పొటాషియం

16:08 - July 17, 2017

చిలకడ దుపం..ఈ దుంపలకు ఒక్కో ప్రదేశంలో ఒక్కో పేరుతో పిలుస్తారు. వీటిని మొరంగడ్డ, కందగడ్డ, స్వీట్ పొటాటో అని కూడా అంటారు. పిండి పదార్థాలను, చక్కెరలను కలిగి ఉండే ఈ ఆహార పదార్థం రుచిని కూడా కలిగి ఉంటుంది. ఇందులో ఉన్నన్ని అద్భుతమైన పోషకాలు ఇంకెందులోనూ ఉండవని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. చిలగడ దుంపలో శరీరానికి కావల్సిన పోషకపదార్థాలను అందించడంలోనే కాదు, వివిధ రకాలుగా శరీరంలో చేరిన విషపదార్థాలను తొలగించడంలో చిలకడ దుంపలకు ప్రత్యేక స్థానం ఉంది. చిలకడదుంపను తినటానికి ఇష్టపడని వారు ఉండరు అనే చెప్పాలి. ఉడికించుకునో, ఆవిరిపై ఉడికించో, కాల్చుకునో, కూరగా వండుకునో.. రకరకాలుగా వీటిని తినొచ్చు. ఇక చిలుగడదుంపలో కార్టినాయిడ్స్‌ మరియు పాలీఫినాల్స్‌ వంటి ఫైటో రసాయనాలు ఉన్నాయి. దుంపలో లభించే పోషక పదార్ధాల వినియోగం దానిని ఉడకపెట్టే విధానంపై ఆధారపడి ఉంటుంది . ఎదిగే పిల్లలకు స్వీట్‌ పొటాటోను ఉడికించి తినిపించడం వల్ల శరీరంలో ఉన్న విషరసాయనాలు సులభంగా బయటకు పంపిస్తుంది. అనేక ఖనిజ లవణాలతో పాటు దుంపలలో పిండి పదార్థాలు(కార్బోహైడ్రేటులు), విటమిన్‌లు(బి,సి,ఇ) ఉన్నాయి.

షుగర్ లెవల్స్ ను తగ్గిస్తుంది...

బంగాళాదుంప, కందగడ్డల్లో కన్నా చిలగడదుంపల్లో పీచు మోతాదు చాలా ఎక్కువ. దీంతో నెమ్మదిగా జీర్ణమవుతూ ఎక్కువసేపు కేలరీలు విడులయ్యేలా చేస్తాయి. ఇందులో ఉండే కార్బోహైడ్రేట్స్ రక్తంలోని షుగర్ లెవల్స్ ను తగ్గిస్తుంది

దండిగా విటమిన్ బీ-6

చిలగడదుంపల్లో విటమిన్‌ బీ6 దండిగా ఉంటుంది. రక్తనాళాలు బలంగా ఉండేందుకు తోడ్పడే హోమోసిస్టీన్‌ను విటమిన్‌ బీ6 విడగొడుతుంది. అందువల్ల వీటితో గుండె, రక్తనాళాల సమస్యలు దూరంగా ఉంటాయి.

అధికంగా పొటాషియం...

ఒంట్లో ఎక్కువగా ఉన్న ఉప్పును తొలగించి, నీటి మోతాదును నియంత్రిస్తూ అధిక రక్తపోటును తగ్గించటంలో పొటాషియం కీలకపాత్ర పోషిస్తుంది. చిలగడదుంపల్లో పొటాషియం మోతాదూ అధికంగానే ఉంటుంది.

అధికంగా మాంగనీసు

పిండి పదార్థాల జీవక్రియల్లో చాలా కీలమైన మాంగనీసు కూడా వీటిల్లో అధికం. అందువల్ల ఇవి రక్తంలో గ్లూకోజు మోతాదులు సాధారణ స్థాయిలో ఉండేలా తోడ్పడతాయి. మ్యాంగనీస్ ఎముకల బలానికి బాగా సహాయపడుతుంది.

అధికంగా విటమిన్ ఇ

విటమిన్‌ ఈ మన చర్మం ఆరోగ్యంగా, నిగనిగలాడేందుకు తోడ్పడుతుంది. వయస్సు మీద పడనియ్యకుండా చేసి, ముడతలను అడ్డుకుంటుంది.

12:27 - June 9, 2017

ఎండాకాలంలో మామిడి పండ్లు.. శీతాకాలంలో జామ, నారింజ, బత్తాయిలు బాగా దొరుకుతాయి. ఈకాలంలో మాత్రం అల్ల నేరేడు పండ్లు విపరీతంగా లభిస్తాయి. తీపీ, పులుపూ, వగరు కలబోతగా నిగనిగలాడుతూ నోరూరించే నేరేడు ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోయే ఈ పండు పోషకాల గని.. అనారోగ్యాల ... ఆరోగ్యానికి మేలు చేయడమే కాదు.. కొన్నిరకాల రోగాలనూ నియంత్రించే శక్తి నేరేడు సొంతం. అయితే వీటి ధరమాత్రం అదిరిపోతోంది.

నేరేడు పండ్లలో అధిక మోతాదులో ఉంటే సోడియం, పొటాషియం, క్యాల్షియం, ఫాస్ఫరస్‌, మంగనీస్‌, జింక్‌, ఇరన్‌, విటమిన్‌ సి, ఎ రైబోప్లెవిన్‌, ఫోలిక్‌ యాసిడ్లు అనారోగ్య సమస్యలను దూరం చేస్తాయి. ఈ పండ్లలో పుష్కలంగా లభించే ఐరన్‌ శరీరంలో ఎర్ర రక్తకణాలను వృద్ధి చేస్తుంది. అంతేకాదు రక్తాన్ని శుద్ధి చేస్తే శక్తి కూడా ఉంది. కాలేయం పనితీరును మెరుగు పరచడానికి నేరేడు దివ్యౌషధంలా పనిచేస్తుందని కొన్ని అధ్యయనాల్లో స్పష్టమైంది.

వీటిని నిత్యం తినడం వల్ల వేసవిలో వచ్చే జీర్ణసంబంధ సమస్యలు అదుపులోకి వస్తాయి. జీర్ణవ్యవస్థ శుభ్రపడి దాని పనితీరు వేగవంతం అవుతుంది. శరీర జీవక్రియల రేటు మెరుగుపడుతుంది.

నేరేడులో విటమిన్‌ సి ఎక్కువగా లభిస్తుంది. ఇది రోగనిరోధకశక్తిని పెంచుతుంది. ఫలితంగా కాలానుగుణంగా వచ్చే పలు సమస్యలు అదుపులో ఉంటాయి.

ఈ పండ్లలో పొటాషియం వంటి ఖనిజాలు అధికంగా ఉంటాయి. ఇవి గుండె పనితీరును మెరుగుపరుస్తాయి, అధిక రక్తపోటుని అదుపులోకి తీసుకొస్తాయి.

యాంటీ ఆక్సిడెంట్లు నేరేడులో సమృద్ధిగా దొరుకుతాయి. ఇవి శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపి శుభ్రం చేస్తాయి.ఫలితంగా అధిక బరువునీ అదుపులో ఉంచుకోవచ్చు. చిన్నవయసులో వచ్చే వృద్ధాప్య ఛాయలూ తగ్గించుకోవచ్చు.

మధుమేహం ఉన్నవారికి నేరేడు చక్కటి ఉపశమనాన్నిస్తుంది. దీనిలో యాంటీ డయాబెటిక్‌ గుణాలుంటాయి. రోజూ తినడం వల్ల రక్తంలోని చక్కెర శాతం క్రమబద్ధమవుతుంది. అలానే తరచూ మూత్రం రావడం, దాహం వంటివి కూడా బాధించవు.

12:35 - September 11, 2016

అవకాడ పండు..ఈ పేరు ఎపుడో ఎక్కడో విన్నట్లు అనిపిస్తోందా. అవునులేండి ఈ పండు మన దేశంలో అంత విరివిగా వాడుకలో లేదు. ఇది మధ్య మెక్సికో ప్రాంతానికి చెందిన ఫలం. ఈ మధ్యకాలంలో సూపర్ మార్కెట్లలో లభ్యమౌతున్నాయి. అవకాడోను వెన్న పండు అని కూడా పిలుస్తారట దీనిని ఇంగ్లీషులో ఎవకాడో (Avocado) అని కూడా పిలుస్తారు. ఇది చూడటానికి ఆకుపచ్చని రంగులో కాడవైపు సన్నగా, వెనుక వేపు లావుగా ఉంటుంది. ఇది మెత్తగా తినడానికి కొద్దిగా ఆవు వెన్న రుచిగానూ, కొద్దిగా చిరు చేదుగానూ ఉంటాయి. అవకాడో పండ్లలో ఎక్కువ కేలరీలనిచ్చే పండు. వందగ్రాము పండులో 167 కేలరీలనిస్తాయి. అవకాడో పండులో విటమిన్ ఏ,ఇ పుష్కలంగా ఉంటుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉంటాయి. ఈ పండు తినడం వల్ల మంచి చర్మ తేజస్సు కలిగి ఉంటారు. అవకాడో గుజ్జు, దోసగుజ్జు, తేనె, పెరుగు సమపాళ్లలో కలిపి మొహానికి ప్యాక్ లా వేసుకోవాలి. పదిహేను నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. కాంతివంతమైన, తోజోవంతమైన చర్మం మీ సొంత అవుతుందని బ్యూటీషియన్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అంతేకాదండోయ్ గుండె ఆరోగ్యంగా ఉండటానికి కావలసిన మోనో-సాచురేటెడ్ ఫాట్'ని కలిగి ఉన్నందున శరీరంలో మంచి కొవ్వు పదార్థాల స్థాయిలను ( హెచ్ డీఎల్) పెంచి, కొవ్వు పదార్థాల స్థాయిలను (ఎల్ డీఎల్) తగ్గిస్తాయి. బీటా-సిటోస్టిరాల్, మోనో-సాచురేటెడ్ ఫాట్ రెండిని కలిగి ఉన్న అవకాడో కొవ్వులను తగ్గేలా చేస్తుంది. కేన్సర్, మధుమేహం, హైపర్ టెన్షన్ లను అదుపు చేసే లక్షణం కూడా వెన్న పండుకు ఉన్నది. అవకాడో అధిక స్థాయిలో పొటాషియం కలిగి ఉంటుంది. ఇది రక్త పీడనం సమతుల్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. అవకాడొలు ఫోలిక్ ఆమ్లం కలిగి ఉంటాయి. మరి ఇంకెదుకు ఆలస్యం... వెంటనే ఆవకాడో కోసం వేట మొదలెడదాం.

16:58 - December 1, 2015

జామపండు ను ఆంధ్రా యాపిల్, పేదవాడి యాపిల్ అని కూడా అంటారు. రోజూ ఒక యాపిల్ తినండి డాక్టర్ కు దూరంగా ఉండండి అని వినే ఉంటాం. అలాగే ఈ ఆంధ్రా యాపిల్ లో కూడా అనేక పోషకాలు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే కాశ్మీర్ యాపిల్ కంటే ఎక్కువ ప్రయోజనాలు...

కొన్ని ఉపయోగాలు...

వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తుంది. జామపండును ఆహారం తీసుకున్న తరువాత తినడం ఉత్తమం. భోజనానికి ముందు జామపండు తినాలనుకుంటే, భోజనం చేయడానికి కనీసం రెండు గంటల ముందు తినాలి.
అతితక్కువ క్యాలరీలు, తక్కువ కొలెస్ట్రాల్ కలిగి , ఎక్కువ పోషక విలువలు ఉన్న పండు జామపండు.
ఎక్కవ పీచుపదార్ధం (ఫైబర్) కలిగి ఉంటుంది. మలబద్దకాన్ని తగ్గిస్తుంది.
వయసుకు ముందే ముఖం పై ముడతలు , చర్మంలో సాగుదల లేకుండా చేస్తుంది.
ఏ,బీ,సీ విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. శరీరానికి కావాల్సిన యాంటిఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి.
కంటి సమస్యలు, కొన్ని రకాల క్యాన్సర్లు రాకుండా జామపండు కాపాడుతుంది. స్త్రీలలో రుతుచక్ర సమస్యలు , బ్రెస్ట్ క్యాన్సర్ మరియు పురుషులలో ప్రోస్టేట్ క్యాన్సర్లు రాకుండా నివారిస్తుంది.
జామపండు ప్రతి రోజు తీసుకోవడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరిగి , అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి.
విటమిన్ ఎ , ఫ్లావనాయిడ్స్ అయిన బీటాకెరోటిన్ , లైకోపిన్ ఉండడం వల్ల ఉపిరితిత్తులకు , చర్మానికి, కంటికి చాల మంచిది అతినీలలోహిత కిరణాల నుండి వచ్చే కొన్ని క్యాన్సర్ కారకాలను జామకాయ లో ఉండే లైకోపిన్ అడ్డుకుంటుంది.
జామకాయ లో ఉండే పొటాషియం గుండె జబ్బులు, బీపి పెరగకుండా చేస్తాయి.
అంతే కాకుండా జమకాయలో బి కాంప్లెక్స్ విటమిన్స్ (బి6 , బి9 ) , ఈ, కె విటమిన్స్ ఉంటాయి.ఎర్ర రక్త కణాల ఉత్పత్తిలో జామకాయ ఎంతగానో సహాయపడుతుంది.

బాగామాగిన జామపండులో....

బాగామాగిన జామపండులోని 50 గ్రాముల గుజ్జు, పది గ్రాముల తేనెను కలిపి తీసుకుంటే శరీరంలో శక్తి పుంజుకుంటుందని ఆరోగ్య నిపుణులు సూచించారు.ఉదయం, రాత్రి వేళల్లో భోజనానంతరం జామపండు సేవిస్తే జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. దీంతోపాటు మానసిక ఒత్తిడి కూడా మటుమాయమవుతుందని నిపుణులు చెపుతున్నారు.
గుండెజబ్బుతో బాధపడే వారు ప్రతి రోజు భోజనంతో పాటు జామపండు గుజ్జును మూడు నెలలపాటు తీసుకుంటే మంచి ఫలితముంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. జామపండును తింటే శరీరంలో రక్త సరఫరా సాఫీగా జరుగుతుంది.
జామపండు చెట్టులోని ఆకులను (కనీసం 20-25 ఆకులు) నీటిలో ఉడకబెట్టండి. ఉడకబెట్టిన నీటిని చల్చార్చి అందులో పటిక వేసి బాగా కలుపుకోండి. ఆ నీటిని పుక్కలిస్తే పంటి నొప్పులుంటే మటుమాయమై పోతాయని వైద్యులు సలహా ఇస్తున్నారు.

07:46 - November 4, 2015

రోజు వారీగా మనం తీసుకునే ఆహారంలో ఉప్పు తక్కువ, పొటాషియం ఎక్కువగా ఉండేలా చూసుకోవాలని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు. మనం రెగ్యులర్‌గా తీసుకునే ఆహారంలో ఏయే పదార్థాల్లో పొటాషియం పరిమాణం సమృద్ధిగా ఉంటుందో చెక్‌ చేసుకోవాలి.
ఎందుకంటే.. గుండెజబ్బులు, రక్తపోటు, పక్షవాతం వచ్చే ప్రమాదం తగ్గించుకోవాలంటే.. పొటాషియం ఎక్కువగా తీసుకోవాలని అధ్యయనాలు చెబుతున్నాయి. అదే సమయంలో ఉప్పును కూడా బాగా తగ్గించాలంటున్నాయి.
కేవలం నాలుగువారాలు ఉప్పు వాడకం తగ్గించినా కూడా.. రక్తపోటు తగ్గుతుందని... పొటాషియం ఎక్కువ తీసుకోవడం ఇంకా మంచిదని ఈ పరిశోధనలు చెబుతున్నాయి. అధికంగా ఉప్పు వినియోగంతో ప్రమాదాలు పెరుగుతుండగా, పొటాషియం రక్తపోటు తగ్గిస్తోందట. దీనివల్ల 23 శాతం పక్షవాతం ప్రమాదం కూడా తగ్గుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇక మీ ఆరోగ్యానికి సరిపడా పొటాషియం లభించాలంటే తాజా పండ్లు, కూరగాయలు, పప్పులు తీసుకోవాలి.

 

Don't Miss

Subscribe to RSS - పొటాషియం