పేర్లు

08:23 - March 12, 2018

హైదరాబాద్ : టీఆర్‌ఎస్ రాజ్యసభ అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయి. నల్లగొండ, కరీంనగర్‌, వరంగల్‌ జిల్లా నుంచి అభ్యర్థులను ఎంపిక చేశారు. తెలంగాణ భవన్‌లో జరిగిన టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశంలో.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పేర్లను ప్రకటించి.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పరిచయం చేశారు. వీరంతా సోమవారం నామినేషన్ వేయనున్నారు.
టీఆర్‌ఎస్‌ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు 
ఈనెల 23న జరగనున్న రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ తన అభ్యర్థులను ప్రకటించింది. సోమవారంతో నామినేషన్ల గడువు ముగుస్తుండటంతో.. ఆదివారం అభ్యర్థులను గులాబీదళపతి ఖరారు చేశారు. ఈమేరకు ఎమ్మెల్సీ కర్నెప్రభాకర్‌ ప్రకటించారు. 
బడుగుల లింగయ్య యాదవ్‌ అవకాశం
నల్లగొండజిల్లాలో బీసీ నేతగా మంచి పేరున్న బడుగుల లింగయ్య యాదవ్‌ను రాజ్యసభకు పంపాలని గులాబీపార్టీ నిర్ణయించింది. కేతేపల్లి మండలం భీమారం గ్రామానికి చెందిన బడుగుల నల్లగొండ ఉమ్మడి జిల్లాలో సుదీర్ఘ కాలం టీడీపీ అధ్యక్షుడిగా పని చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం 2015లో టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శిగా  కొనసాగుతున్న తనను రాజ్యసభ అభ్యర్తిగా ఎంపిక చేయడంపై లింగయ్య యాదవ్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
జోగినపల్లి సంతోష్‌ కుమార్‌కు రాజ్యసభ అవకాశం 
రాజ్యసభకు అభ్యర్థిగా అవకాశం దక్కించుకున్న జోగినపల్లి సంతోష్ కుమార్ స్వస్థలం కరీంనగర్ జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాక. సంతోష్‌కుమార్‌ పుణె యూనివర్సిటీ నుంచి  ఎంబీఏ పూర్తి చేశారు.  టీఆర్ఎస్ ఆవిర్భావంలో జోగినపల్లి క్రియాశీలంగా వ్యవహరించారు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలోనూ గులాబీదళంలో కీలకపాత్ర పోషించారు. ప్రస్తుతం టీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న సంతోష్‌కుమార్‌ను  రాజ్యసభకు ఎంపిక చేశారు గులాబీదళపతి. 
రాజ్యసభ అభ్యర్థిగా బండ ప్రకాశ్‌
ఇక వరంగల్‌కు చెందిన బండప్రకాశ్‌కు రాజ్యసభ ఛాన్స్‌ దక్కింది. ఎంఏ పీహెచ్‌డీ పూర్తిచేసిన బండ జిల్లా రాజకీయాల్లో కీలక నేతగా ఉన్నారు. ప్రస్తుతం టీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న బండప్రకాశ్‌ను రాజ్యసభకు పంపాలని టీఆర్‌ఎస్‌ అధినేత నిర్ణయించడంపై గులాబీపార్టీలో హర్షం వ్యక్తం అవుతోంది. రాజ్యసభ అభ్యర్థులుగా వరంగల్‌ నుంచి ముదిరాజ్‌ సామాజిక వర్గానికి ఛాన్స్‌ ఇచ్చిన కేసీఆర్‌.. నల్లగొండ జిల్లా నుంచి యాదవ కులానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఇక కరీంనగర్‌ నుంచి ఓసీ వర్గానికి చెందిన జోగినపల్లి సంతోశ్‌కుమార్‌కు అవకాశం ఇచ్చారు. మొత్తానికి గులాబీదళపతి సామాజిక, పొలిటికల్‌ లెక్కలన్నీ పక్కాగా వేసుకునే రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక చేసినట్టు అభిప్రాయాలు వస్తున్నాయి.

 

19:46 - March 11, 2018

హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌ రాజ్యసభ అభ్యర్థులుగా జోగినిపల్లి సంతోష్‌ కుమార్‌, బడుగుల లింగయ్య యాదవ్‌, బండ ప్రకాశ్‌ల పేర్లు ఖరారయ్యాయి. నోటిఫికేషన్ వెలువడ్డ 3 స్థానాలకు టీఆర్ఎస్‌ బరిలోకి దిగింది. ఈ ముగ్గురి పేర్లను తెలంగాణ భవన్‌లో జరిగిన టీఆర్‌ఎస్ఎల్పీ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌.. అధికారికంగా ప్రకటించారు. ఈ ముగ్గురు రేపు తమ నామినేషన్లు దాఖలు చేయనున్నారు. 

 

17:44 - March 11, 2018

హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌ రాజ్యసభ అభ్యర్థుల పేర్లు దాదాపు ఖరారైంది. రాజ్యసభ అభ్యర్థులుగా జోగినిపల్లి సంతోష్‌ కుమార్‌, లింగయ్య యాదవ్‌, బండ ప్రకాశ్‌ల పేర్లను ఫైనల్ చేసినట్లు సమాచారం. కాసేపట్లో జరిగే టీఆర్‌ఎస్ఎల్పీ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌.. పేర్లను అధికారికంగా ప్రకటించనున్నారు.  

 

14:11 - December 12, 2016

వర్ద...అంటే ఏమిటీ ? ఈ పేరు ఎందుకు పెట్టారు..ప్రస్తుతం దీనిపై చర్చ జరుగుతోంది. చెన్నైలో 'వార్దా' తుపాన్ బీభత్సం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వర్దా తీవ్ర తుపాను చెన్నై తీరాన్ని దాటింది. దీనితో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు తుపాన్ లు ఏర్పడిన సమయంలో కొన్ని పేర్లు పెడుతుంటారు. రౌనా, హుద్ హుద్, లైలా, పైలిన్, లెెహెర్, హెలిన్, నీలం వంటి పేర్లు పెట్టారు. తాజాగా 'వర్ద' పేరు పెట్టారు. వర్ద అంటే ఏమిటీ ? వర్ద అంటే అరబిక్, ఉర్దూ భాషల్లో గులాబీ అని అర్ధం. ఈ పేరును పాకిస్తాన్ సూచించింది.
గాలి వేగం గంటకు 39 కిలోమీటర్ల కంటే ఎక్కువగా ఉంటే పేర్లు పెట్టేవారు. కరేబియన్ దీవుల్లోని ప్రజలు రోమన్ కేథలిక్ క్యాలెండర్ ప్రకారం ఏ రోజు హరికేన్ లేదా తుపాను ప్రారంభమవుతుందో ఆ రోజు పేరును ఆ తుపానుకు పెట్టేవారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలోని తుపాన్లకు పేరు పెట్టడం 2000లో ప్రారంభమై 2004లో ఆచరణలోకి వచ్చింది. 
బంగాళాఖాతం, అరేబియా సముద్రం పరిధిలోని దేశాలైన భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, మాల్దీవులు, మయన్మార్, ఒమన్, శ్రీలంక, థాయ్ లాండ్ లు తుపాన్లకు పేరు నిర్ణయిస్తాయి. ఈ ఎనిమిది దేశాలు కలసి 64 పేర్లతో ఒక జాబితాను రూపొందించింది. ఈ జాబితా ప్రకారం న్యూఢిల్లీలోని ప్రాంతీయ ప్రత్యేక వాతావరణ కేంద్రం తుపానుకు పేరు నిర్ణయిస్తుంది.
హిందూ మహా సముద్రంలో వచ్చే తుపానులకు భారత దేశం అగ్ని, ఆకాశ్‌, బిజిలి, లాల్‌, లహర్‌, మేఘ్‌, సాగర్‌, వాయు అనే పేర్లు ఇచ్చింది. లైలా పేరును పాకిస్థాన్‌ పెట్టింది. థానే పేరును మయన్మార్‌ పెట్టింది. ఆయా దేశాల సామాన్యులు సులువుగా గుర్తు పెట్టుకునేందుకు, తుపానుల ప్రభావాన్ని చారిత్రకంగా నమోదు చేయడానికి తుపానులకు పేర్లు పెడతారు.1953లో అట్లాంటిక్ మహాసముద్రంలో తుఫానులు వచ్చినపుడు హరికేన్స్, ట్రోపికల్ పేరుతో పిలిచారు. మనదగ్గర నీలం, హెలిన్, లెహెర్, ఫైలిన్, హూద్ హుద్, రౌనా వంటి తుపాన్ లు అల్లకల్లోలం చేసిన సంగతి తెలిసిందే.
 

తుఫానులకు పేర్లు పెట్టటం ద్వారా ప్రజలను అప్రమత్తం చేయటం తేలిక అవుతుందని నిపుణుల అంచనా. అందుకే పేర్లు పెడతారు. ఇప్పుడు వర్ద తుపాన్ ఎం చేస్తుందో చూడాలి. 

16:54 - March 5, 2016

ఢిల్లీ : కేంద్రంలో బిజెపి మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక యుపిఎ స్కీముల పేర్ల మార్పుకు శ్రీకారం చుట్టింది. దివంగత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ పేరిట ఉన్న స్కీములకు పేర్లను మార్చుతోంది. పాత సీసాలో కొత్త నీరు పోసినట్టు స్కీముకు ముందున్న రాజీవ్‌గాంధీ పేరును మాత్రం కేంద్రం తొలగించింది. ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో నాలుగు స్కీములకు రాజీవ్‌గాంధీ పేర్లను తొలగించింది. రాజీవ్‌గాంధీ పంచాయత్ సశక్తీకరణ్‌ అభియాన్‌ పేరు ఏప్రిల్‌ ఒకటి నుంచి పంచాయత్‌ సశక్తీకరణ్‌ గా మారనుంది. అలాగే రాజీవ్‌గాంధీ నేషనల్ ఫెలోషిప్ ఫర్‌ సూడెంట్స్‌ విత్‌ డిస్‌ ఎబిలిటీస్‌, రాజీవ్‌గాంధీ నేషనల్‌ ఫెలోషిప్‌ ఫర్‌ షెడ్యూల్‌ క్యాస్ట్‌, రాజీవ్‌గాంధీ ఖేల్‌ అభియాన్‌ స్కీములకు సంబంధించి మోదీ ప్రభుత్వం రాజీవ్‌గాంధీ పేరును తొలగించింది. రాజీవ్‌గాంధీ ఖేల్‌ అభియాన్‌ పేరును కాస్తా 'ఖేలో ఇండియా'గా మార్చింది.

12:41 - February 13, 2016

నిజామాబాద్ : ఆ ఊళ్లలో ఎవరిని పలకరించినా ... ఒకటే ప్రశ్న.. ఎవరిని కలిసినా ఒకటే ప్రశ్న.. ఆ ఊళ్లలోని వారంతా మొగులయ్యలే.. ఆ ఊళ్లలోని ఆడవాళ్లంతా మొగులవ్వలే.. ఇంతకీ ఆ ఊళ్లోని వారందరూ అడిగే ప్రశ్న ఏంటి... అందరిని మొగులయ్య.. మొగులవ్వ అనే ఎందుకు పిలుస్తున్నారు దీని వెనక హిస్టరీ తెలియాలంటే లెట్స్ వాచ్ దిస్ స్టోరి.
సుమారు 3 వేల మంది జనాభా
నిజామాబాద్ జిల్లాలోని బాన్సువాడ పట్టణానికి 3 కి.మీ దూరంలో ఉన్న గ్రామమే సోమేశ్వర్ గ్రామం. సుమారు 3 వేల మంది జనాభా ఉన్నారు. ఆ గ్రామం చుట్టుప్రక్కల గ్రామాలైన నాగారం , కొల్లూరు , దుర్కి, దేశయ్ పేట వంటి తదితర గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాల్లో ఎవరి నోట విన్న .. ఓ మొగులవ్వ ఇలా రా .. ఓ మొగులయ్య ఇలా రా.. అనే మాటలే వినిపిస్తాయి. వినడానికి చిత్రంగా ఉన్నా ఇది నిజంగా నిజం.
ప్రశ్నల మీద ప్రశ్నలు
ఒక వైపు ప్రపంచం మొత్తం కంప్యూటర్ వైపు పయనిస్తున్నా.. ఇక్కడి ప్రజలు మాత్రం పాత పద్థతులు ,ఆచారాలను తు.చ తప్పకుండా పాటిస్తూనే ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎవరైనా కొత్తవారు సోమేశ్వర్ గ్రామానికి వెళ్లి పలానా మొగులయ్య కావాలనో..పలానా మొగులవ్వ కావాలనో అడిగారో ఒక అంతే ప్రశ్నల మీద ప్రశ్నలు మీముందుంటాయి. ఏ మొగులయ్య కావాలి ఏ మొగులవ్వ కావాలి అనే ప్రశ్నలు సందిస్తారు. ఎందుకంటే ఆ గ్రామంలోని వారందరి పేర్లు మొగులయ్య , మొగులవ్వ లే కాబట్టి. ఇంటి పేరు చెబితే కాని అంత ఈజీగా ఎవరు అడ్రస్ చెప్పలేరు. అంతలా అక్కడి వారు అలవాటు పడిపోయారు.
రేషన్ కార్డులో, ఓటర్ లిస్టులలో సైతం అవే పేర్లు
ఇది ఇలా ఉండగా రేషన్ కార్డులో, ఓటర్ లిస్టులలో సైతం అవే పేర్లు కనబడతాయి. కాలక్రమేనా మారుతున్న కాలాను గుణంగా ఇప్పటి వారు కాస్త మారుతున్నా ... వారి పిల్లల పేర్లు సైతం మొదటి అక్షరం మ.. తోనే మొదలయ్యేలా మోహన్ , మమతా, మౌనిక అనే పెట్టుకుంటున్నారు. తమ తాత ముత్తాతల కాలం నాటి నుండి సోమేశ్వర్ గ్రామంలో మొగలాయి దర్గా ఉందని.. కుల మతాలకు అతీతంగా అందరూ పీర్ల పండుగను జరుపుకుంటున్నామని గ్రామస్తులు తెలుపుతున్నారు. తమకు అన్ని విధాల మంచి చేస్తున్న మొగులాయి దేవుడే అన్ని అంటున్నారు గ్రామస్తులు. తమను పిలుచుకుంటున్న సమయంలో తమ ఇష్టదైవాన్ని తలచుకున్నట్టే ఉంటుందని చెప్పడం మరో విశేషం. నిజామాబాద్ జిల్లాలోని సోమేశ్వర్ గ్రామానికి వెళ్లాలనుకున్నవారు ఎవరైనా గ్రామస్థుల ఇంటి పేర్లతో సహా తెలియకుండా వెళ్లారో ప్రశ్నలు ఎదుర్కోవలసిందే.. ఏది ఏమైనా కాలం మారుతున్నా ఇంకా తమ ఇష్ట దైవాన్నే తమ పేర్లుగా పెట్టుకోవడం విచిత్రంగా అనిపించినా మనమూ అలాగే పిలవక తప్పదు మరి.

 

19:28 - November 9, 2015

హైదరాబాద్ : తెలంగాణ డీజీపీగా నియమించుకోవడానికి యుపీఎస్‌సీ పానల్‌ కమిటీ మూడు పేర్లను ఖారారు చేసింది. ప్రస్తుతం తాత్కాలిక డీజీపీగా ఉన్న అనురాగశర్మతో పాటు ఆరుణాబహుగుణ, ఎకె ఖాన్‌ పేర్లకు క్లియరెన్స్‌ లభించింది. ఈ పేర్లను పరిశీలించిన అనంతరం వీరిలో ఎవరినైనా డీజీపీగా నియమించుకునే అధికారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. సుప్రీం కోర్టు నిబంధనల ప్రకారం ఒకసారి డీజీపీగా నియమితులైన అధికారి రెండేళ్లు కొనసాగాల్సి ఉంటుంది. 

Don't Miss

Subscribe to RSS - పేర్లు