన్ని ప్రాంతాల్లో....

ఇక జీతాల సమయంలో ఏటీఎంలలో క్యాష్‌ లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ సమస్య ప్రధాన నగరాలకే కాకుండా అన్ని ప్రాంతాల్లో ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం, బ్యాంకు అధికారులు స్పందించి ఏటీఎంలలో క్యాష్‌ అందుబాటులో ఉండేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

13:36 - February 2, 2017

ఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు ప్రభావం మీడియాపై పడిందన్న అంశపై రాజ్యసభలో చర్చ జరిగింది. ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్‌ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్‌ ఈ అంశాన్ని లేవనెత్తారు. పత్రికల సర్క్యులేషన్‌ పడిపోయిందని, పూర్వకాలం నుంచి అమల్లో ఉన్న ప్రభుత్వ ప్రకటనల జారీ విధానాన్ని మార్చాలని రాపోలు సూచించారు. అయితే పెద్ద నోట్ల రద్దు ప్రభావం మీడియా రంగంపై పండిందన్న వాదాన్ని కేంద్ర సమాచార, ప్రసార శాఖల మంత్రి వెంకయ్యనాయుడు తోసిపుచ్చారు. పత్రికలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని సభ దృష్టికి తెచ్చారు.

20:48 - January 18, 2017

విజయవాడ : పెద్ద నోట్ల రద్దుతో దేశంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడిందని ఏపీ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. నోట్ల రద్దును నిరసిస్తూ విజయవాడలోని ఎస్‌బీఐ జోనల్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ ధర్నా నిర్వహించింది. ఈ ధర్నాకు కాంగ్రెస్ నేతలందరూ హాజరయ్యారు. నోట్ల రద్దుతో మోదీ సర్కార్ భారీ కుంభకుణానికి పాల్పడిందని.. దీనిపై సుప్రీంకోర్టులో సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 

 

21:30 - January 11, 2017

విజయవాడ : పెద్ద నోట్ల రద్దు నిర్ణయంలో ప్రధాని మోదీ ఘోరంగా విఫలమయ్యారని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు రాఘవులు అన్నారు. అసలు దొంగలను వదలి.. పేదలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నకిలీ కరెన్సీని అరికట్టడంలో.. ఉగ్రవాదాన్ని అణిచివేయడంలో మోదీ విఫలమయ్యారని అన్నారు. నల్లడబ్బు స్విస్‌ బ్యాంకుల్లోనే కాకుండా.. బంగారం, రియల్‌ ఎస్టేట్‌ రూపంలో ఉందన్నారు.

21:39 - January 5, 2017
16:41 - January 4, 2017

హైదరాబాద్ : పెద్దనోట్ల రద్దై 50 రోజులు దాటిపోయినా ఇంకా కరెన్సీ కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. అన్ని వర్గాల ప్రజానీకం ఇబ్బంది పడుతున్నారు. అయితే ఇప్పుడు ఎన్‌ఆర్‌ఐలకు కూడా  నోట్లరద్దు సెగ తగిలింది.  పాతనోట్లు డిపాజిట్‌ చేసి, కొత్త నోట్లు తీసుకోవాలని ఆర్బీఐ కేంద్రాలకు వెళ్లిన వారికి నిరాశే ఎదురవుతోంది.  ఆర్బీఐ  చెన్నై, ముంబై, ఢిల్లీ వెళ్లి మార్చుకోవాలని చెతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం వీడియోలో చూడండి....

 

10:28 - December 31, 2016
08:46 - December 31, 2016

పెద్ద నోట్ల రద్దుతో సామాన్య ప్రజలే ఇబ్బందులు పడుతున్నారని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో విశ్లేషకుడు వినయ్ కుమార్, టీకాంగ్రెస్ నేత రామచందర్ రెడ్డి, బీజేపీ నేత ప్రకాశ్ రెడ్డి, టీఆర్ ఎస్ నేత మన్నె గోవర్థన్ రెడ్డి పాల్గొని, మాట్లాడారు. టీఅసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరుపై మాట్లాడారు. అనుకున్న మేరకు సమావేశాలు జరగడం లేదని అభిప్రాయపడ్డారు. ప్రజా సమస్యలపై చర్చ జరగడం లేదన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

11:30 - December 30, 2016
21:28 - December 27, 2016

హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు కాంగ్రెస్‌ నేతృత్వంలో 8 పార్టీలు ఢిల్లీలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశాయి. నోట్ల రద్దుతో ప్రధాని చెప్పినట్లు నల్లధనం, అవినీతి నిర్మూలన కాకపోగా అది మరింత పెరిగిందని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆరోపించారు. నోట్ల రద్దుతో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని, పేదలు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. చేతిలో డబ్బుల్లేక రైతులు, కార్మికులు విలవిలలాడిపోతున్నారని రాహుల్‌ అన్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగం పెరిగిపోయిందన్నారు. డిసెంబర్‌ 30 వరకు మోది సమయమిచ్చారని...అయితే పరిస్థితిలో ఎలాంటి మార్పు రాదన్నారు. సహారా డైరీకి సంబంధించి తాను చేసిన అవినీతి ఆరోపణలపై ప్రధాని ఎందుకు స్పందించడం లేదని రాహుల్‌ ప్రశ్నించారు. నోట్ల రద్దును మెగా స్కాంగా పశ్చిమ బెంగాల్‌ సిఎం మమతా బెనర్జీ అభివర్ణించారు. నోట్ల రద్దుతో దేశం 20 ఏళ్లు వెనక్కి పోయిందన్నారు. 'అచ్చే దిన్' పేరుతో మోదీ ప్రభుత్వం రైతులు, కార్మికులు, పేద ప్రజలను లూటీ చేసిందన్నారు. ఇందిరాగాంధీ బ్యాంకులను జాతీయం చేస్తే... మోది పేదల డబ్బును దోచి ఎన్‌పిఏ పేరిట కొంతమంది పెద్దలకు లాభం చేకూరుస్తున్నారని మమత ధ్వజమెత్తారు. 50 రోజుల గడవు తర్వాత కూడా పరిస్థితిలో మార్పు లేకపోకపోతే ఇందుకు మోదీ బాధ్యత తీసుకుని రాజీనామా చేస్తారా? అంటూ నిలదీశారు. మోది దేశ సమాఖ్య వ్యవస్థను ధ్వసం చేయడం ద్వారా సూపర్ ఎమర్జెన్సీ సృష్టిస్తున్నారని మమత నిప్పులు చెరిగారు.ఈ సమావేశానికి కాంగ్రెస్‌తో పాటు తృణమూల్‌, డిఎంకె, ఆర్జేడి, జెఎంఎం, జెడిఎస్‌, తదితర 8 పార్టీలు హాజరయ్యాయి. వామపక్షాలు, జెడియు, ఎన్‌సిపి, బిఎస్‌పి పార్టీలు ఈ సమావేశంలో పాల్గొనలేదు.

Pages

Don't Miss

Subscribe to RSS - పెద్ద నోట్ల రద్దు